divisions
-
USA Presidential Elections 2024: అమెరికా కార్పొరేట్ల పార్టీల బాట
అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అమెరికాలో రాజకీయ చీలికలు పెరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో వ్యక్తులు రాజకీయ పార్టీలకు, నాయకులకు మద్దతు తెలపడం సాధారణం. అయితే అమెరికాలో కార్పొరేట్లు సైతం రెండు వర్గాలుగా విడిపోయాయి. చిన్న, ప్రాంతీయ సంస్థలు మొదలు టెక్, బ్యాంకింగ్ దిగ్గజాల వంటి పెద్ద సంస్థల దాకా మెజారిటీ సంస్థలన్నీ డెమొక్రటిక్, రిపబ్లికన్ అభ్యర్థుల మధ్య విడిపోయాయి. కొన్ని సంస్థలు కమలా హారిస్‌వైపు, మరికొన్ని సంస్థలు డొనాల్డ్ ట్రంప్ వైపు నిలిచారు. ఈ చీలికతో ఉదారవాద, వామపక్ష భావాలు కలిగిన కమలా హారిస్‌కు మితవాద ట్రంప్‌కు మధ్య పోటీగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు మారిపోయాయి. టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్ (ఆల్ఫాబెట్), అమెజాన్, సన్ మైక్రోసిస్టమ్స్ ఉద్యోగులు కమలా హారిస్ ప్రచారానికి మిలియన్ల డాలర్లను విరాళంగా ఇచి్చనట్లు రాజకీయరంగ విషయాలను బహిర్గం చేసే ‘ఓపెన్ సీక్రెట్స్’సంస్థ వెల్లడించింది. ట్రంప్ ప్రచారానికి వచి్చన విరాళాల కంటే కమలా హారిస్ ప్రచారానికి వచి్చన సహకారం గణనీయంగా ఉంది. ఎలాన్ మస్‌్క, మార్క్ జుకర్‌బర్గ్ వంటి టెక్ దిగ్గజాలు మాత్రం ట్రంప్‌కు మద్దతుగా ప్రకటించడం తెల్సిందే. హారిస్‌కు గూగుల్ సహా పలు సంస్థల బాసట భారత సంతతికి చెందిన అమెరికన్ బిలియనీర్, సన్ మైక్రోసిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా, వెంచర్ క్యాపిటలిస్ట్ రీడ్ హాఫ్మన్ తదతరులు హారిస్‌కు మద్దతుగా నిలిచారు. సుందర్ పిచాయ్ నేతృత్వంలోని గూగుల్ (ఆల్ఫాబెట్), దాని అనుబంధ సంస్థలు హారిస్‌కు దాదాపు రూ.18 కోట్లు విరాళంగా ఇచి్చనట్లు అమెరికా ఎన్నికల నిధుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ సంస్థ అటు కమలకు విరాళాలు అందిస్తూ ట్రంప్‌కు సైతం విరాళాలు పంపుతున్నాయి. అయితే కమలతో పోలిస్తే ట్రంప్‌కు వస్తున్న కార్పొరేట్ విరాళాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. హారిస్ ప్రచారానికి సత్య నాదెళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ దాదాపు రూ.9.2 కోట్లు విరాళం ఇచి్చంది. అమెరికా కుబేరుడు జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ సంస్థ దాదాపు రూ.8.36 కోట్లు విరాళంగా ఇచ్చింది. సిలికాన్‌వ్యాలీలో వందకు పైగా పెద్ద పెట్టుబడిదారులు, పెద్ద టెక్ సంస్థలు హారిస్‌కు మద్దతుగా నిలిచాయి. ట్రంప్‌కు బ్యాంకింగ్,ఆయిల్ దిగ్గజాల మద్దతు కార్పొరేట్లపై పన్ను మరింత తగ్గిస్తామని, విదేశాల నుంచి వచ్చే దిగుమతులపై అధిక సుంకాలు విధిస్తామని, చమురు, సహజవాయువు, బొగ్గు గనుల రంగాల్లో పెట్టుబడులు పెంచుతామని ట్రంప్ ఎన్నికల వేళ హామీలు గుప్పించారు. అమెరికాలో చమురు వెలికితీతను మొదట్నుంచీ సమర్థించే ట్రంప్‌కు చమురురంగ సంస్థలు మద్దతు పలుకుతున్నాయి. ట్రంప్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు అమెరికా స్టాక్ మార్కెట్ కదలికలు సైతం ట్రంప్‌కు అనుకూలంగా ఉండటం గమనార్హం. చమురు వినియోగం అధికంగా ఉన్నంత మాత్రాన వాతావరణంలో ఎలాంటి మార్పులు రావని, వాతావరణ మార్పులు అనేది పచ్చి అబద్ధమని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా ఉన్నకాలంలో పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగేలా చేశారు. అమెరికా అభివృద్దిలో చమురు, బొగ్గుది కీలక పాత్ర అని ప్రకటించారు. దీంతో ఈ రెండు రంగాలు ట్రంప్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. బైడెన్ పాలనలో అమలు చేసిన కఠిన నిబంధనలను ట్రంప్ వెనక్కి తీసుకుంటారని బ్యాంకర్లు భావిస్తున్నారు. బైడెన్ సూచించిన కొత్త కఠిన బ్యాంకింగ్ నిబంధనలపై ఆ రంగం చూపుతున్న విముఖత ట్రంప్‌కు అనుకూలిస్తోంది. జుకర్‌బర్గ్, మస్క్ బహిరంగంగానే.. మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జుకర్‌బర్గ్ మితవాద ట్రంప్‌కు మద్దతు ఇస్తూ బహిరంగ ప్రకటనలు చేశారు. అయితే తర్వాత జుకర్‌బర్గ్ తాను తటస్థంగా, నిష్పక్షపాతంగా కనిపించాలనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రచారానికి జుకర్‌బర్గ్ ఎంత విరాళంగా ఇచ్చారనే అంశాలు ఇంకా బహిర్గతంకాలేదు. ఫేస్బుక్లో వచ్చే కంటెంట్‌ను సెన్సార్ చేయాలని బైడెన్ ప్రభుత్వం మెటాపై ఒత్తిడి తేవడం తెల్సిందే. ఎలాన్ మస్క్ ట్రంప్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చారు. ట్రంప్ ప్రచారాన్ని చూసుకునే అమెరికా పీఏసీ సంస్థకు తాను వ్యక్తిగతంగా ప్రతి నెలా దాదాపు రూ.376 కోట్లు విరాళంగా పంపుతున్నానని మస్క్ జూలైలో బహిరంగంగా ప్రకటించారు. భారీ వెంచర్ క్యాపిటలిస్ట్ పీటర్ థెయిల్ సైతం ట్రంప్‌కు జై కొడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విజయవాడలోని 57, 62, 64 డివిజన్లలో పర్యటించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-
వివాదాలు ఘనం.. అభివృద్ధి శూన్యం
ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆరోపణలు ప్రత్యారోపణలతోనే కార్పొరేటర్ల సంవత్సర పాలన ముగిసింది. నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు ఎక్కుపెట్టుకుంటూ టీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు అభివృద్ధిని మరిచారు. ఏడాది క్రితం ఉత్కంఠ భరితంగా సాగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో ఒక్క భోలక్‌పూర్ డివిజన్ మినహా ఐదు డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. స్థానిక ఎమ్మెల్యే టీఆర్ఎస్ నేత కావడం, గెలిచిన కార్పొరేటర్లంతా బీజేపీ వారు కావడంతో ప్రతి విషయంలోనూ ఆదిపత్యపోరు కొనసాగించారు. దీంతో ఇరు పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో వివాదాలు ఎక్కువై అభివృద్ధిపై దృష్టి సారించిన దాఖలాలు తక్కువే. ఎమ్మెల్యే తమను విస్మరిస్తున్నారంటూ.. నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా ఎమ్మెల్యే ముఠా గోపాల్ తమకు సమాచారం ఇవ్వడం లేదని, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తమను విస్మరిస్తున్నారంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో ఏడాది నుంచి ఇదే వివాదం కొనసాగుతూ వస్తోంది. ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు కార్పొరేటర్లు మరోసారి శంకుస్థాపనం చేయడం, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు వివాదాలకు దిగడం నిత్యం పరిపాటిగా మారింది. ముషీరాబాద్ చేపల మార్కెట్, ఆదర్శ కాలనీ, రాంనగర్ డివిజన్లోని జెమినీ కాలనీ, బాగ్‌లింగంపల్లి.. ఇలా ప లు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ చేపట్టిన అభివృద్ధి పనుల సందర్భంగా కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కార్పొరేటర్లకు నిధులు నిల్.. కార్పొరేటర్లుగా ఎన్నికై ఏడాది గడిచినా డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం వారికి నిధులు కేటాయించలేదు. దీంతో వారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను స్వతహాగా చేపట్టలేకపోయారు. డ్రైనేజీ, తాగునీటి కలుషితం, వీధి దీపాలు, అధ్వానంగా మారిన అంతర్గత రహదారులు వంటి పలు సమస్యల విషయంలో ప్రజాప్రతినిధులు ఫొటోలు తీయించుకోవడం వరకే పరిమితమయ్యారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారిపై ఒత్తిడి పెంచడం తప్ప ప్రజల సమస్యలను పరిష్కరించిన దాఖలాలు పెద్దగా కనిపించలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు అనేక రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి పైప్లైన్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ హడావిడిగా శంకుస్థాపనలు చేశారు. ఆ పనులే ఇప్పటికీ కొనసాగుతున్నాయి తప్ప కొత్తగా ఎలాంటి అభివృద్ధి పనులుచేపట్టింది లేదు. -
