సాక్షి, కర్నూలు: కీలకమైన రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్ల హవా నడుస్తోంది. కొందరు సబ్ రిజిస్ట్రార్ల అండఉండడంతో వారు ఆడిందే ఆటగా మారింది. దీంతో తప్పుడు రిజిస్ట్రేషన్‌తో అక్రమ వసూళ్లు అధికమవుతున్నాయి. జిల్లాలోని ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనూ ఇదే తంతు సాగుతున్నట్లు విమర్శలున్నాయి. కర్నూలులో డీఐజీ రిజిస్ట్రేషన్లశాఖ ప్రాంగణంలోని కర్నూలు, కల్లూరు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాలు ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనూ ఇదే తంతు సాగుతున్నట్లు విమర్శలున్నాయి. కర్నూలులో డీఐజీ రిజిస్ట్రేషన్లశాఖ ప్రాంగణంలోని కర్నూలు, కల్లూరు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాలు డాక్యుమెంట్ రైటర్లకు అడ్డాగా మారాయి. కార్యాలయాల పరిసరాలతోపాటు లోపల తిష్ట వేస్తున్న పలువురు రైటర్లు ప్రజలకు సంబంధించి ఆస్తి రిజిస్ట్రేషన్ల వ్యవహారాలను చక్కబెడుతున్నారు.
అందుకు వారు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. వీరి ప్రవేశంతో ఆయా కార్యాలయాల్లో అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నేరుగా అధికారులను కలిసి రిజిస్ట్రేషన్లు చేయించుకోడానికి అవకాశం లేకుండా పోతోంది. ఏ పని అయినా క్షణాల్లో చేయించి పెడతామని వీరు ప్రజలను నమ్మబలుకుతున్నారు. డాక్యుమెంట్ రైటర్ల హవాను అడ్డుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం ఆరోపణలకు తావిస్తోంది. కొందరు అధికారులే వీరి ద్వారా నజరానాలు అందుకుంటున్నారన్న విమర్శలున్నాయి. రిజిస్ట్రేషన్లు మొదలుకుని ఈసీ, ఇతర నకళ్లు, కంప్యూటరీకరణ పనులు నిర్వహించే అన్ని విభాగాల్లో డాక్యుమెంట్ రైటర్లు సిబ్బంది వెనుకే ఉంటూ పనులు చక్కబెడుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ ముందుకు ఏదైనా డాక్యుమెంట్ వస్తే క్రయ, విక్రయదారులు తప్పక హాజరుకావాలి. కానీ, క్రయ, విక్రయదారుల్లో ఎవరు రాకున్నా వీరు సబ్‌రిజిస్ట్రార్‌కు చెప్పి ఆ డాక్యుమెంట్ పెండింగ్ పడకుండా పనులు చేయిస్తున్నారని తెలిసింది.
ఏదైనా ఆస్తి ఒక వ్యక్తికి ఎలా సంక్రమించింది? దానికి వారసులు ఎవరు? దానిపై ఏమైనా అప్పులు ఉన్నాయా? అనే వివరాలు ఈసీ నకళ్లు కోరడం ద్వారానే తెలుస్తాయి. సహజంగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈసీలు కోరేవారే ఎక్కువ. డాక్యుమెంట్ రైటర్లు ఈసీ కోరిందే తడవుగా వెంటనే ఇస్తున్నారని, అదే సామాన్యులు కోరితే సీరియల్ ప్రకారం అంటూ కొర్రీఉ వేస్తూ కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో డాక్యుమెంట్ రైటర్లను సంప్రదించక తప్పని పరిస్థితి నెలకొంటోంది.
రైటర్ల దందా!
జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్ల నుంచి దందా ప్రారంభమవుతోంది. అధికారుల చేతికి మట్టి అంటకుండా అంతా వారే అయి నడిపిస్తున్నారు. వచ్చిన డాక్యుమెంట్ల ప్రకారం లెక్కలు వేసి సాయంత్రం ఆయా అధికారులకు అందజేస్తున్నట్లు సమాచారం. ఏ డాక్యుమెంట్‌కు ఎంత ఇవ్వాలో రైటర్లే నిర్ణయించి వసూలు చేస్తున్నారని, సమయం గడిచిపోయిన తర్వాత, తప్పుడు రిజిస్ట్రేషన్ల కోసం భారీగా వసూలు చేస్తున్నారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. సాధారణంగా ఒక డాక్యుమెంట్ తయారు చేయడానికి రూ. 100 నుంచి రూ. 150 వరకు వ్యయమవుతుంది. కానీ, వారు వినియోగదారుల నుంచి రూ. 800 నుంచి 1,500 వరకు వసూలు చేస్తుంటారు.
అంతా వారై..!
Published Thu, Nov 14 2013 12:49 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement