Document writers
-
రైటర్లదే రాజ్యం..
సాక్షి, అమరావతి : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లను అనుమతించకూడదని.. వారి ప్రమేయం లేకుండానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాగాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ నేటికీ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రైటర్ల హవానే కొనసాగుతోంది. వారు చెప్పిందే వేదంగా నడుస్తోంది. అక్కడి అధికారులు..సిబ్బందికి అ‘ధన’పు సాయం అందించడంలో వారే కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్రమాల సంగతి బయట పడకుండా, సిబ్బంది తప్పులు ఎవరికీ కనపడకుండా వారి ఇళ్లకు సంబంధిత మొత్తాన్ని చేర్చడంలో వారిదే ప్రధాన పాత్ర. డాక్యుమెంట్ రైటర్లతో సంధానకర్తలుగా ప్రైవేటు వ్యక్తులు కొందరు అక్కడే ఉంటూ వారు కూడా వసూళ్లకు పాల్పడుతున్నారు. కొందరు రిజిస్ట్రార్లే ప్రైవేటు వ్యక్తులకు నెలనెలా కొంత మొత్తం చెల్లించి తమ ఏజెంట్లుగా నియమించుకుంటున్నారని, ప్రజల నుంచి వారి ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పటమట కార్యాలయంలో 12 మంది... సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లు లేనిదే పని కావడం లేదు. వారి ఆధ్వర్యంలో మామూళ్ల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి అవినీతి మరక అంటకుండా... వారి జేబుల్లోకి డబ్బులు దర్జాగా చేరుతున్నాయి. వారధులుగా డాక్యుమెంట్ రైటర్లు అనధికార విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని అనేక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోమవారం తనిఖీలు చేశారు. అందులో రాష్ట్రంలోనే ఆదాయంలో ప్రథమ వరుసలో నిలిచే విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడుల సమయంలో ఏకంగా 12 మంది డాక్యుమెంట్ రైటర్లు దొరికారు. వారి నుంచి రూ. 3.41 లక్షలను స్వాధీనం చేసుకోవడంతో ఏ స్థాయిలో ఈ దందా జరుగుతోందో ఆర్థమవుతోంది. నిబంధనల ప్రకారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి డాక్యుమెంట్ రైటర్లను అనుమతించకూడదు. కానీ అక్కడ ప్రతి పని వారి ద్వారానే జరుగుతోంది. వీరు అధికారికంగా పనిచేసే అవకాశం లేదు. రిజిస్ట్రార్ కార్యాలయాల సమీపంలో కేంద్రాలను ఏర్పాటు చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వచ్చిన పార్టీలకు సేవలు అందించవచ్చు. కానీ పూర్తిగా వారే చక్రం తిప్పుతూ డబ్బులు గుంజుతున్నారు. ఆశ్రయించకపోతే కొర్రీలు.. ప్రభుత్వం మాత్రం రిజిస్ట్రేషన్ చేయించుకునే పార్టీలు(అమ్మకం, కొనుగోలుదారులు) ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తాన్ని చలానా రూపంలో అందజేస్తే చాలు అంటోంది. రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక సంబంధిత డాక్యుమెంట్లు పార్టీల చేతికి వచ్చేయాలి. ప్రభుత్వ నిబంధన ఇలా ఉన్నా పార్టీలు నేరుగా రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లడం లేదు. అనధికారికంగా కార్యాలయాల సమీపంలో ఏర్పాటు చేసుకున్న డాక్యుమెంట్ రైటర్లనే ఆశ్రయిస్తున్నారు. డాక్యుమెంట్ రాయించిన వారి వద్ద వెయ్యి నుంచి సంబంధిత ఆస్తి విలువ ఆధారంగా పర్సంటేజీ రూపంలో రైటర్లు వసూలు చేస్తున్నారు. ఇది కాకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది పేరుతో స్టాంప్ డ్యూటీ చెల్లించే మొత్తంలో ఒక శాతం మామూళ్ల రూపంలో వసూలు చేస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్ చెప్పినట్టు చేస్తే..పని సాఫీగా అయిపోతుంది. కాదూ కూడదంటే...కార్యాలయ సిబ్బంది సవాలక్ష కొర్రీలు పెడతారు. దీనిని దృష్టిలో పెట్టుకొని క్రయ, విక్రయదారులు వారు అడిగినంత ఇచ్చుకొని పని పూర్తి చేయించుకుంటారు. వసూలైన మొత్తం రోజంతా రైటర్ల దగ్గరే ఉంచుకొని సాయంత్రానికి సిబ్బందికి అందజేస్తుంటారు. నకిలీ డాక్యుమెంట్ రైటర్ల పనే... పాత తరం డాక్యుమెంటరీ రైటర్లు ఇలా భారీ స్థాయిలో డబ్బులు తీసుకొని అనధికార విధుల చేసేవారు కాదు. లైసెన్స్డ్ నెంబర్ కలిగిన డ్యాక్యుమెంట్ రైటర్లు తప్పు చేయాలంటే బయపడేవారు. ఉన్నతాధికారులు తప లైసెన్స్ రద్దు చేస్తారేమోన న్న భయం వారిలో ఉండేది. అలా జరిగితే అవమానంగా భావించి పనిచేసేవారు. కాలక్రమంలో ప్రభుత్వం లైసెన్స్ విధానం రద్దు చేయటంతో ప్రతి ఒక్కరు డాక్యుమెంట్ రైటర్లుగా అవతారం ఎత్తి అనధికార దందాను మొదలు పెట్టారు. చాలావరకు రియల్ ఎస్టేట్ చేసేవారే వీరిని మెల్లగా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చొప్పించి తమ పనిని సులువుగా చేయించుకుంటున్నారు. నకిలీ డాక్యుమెంట్ రైటర్ల వల్ల అసలు రైటర్లు చెడ్డపేరు తెచ్చుకోవాల్సి వస్తోంది. ఆఫీస్‌లోకి నో ఎంట్రీ..! సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అనధికార వ్యక్తులకు అనుమతి నిషేధం. డాక్యుమెంట్ రైటర్లు, వారి ఏజెంట్లు కొన్ని ఆఫీసుల్లో విధులు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుతోంది. అటువంటివి మా దృష్టికి వస్తే సంబంధిత సబ్ రిజిస్ట్రార్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. అవినీతిని ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించేది లేదు. –శ్రీనివాసమూర్తి, డీఐజీ, రిజిస్ట్రేషన్ శాఖ, కృష్ణా జిల్లా -
తాత్కాలికంగా సమ్మె విరమించిన దస్తావేజు లేఖరులు
హైదరాబాద్: దస్తావేజు లేఖరులు పది రోజులుగా చేస్తున్న సమ్మెను తాత్కాలికంగా విరమించాలని నిర్ణయించారు. రాష్ట్ర సబ్‌రిజిస్ట్రార్స్ అసోసియేషన్, రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంఘంతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది. డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరులు ఈనెల 16 నుంచి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై చర్చించిన జేఏసీ ప్రస్తుతానికి తాత్కాలికంగా సమ్మె విరమించాలని దస్తావేజు లేఖరులకు సూచించింది. దస్తావేజు లేఖరుల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటామని జేఏసీ ప్రకటించింది. సమ్మెను తాత్కాలికంగా విరమించి సోమవారం నుంచి స్థిరాస్తి రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారికి సహకరించాలని నిర్ణయించుకున్నట్లు రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యుదర్శులు హరికష్ణ, కలీముల్లా తెలిపారు. -
అంతా వారై..!
సాక్షి, కర్నూలు: కీలకమైన రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్ల హవా నడుస్తోంది. కొందరు సబ్ రిజిస్ట్రార్ల అండఉండడంతో వారు ఆడిందే ఆటగా మారింది. దీంతో తప్పుడు రిజిస్ట్రేషన్‌తో అక్రమ వసూళ్లు అధికమవుతున్నాయి. జిల్లాలోని ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనూ ఇదే తంతు సాగుతున్నట్లు విమర్శలున్నాయి. కర్నూలులో డీఐజీ రిజిస్ట్రేషన్లశాఖ ప్రాంగణంలోని కర్నూలు, కల్లూరు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాలు ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనూ ఇదే తంతు సాగుతున్నట్లు విమర్శలున్నాయి. కర్నూలులో డీఐజీ రిజిస్ట్రేషన్లశాఖ ప్రాంగణంలోని కర్నూలు, కల్లూరు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాలు డాక్యుమెంట్ రైటర్లకు అడ్డాగా మారాయి. కార్యాలయాల పరిసరాలతోపాటు లోపల తిష్ట వేస్తున్న పలువురు రైటర్లు ప్రజలకు సంబంధించి ఆస్తి రిజిస్ట్రేషన్ల వ్యవహారాలను చక్కబెడుతున్నారు. అందుకు వారు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. వీరి ప్రవేశంతో ఆయా కార్యాలయాల్లో అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నేరుగా అధికారులను కలిసి రిజిస్ట్రేషన్లు చేయించుకోడానికి అవకాశం లేకుండా పోతోంది. ఏ పని అయినా క్షణాల్లో చేయించి పెడతామని వీరు ప్రజలను నమ్మబలుకుతున్నారు. డాక్యుమెంట్ రైటర్ల హవాను అడ్డుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం ఆరోపణలకు తావిస్తోంది. కొందరు అధికారులే వీరి ద్వారా నజరానాలు అందుకుంటున్నారన్న విమర్శలున్నాయి. రిజిస్ట్రేషన్లు మొదలుకుని ఈసీ, ఇతర నకళ్లు, కంప్యూటరీకరణ పనులు నిర్వహించే అన్ని విభాగాల్లో డాక్యుమెంట్ రైటర్లు సిబ్బంది వెనుకే ఉంటూ పనులు చక్కబెడుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ ముందుకు ఏదైనా డాక్యుమెంట్ వస్తే క్రయ, విక్రయదారులు తప్పక హాజరుకావాలి. కానీ, క్రయ, విక్రయదారుల్లో ఎవరు రాకున్నా వీరు సబ్‌రిజిస్ట్రార్‌కు చెప్పి ఆ డాక్యుమెంట్ పెండింగ్ పడకుండా పనులు చేయిస్తున్నారని తెలిసింది. ఏదైనా ఆస్తి ఒక వ్యక్తికి ఎలా సంక్రమించింది? దానికి వారసులు ఎవరు? దానిపై ఏమైనా అప్పులు ఉన్నాయా? అనే వివరాలు ఈసీ నకళ్లు కోరడం ద్వారానే తెలుస్తాయి. సహజంగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈసీలు కోరేవారే ఎక్కువ. డాక్యుమెంట్ రైటర్లు ఈసీ కోరిందే తడవుగా వెంటనే ఇస్తున్నారని, అదే సామాన్యులు కోరితే సీరియల్ ప్రకారం అంటూ కొర్రీఉ వేస్తూ కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో డాక్యుమెంట్ రైటర్లను సంప్రదించక తప్పని పరిస్థితి నెలకొంటోంది. రైటర్ల దందా! జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్ల నుంచి దందా ప్రారంభమవుతోంది. అధికారుల చేతికి మట్టి అంటకుండా అంతా వారే అయి నడిపిస్తున్నారు. వచ్చిన డాక్యుమెంట్ల ప్రకారం లెక్కలు వేసి సాయంత్రం ఆయా అధికారులకు అందజేస్తున్నట్లు సమాచారం. ఏ డాక్యుమెంట్‌కు ఎంత ఇవ్వాలో రైటర్లే నిర్ణయించి వసూలు చేస్తున్నారని, సమయం గడిచిపోయిన తర్వాత, తప్పుడు రిజిస్ట్రేషన్ల కోసం భారీగా వసూలు చేస్తున్నారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. సాధారణంగా ఒక డాక్యుమెంట్ తయారు చేయడానికి రూ. 100 నుంచి రూ. 150 వరకు వ్యయమవుతుంది. కానీ, వారు వినియోగదారుల నుంచి రూ. 800 నుంచి 1,500 వరకు వసూలు చేస్తుంటారు.