District Rural Development Organization
-
ఊరూరా మహిళా దుకాణాలు
సాక్షి, రఘునాథపల్లి: మహిళలు స్వశక్తితో ఎదిగేలా బ్యాంకు రుణాలందించడంతో పాటు, స్వయం ఉపాధి పొందేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో మహిళా పొదుపు సంఘాల ద్వారా ప్రత్యేక స్టోర్లు ఏర్పాటు చేయించి వ్యాపారవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సాహం అందిస్తున్నారు. జనగామ జిల్లా కలెక్టర్ నిఖిల చొరవతో రాష్ట్రంలోనే ప్రథమంగా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 204 స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) స్టోర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, తొలివిడతగా 60 స్టోర్లు ఏర్పాటు చేశారు. స్టోర్ల ఏర్పాటు, అమ్మకాలు, శిక్షణలో బైరిసన్స్ సంస్థ సహకారం అందిస్తుండటంతో స్టోర్లకు బైరిసన్స్ ఎస్‌హెచ్‌జీ స్టోర్లుగా నామకరణం చేశారు. నిత్యావసర వస్తువులు బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకు అందించడమే స్టోర్ల ఏర్పాటు ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ఈ స్టోర్లలో సామగ్రి కొనుగోళ్లు, తయారీ, రవాణా, విక్రయం అంతా మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే జరగనుంది. 140 రకాల నిత్యావసర వస్తువులు సాధారణ కుటుంబాలకు నిత్యం ఎన్ని సరుకులు అవసరమన్న అంశంపై సెర్ప్ సిబ్బంది, బైరిసన్స్ ప్రతినిధులు అధ్యయనం చేశారు. ఒక్కో కుటుంబానికి 262 వస్తువులు అవసరమని, ఇందులో 140 అత్యంత అవసరమని గుర్తించారు. వీటితో పాటు ఇతర వస్తువుల క్రయవిక్రయాలపై పొదుపు సంఘాల సభ్యులకు జిల్లా సమాఖ్య ద్వారా శిక్షణ ఇచ్చారు. ఒక్కో మండలంలో 15 నుంచి 20 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇళ్లలో నిత్యం కావాల్సిన పప్పు, ఉప్పు, చక్కెర, బియ్యం, సబ్బులు తదితర సరుకులు విక్రయించనున్నారు. జూట్ సంచుల తయారీ, శారీ డిజైనింగ్, ప్రింటింగ్, సర్ఫ్, ఫినాయిల్, జండుబామ్, హార్ఫిక్, దూప్‌స్టిక్స్, తయారీపై వరంగల్‌కు చెందిన జనశిక్షణ సంస్థాన్ సంస్థ తరఫున శిక్షణ ఇస్తుండగా, వీటిని తయారుచేసి స్టోర్లలో బైరిసన్స్ అగ్రో ఇండియా ఉత్పత్తులతో కలిపి విక్రయించనున్నారు. శిక్షణ పొందిన మహిళలకు రుణాలు శిక్షణ పొందిన మహిళలు వస్తువులు తయారు చేసేందుకు బ్యాంకు, స్త్రీనిధి, సెర్ప్ ద్వారా రుణాలు అందించనున్నారు. ఇంటి వద్ద తయారు చేసిన ప్రతీ వస్తువును డీఆర్డీఓ ఆధ్వర్యాన ఎస్‌హెచ్‌జీ స్టోర్స్‌కు తరలిస్తారు. జిల్లావ్యాప్తంగా ఒకే ధరతో ఓపీఎస్ మిషన్ ద్వారా వినియోగదారులకు కంప్యూటర్ బిల్లులు అందిస్తారు. మార్కెట్ కంటే తక్కువ ధరతో పాటు నాణ్యమైన వస్తువులు స్టోర్లలో లభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళల ఆర్దికాభివృద్ధికి దోహదం మహిళలు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించేలా ప్రోత్సహించడమే స్టోర్ల ఏర్పాటు లక్ష్యం. తయారీ నుంచి విక్రయం వరకు అంతా చైన్ సిస్టం ద్వారా జరుగుతుంది. రఘునాథపల్లి మండలంలో 24 గ్రామాల్లో ఎస్‌హెచ్‌జీ స్టోర్లు ఏర్పాటు చేస్తున్నాం. మహిళలు తయారు చేసిన 15 రకాల ఉత్తత్తులను జిల్లావ్యాప్తంగా ఎస్‌హెచ్‌జీ స్టోర్లకు తరలించి అమ్మకాలు సాగేలా చూస్తాం. తద్వారా 100 మందికి పైగా కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది. తయారీదారులతోపాటు విక్రయించే వారికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. – సారయ్య, ఏపీఎం, రఘునాథపల్లి ఇళ్ల నుంచే వస్తువులు తీసుకెళ్తాం డీఆర్డీఏ, సెర్ప్ ద్వారా మహిళా సంఘాల సభ్యులకు రుణాలు అందిస్తాం. వస్తువుల తయారీ, రామెటిరీయల్ ఎక్కడి నుంచి పొందాలన్న దానిపై అవగాహన కల్పిస్తాం. ఇళ్లకు వెళ్లి వస్తువులు సేకరించనుండటంతో మార్కెటింగ్ ఇబ్బందులు కూడా ఉండవు. జిల్లాలోని 11 మండలాల్లో ఎస్‌హెచ్‌జీ స్టోర్లు ఏర్పాటు చేయనున్నాం. కలెక్టర్ నిఖిల మహిళల ఆర్థికాభివృద్ధికి సంబంధించి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. మహిళలతోపాటు వినియోగదారులకూ ఇది ఉపయుక్తంగా ఉంటుంది. – గూడూరు రాంరెడ్డి, డీఆర్డీఓ, జనగామ జిల్లా -
దొరికినంత దోచేశారు..
ఒంగోలు సెంట్రల్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వెలుగు ప్రాజెక్టు పరిధిలో పౌష్టికాహార కేంద్రాలను గతంలో ఏర్పాటు చేశారు. అయితే పిల్లల పౌష్టికాహార కేంద్రాలన్నీ స్త్రీశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో వెలుగు పౌష్టికాహార కేంద్రాలు మూత పడ్డాయి. జిల్లా పరిధిలో 15 మండలాల్లో 139 కేంద్రాలు పనిచేసేవి. వీటికి గాను అప్పట్లో రూ.4.17 కోట్లు వెచ్చించారు. ఈ నిధుల నుంచి వంట సామగ్రి, గ్యాస్, పిల్లలకు ఆట వస్తువుల కొనుగోలుకు ప్రతి కేంద్రానికి దాదాపు రూ.50 వేల వరకూ వెచ్చించారు. మూడేళ్లపాటు నడిచిన ఈ కేంద్రాలను ఏడాదిన్నర కాలంగా మూసేశారు. ఈ కేంద్రంలో పని చేసిన సిబ్బంది, ఆయాలకు కొన్ని నెలల జీతాలు కూడా ఇవ్వలేదు. కానీ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు బూడిదలో పోసిన పన్నీరులా మారిపోయాయి. ప్రస్తుతం ఆరోగ్య, పోషణ కేంద్రాల గురించి, వాటికి మంజూరైన నిధులు, సామగ్రి ఎక్కడ, ఎంత ఉన్నాయనే విషయం కూడా తెలియదు. నిధులు ఎక్కడికక్కడ దొరికినంత దోచుకున్నారు. సామగ్రిని సొంతానికి వాడేసుకున్నారు. నిధులు...కేంద్రాలు ఎక్కడ పొదుపు మహిళలు కొందరు దినసరి కూలీకి వెళ్తుంటారు. వీరి పిల్లలు, అనాథ పిల్లల కోసం ఆరోగ్య పోషణ కేంద్రాలను 2011లో అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. జిల్లాలో బాగా వెనుకబడిన 15 మండలాల్లో మొత్తం 139 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రానికి రూ.3 లక్షల చొప్పున నేరుగా సెర్ప్ సీఈవో డీఆర్డీఏకు మంజూరు చేశారు. వీటిలో రూ.10 వేలు చొప్పున వంట సామగ్రి, మరో రూ.20 వేలతో చిన్నపిల్లల సైకిల్, క్యారమ్ బోర్డు, బొమ్మలు, తదితర ఆట వస్తువులను కొనుగోలు చేశారు. మొత్తం మీద రూ.50 వేలు వరకూ ఇలా వెచ్చించారు. మొత్తం అన్ని కేంద్రాల్లో కలిపి రూ.69,50,000లను ఖర్చు చేశారు. అప్పట్లో సామగ్రి కొనుగోలు పై అనేక ఆరోపణలు వచ్చాయి. కానీ ఎవరూ పట్టించుకోలేదు. అవినీతిలో అందరూ భాగస్వామ్యం అయ్యారు. ఇప్పుడు కేంద్రాలు లేవు, వాటికి కొనుగోలు చేసిన వస్తువులూ కనిపించడం లేదు. ఎవరికి దొరికింది వారు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై డీఆర్డీఏ-వెలుగు యంత్రాంగం కనీసం వాకబు కూడా చేయని దుస్థితిలో ఉంది. మొత్తం రూ.4.17 కోట్లలో వంట సామగ్రి, ఆట వస్తువుల కోసం రూ.69.50 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్కలు రాశారు. ఒక్కో కేంద్రానికి రూ.3 లక్షలు ఇచ్చారు. వీటిలో రూ.50 వేల వరకూ వంట, ఆట వస్తువులకు కేటాయించారు. తక్కిన రెండున్నర లక్షలు పోషకాహార కేంద్రాలు ఉన్న గ్రామంలోని డ్వాక్రా సంఘాలకు సామాజిక పెట్టుబడి నిధి రూపంలో అన్ని కేంద్రాలకు కలిపి మొత్తం రూ.3,47,50,000 రుణాలను ఇచ్చారట. ఈ రుణాలకు వచ్చే వడ్డీతోనే పోషకాహార కేంద్రాలను నిర్వహించాల్సి ఉంది. కేంద్రాలను నడి పే ఆరోగ్య కార్యకర్తకు నెలకు రూ.1000లు, ఆయాకు రూ.300ల చొప్పున వేతనం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఏ సంఘానికి ఎంత రుణం ఇచ్చారు. ఎంత రికవరీ అయింది, మిగిలింది ఎంత అనే సమాచారం వెలుగు అధికారుల వద్ద లేదు. ఆ మొత్తంలో అత్యధికంగా పలుకుబడి ఉన్న మహిళా సంఘాలు, కొందరు వెలుగు ఉద్యోగులు పంచుకుని తినేశారన్న విమర్శలున్నాయి. ఇక వంట సామగ్రి, ఆట వస్తువులు కూడా కేంద్రాల్లో లేవు. చాలా చోట్ల ఎవరికి చిక్కినివి వారు తీసుకువెళ్లిపోయారు. కొన్ని చోట్ల ర్యాకులు, టీవీలు కొనుగోలు చేశారు. అయితే ఏ ఒక్క చోట కూడా ఈ వస్తువులు కనిపించడం లేదు. ఇంత భారీ ఎత్తున అవినీతి జరిగితే ఎవరూ పట్టించుకోకపోవడం చూస్తుంటే ఈ పాపంలో ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
డ్వాక్రా సంఘాలకు రూ. 275 కోట్ల లబ్ధి
►వడ్డీ కింద సంఘానికి సగటున రూ. 25వేలు మంజూరు ►జూన్ 3 నుంచి పంపిణీ చేసే అవకాశం ►జిల్లా సమాఖ్య సమావేశంలో డీఆర్డీఏ పీడీ వెంకటేశం అనంతపురం సెంట్రల్ : జిల్లాలోని డ్వాక్రా మహిళలకు రూ. 275 కోట్లు లబ్ధి కలుగుతోందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ- వెలుగు ప్రాజెక్టు డెరైక్టర్ జి. వెంకటేశం స్పష్టం చేశారు. ఈ మొత్తాన్ని పెట్టుబడి నిధిగా మార్చుకొని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. శనివారం ప్రశాంతి జిల్లా సమాఖ్య కార్యాలయంలో అధ్యక్షురాలు పార్వతి అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పీడీ వెంకటేశం మాట్లాడుతూ స్వయం సహాయక సంఘం సభ్యురాలికి రూ. 10 వేలు చొప్పున మంజూరు చేస్తే, జిల్లాలోని మహిళలకు రూ. 490 కోట్లు లబ్ధి కలుగుతుందన్నారు. తొలివిడతలో రూ. 3 వేలు చొప్పున రూ. 147 కోట్లు మంజూరైందన్నారు. ప్రభుత్వం వడ్డీ కూడా మాఫీ చేయడంతో సరాసరిన సంఘానికి రూ. 22 వేలు చొప్పున వర్తిస్తుందన్నారు. మొత్తం తొలివిడతలో రూ. 275 కోట్లు వస్తుందన్నారు. ఈ మొత్తం జూన్ 3 నుంచి పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని వివరించారు. వ్యాపార అవసరాల కోసం ఈ మొత్తాన్ని పెట్టుబడి నిధిగా భావించాలని కోరారు. వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించరాదని సూచించారు. ఆధార్ అనుసంధానంలో నిర్లక్ష్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ 98.4 శాతం మాత్రమే అనుసంధానం అయిందన్నారు. దీనివల్ల మిగిలినవారు ప్రభుత్వం మంజూరు చేస్తున్న నగదును కోల్పోతున్నారన్నారు. ప్రతి మహిళకు ఆధార్‌కార్డు తీయించి ఎన్రోల్ చేయాలని ఈసీ మెంబర్లను, వెలుగు సిబ్బందిని ఆదేశించారు. సమావేశంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పార్వతి, కార్యదర్శి పార్వతమ్మ, ఐబీ ఇన్చార్జ్ డీపీఎం, ఏసీ గంగాధర్, ఏరియా కో ఆర్డినేటర్ ఈశ్వరయ్య, సబ్జెక్టు యాంకర్ పర్సన్లు ఖలీల్, శివప్రసాద్, నారాయణస్వామి, హరిప్రసాద్, జేడీఎం సూర్యానారాయణ వెలుగు అధికారులు, జిల్లా సమాఖ్య ఈసీ మెంబర్లు పాల్గొన్నారు. -
‘తెలంగాణ పల్లె ప్రగతి’
నల్లగొండ : నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. షెడ్యూల్ కులాలు, తెగల జనాభా ఎక్కువగా ఉన్న మండలాల్లో సమీకృత గ్రామీణాభివృద్ధి సాధించేందుకు ఈ పథకాన్ని రూపొందించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గతంలో అమలైన టీఆర్ఐజీపీ (తెలంగాణ రూరల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగాం)కి ఇటీవల ‘తెలంగాణ పల్లె ప్రగతి’గా నామకరణం చేశారు. ప్రపం చ బ్యాంకు నిధులతో చేపట్టే ఈ పథకంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గాను జిల్లాకు తొలి విడతలో రూ.50 కోట్లు వెచ్చించనున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా చేపట్టనున్న ఈ కార్యక్రమాల ప్రణాళిక పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథ కం అమలుకు తొలి దశలో జిల్లా నుంచి 13 మండలాలు ఎంపిక చేశారు. డీఆర్డీఏ నిర్వహించిన బేస్‌లైన్ సర్వే ప్రకారం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబ డిన మండలాలుగా వీటిని గుర్తిం చారు. దేవరకొండ ఏరియాలో శిశు విక్రయా లు, మాతా శిశు మరణాలను అరికట్టేం దుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నా రు. ఈ పథకంలో పేర్కొన్న అంశాలను అమలు చేసేందుకుగాను డీఆర్డీఏ, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ, ఐసీడీఎస్, వైద్యశాఖల సమన్వయంతో ఆయా మండలాల్లో ప్రజలను, మహిళల ను, రైతులను చైతన్య పర్చడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. దళారుల బారిన పడి తమ పంటకు గిట్టుబాటు ధరను కోల్పోతున్న రైతులను ఆదుకునేలా ఏర్పాట్లు చేస్తారు. రైతులను బృం దాలుగా ఏర్పర్చి, వారి పంట ఉత్పత్తులను వారే స్వయంగా మార్కెటింగ్ చేసుకునేలా సదుపాయాలు కల్పిస్తారు. ఏ ఎన్ఎంల ద్వారా ఆరోగ్య సేవలు, ఐసీడీఎస్ ద్వారా మాతా, శిశు సంరక్షణ కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాలను ఐటీకి అనుసంధానం చేసి పర్యవేక్షిస్తారు. గ్రామపంచాయతీల్లో పౌరసేవ కేంద్రాలు ఎంపిక చేసిన మండలాల్లోని గ్రామ పం చాయతీల్లో ‘మీ సేవ’ తరహాలో పౌర సేవ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నా రు. ప్రస్తుతం ఈమండలాల్లో 44 మీసేవ కేంద్రాలు పని చేస్తున్నాయి. అయితే వీటిలో చాలా వరకు మండల కేంద్రాల్లోనే కొనసాగుతున్నాయి. చందంపేట, డిండి, దేవరకొండ, పీఏపల్లి వంటి మండలాల్లో పలు చోట్ల మీ సేవ కేం ద్రాలు గ్రామాలకు మంజూరైనప్పటికీ సరైన వసతుల్లేక, విద్యుత్ సమస్య కారణంగా మండల కేంద్రాల్లో వాటిని ఏర్పాటు చేశారు. అలా కాకుండా పౌర సేవా కేంద్రాలను పక్కాగా పంచాయతీల్లోనే ఏర్పాటు చేస్తారు. మీ సేవ కేంద్రాలు అందించే సేవలకు అదనంగా ఉపాధి హామీ, పెన్షన్ల పంపిణీ, ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ వంటి సేవలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఎంపిక చేసిన మండలాల్లో విజయవంతమైనట్లయితే రెండో దశలో మరిన్ని మండలాలకు విస్తరించే అవకాశం ఉంది. -
పండుగకు పస్తులే!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : సామాజిక భద్రతా పింఛన్ పథకం లబ్ధిదారులకు ఇది చేదు కబురే. దసరా పండుగకు పింఛన్ డబ్బులు చేతికందుతాయని భావించిన వారు నిరాశకు గురయ్యే పరిస్థితి నెలకొంది. సాంకేతిక కారణాలతో బుధవారం జిల్లావ్యాప్తంగా చెల్లింపులు నిలిపివేసినట్లు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ (డీఆర్డీఏ) మంగళవారం విడుద ల చేసిన ప్రకటనలో పేర్కొంది. సెప్టెంబ ర్ మాసానికి సంబంధించి వృద్ధాప్య, వికలాంగ, వితంతువు, చేనేత, కల్లుగీత కార్మికులు, అభయహస్తం ఫించన్లను నిలిపివేయనున్నారు. డీఆర్డీఏ అధికారుల వద్ద ఉన్న గణాంకాల ప్రకారం 2,84,165 మంది లబ్ధిదారులకు నెలనెలా రూ.3.16 కోట్ల మేరకు పింఛ న్లు పంపిణీ చేస్తున్నారు. 15 వేలకు పైగా దరఖాస్తులు ఏడాదిగా పెండింగ్‌లో ఉండగా, ఇప్పుడున్న లబ్ధిదారులకు సాంకేతిక కారణాలు తరచూ ప్రతిబంధకాలు అ వుతున్నాయి. ఉగాదికి ముందు ఇదే తరహాలో ఫించన్లను ఆపేశారు. ఇదిలా ఉండగా, సామాజిక భద్రత ఫించన్ల పంపిణీకి పోస్టాపీసుల్లో బయోమెట్రిక్ మిషన్ లో తమ ఆధార్‌కార్డులను నమోదు చేయించుకోవా ల్సి ఉంది. ఆధార్ సంఖ్య లేనట్లయితే ఫించన్ చెల్లించే వీలు లేదు. అధికారులే లబ్ధిదారులకు అవగాహన క ల్పించి సరైన సమయంలో ఆధార్‌తో అనుసంధానం చేయాల్సి ఉంది. జిల్లా మొత్తంగా చూస్తే 25,52,073 మంది జనాభా ఉంటే 23,61,450 మంది (92.53 శాతం) ఆధార్‌తో అనుసంధానం అయినట్లు గణాంకా లు చెప్తున్నాయి. ఆధార్ కార్డులు లేనివారు ఎక్కువ మంది ఫించన్‌దారులే. ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకం గా భావించని కారణంగా ఫించన్‌దారులకు పండగపూట చేతికి డబ్బులందకుండా పోతున్నాయి.