మరో రెండు రోజుల్లో ఈడీ ఎదుటకు సెంథిల్ సోదరుడు
సాక్షి, చైన్నె: మంత్రి సెంథిల్ బాలాజీ సోదరుడు అశోక్‌కుమార్ ఈడీ సమక్షంలో ఒకటి రెండురోజుల్లో లొంగి పోనున్నట్లు ఆయన తరపు న్యాయవాదులు బుధవారం పేర్కొన్నారు. మనీ లాండరింగ్ కేసులో సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన వద్ద ఐదు రోజల పాటు విచారణ కూడా జరిగింది. అదే సమయంలో ఈ కేసులో సెంథిల్ సోదరుడు అశోక్‌కుమార్‌ను ఇప్పటికే ఈడీ టార్గెట్ చేసింది. ఆయన నివాసాలు, కార్యాలయాలు, సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. విచారణకు రావాలని పలుమార్లు అశోక్‌కుమార్‌కు ఈడీ తరపున సమన్లు జారీ అయ్యాయి.
అయితే, ఆయన వాటిని పట్టించుకోలేదు. ఆ యన విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న ఈడీ వర్గాలు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అదే సమయంలో కేరళ రాష్ట్రం కొచ్చి విమానాశ్రయంలో భద్రతా అఽధికారులు అశోక్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం సాగింది. దీనిని ఈడీ ఖండించింది. ఆయన్ని తాము అరెస్టు చేయలేదని స్పష్టం చేసింది.
ఆయనకు సమన్లు జారీ చేశామని, ఇంత వరకు స్పందన లేని దృష్ట్యా, తదుపరి చర్యలపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో తనకు అనారోగ్య సమస్య ఉందని, చికిత్స అనంతరం ఒకటి రెండు రోజులలో ఈడీ ఎదుట లొంగిపోనున్నట్లు అశోక్‌కుమార్ తెలియజేశారని ఆయన తరపు న్యాయవాది ప్రకటించారు. ఈ విషయాన్ని ఈడీ దృష్టికి తీసుకెళ్లి, మరికొంత సమయం కోరినట్లు పేర్కొన్నారు.
కారు బోల్తా ముగ్గురి మృతి
సాక్షి, చైన్నె: చెంగల్పట్టు జిల్లా మధురాంతకం సమీపంలోని కారు బోల్తా పడి నలుగురు మృతి చెందారు. తిరువారూర్‌కు చెందిన ముగ్గురు కారులో చైన్నెకు మంగళవారం రాత్రి పని నిమిత్తం బయలుదేరారు. మార్గం మధ్యలో చైన్నై – తిరుచ్చి జాతీయ రహదారిలోని మేల్ మరువత్తురు దాటగానే మధురాంతకం వద్ద బుధవారం వేకువజామున ఓ వంతెన ప్రాంతంలో అదుపు తప్పింది. కారుపై నుంచి కింద పడడంతో అందులో ఉన్న ముగ్గురు ఘటనా స్థలంలోనే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు జీహెచ్‌కు తరలించారు. మృతులు తిరువారూర్‌కు ఎందిన కదిరవన్, నందకుమార్, కార్తీక్‌లుగా గుర్తించారు.