వంతెన పైనుంచి లారీ బోల్తాపడి ఇద్దరు మృతి
ఆదిలాబాద్(నేరడిగొండ): మండలంలోని కుప్టి వంతెనపై నుంచి లారీ బోల్తాపడి డ్రైవర్, క్లీనర్ మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు కిరా ణా, జనరల్ సామగ్రితో వస్తున్న లారీ కుప్టి వంతెన వద్దకు రాగానే ముందు టైరు పగిలింది. దీంతో అదుపు తప్పిన లారీ వంతెనపైనుంచి లోయలో పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కిశోర్‌సింగ్ (42) అక్కడికక్కడే మృతి చెందాడు.క్లీనర్ రజాక్‌కు తీవ్రగాయాలు కావడం తో 108లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగాఅక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
డ్రైవర్‌ది ఆదిలాబాద్‌లోని భూక్తాపూర్ కాలనీ కాగా క్లీనర్ మామడ మండలం తాండ్రవాసీగా గుర్తించినట్లు ఎస్సై నరేశ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రైలు ఢీకొని యువకుడు..
తాండూర్ : మండలంలోని తాండూర్ బస్టాండ్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై రైలు ఢీకొన్న ఘటనలో తాండూర్ గ్రా మం బోయవాడకు చెందిన బోనె లక్ష్మణ్ (27) అనే యువకుడు మృతి చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. లారీ క్లీనర్‌గా పని చేసే లక్ష్మణ్ గురువారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి శుక్రవారం తెల్లవారుజామున రైలు పట్టాలపై శవమై కనిపించా డు. లక్ష్మణ్ ప్రమాదవశాత్తు మృతి చెం దాడా? ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న విషయం తెలియరాలేదు. మృతుడికి భా ర్య వైశాలి, కుమారుడు విష్ణు ఉన్నారు.
మంచిర్యాలలో గుర్తు తెలియని వ్యక్తి..
మంచిర్యాల టౌన్ : మంచిర్యాల గర్మిళ్ల శివారులోని రైల్వే ట్రాక్‌పై శుక్రవారం గుర్తు తెలియని 60 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ జగన్ కథనం ప్రకారం.. ఉదయం 6-30గంటల ప్రాంతంలో రామగుండం నుంచి బెల్లంపల్లి వైపు వెళ్తున్న జీటీ రైలు గుర్తు తెలి యని వృద్ధుడిని ఢీ కొట్టడంతో మృతి చెందాడు. మృతుడు తెలుపు రంగు ఫుల్ షర్ట్, తెలుపు, పచ్చ రంగుల అంచులున్న పంచె ధరించి ఉన్నా డు. మరే ఇతర ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రి శవాల గదిలో భద్రపరిచినట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు.