హైదరాబాద్: దస్తావేజు లేఖరులు పది రోజులుగా చేస్తున్న సమ్మెను తాత్కాలికంగా విరమించాలని నిర్ణయించారు. రాష్ట్ర సబ్‌రిజిస్ట్రార్స్ అసోసియేషన్, రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంఘంతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది. డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరులు ఈనెల 16 నుంచి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.
భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై చర్చించిన జేఏసీ ప్రస్తుతానికి తాత్కాలికంగా సమ్మె విరమించాలని దస్తావేజు లేఖరులకు సూచించింది. దస్తావేజు లేఖరుల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటామని జేఏసీ ప్రకటించింది. సమ్మెను తాత్కాలికంగా విరమించి సోమవారం నుంచి స్థిరాస్తి రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారికి సహకరించాలని నిర్ణయించుకున్నట్లు రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యుదర్శులు హరికష్ణ, కలీముల్లా తెలిపారు.
తాత్కాలికంగా సమ్మె విరమించిన దస్తావేజు లేఖరులు
Published Sun, Jan 26 2014 8:56 PM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
Advertisement
Advertisement