registation office
-
డాక్యుమెంట్ రైటర్లదే హవా..
సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్): జిల్లాలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉద్యోగుల కంటే ఎక్కువగా డాక్యుమెంట్ రైటర్ల హవా నడుస్తోంది. డాక్యుమెంట్లు చేయడంతోపాటు ఆఫీసులో సైతం వారే పెత్తనం చెలాయిస్తున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాలకు వచ్చే వారి నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రజల నిరక్షరాస్యతతో పాటు విద్యావంతులు సైతం ఆన్లైన్లో సర్వే నంబర్ల పరిశీలన డాక్యుమెంట్ కోసం చేయాల్సిన పనులు తెలిసినప్పటికీ డాక్యుమెంట్ రైటర్లను సంప్రదిస్తుండంతో వారి ఆదాయం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోందని రియల్ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. (చదవండి: వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!) 50 నుంచి 90 వరకు డాక్యుమెంట్లు.. జిల్లాలో పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథనిలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. రోజుకు పెద్దపల్లిలో 20నుంచి 50 వరకు డాక్యుమెంట్లు మిగతా ప్రాంతాల్లో 10నుంచి 15వరకు డాక్యుమెంట్ రైటర్లు డాక్యుమెంట్ చేస్తుంటారు. పారదర్శకంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం చాలావరకు వివరాల నమోదును ఆన్లైన్ చేసింది. అయితే ఆన్లైన్ వివరాల నమోదులోనూ డాక్యుమెంట్ రైటర్లు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారికి ఆన్లైన్ పై సరైన అవగాహన లేకపోవడంతో డాక్యుమెంట్ రైటర్ల పైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో ఒక్కో సేవకు ఒక్కో రేటు చొప్పున వసూలు చే స్తు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు అధికంగా ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్‌ను ఏసీబీకి పట్టించిన డాక్యుమెంట్ రైటర్... పెద్దపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్న ఒకరు.. గతంలో పనిచేసిన సబ్‌రిజిస్ట్రార్ వద్ద తనమాట చెల్లకపోవడంతో సబ్ రిజిస్ట్రార్‌ను ఏసీబీకి పట్టించాడు అయినప్పటికీ తిరిగి డాక్యుమెంట్ రైటర్‌గా కొనసాగుతుండడం విశేషం. అక్రమ వసూళ్లలో రిజిస్ట్రార్ కార్యాల య అధికారులు, సిబ్బందికి కూడా వాటాలు ముడుతుండడంతో అధికారుల వద్ద రైటర్ల హవా నడుస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు మ్యుటేషన్ ఉచితమే... రిజిస్ట్రేషన్ సమయంలో మ్యుటేషన్ ఉచితంగానే రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారులు చేస్తారు. కానీ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారుల పేరుచెప్పి సమీపంలోని డాక్యుమెంట్ రైటర్లు మ్యుటేషన్ చేస్తా మని పలువురు వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. ధరణి మాదిరిగా చేయాలి ధరణి మాదిరిగా భూముల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే డాక్యుమెంట్ రైటర్ల అవినీతిని అరికట్టవచ్చని సబ్ రిజిస్ట్రార్లు పేర్కొంటున్నారు. ధరణిలో రిజిస్ట్రేషన్ చేస్తే అవకతవకలు నివారించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. డబ్బులు వసూలు చేస్తే చర్యలు మ్యుటేషన్ పేరుతో డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇలా ఎవరైనా అవినీతికి పాల్పడితే తమదృష్టికి తీసుకురావాలి. ఈ విషయమై తమకు ఫిర్యాదులు కూడా అందాయి. డాక్యుమెంట్రైటర్లపై ప్రత్యేక దృష్టిసారించాం. – సురేశ్‌బాబు, సబ్ రిజిస్ట్రార్, పెద్దపల్లి (చదవండి: దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తి మనోడే!) -
తెలంగాణ లో ప్రారంభమైన భూముల , వాహనాల రిజిస్ట్రేషన్లు
-
స్టాంపు వెండర్లకు స్వస్తి !
సాక్షి, హైదరాబాద్ : రిజిస్ట్రేషన్ దస్తావేజులను స్టాంప్ వెండర్ల ద్వారా అమ్మే విధానానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలకబోతోంది. ప్రస్తుతం స్టాంప్ వెండర్ల ద్వారా అధికారికంగానే విక్రయాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విధానంలో విక్రయం ద్వారా తలెత్తుతున్న ఇబ్బందులు, వెండర్లు కృత్రిమంగా సృష్టిస్తోన్న కొరతతో ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తుతు న్నాయి. దీంతో ఈ కొరతకు శాశ్వతంగా చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాన్ని తీసుకువచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ విధానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ దస్తావేజుల విక్రయ బాధ్యతల నుంచి తప్పుకోనుంది. ఈ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ అధీనంలోని స్టాక్ హోల్డింగ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సీఎల్)కు అప్పగించే ప్రతిపాద నలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం వెళ్లాయి. అనుమతి రాగానే కొత్త విధానం అమల్లోకి రానుంది. ఆ వెంటనే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ స్టాంప్ వెండర్లకు లైసెన్స్‌లు నిలిపివేయనుంది. ఇప్పుడేం జరుగుతోంది ? వాస్తవానికి రాష్ట్రంలో 1,665 మంది స్టాంప్ వెండర్లు అధికారికంగా రిజిస్ట్రేషన్ దస్తావేజులతో పాటు ఇతర స్టాంపులను విక్రయిస్తున్నారు. రూ.1, 2, 20, 100 స్టాంపుల విక్రయం వీరి ద్వారా జరుగు తోంది. ఇందులో 20 రూపాయల స్టాంపు వరకు హైదరాబాద్‌లోనే తయారవు తుండగా, 100 రూపాయల స్టాంపులు మాత్రం మహారాష్ట్రలోని నాసిక్‌లో ముద్రిస్తారు. వీటిని ప్రభుత్వం కొనుగోలు చేసి స్టాంపుల డిపో ద్వారా> అవసరమైన డిమాండ్ మేరకు జిల్లా రిజిస్ట్రార్లకు పంపిస్తుంది. ఈ క్రమంలో అటు రిజిస్ట్రేషన్ల శాఖకు, స్టాంపు వెండర్లకు కొంత కమీషన్ లభిస్తుంది. అయితే, స్టాంప్ వెండర్లు కాసుల కక్కుర్తితో చాలా సందర్భాల్లో స్టాంపుల కృత్రిమ కొరత సృష్టించడం, స్టాంపులు అందుబాటులో ఉన్నా లేవని చెప్పడంతో రిజిస్ట్రేషన్ లావాదేవీల కోసం వచ్చే వారు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చేది. దీంతో పాటు నాసిక్‌లో స్టాంపులు కొనుగోలు చేసి ఇక్కడి వెండర్లకు ఇచ్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖకు నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నిధులు కూడా రూ.35 కోట్ల వరకు పేరుకుపోవడంతో అక్కడి నుంచి నోటీసులు అందుతున్నాయి. ఈ సమస్యల నేపథ్యంలో రిజిస్ట్రేషన్ దస్తావేజుల విక్రయం నుంచి తప్పుకోవాలని నిర్ణయించిన ఆ శాఖ అధికారులు పలు రాష్ట్రాల్లో అమలవుతోన్న విధానాలను అధ్యయనం చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఏం జరగనుంది ? స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదన ప్రకారం రూ.20, 100 స్టాంపు పేపర్లు ఇకపై భౌతికంగా లభ్యం కావు. ఈ స్టాంపు పేపర్లను విక్రయించే బాధ్యత ఎస్‌హెచ్‌సీఎల్‌కు అప్పగిస్తారు. ఆ సంస్థ ఆన్లైన్లోనే స్టాంపు పేపర్లను అందుబాటులో ఉంచుతుంది. తమ సాఫ్ట్‌వేర్‌ను బ్యాంకులు, పోస్టాఫీసులు లేదా ఇతర ప్రైవేటు వ్యక్తులకు అనుసంధానం చేసి వారి ద్వారా స్టాంపు పేపర్లను విక్రయిస్తుంది. అప్పుడు రిజిస్ట్రేషన్ దస్తావేజు అవసరం అయిన వ్యక్తులు ఆయా చోట్లకు వెళ్లి నిర్ణీత రుసుము చెల్లిస్తే వెంటనే ఆన్లైన్లో ప్రింట్ తీసి స్టాంప్ పేపర్ ఇచ్చేస్తారు. అయితే, ప్రైవేటు వ్యక్తులకు కనుక ఎస్‌హెచ్‌సీఎల్ ఇచ్చేందుకు అంగీకరిస్తే ప్రస్తుతమున్న స్టాంపు వెండర్లే వాటిని దక్కించుకోవచ్చని, నిర్ణీత రుసుము చెల్లించి వాటిని అందుబాటులో ఉంచుకోవచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులంటున్నారు. మొత్తంమీద ఎస్‌హెచ్‌సీఎల్‌కు స్టాంపు పేపర్ల విక్రయ బాధ్యతలు ఇవ్వడం ద్వారా ఎలాంటి ఇబ్బందులూ ఉండవని, ప్రజలు.. బ్యాంకులు, పోస్టాఫీసులు, లేదంటే ప్రైవేటు లైసెన్సీల దగ్గర వాటిని పొందవచ్చని అధికారులు చెపుతున్నారు. మరి డాక్యుమెంట్లు రాసేదెవరు? రిజిస్ట్రేషన్ దస్తావేజుల విక్రయ బాధ్యతల నుంచి తప్పుకుని స్టాంప్ వెండర్ లైసెన్స్‌లు ఇవ్వడం నిలిపివేస్తే మరి డాక్యుమెంట్లు ఎవరు రాస్తారనే చర్చ జరుగుతోంది. అయితే, స్టాంప్వెండర్లే అనధికారంగా డాక్యుమెంట్ రైటర్ల అవతారమెత్తారే కానీ, తామెక్కడా అధికారికంగా డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థను ఏర్పాటు చేయలేదని రిజిస్ట్రేషన్ అధికారులు చెపుతున్నారు. ప్రస్తుతం ఉన్న విధంగానే రిజిస్ట్రేషన్ కార్యాలయాల సమీపంలో ఉన్న కార్యాలయాల్లోనే డాక్యుమెంటేషన్ కూడా జరుగుతుందని, ఎస్‌హెచ్‌సీఎల్ లైసెన్స్‌లు వచ్చిన వ్యక్తులు లేదా సంస్థలు దీన్ని కొనసాగిస్తారని వారంటున్నారు. రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో పారదర్శకతకు కూడా కొత్త విధానం ద్వారా మార్గం సుగమం అవుతుంది. ప్రస్తుత వ్యవస్థ ద్వారా పాత తేదీలతో దస్తావేజులు రాసుకున్నట్లు చెప్పేందుకు వీలుంటుంది. ఇందుకోసం వెండర్లు పెద్దమొత్తంలో వసూలు చేస్తారు. ఎస్‌హెచ్‌సీఎల్ ద్వారా స్టాంపుపేపర్లను పక్కా ఆధారాలు తీసుకున్నాక.. ఎప్పటికప్పుడు తేదీలు వేసి మరీ విక్రయించడం ద్వారా ఈ తరహా అక్రమాలకు అడ్డుకట్టవేసే అవకాశముండొచ్చని తెలుస్తోంది. మొత్తంమీద రిజిస్ట్రేషన్ల శాఖ తీసుకున్న ఈ నిర్ణయం ఎప్పటినుంచి అమల్లోకి వస్తుంది? ఆస్తులు, భూముల అమ్మకాలు, కొనుగోలు లావాదేవీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది వేచి చూడాల్సిందే ! రిజిస్ట్రేషన్ల వివరాలు.. రాష్ట్రంలో ఏటా జరిగే రిజిస్ట్రేషన్లు : 17.50 లక్షలు.. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగినవి : 7.01 లక్షలు.. ఈ నెలలో జరిగినవి : 1.42 లక్షలు ఈనెల 31న జరిగినవి : 4,421 -
బిల్లు కట్టలేదని ఫీజు పీకేశారు
చేవెళ్ల : చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించి రెండు నెలల విద్యుత్ బకాయిలు కట్టలేదని అధికారులు మంగళవారం కనెక్షన్ తొలగించారు. రెండు నెలలకు సంబంధించి రూ. 14వేల విద్యుత్ బిల్లు పెండింగ్‌లో ఉంది. దీంతో మంగళవారం రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. వివరాల్లోకి వెళితే... చేవెళ్ల మండల కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. దీనికి సంబంధించిన విద్యుత్ బిల్లును కార్యాలయమే చెల్లించాల్సి ఉంది. ప్రతినెలా విద్యుత్‌బిల్లుకు సంబంధించి బిల్లు చేసి ఎస్టీఓకు పంపిస్తారు. అక్కడ బిల్లుకు సంబంధించిన నిధులు విడుదలైతే డీడీని విద్యుత్ అధికారులకు ఇస్తారు. అయితే రెండు నెలలుగా ఎస్టీఓ నుంచి డీడీ రాకపోవటంతో వేచి చూసిన విద్యుత్ అధికారులు మంగళవారం కనెక్షన్ తొలగించారు. దీంతో కార్యాలయంలో జరగాల్సిన రోజువారీ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అసలే వరుసగా మూడు రోజులు (శని, ఆది, సోమ) సెలవులు రావటంతో రిజిస్ట్రేషన్లు జరగలేదు. మంగళవారమైనా చేయించుకుందామని వచ్చిన వారికి నిరాశే మిగిలింది. కొంతమంది పనులు మానుకొని వచ్చామని సబ్‌రిజిస్ట్రార్‌తో వాగ్వివాదం పెట్టుకున్నారు. ఆన్లైన్ లేకపోతే మాన్యూవల్‌గానైనా చేయాలని కోరారు. అయితే తనకు అలాంటి అధికారం లేదని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉంటేనే చేస్తానని సబ్ రిజిస్ట్రార్ వారితో చెప్పారు. రెండు రోజులు గడువిచ్చాం: విద్యుత్ ఏఈ మురళీధీర్ విద్యుత్ ఏఈ మురళీధీర్‌ను ఈ విషయంపై ప్రశ్నించగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం భవనం ప్రైవేటుదని తప్పనిసరిగా ప్రతినెలా బిల్లు చెల్లించాల్సిందేనని అన్నారు. ఇప్పటికే రెండు నెలలు వేచి చూశామని రూ. 14వేల బిల్లు పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఇప్పటికీ బిల్లు రాకపోవటంతోనే తొలగించినట్లు చెప్పారు. అయితే సబ్‌రిజిస్ట్రార్ రెండురోజుల కోసం అనుమతి కోరటంతో సాయంత్రం విద్యుత్ కనెక్షన్‌ను ఇచ్చినట్లు చెప్పారు. రెండు రోజులు చూసి బిల్లు రాకపోతే మళ్లీ తొలగిస్తామని తెలిపారు. సాయంత్రం కనెక్షన్ ఇచ్చినా అప్పటికే సమయం అయిపోవటంతో అందరూ వెళ్లిపోయారు. బిల్లు చేసి పంపించాం.. బకాయిలకు సంబంధించి బిల్లు చేసి మా కార్యాలయం నుంచి ఎస్టీఓకు పంపించాం. అక్కడి నుంచి నేరుగా విద్యుత్ అధికారులకు డీడీ రూపంలో బిల్లు వెళ్లాలి. కానీ ఎస్టీఓ నుంచి డీడీ వెళ్లలేదన్నారు. పైనుంచి నిధులు రాలేదని అందుకు డీడీ పంపలేదని చెప్పారు. విద్యుత్ అధికారులు అడిగితే రెండురోజుల్లో వస్తుందని నాలుగైదు రోజులుగా చెబుతున్నారు. – రాజేంద్రకుమార్, సబ్‌రిజిస్ట్రార్, చేవెళ్ల -
ఆనందపురంలో దర్శకుడు రాజమౌళి
ఆనందపురం (భీమిలి): దర్శక దిగ్గజం, బాహుబలి దర్శకుడు ఎస్. ఎస్.రాజమౌళి శుక్రవా రం ఆనందపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో ఆయనను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రాజమౌళికి విజయనగరం జిల్లాలో కొంత జిరాయితీ భూమి ఉంది. దానిని విక్రయించి ఇక్కడకు రిజిస్ట్రేషన్ చేయడానికి వచ్చారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది ఆయన సంతకాలు తీసుకున్నారు. రాజమౌళి వచ్చారని తెలిసి కొంతమంది సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి పరుగులు తీయగా అప్పటికే ఆయన వెళ్లి పోయారు -
అంతా వారై..!
సాక్షి, కర్నూలు: కీలకమైన రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్ల హవా నడుస్తోంది. కొందరు సబ్ రిజిస్ట్రార్ల అండఉండడంతో వారు ఆడిందే ఆటగా మారింది. దీంతో తప్పుడు రిజిస్ట్రేషన్‌తో అక్రమ వసూళ్లు అధికమవుతున్నాయి. జిల్లాలోని ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనూ ఇదే తంతు సాగుతున్నట్లు విమర్శలున్నాయి. కర్నూలులో డీఐజీ రిజిస్ట్రేషన్లశాఖ ప్రాంగణంలోని కర్నూలు, కల్లూరు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాలు ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనూ ఇదే తంతు సాగుతున్నట్లు విమర్శలున్నాయి. కర్నూలులో డీఐజీ రిజిస్ట్రేషన్లశాఖ ప్రాంగణంలోని కర్నూలు, కల్లూరు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాలు డాక్యుమెంట్ రైటర్లకు అడ్డాగా మారాయి. కార్యాలయాల పరిసరాలతోపాటు లోపల తిష్ట వేస్తున్న పలువురు రైటర్లు ప్రజలకు సంబంధించి ఆస్తి రిజిస్ట్రేషన్ల వ్యవహారాలను చక్కబెడుతున్నారు. అందుకు వారు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. వీరి ప్రవేశంతో ఆయా కార్యాలయాల్లో అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నేరుగా అధికారులను కలిసి రిజిస్ట్రేషన్లు చేయించుకోడానికి అవకాశం లేకుండా పోతోంది. ఏ పని అయినా క్షణాల్లో చేయించి పెడతామని వీరు ప్రజలను నమ్మబలుకుతున్నారు. డాక్యుమెంట్ రైటర్ల హవాను అడ్డుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం ఆరోపణలకు తావిస్తోంది. కొందరు అధికారులే వీరి ద్వారా నజరానాలు అందుకుంటున్నారన్న విమర్శలున్నాయి. రిజిస్ట్రేషన్లు మొదలుకుని ఈసీ, ఇతర నకళ్లు, కంప్యూటరీకరణ పనులు నిర్వహించే అన్ని విభాగాల్లో డాక్యుమెంట్ రైటర్లు సిబ్బంది వెనుకే ఉంటూ పనులు చక్కబెడుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ ముందుకు ఏదైనా డాక్యుమెంట్ వస్తే క్రయ, విక్రయదారులు తప్పక హాజరుకావాలి. కానీ, క్రయ, విక్రయదారుల్లో ఎవరు రాకున్నా వీరు సబ్‌రిజిస్ట్రార్‌కు చెప్పి ఆ డాక్యుమెంట్ పెండింగ్ పడకుండా పనులు చేయిస్తున్నారని తెలిసింది. ఏదైనా ఆస్తి ఒక వ్యక్తికి ఎలా సంక్రమించింది? దానికి వారసులు ఎవరు? దానిపై ఏమైనా అప్పులు ఉన్నాయా? అనే వివరాలు ఈసీ నకళ్లు కోరడం ద్వారానే తెలుస్తాయి. సహజంగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈసీలు కోరేవారే ఎక్కువ. డాక్యుమెంట్ రైటర్లు ఈసీ కోరిందే తడవుగా వెంటనే ఇస్తున్నారని, అదే సామాన్యులు కోరితే సీరియల్ ప్రకారం అంటూ కొర్రీఉ వేస్తూ కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో డాక్యుమెంట్ రైటర్లను సంప్రదించక తప్పని పరిస్థితి నెలకొంటోంది. రైటర్ల దందా! జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్ల నుంచి దందా ప్రారంభమవుతోంది. అధికారుల చేతికి మట్టి అంటకుండా అంతా వారే అయి నడిపిస్తున్నారు. వచ్చిన డాక్యుమెంట్ల ప్రకారం లెక్కలు వేసి సాయంత్రం ఆయా అధికారులకు అందజేస్తున్నట్లు సమాచారం. ఏ డాక్యుమెంట్‌కు ఎంత ఇవ్వాలో రైటర్లే నిర్ణయించి వసూలు చేస్తున్నారని, సమయం గడిచిపోయిన తర్వాత, తప్పుడు రిజిస్ట్రేషన్ల కోసం భారీగా వసూలు చేస్తున్నారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. సాధారణంగా ఒక డాక్యుమెంట్ తయారు చేయడానికి రూ. 100 నుంచి రూ. 150 వరకు వ్యయమవుతుంది. కానీ, వారు వినియోగదారుల నుంచి రూ. 800 నుంచి 1,500 వరకు వసూలు చేస్తుంటారు.