27 డివిజన్లు, వార్డుల్లో వైఎస్సార్సీపీ ఏకగ్రీవం
సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలతోపాటు, వివిధ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో జరుగుతున్న 353 డివిజన్లు, వార్డుల ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ సోమవారం ముగిసింది. 27 డివిజన్లు, వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 8 డివిజన్లను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెల్చుకుంది. గుంటూరు జిల్లా గురజాల నగర పంచాయతీలో ఆరు వార్డులు, దాచేపల్లి నగర పంచాయతీ, ప్రకాశం జిల్లా దర్శి, చిత్తూరు జిల్లా కుప్పం మునిసిపాలిటీల్లో ఒక్కొక్క వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత మార్చిలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల మరణం, అప్పట్లో వివిధ కారణాలతో ఎన్నికలు జరగని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో 19 డివిజన్లు, వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా 10 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఒకచోట ఇండిపెండెంట్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమోదించిన 838 నామినేషన్లను అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థలో ఎన్నికలు జరుగుతున్న 46 డివిజన్లలోను వైఎస్సార్సీపీ బరిలో ఉంది. టీడీపీ 44 డివిజన్లలో పోటీ చేస్తోంది. నేనే తప్పుకొన్నా.. మా పార్టీవాళ్లే డ్రామా చేస్తున్నారు దర్శి టీడీపీ నేత శ్రీనివాసరావు దర్శి: ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక టీడీపీ నీచరాజకీయాలకు తెరతీసింది. 8వ వార్డులో టీడీపీ అభ్యర్థి చెరుకూరి శ్రీనివాసరావు సోమవారం స్వచ్ఛందంగా ఎన్నికల బరిలో నుంచి తప్పుకొంటున్నట్టు తెలిపి నామినేషన్ ఉపసంహరణ పత్రాన్ని ఇచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి మోహన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు నూకసాని బాలాజీ, దామచర్ల జనార్దన్ తదితరులు సోమవారం సాయంత్రం నుంచి ఎన్నికల అధికారి కార్యాలయం ముందు హైడ్రామా చేశారు. తమ పార్టీ అభ్యర్థి శ్రీనివాసరావు సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ హడావుడి చేశారు. విధుల్లో ఉన్న అధికారులపై దౌర్జన్యం చేసేందుకు యత్నించారు. అడ్డుకున్న పోలీసులపై దురుసుగా వ్యవహరించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి మోహన్‌రెడ్డి, తాను స్నేహితులమని, స్నేహితుడిపై పోటీ చేసేందుకు ఇష్టం లేక నామినేషన్ ఉపసంహరించుకున్నానని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తమ పార్టీ పెద్దలు తనను బెదిరించారని, సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారని అధికారులకు చెప్పాలని ఒత్తిడి తెచ్చారని తెలిపారు. ‘లాయర్‌తో లోపలికి వెళ్లు.. అంతా వాళ్లే చూసుకుంటారు..’ అని తనను బలవంతం చేశారని చెప్పారు. తాను ఇష్టపూర్వకంగానే ఎన్నికల బరిలో నుంచి తప్పుకొన్నానని శ్రీనివాసరావు మరోసారి స్పష్టం చేశారు. -
వామ్మో.. ఇవేం డివిజన్లు
సాక్షి, కరీంనగర్ : మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు హడావుడిగా జరిపిన డివిజన్ల పునర్విభజన రాజకీయ పార్టీల నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్లో డివిజన్ల సంఖ్య 50 నుంచి 60కి పెరగడంతో తదనుగుణంగా డివిజన్లను విభజించారు. కరీంనగర్ సిటీలో 2,50,484 మంది ఓటర్లు ఉండగా, 60 డివిజన్లకు విభజిస్తే ఒక్కో వార్డుకు 4,174 మంది ఓటర్లు ఉండాలి. డివిజన్ల భౌగోలిక స్వరూపం, రోడ్లు, కాలువలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఒక్కో డివిజన్‌కు 3,800 నుంచి 4,500 వరకు ఓటర్లను తీసుకొని విభజన ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. మునిసిపల్ అధికారులు తమకున్న తక్కువ సమయంలో ఇంటి నెంబర్లను ప్రాతిపదికగా తీసుకొని ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా డివిజన్ల విభజన జరిపి ముసాయిదా డివిజన్ల జాబితాను ఈ నెల ఒకటో తేదీన ప్రకటించారు. ఇది గందరగోళంగా తయారైంది. ఇప్పటివరకు కొనసాగిన డివిజన్ల స్వరూపం చాలా చోట్ల మారిపోయింది. కొన్ని ఇంటి నెంబర్లు ఏ వార్డుల్లో కూడా లేని పరిస్థితి నెలకొంది. దీంతో అధికార పార్టీ మాజీ కార్పొరేటర్లతోపాటు కొత్తగా పోటీ చేయాలని భావిస్తున్న నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ మునిసిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్లను కలిసి తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పునర్విభజన సిత్రాలు మచ్చుకు కొన్ని... ఇప్పటివరకు 20వ డివిజన్‌గా కొనసాగిన డివిజన్ ఇప్పుడు 17వ డివిజన్‌గా మారింది. ఇక్కడ కార్పొరేటర్‌గా ప్రాతినిధ్యం వహించిన కళావతి నివాసం ఉన్న గల్లీ మాత్రం 16వ డివిజన్‌లోకి చేరింది. 19వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సుజాత నివాసం 17వ డివిజన్‌లోకి వచ్చింది. హౌసింగ్‌బోర్డు కాలనీ ఇప్పటి వరకు 21వ డివిజన్‌గా ఉండగా, ప్రస్తుతం అది 18వ డివిజన్‌గా రూపాంతరం చెందింది. కానీ ఇందులోని 300కు పైగా నివాసాలు వేరే డివిజన్‌లోకి వెళ్లాయి. ఇక 41వ డివిజన్లోని ప్రాంతాలు కొన్ని 40, 42 డివిజన్లలోకి చేరాయి. 30వ డివిజన్ పరిస్థితి కూడా అదే. 47, 40, 15 నెంబర్లు గల పాత డివిజన్లు ఇప్పుడు పూర్తిగా స్వరూపాన్ని కోల్పోయాయని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 40వ డివిజన్లో 2–10–185æ నెంబర్ నుంచి 2–10–310 వరకు గల ఇళ్లు ఏ వార్డులోనూ కనిపించడం లేదు. జ్యోతినగర్‌ను 45వ డివిజన్‌గా ప్రకటించిన అధికారులు కట్టరాంపూర్‌ను 46వ డివిజన్‌గా ప్రకటించారు. ఇక ఓటర్ల సంఖ్య విషయంలో కూడా ఎలాంటి శాస్త్రీయత లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక డివిజన్లో 3000 పైచిలుకు ఓటర్లు ఉంటే మరో డివిజన్లో 4500 మంది ఓటర్లుగా ముసాయిదా జాబితాను ప్రకటించడం గమనార్హం. సమయాభావం వల్లనే... జూలై నెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలనే ప్రభుత్వ పెద్దల ఆలోచనలకు అనుగుణంగా డివిజన్ల విభజనలో శాస్త్రీయత లోపించింది. డివిజన్ల సంఖ్య 60కి అనుగుణంగా ఓటర్ల సంఖ్యను విభజిస్తూ హద్దులు నిర్ణయించడంతో డివిజన్లు ముక్కలు ముక్కలుగా తయారయ్యాయి. గతంలో డివిజన్ల పునర్విభజనకు పలు అంశాలను పరిగణనలోకి తీసుకునే వారు. ఇంటి నెంబర్లతో సంబంధం లేకుండా ఒక వార్డు భౌగోళిక స్వరూపాన్ని ప్రామాణికంగా తీసుకొని తదనుగుణంగా ఇళ్లను చేర్చేవారు. రోడ్లు, రైల్వే లైన్లు, పార్కులు, కాలువలు, తదితర వాటిని హద్దులుగా నిర్ణయించి పునర్విభజన ప్రక్రియ సాగేది. ఈసారి శాస్త్రీయ విధానం లేకపోవడంతో ముసాయిదాలోనే గందరగోళం ఏర్పడింది. నేటితో అభ్యంతరాలకు ముగుస్తున్న గడువు ఈ నెల 1న ముసాయిదా డివిజన్ల జాబితాను అధికారులు ప్రకటించగా, శుక్రవారం వరకు అభ్యంతరాలు తెలియజేసేందుకు గడువు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మాజీ కార్పొరేటర్లు, స్థానిక బస్తీ పెద్దలు, బీజేపీ, ఇతర పార్టీల నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కమిషనర్, కలెక్టర్లను కలిసి వినతిపత్రాలు అందజేశారు. వార్డులను శాస్త్రీయ పద్ధతిలో పునర్విభజన జరపాలని కోరుతున్నారు. కాగా వచ్చిన అభ్యంతరాల మేరకు ఇప్పటికే మునిసిపల్ అధికారులు, సిబ్బంది వార్డుల్లో తిరుగుతూ వాస్తవాలను తెలుసుకుంటున్నారు. శుక్రవారం అభ్యంతరాలకు గడువు ముగిస్తే శనివారం ఒక్కరోజులేనే వాటిని సరిచేసి, ఆదివారం తుది జాబితా ప్రకటించాల్సి ఉంటుంది. హడావుడిలో ఎంత మేరకు న్యాయం జరుగుతుందో చూడాలి. -
నేటితో వారందరూ మాజీలే..
సాక్షి, తూర్పు గోదావరి: ఐదేళ్ల రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పాలకమండలి పదవీకాలం మంగళవారంతో ముగుస్తోంది. పాలక మండలి సభ్యులందరూ బుధవారం నుంచి మాజీలుగా మారిపోనున్నారు. వివిధ పార్టీలకు చెందిన 50 మంది కార్పొరేటర్లు 2014 జూలై రెండో తేదీన రాజమహేంద్రవరం నగర పాలకసంస్థ పాలమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన పంతం రజనీశేషసాయి వ్యవహరిస్తున్నారు. మళ్లీ కొత్త పాలకవర్గం ఎన్నికయ్యే వరకూ నగరపాలక సంస్థ పాలన అధికారుల చేతుల్లోకి వెళ్లనుంది.రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలో రాజమహేంద్రవరం నగరానికి విశిష్ట స్థానం ఉంది. ఈ చారిత్రక నగరంలో సుమారు నాలుగు లక్షల మంది జనాభా ఉన్నారు. నగరాన్ని 50 డివిజన్లుగా విభజించారు. వాటిలో సిటీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 42 డివిజన్లు, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలో ఎనిమిది డివిజన్లు ఉన్నాయి. నగరపాలక సంస్థ పరిధిలో 3,00, 546 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 1,45,319 మంది కాగా, మహిళలు 1,55,161 మంది. ఇతరులు 66 మంది జీవిస్తున్నారు. ఈ పాలకమండలిలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, స్వతంత్రులు కూడా కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. వారితో పాటు వివిధ వర్గాలకు చెందిన ఐదుగురు కో ఆప్షన్ సభ్యుల హోదాలో నగర పాలనలో భాగస్వాములుగా ఉన్నారు. ఇది మూడో పాలకవర్గం ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ మూడు సార్లూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్పొరేషన్ మేయర్ ఎన్నిక కావడం విశేషం. గత ఐదేళ్లలో నగరాభివృద్ధి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని, డివిజన్ల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం పెద్దగా సహకరించలేదనే భావన ప్రజల్లో బలంగా ఉంది. పుష్కరాల సమయంలో కూడా నగరాన్ని ఏమంత అభివృద్ధి పరచలేదని, వచ్చిన నిధులను సద్వినియోగం చేయలేదనే విమర్శలను నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఎదుర్కొంది. టీడీపీ డివిజన్లలోనే అభివృద్ధి తెలుగుదేశం కార్పొరేటర్లు ఉన్న డివిజన్లలో మాత్రమే అభివృద్ధి పనులు చేపట్టి, మిగతా పార్టీల డివిజన్లలో అభివృద్ధిని గాలికి వదిలేశారు. పాలక మండలి బడ్జెట్లో తెలుగుదేశం వారు తమకు అనుకూలంగా నిధులను మంజూరు చేయించుకున్నారు. ఫలితంగా మిగిలిన డివిజన్లలో అభివృద్ధి అంతంత మాత్రంగానే జరిగింది. మరోపక్క తెలుగుదేశం కార్పొరేటర్ల ఏకపక్ష నిర్ణయాల వల్ల నగరంలో అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని ప్రజలు విమర్శిస్తున్నారు. రేపటి నుంచి అధికారుల చేతికి పగ్గాలు మంగళవారంతో కార్పొరేటర్ల పదవీ కాలం ముగియనుండడంతో నగరపాలక సంస్థ పగ్గాలు ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఎన్నికల నిర్వహణకు స్పష్టమైన సంకేతాలు రావడంతో ఇప్పటికే అధికారులు నగరపాలక సంస్థలో డివిజన్ల వారీగా కులగణన చేసి జాబితాలు తయారు చేశారు. 50 డివిజన్లలో ఎస్సీ, బీసీ, మహిళల గణన కూడా పూర్తయ్యింది. డివిజన్ల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ సిద్ధంగా ఉంది. విలీనమైతే నగర విస్తీర్ణం పెరిగే అవకాశం రాజమహేంద్రవరం నగర పాలక సంస్థలో చుట్టు పక్కల గ్రామాల విలీనం జరిగితే ప్రస్తుతం ఉన్న 50 డివిజన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం సిటీ, రూరల్ నియోజక వర్గాలతో పాటు విలీనం తర్వాత రాజానగరం నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు కూడా నగరపాలక సంస్థలో అంతర్భాగం అవుతాయి. అదే జరిగితే నగర వైశాల్యం పెరగడంతో పాటు ప్రస్తుతం ఉన్న 50 డివిజన్ల సంఖ్య 75కు పెరిగే అవకాశం ఉంది. -
డివిజన్ల పునర్విభజనకు ఆమోదం
కాకినాడ : కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ప్రతిపాదించిన పునర్విభజనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 83 తేదీ 4–3–2017 ద్వారా పురపరిపాలన, అర్బన్ డెవలప్మెంట్ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ప్రభుత్వం త్వరలో ఇక్కడ ఎన్నికలకు సమాయత్తమవుతున్నామన్న సంకేతాలను ఇచ్చినట్టయింది. ఆరేళ్ళుగా నగరపాలక సంస్థ ఎన్నికలు జరగకపోవడం, దీనిపై కాకినాడకు చెందిన మాజీ కౌన్సిలర్ చిట్నీడి మూర్తి హైకోర్టులో కేసు వేయడం తదితర పరిణామాలతో గత ఏడాది తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో కాకినాడలో గతంలో ఉన్న 50 డివిజన్లను, కొన్ని పంచాయతీలను కలిపి హద్దులను మార్చి పునర్విభజన చేశారు. ఎస్.అచ్యుతాపురం, గంగానపల్లిలోని టీచర్స్‌కాలనీ, స్వామినగర్ ప్రాంతాలను విలీనం చేస్తూ మార్పులు, చేర్పులు చేసి ప్రజల నుంచి అభ్యంతరాలను కూడా సేకరించారు. వచ్చిన 47 అభ్యంతరాలను పరిష్కరించి కౌన్సిల్ ఆమోదంతో తుది నివేదికను ప్రభుత్వానికి గత ఏడాది సెప్టెంబర్‌లో పంపించారు. ఈ ప్రతిపాదనలను యథావిధిగా ఆమోదిస్తూ పుర పరిపాలన శాఖ శనివారం జీవో ఎంఎస్ నెంబర్ 83 ద్వారా ఆమోదం తెలిపింది. ఎన్నికల ఊసేదీ...? పుర పరిపాలనశాఖ జారీ చేసిన జీవోలో స్పష్టత కొరవడిందని రాజకీయ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. గత నెల చివరిలో శ్రీకాకుళం, కర్నూలు, తిరుపతి, అనంతపురం కార్పొరేష¯ŒS ఎన్నికలకు సంబంధించి పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికలకు సిద్ధం కావాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని చెబుతున్నారు. కాకినాడ విషయంలో మాత్రం కేవలం పునర్విభజనకు ఆమోదం తెలిపారే తప్ప బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా తదితర అంశాలపై ఆ ఉత్తర్వుల్లో ఎలాంటి స్పష్టత లేదంటున్నారు. కేవలం కంటితుడుపుగా ఆమోదం తెలిపారే తప్ప మిగిలిన కార్పొరేషన్లతోపాటుగా ఇక్కడ ఎన్నికలు జరుగుతాయనే అంశంపై స్పష్టత లేకపోయిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. తొలుత జీవో నెంబర్ లేకుండానే పునర్విభజనకు ఆమోదం తెలియజేస్తూ ఉత్తర్వులు రావడం, ఆ తరువాత జీవో నెంబర్‌తో ఇచ్చినా అది డౌన్లోడు కాకపోవడంతో మరికొంత గందరగోళానికి దారితీసింది. జీవో నెంబర్‌తో సహా ఉత్తర్వులు కాపీ చేతికందితే తప్ప దీనిపై ఏమి చెప్పలేమంటూ కార్పొరేషన్ వర్గాలు చెబుతున్నాయి. కోర్టు నుంచి మొట్టికాయలు పడడంతో ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నట్టుగా చూపించేందుకే ఇలా పునర్విభజనను ఆమోదించారా? లేక ఇతర కార్పొరేషన్లతోపాటుగా ఇక్కడ కూడా ఎన్నికలు నిర్వహిస్తారా? అనే అంశంపై ఒకటి,రెండు రోజుల్లో స్పష్టతవచ్చే అవకాశం ఉంటుందన్నారు. -
కులాల కుమ్ముడు
భీమవరం :తెలుగుదేశం పార్టీలో కులాల కుంపట్లు రాజుకున్నాయి. స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో ఆశావహులు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. తమకు ఆదినుంచీ అన్యాయమే జరుగుతోందని.. ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి తమ సేవలకు గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు. గ్రూపు రాజకీయాలకు తెరలేపడమే కాకుండా కులాల కోణాన్ని సైతం ప్రయోగిస్తున్నారు. భీమవరం నియోజకవర్గం నుంచి ముగ్గురు నాయకులు ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. వీరంతా సామాజిక వర్గాల వారీగా విడిపోయి రాజకీయాలను వేడెక్కించారు. గత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి, గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), వీరవల్లి చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని ఆశించారు. అప్పట్లో చంద్రశేఖర్ పేరును పార్టీ అధిష్టానం పరిశీలించినా చివరకు అదే సామాజిక వర్గానికి చెందిన అంగర రామ్మోహనరావుకు ఎమ్మెల్సీ పీఠం కట్టబెట్టింది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో మెంటే పార్థసారథి, గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తనయుడు జగదీష్ భీమవరం అసెంబ్లీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పటికప్పుడు టీడీపీలో చేరిన పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) సీటు దక్కించుకోవడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు. వీరంతా మూడు గ్రూపులుగా విడిపోయారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గిరీ విషయంలోనూ వర్గాలవారీగా విడిపోయి ఆ పదవి దక్కించుకునేందుకు యత్నిం చి విఫలమయ్యారు. ఎమ్మెల్సీ పదవిని సీనియర్ నాయకుడైన మెంటే పార్థసారథికి కట్టబెట్టేలా అంతా కలిసి ప్రయత్నిద్దామని ఎమ్మెల్యే పులపర్తి అంజి» êబు ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకార సభలో ప్రకటించడంతో కులం కోణం తెరపైకి వచ్చింది. నియోజకవర్గంలోని అన్ని పదవులూ ఒకే సామాజిక వర్గానికి కట్టబెడతారా అంటూ కొందరు నాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెంటే పార్థసారథితోపాటు గాదిరాజు బాబు, వీరవల్లి చంద్రశేఖర్ తమ వ్యూహాలకు పదును పెట్టారు. ఎమ్మెల్సీ పదవిని బీసీలకే ఇవ్వాలని ఒక వర్గం పట్టుబడుతోంది. మిగిలిన చోట్లా ఇదే పరిస్థితి ఇప్పటికే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న అంగర రామ్మోహనరావు ఇదే పదవి కోసం తిరిగి ప్రయత్నిస్తుండగా.. ఏలూరు నగరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ఈ పదవిపై కన్నేశారు. గతంలో చంద్రబాబు హామీ ఇచ్చినందున ఈ పదవి తనకే దక్కుతుందన్న ధీమాతో అంబికా ఉన్నారు. ఇక్కడా సామాజిక కోణమే నడుస్తోంది. ఇటీవల రాజ్యసభ సభ్యత్వాన్ని ఆయన సామాజిక వర్గానికి చెందిన టీజీ వెంకటేష్‌కు ఇచ్చినందున ఎమ్మెల్సీ పదవి ఈయనకు ఇవ్వకపోవచ్చని టీడీపీలో చర్చ సాగుతోంది. మరోవైపు బీసీ కోటాలో ఏలూరు నుంచి సైదు సత్యనారాయణ, తణుకు నుంచి డాక్టర్ దొమ్మేటి సుధాకర్, వావిరాల సరళాదేవి, తాడేపల్లిగూడెం నుంచి కిల్లాడి ప్రసాద్ ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ సామాజిక చిచ్చు రగులుస్తున్న పదవుల వ్యవహారం ఎటు తిరిగి ఎటు వస్తుందో తెలియక తెలుగు తమ్ముళ్లు తికమక పడుతున్నారు. -
నేడు ఆర్‌యూలో జిల్లాస్థాయి యూత్ ఫెస్టివల్
కర్నూలు(ఆర్యూ): స్థానిక రాయలసీమ యూనివర్సిటీలో నేడు జిల్లాస్థాయి యూత్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా డివిజన్ వారీగా జరిగిన పోటీల్లో ప్రథమ స్థానంలో గెలుపొందిన విజేతలకు జిల్లాస్థాయి పోటీలను నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం సాధించే విజేతలు ఈనెల 31వ తేదీన రాజమహేంద్రవరంలోని నన్నయ యూనివర్సిటీలో నిర్వహించే రాష్ట్రస్థాయి యూత్ ఫెస్టివల్‌కు ఎంపికవుతారు. జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్లో భాగంగా వివిధ రకాల లలిత కళలు, వ్యాసరచన, కరిక్యులర్, కో–కరిక్యులర్ యాక్టివిటీస్ తదితర సాంస్కృతిక పోటీలను 23 విభాగాల్లో నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎన్.నరసింహులు తెలిపారు. -
‘కాకినాడ’ పీఠం కైవసమే లక్ష్యం
అధికార పార్టీ వైఫల్యాల్నీ, వంచననూ ఎండగట్టాలి మెజారిటీ డివిజన్లూ, మేయర్ స్థానమూ గెలవాలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నేతల పిలుపు కాకినాడ: రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో మెజారిటీ డివిజన్లలో గెలుపుతో పాటు మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని వైఎస్సార్ సీపీ కార్పొరేషన్ ఎన్నికల పరిశీలకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షతన బుధవారం జరిగింది. ముఖ్యఅతిథిగా బొత్స మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలను రెండేళ్ళ పాలనలో తుంగలో తొక్కి, ప్రత్యేక హోదా విషయంలో దగా చేసిన తెలుగుదేశం, బీజేపీ వైఫల్యాలను ఇంటింటా ప్రచారం చేయాలన్నారు. టీడీపీ అరాచకాలను ధైర్యంగా ఎదుర్కోవడంతో పాటు ఐకమత్యంతో పనిచేసి మంచి ఫలితాలను సాధించాలని కోరారు. సమర్థులే అభ్యర్థులు : ధర్మాన పార్టీ జిల్లా పరిశీలకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో సమర్థులైన అభ్యర్థులను సర్వేలు, ఇతర అంశాల ప్రాతిపదికగా ఎంపిక చేస్తారని స్పష్టం చేశారు. అభ్యర్థి గుణగణాలతోపాటు ప్రజలతో ఉండే సత్సంబంధాలను పరిగణనలోకి తీసుకుంటారన్నారు. మరో పరిశీలకుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని శత్రువుగా చూసే ధోరణిలో పాలన సాగిస్తున్న చంద్రబాబు హయాంలో ఎన్నికలు యుద్ధంలా జరుగుతున్నాయని, కేడర్ సైనికుల్లా పనిచేయాల్సి అవసరం ఉందని చెప్పారు. జన్మభూమి కమిటీల ద్వారా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీట్ లెవెల్లో పార్టీ శ్రేణులతో కమిటీలు వేయాలన్నారు. మరో ఎన్నికల పరిశీలకుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ పార్టీ నేతలు ఐక్యతతో పనిచే సి ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని సూచించారు. ‘స్మార్ట్ సిటీ’ ప్రచారార్భాటమే : కన్నబాబు పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ద్వారా రూ.386 కోట్లు విడుదలైనట్టు గొప్పలు చెబుతూ ఇప్పటి వరకు పట్టుమని రూ.2 కోట్లు నిధులు ఖర్చు చేయలేదని విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికొదిలిన టీడీపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడంతో పాటు పార్టీ విధానాలను విస్తృతంగా ప్రచారం చేసి గెలుపుబాట పట్టాలన్నారు. మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ద్వారా అధికార పార్టీకి ఎక్స్ అఫిషియో సభ్యులున్నందున కనీసం 35 స్థానాల్లో గెలుపును లక్ష్యంగా భావించాలన్నారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోపాటు ఇతర వైఫల్యాలను, స్మార్ట్‌సిటీ పేరుతో అభివృద్ధికి ఆమడదూరంగా ఉన్న విధానాలను ఇంటింటికీ తిరిగి విస్తృత ప్రచారం చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా మేయర్ పీఠాన్ని జగన్‌కు బహుమతిగా ఇద్దామని పిలుపునిచ్చారు. కాకినాడ సిటీ కో ఆర్డినేటర్ ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోగలమనే ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, జన్మభూమి కమిటీ అరాచకాలు పెరిగిపోయాయన్నారు. అమర జవాన్లకు నివాళి ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఎలా పనిచేయాలనే అంశంపై పార్టీ శ్రేణులకు నేతలు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు స్వాగతం పలుకగా, రాష్ట్ర కార్యదర్శి కర్రి నారాయణరావు, మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, కాకినాడ నగర ఎస్సీ, మైనార్టీ సెల్ అధ్యక్షులు సునీల్, అక్బర్ అజామ్ తదితరులు ప్రసంగించారు. తొలుత మహానేత వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన జవాన్లకు నివాళులర్పిస్తూ శశిధర్ తీర్మానం ప్రవేశపెట్టగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. పార్టీ పెద్దాపురం, జగ్గంపేట కో ఆర్డినేటర్లు తోట సుబ్బారావునాయుడు, ముత్యాల శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, మట్టా సుజాత, రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్, జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు అబ్దుల్ బషీరుద్దీన్, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శులు బొబ్బిలి గోవిందు, అల్లి రాజబాబు, మీసాల దుర్గాప్రసాద్, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి పెద్దిరెడ్డి రామలక్ష్మి, రాష్ట్ర యువజన విభాగం సభ్యుడు వాసిరెడ్డి జమీలు, పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
‘జిల్లాల విభజన సహేతుకంగా లేదు’
చిలుకూరు: జిల్లాల విభజనను స్వాగతిస్తున్నాం. కానీ మండలాలు, డివిజన్ల విభజన సహేతుకంగా లేదని ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు యతిపతిరావును అన్నారు. మంగళవారం చిలుకూరు ఎమ్మార్సీ కార్యాలయంలో జరిగిన అ సంఘం మండల సమావేశంలో మాట్లాడారు. జోనల్ వ్యవస్థను కొనసాగించాలి డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని తమిళనాడు రాష్ట్రంలో మాదిరిగా అమలు చేయాలన్నారు. పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 2016 డీఎస్సీ తక్షణమే నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వీరరాఘవులు, మండల అధ్యక్షుడు కొండా వెంకయ్య, ప్రధాన కార్యదర్శి కంచుగంటి వెంకటేశ్వర్లు, జిల్లా, మండల నాయకులు గుండు ఆదినారాయణ, మండవ ఉపేందర్, మంద పుల్లయ్య, ఎస్. రాదాకృష్ణ, సురేష్, పి. నాగేశ్వరారవు, కీరీటం, ఎస్. శ్రీనివాస్‌రావు, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డివిజన్లు యథాతథం
* జీహెచ్ఎంసీపై సీఎం కేసీఆర్ నిర్ణయం! * ఇప్పుడున్న 150 డివిజన్ల కొనసాగింపు * జనాభా సమాన నిష్పత్తిలో ఉండేలా పునర్వ్వవస్థీకరణ *ఒక్కో డివిజన్‌కు 44,879 మంది సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ శనివారం మంత్రివర్గ సహాచరులతో జరిపిన సమావేశంలో ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తుంది. 150 డివిజన్లనే కొనసాగించినా.. జనాభా మాత్రం సమాన నిష్పత్తిలో ఉండేలా డివిజన్ల పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 67,31,790 జనాభా ఉంది. ఇందుకు అనుగుణంగా 150 డివిజన్లలో ఒక్కోదానికి 44,879 మందిని ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇలా కుదరని పక్షంలో 10 శాతం అటూఇటుగా సర్దుబాటు చేయనున్నారు. ప్రస్తుతం కాన్షీబజారు డివిజన్లో అత్యల్పంగా 17,601 జనాభా ఉండగా, శేరిలింగంపల్లిలో గరిష్టంగా 93,141 జనాభా ఉంది. ఇలాంటి ఈ వ్యత్యాసానికి తావు లేకుండా డివిజన్ల జనాభాలో సమాన నిష్పత్తి ఉండేందుకు చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం 150 డివిజన్లలో కోర్ సిటీలో 100, శివారులో 50 డివిజన్లు ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ తర్వాత కోర్ సిటీలో 67, శివారులో 83 డివిజన్లు ఉండనున్నట్లు సమాచారం. డివిజన్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన జీవో మరో రెండ్రోజుల్లో వెలువడనుంది. వారం, పది రోజుల్లో ముసాయిదా ప్రతిని ప్రజల ముందుంచి వారి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించనున్నారు. తొలుత 200 డివిజన్లు ఏర్పాటు చేయాలని భావించారు. అయితే జీహెచ్ఎంసీ కమిషన ర్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం 150 డివిజన్లనే ఖరారు చేయాలని నిర్ణయించింది. కార్పోరేటర్లు ఎక్కువగా ఉన్నట్లయితే కౌన్సిల్ నిర్వహణలో ఏర్పడనున్న ఇబ్బందులను కూడా కమిషనర్ ప్రభుత్వానికి రాసిన లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా కమిషనర్‌తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న డివిజన్ల ఖరారుకు మార్గం సుగమమైనట్లు చర్చసాగుతుంది. ఇప్పటికే డీలిమిటేషన్‌కు సంబందించి మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసినట్లు సమాచారం. -
తనిఖీల పేరుతో వసూళ్లు
కడప అగ్రికల్చర్: ఎరువుల దుకాణాల్లో అక్రమాలు జరగకుండా నివారించాలనే ఉద్దేశంతో ఇటీవల జిల్లా వ్యవసాయశాఖ ఇన్చార్జ్ జేడీ జ్ఞానశేఖర్ వ్యవసాయాధికారులను డివిజన్ల వారీగా నియమించి తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఓ వ్యవసాయాధికారి అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎరువుల దుకాణ యజమానుల నుంచి ముక్కు పిండి దాదాపు 50 వేల రూపాయలు వసూలు చేసుకున్నారు. అధికారుల బృందం పోరుమామిళ్ల డివిజన్లో ఎరువుల దుకాణాలు తనిఖీలు చేయడానికి వెళ్లారు. ఆ బృందంలోని ఓ అధికారి రికార్డులు సరిగాలేవని, తాను తలచుకుంటే షాపులను సీజ్‌చేస్తానని బి. మఠం మండలంలోని దుకాణదారులను బెదించి అందినకాడికి దోచుకుని తిరుగుముఖం పడుతుండగా ఓ మండల వ్యవసాయాధికారి సమీపంలోని దుకాణాన్ని తనిఖీ చేస్తూ కనిపించాడు. అంతే...ఆ అధికారి అక్కడి వెళ్లి నా అనుమతి లేకుండా నీవు డబ్బులు వసూలు చేసుకోవడానికి వ చ్చావా అంటూ ఆ అధికారి మండల అధికారిని గద్దించినట్టు సమాచారం. దుకాణాల నుంచి డబ్బులు వసూలు చేసిన విషయం ఆనోటా...ఈ నోటా పడి అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ అధికారి, జిల్లా జేడీ కార్యాలయంలో పనిచేసే అధికారులు కొందరు ఉన్నతాధికారి వద్ద బుధవారం రాత్రి పంచాయితీ పెట్టినట్లు సమాచారం. వ్యవసాయశాఖకు చెడ్డపేరు తెచ్చే పనులు ఎట్టి పరిస్థితుల్లోను సహించేది లేదని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు వివరించి తగు చర్యలు తీసుకుంటామని ఆ ఉన్నతాధికారి తెగేసి చెప్పినట్లు సమాచారం. గత ఏడాది కూడా ఓ అధికారి ఇలాగే అవినీతికి పాల్పడగా పత్రికల్లో కథనాలు రావడంతో బదిలీపై వెళ్లిపోయారు. ఇప్పుడు అదే బాటలో మరో అధికారి పయనిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. -
51 విభాగాల్లో ఉద్యోగుల పంపిణీ పూర్తి
8,191 మంది ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు పంచిన కమలనాథన్ కమిటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఇప్పటి వరకు 51 విభాగాల్లోని రాష్ట్ర స్థాయి కేడర్‌కు చెందిన 8,191 మంది ఉద్యోగులను కమలనాథన్ కమిటీ ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. స్థానికత, ఆప్షన్లు, మార్గదర్శకాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు 4,359 మంది ఉద్యోగులను, తెలంగాణకు 3,832 మందిని కమిటీ కేటాయించింది. తెలంగాణకు చెందిన 518 మంది ఉద్యోగులను ఆప్షన్లు, ఇతర నిబంధనల మేరకు కమిటీ ఏపీకి కేటాయించింది. అలాగే ఆంధ్రాకు చెందిన 246 మందిని ఆప్షన్లు, ఇతర నిబంధనల మేరకు తెలంగాణకు కేటాయించారు. పంపిణీ పూర్తి చేసిన 51 విభాగాల్లో ఏపీకి 6,462 పోస్టుల మంజూరవ్వగా.. పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఆధారంగా 4,359 మందిని కేటాయించారు. అలాగే తెలంగాణకు 51 విభాగాల్లో మంజూరైన పోస్టులు 4,329కు గాను పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఆధారంగా 3,832 మందిని కేటాయించారు. తెలంగాణ నాల్గోతరగతి ఉద్యోగులు ఎక్కువగా ఉండటంతో ఆంధ్రాకు కేటాయించిన తెలంగాణ ఉద్యోగుల్లో 287 మంది నాల్గోతరగతి ఉద్యోగులే ఉన్నారు. ఇలా ఉండగా మరో 17 విభాగాల్లో కూడా రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ కూడా పూర్తి అయింది. ఈ పంపిణీకి సంబంధించి అధికారికంగా నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది. నెలాఖరుకు రాష్ట్ర స్థాయి ఉద్యోగుల ప్రొవిజనల్ పంపిణీ నూరు శాతం పూర్తి చేయాలని కమలనాథన్ కమిటీ నిర్ణయించింది. ప్రొవిజనల్ పంపిణీ జాబితాలను కేంద్రానికి పంపి ఆమోదం పొందాల్సి ఉంది. ఆ తర్వాత ఉద్యోగుల తుది పంపిణీ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. -
51 విభాగాల్లో ఉద్యోగుల పంపిణీ
⇒ గతంలో 25 శాఖల్లో.. తాజాగా మరో 26 శాఖల్లో.. ⇒ రెండు వారాల్లోగా అభ్యంతరాలు తెలియజేయాలి ⇒ కమలనాథన్ కమిటీ నోటిఫికేషన్ జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర స్థాయి ఉద్యోగుల ప్రొవిజనల్ పంపిణీని 51 శాఖలకు చెందిన విభాగాల్లో కమలనాథన్ కమిటీ పూర్తి చేసింది. గతంలో 25 శాఖలకు చెందిన విభాగాల్లో పంపిణీ పూర్తి చేసిన కమిటీ మంగళవారం మరో 26 శాఖల విభాగాల్లోనూ పంపిణీని పూర్తి చేసింది. వర్క్ టు సర్వ్ ఆర్డర్లో ప్రస్తుతం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో 26 శాఖలకు చెందిన విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు తాత్కాలిక పంపిణీ చేస్తూ కమలనాథన్ కమిటీ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్లు, స్థానికత, మార్గదర్శకాల ఆధారంగా ఏ ఉద్యోగి ఏ రాష్ట్రంలో పనిచేయాలో నోటిఫికేషన్లో పేర్లతో సహా పేర్కొంది. అలాగే ఆయా ఉద్యోగుల సీనియారిటీ ర్యాంకును పంపిణీలో కమలనాథన్ కమిటీ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ స్థానికత గల ఉద్యోగులను నిబంధనల మేరకు కొంత మందిని తెలంగాణకు.. అలాగే తెలంగాణ స్థానికత గల ఉద్యోగులను కొంత మందిని ఏపీకి కేటాయించారు. తాజాగా పంపిణీ అయిన ఉద్యోగులు ఏమైనా అభ్యంతరాలుంటే రెండు వారాల్లోగా తెలియజేసేందుకు గడువు ఇచ్చారు. నోటిఫికేషన్ జారీ అయిన 14 రోజుల్లోగా పంపిణీ చేసిన రాష్ట్రానికి వెళ్లి ఉద్యోగంలో చేరాలని స్పష్టం చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులనూ కమిటీ పంపిణీ చేసింది. రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల ప్రొవిజనల్ పంపిణీ దాదాపు సగం శాఖల్లో కమలనాథన్ కమిటీ పూర్తి చేసినట్లైంది. 5వ తేదీన కమలనాథన్ కమిటీ భేటీ రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై కమలనాథన్ కమిటీ ఈ నెల 5వ తేదీన సమావేశం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ సీఎస్‌లు రాజీవ్ శర్మ, ఐ.వై.ఆర్. కృష్ణారావు, ఇరు రాష్ట్రాల పునర్విభజన విభాగం కార్యదర్శులు ప్రేమచంద్రారెడ్డి, రామకృష్ణారావు, కేంద్ర వ్యక్తిగత సిబ్బంది వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి అర్చనా వర్మ పాల్గొంటారు. -
‘స్వచ్ఛ'ందంగా కదిలారు...
పుస్తకాలు.. పెన్నులతో.. నిత్యం కుస్తీపట్టే.. చిట్టిచేతులు చీపుర్లు పట్టాయి.. నగరపాలక సంస్థ ఇచ్చిన స్వచ్ఛనగరం పిలుపుతో స్వచ్ఛందంగా కదిలివచ్చారు.. కార్యక్రమంలో సింహభాగమై చెత్తను తరిమే పనిపట్టారు.. చెత్తను రోడ్లపై వేసేవారికి కనువిప్పు కలిగించారు.. నగరంలోని గల్లీగల్లీలోకి వెళ్లి రోడ్లు ఊడ్చి.. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజల్లో స్ఫూర్తి నింపారు.. - టవర్‌సర్కిల్ స్వచ్ఛభారత్‌లో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛనగరం- మన కరీంనగర్’ కార్యక్రమం శనివారం అన్ని డివిజన్లలో నిర్వహించారు. రోడ్లను ఊడ్చి, చెత్తను పోగుచేసి ట్రాక్టర్లలో పంపే వరకు విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలంతా బాధ్యతగా పనులు నిర్వహించారు. నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తరలివచ్చారు. ఆయా డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, మున్సిపల్ నియమించిన ప్రత్యేకాధికారులతో కలిసి రోడ్లుఊడ్చి, చెత్తను తొలగించారు. మూడు గంటలు.. యాభై డివిజన్లు.. ‘స్వచ్ఛ నగరం - మన కరీంనగర్’ కార్యక్రమం ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని డివిజన్లలో జరిగింది. మూడు గంటలపాటు విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఉద్యమంలా పనులు చేపట్టారు. ఎక్కడ చూసినా స్వచ్ఛ భారత్ కనిపించింది. డివిజన్‌కు వెయ్యి మందితో కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించినా విద్యాసంస్థలు తక్కువగా ఉన్న డివిజన్లలో తక్కువగా, కొన్ని డివిజన్లలో ఎక్కువగా హాజరయ్యారు. లక్ష్యాన్ని చేరువగా వచ్చామని ప్రజాప్రతినిధులు, అధికారులు వెల్లడించారు. పాశ్చాత్యదేశాలకు ధీటుగా - ఎమ్మెల్యే, మేయర్ పాశ్చాత్య దేశాలైన అమెరికా, లండన్, చైనాల్లో ఇంతమంది పారిశుధ్య కార్మికులు ఉండరని, ఎవరి పనిని వారే చేసుకుంటారని, అందుకే ఆ దేశాలు సుందరంగా కనబడతాయని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్ అన్నారు. పలు డివిజన్లలో జరిగిన స్వచ్ఛ నగరం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ... మనం కూడా ఎవరి చెత్తను వారే తొలగించుకుంటే ఆయా దేశాలకు ధీటుగా మనం నిలబడగలమన్నారు. చెత్తలేని రహదారులపై చెత్త వేయాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితిని తీసుకురావాలని కోరారు. పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు.ఒక్క రోజుతోనే స్వచ్ఛత పనులు నిలపవద్దని, పరిసరాల్లో ఎక్కడ చెత్త కనబడినా తొలగించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ శ్రీకేశ్‌లట్కర్, డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, బీజేపీ నాయకులు బండి సంజయ్, ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి, డీఎస్పీ జె.రామారావు, కార్పొరేటర్లు వై.సునీల్‌రావు, చల్ల స్వరూపరాణి, కమల్జిత్కౌర్, చాడగొండ కవిత, ఏవీ.రమణ, మాచర్ల రజిత, ఎడ్ల స్వరూప, కంసాల శ్రీనివాస్, గందె మాధవి, వైద్యుల శ్రీదేవి, రవీందర్, వేణు, ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శివారు జోరు
పెరగనున్న డివిజన్లు కోర్ ఏరియాలో తగ్గే అవకాశం సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని శివారు ప్రాంతాల్లో కొత్త డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. మరోవైపు పాత ఎంసీహెచ్ పరిధిలో .. ముఖ్యంగా పాతబస్తీ లో డివిజన్లు తగ్గే అవకాశాలూ ఉన్నాయి. త్వరలో జీెహ చ్ఎంసీ పాలకవర్గం గడువు ముగియనుండటం.. కోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం.. బుధవారం జీవో జారీ కావడంతోత్వరలోపునర్విభజన ప్రక్రియ ప్రారంభం కానుంది. 2011 జనాభాను బట్టి అన్ని వార్డుల్లో జనాభా సమానంగా ఉండేలా పునర్విభజించాల్సి ఉంది. దీంతో గ్రేటర్లో విలీనమైన శివారు ప్రాంతాల్లో ఎక్కువ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. అదే సమయంలో కోర్ ఏరి యాలో డివిజన్లు తగ్గే అవకాశాలున్నాయి. ప్రభుత్వం గతంలోవెలువరించిన జీవో మేరకు 50 లక్షల జనాభా వరకు 143 డివిజన్లు, అనంతరం ప్రతి 60 వేల జనాభాకు ఒక డివిజన్ వంతున ఏర్పాటు చేయవచ్చు. ఇలా చేశాక మిగిలిన జనాభా 30 వేలకు మించి ఉంటే అదనంగా మరో డివిజన్‌ను ఏర్పాటు చేయవచ్చు. 30 వేల లోపు ఉంటే ఇరుగుపొరుగు డివిజన్లలో సర్దుబాటు చేయాలి. వీటిని పరిగణనలోకి తీసుకొని 35 వేల జనాభాకు ఒకటి చొప్పున 2011 జనాభా మేరకు 172 డివిజన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా. ఇలా జరిగితే శివారు ప్రాంతాల్లో ఎక్కువ డివిజన్లు రానున్నాయి. అక్కడ కొన్నిచోట్ల 70వేలకు పైగా జనాభా ఉంది. కోర్ ఏరియాలోని కొన్ని డివిజన్లలో 25 వేలకు అటూఇటూగా మాత్రమే ఉంది. ఇలాంటి డివిజన్లలో కొన్ని కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఉత్తర్వులు జారీ.. గ్రేటర్ పునర్విభజనప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వం గురువారం జీవో జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలు..ఎన్నికల సంఘం సూచన తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని జీహెచ్ఎంసీ వెంటనే ఈ ప్రక్రియను చేపట్టాల్సిందిగా సూచించింది. ఆ పంచాయతీల సంగతేంటి? జీహెచ్ఎంసీలో విలీనమవుతాయనే ఉద్దేశంతో శివార్లలోని కొన్ని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన జరుగుతుండడంతో ఆ పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వెంటనే పూర్తి చేయాలి: ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇకనైనా ప్రభుత్వం వెంటనే శాస్త్రీయ పద్ధతిలో వార్డుల విభజన చేపట్టాలని ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రిజర్వేషన్ ప్రక్రియను పూర్తిచేసి వీలైనంత త్వరగా సమాచారాన్ని ఎన్నికల సంఘానికి పంపించాలన్నారు. కుంటి సాకులతో ఎన్నికలు ఆలస్యం చేస్తే తాము కోర్టులను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. ఎన్నికలు జాప్యమైతే జీహెచ్ఎంసీ కమిషనర్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సమాన ఓటర్లు ఉండాలి: వీహెచ్ అన్ని డివిజన్లలో సమానంగా ఓటర్లు ఉండేలా పునర్విభజన చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు కోరారు. ఈమేరకు గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్‌కు లేఖ రాశారు. గతంలో జరిగిన విభజనలో హెచ్చుతగ్గుల వల్ల అసమానతలు చోటుచేసుకునన విషయాన్ని ప్రస్తావించారు. పక్షపాతం లేకుండా చూడండి: బంగారి ప్రకాశ్ తమ పార్టీ నాయకులు హైకోర్టును ఆశ్రయించడంతో పునర్విభజనపై రెండు నెలల క్రితమే హైకోర్టు ఆదేశించినా, అధికారులు జాప్యం చేశారని జీహెచ్ఎంసీలో బీజేపీ పక్ష నాయకుడు బంగారి ప్రకాశ్ అన్నారు. ఇప్పటికైనా జీవో వెలువరించడం ముదావహమంటూ.. వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. వార్డుల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు.. రాజకీయ పక్షపాతాలకు తావులేకుండా విభజన పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వచ్చేవారం నుంచే... జీహెచ్ఎంసీలో వార్డుల విభజన ప్రక్రియను అధికారులు వచ్చేవారం ప్రారంభించనున్నారు. అంతకుముందు ఆయా ప్రభుత్వ విభాగాలు, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు, సమావేశాలు నిర్వహించనున్నట్లు కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. పునర్విభజన సవ్యంగా సాగేందుకు వారి సహకారం తీసుకుంటామని, తమ సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు గురువారం తనను కలిసిన మీడియా ప్రతినిధులకు చెప్పారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వం 1996లోజారీ చేసిన జీవో నెంబరు 570 మేరకు పునర్విభజన చేయనున్నారు. అన్ని వార్డుల్లోనూ జనాభా సమానంగా ఉండాలి. హెచ్చు తగ్గులున్నా అవి పది శాతం లోపునే ఉండాలి. సరిహద్దులనూ పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుత, మార్పు చేయబోయే డివిజన్లను మ్యాపుల రూపంలో, ప్రత్యేక రంగుల్లో ప్రచురించాలి. తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలు, వారి సూచనలు, అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోవాలి. వీటితోపాటు మరికొన్ని నియమ నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. -
ఫ్యాన్ హవా
కడప కార్పొరేషన్లో తిరుగులేని ఆధిక్యత మున్సిపాలిటీలలో అత్యధిక వార్డులు కైవసం 97 స్థానాలు దక్కించుకున్న వైఎస్సార్సీపీ 87 స్థానాలతోనే సరిపెట్టుకున్న టీడీపీ కాంగ్రెస్‌కు ఒకే ఒక్క స్థానం పుర సమరంలో ఫ్యాన్ గాలి వీచింది. కడప కార్పొరేషన్లో తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం అదే హవాను కనబరిచింది. 186 మున్సిపల్ వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే 97స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 87స్థానాలతోనే తెలుగుదేశం పార్టీ సరిపెట్టుకుంది. 50 డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తే, 42 స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకోగా, 8స్థానాల్లో టీడీపీ నెగ్గింది. జిల్లాలో మరోమారు వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించగా, టీడీపీ వెనుకబడింది. అయితే పాలకమండలిని కైవసం చేసుకునేందుకు సంఖ్యాపరంగా సరిపడ సీట్లు దక్కించుకోవడంతో నాలుగు మున్సిపాలిటీలు ఆపార్టీ ఖాతలో జమకానున్నాయి. జిల్లాలో ఏడు మున్సిపాలిటీలకు, కడప కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించారు. హైకోర్టు స్టేటస్కో ఆర్డర్ కారణంగా రాజంపేట మున్సిపల్ ఎన్నికలు రద్దయ్యాయి. మున్సిపాలిటీలను పరిశీలిస్తే పులివెందుల, రాయచోటి, యర్రగుంట్లలో వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మైదుకూరు, బద్వేల్ మున్సిపాలిటీలలో టీడీపీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించగా, జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో చావుతప్పి కన్నులొట్ట అయినట్లుగా స్వల్ప ఆధిక్యతతో గట్టెక్కింది. మొత్తానికి నాలుగు మున్సిపాలిటీలు తెలుగుదేశం పార్టీ వశం కానున్నాయి. సంఖ్యా పరంగా పాలకమండళ్లను కైవసం చేసుకున్నా, జిల్లాను పరిగణలోకి తీసుకుంటే 236 మందికిగాను, 139మంది వైఎస్సార్సీపీ ప్రతినిధులుగా ఎన్నికకాగా, 95 మంది తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్‌గా ఒకరు మాత్రమే జిల్లా నుంచి ఎన్నిక కావడం విశేషం. మరొకరు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఓట్లల్లో సైతం ఆధిక్యతే.. మున్సిపాలిటీ ఎన్నికల్లో పోలైన ఓట్లను పరిశీలిస్తే వైఎస్సార్సీపీకే పట్టణ ఓటర్లు మొగ్గుచూపారు. జిల్లాలోని కడప కార్పొరేషన్‌తో పాటు, ఏడు మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించారు. ఆయా మున్సిపాలిటీల పరిధిలో 4,54,769 మంది పట్టణ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో వైఎస్సార్సీపీకి 2,27,480 మంది ఓటేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు 1,86,178 మంది ఓటేశారు. ఈలెక్కన 41,302 ఓట్లు అధికంగా వైఎస్సార్సీపీ దక్కాయి. ఇతర పార్టీల అభ్యర్థులకు 41,111 మంది అనుకూలంగా ఓటు వేశారు. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్.... జిల్లాలో ఒకప్పుడు తిరుగులేని హవా ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన అంశంతో తుడిచిపెట్టుకుపోయింది. 236 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే అందులో ఒకే ఒక్క స్థానాన్ని ఆపార్టీ దక్కించుకుంది. బద్వేలులో ఒక కౌన్సిలర్ స్థానాన్ని సొంతం చేసుకుంది. అత్యధిక స్థానాలలో నామినేషన్లు సైతం వేయలేని దుస్థితి ఆ పార్టీకి ఎదురైంది. సంస్థాగతంగా నిర్మాణం లేకపోయినా.. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంగా నిర్మాణం పూర్తి కాకపోయినా మున్సిపోల్స్‌లో సత్తా చాటిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల కంటే ముందే మున్సిపల్, స్థానిక సంస్థలకు ఎన్నికల నేపధ్యంలో వైఎస్సార్సీపీకి భారం కానున్నట్లు విశ్లేషకులు ముందే భావించారు. పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోయినా, సంస్థాగ తంగా పూర్తిగా నిలదొక్కకపోయినా మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా చాటుకున్నట్లు పలువురు భావిస్తున్నారు. మాజీ కౌన్సిలర్ల కారణంగానే ప్రొద్దుటూరు, జమ్మలమడుగు మున్సిపాలిటీలలో ఓటమి ఎదురైనట్లు పలువురు విశ్లేషిస్తున్నారు. ప్రొద్దుటూరులో ఏడు మంది కౌన్సిలర్లను ఎన్నికల బరిలో దింపగా ఐదుగురు ఓటమి చెందారు. ఈ అంశాన్ని పలువురు ఉదహరిస్తున్నారు. స్థానికంగా వారిపై ఉన్న వ్యతిరేకత పార్టీపై ప్రభావం చూపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
గ్రేటర్ పోలింగ్ 53.38 %
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సగటున 53.38 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు లెక్కలు తేల్చారు. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు అందిన సమాచారం మేరకు పోలింగ్ 54.31 శాతంగా ఉన్నప్పటికీ.. అది తగ్గింది. అం తిమంగా 53.38 శాతం పోలింగ్ నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 24 నియోజకవర్గాల్లో పటాన్చెరులో అత్యధికంగా 67.67 పోలింగ్ నమోదైనప్పటికీ.. గ్రేటర్ పరిధిలో ఆ నియోజకవర్గంలోని రెండు డివిజన్లు మాత్రమే ఉన్నాయి. దాన్ని మినహాయిస్తే అత్యధిక పోలింగ్ రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 60.46 శాతంగా నమోదైంది. అత్యల్పంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో 47 శాతం నమోదైంది. వివరాలిలా ఉన్నాయి. 2009 ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో 54.18 శాతం కాగా.. ఈసారి అంతకన్నా తగ్గింది. -
దీక్ష భగ్నం
సాక్షి, కడప:రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే ఏకైక డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు గత నెలలోనే రాజీనామాలు చేశారు. అయినా విభజన నిర్ణయాన్ని ప్రకటించడంతో ఈ నెల 12న రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డితో పాటు హఫీజుల్లా, పాండురంగారెడ్డి, సంపత్‌లు కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నారు. వైసీపీ నేతల దీక్షలతో సమైక్య ఉద్యమం ఒక్కసారి ఉధృతమైంది. కార్మిక, ఉద్యోగ, ప్రజా, కుల సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు సంబంధించి మతపెద్దలు దీక్షలను సందర్శించి దీక్షకులను ఆశీర్వదించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా శిబిరాన్ని సందర్శించారు. జిల్లాలోని పట్టణాలతో పాటు గ్రామాల నుంచి స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చి దీక్షలో పాల్గొన్నారు. దీక్షలోని వారికి మద్దతుగా రోజూ 30-40 మంది రిలేదీక్షలకు కూర్చున్నారు. ఇతర జిల్లాలోని వైఎస్సార్కాంగ్రెస్పార్టీ నేతలు కూడా దీక్షాశిబిరాన్ని సందర్శించారు. దీంతో జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి పెరిగింది. దీక్ష కొనసాగుతున్న తీరు, ప్రజా మద్దతు, ఉద్యమసెగలపై ఎప్పటికప్పుడు ఇంటలిజెన్స్ విభాగం ప్రభుత్వానికి సమాచారం చేరవేసింది. ఏ రాజకీయపార్టీ నేతలు జిల్లాలో ఆమరణదీక్షకు దిగకపోవడం, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ దీక్షలతో ఉద్యమం ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చడంతో ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది. పోలీసుల ద్వారా దీక్షను భగ్నం చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం శిబిరం వద్దకు భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. రాత్రి 7 గంటలకు డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, సీఐ షౌకత్‌అలీ శిబిరం లోపలికి వచ్చారు. దీంతో వైసీపీ కార్యకర్తలు దీక్షకులకు రక్షణగా చుట్టుముట్టి ‘పోలీస్ గోబ్యాక్’ అని నినదించారు. దీంతో వారు వెనుదిరిగారు. తర్వాత 9 గంటల సమయంలో పోలీసులు భారీబలగంతో వచ్చి దీక్షను భగ్నం చేశారు. బలవంతంగా వారిని లాక్కెళ్లి జీపులో రిమ్స్‌కు తరలించారు. వెంటనే దీక్షకు దిగిన పార్టీ నేతలు: ఆమరణదీక్షను భగ్నం చేయగానే వెంటనే పార్టీ రైతు విభాగం కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి, పార్టీ మెడికల్ వింగ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేసా ప్రసాద్‌లు అదే శిబిరంలో ఆమరణదీక్షకు దిగారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమపార్టీ నేతలను ఆస్పత్రికి తరలించడం దారుణమని, తెలంగాణలో పోలీసులు ఉద్యమానికి సహకరిస్తుంటే ఇక్కడి పోలీసులు ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నారని దీక్షకు కూర్చున్నవారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైసీపీ పోరాటం ఆగదని, అందుకే ఆమరణదీక్షకు సిద్ధమయ్యామని వారు ప్రకటించారు. నేడు ఆమరణదీక్షలో కూర్చోనున్న ముగ్గురు నేతలు సమైక్యాంధ్రకు మద్ధతుగా వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, కడపనగర సమన్వయకర్త అంజాద్‌బాషా, పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు రఘురామిరెడ్డి తనయుడు నాగిరెడ్డిలు కలె క్టరేట్ ఎదుట సోమవారం ఆమరణదీక్షకు కూర్చోనున్నారు. ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తాం: రవీంద్రనాథరెడ్డి, మాజీ మేయర్. ఏడురోజులుగా శాంతియుత దీక్ష చేస్తున్నాం. దీక్షకు స్పందించాల్సింది పోయి మమ్మల్ని అరెస్టు చేయడం దారుణం. దీక్షను భగ్నం చేశామని పోలీసులు, ప్రభుత్వం భావించవచ్చు. కానీ ఆస్పత్రిలో దీక్షను కొనసాగిస్తాం. సమైక్య ప్రకటన వచ్చేంత వరకూ ప్రాణాలు పోయినా దీక్షను మాత్రం ఆపే ప్రసక్తే లేదు. మన ప్రాంతానికి అన్యాయం జరగనివ్వం: ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి దీక్షను భగ్నం చేయడం అన్యాయం. విభజన జరిగితే మన ప్రాంతానికే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అది అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపుతోంది. శాంతియుతంగా సాగిస్తున్న దీక్షను పోలీసులు అర్థం చేసుకోలేదు. అండగా నిలవాల్సింది పోయి భగ్నం చేశారు. ప్రాణాలు పోయినా మన ప్రాంతానికి మాత్రం అన్యాయం జరగనివ్వం. సమైక్య ప్రకటన వెలువడే వరకూ వైసీపీ పోరాటం ఆగదు. నేడు కడప, రాయచోటి బంద్ మా పార్టీ నేతలు శాంతియుతంగా దీక్ష చేస్తున్నారు. మా దీక్షకు పోలీసులు కూడా ఇన్ని రోజులు సహకరించారు. ఆదివారం కూడా మేము అదే భావనలో ఉన్నాం. అయితే ఒక్కసారిగా పోలీసులు దీక్షా శిబిరంలోకి చొచ్చుకువచ్చి మా నేతలను అక్రమంగా అరెస్టు చేశారు. దీనికి నిరసనగా సోమవారం కడప, రాయచోటి బంద్‌కు పిలుపునిస్తున్నాం. - అంజాద్ బాషా,కడప సమన్వయకర్త, మదన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ యూత్ స్టీరింగ్ కమిటీ మెంబర్