చైనాలో రాక్షస జాతి మనుషులున్నారా?
బీజింగ్: పైకి చూడ్డానికి గుండ్రటి ముఖం.. అతడి తలపై వెంట్రుకలు అక్కడక్కడా ఊడిపోయి ఈకలుగా మారిన తల.. పెదవులు మూసి చిరునవ్వుతో ముఖంలోకి ముఖంపెట్టి చూశాడు. అతడికి పెద్దగా నవ్వాలనిపించి నోరు తెరిచాడు.. అంతే గుండెలు జారీపోయాయి. ఎందుకంటే అతడు డ్రాకులా లాంటి మనిషి. రక్తాన్ని తాగి బతికే డ్రాకులాల మాదిరిగా అతడికి కూడా రెండే పళ్లు. అవి కూడా ఎంతో వాడిగా ఉండే కోరటి పళ్లు. అయితే, వాస్తవానికి అతడు డ్రాకులా కాదు. అతడిని చూసినవారంతా రాక్షసి జాతి అని భయపడిపోతారంతే.. ఫలితంగా 15 ఏళ్లు పూర్తయినా అతడు ఇంట్లోనే ఎక్కువగా పరిమితమై ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోకుండా తనలో తానే కుమిలిపోతున్నాడు.
పాఠశాలకు వెళ్లినా తోటి విద్యార్థులు నిత్యం హేళన చేస్తుంటారు. అవును ఇది దురదృష్టవశాత్తు ఎవరికీ రాని జబ్బుతో బాధపడుతున్న ఓ చైనాకు చెందిన కుర్రాడి వ్యధ. అతడి బంధువులు కూడా ఈ వ్యాధితో బాధపడుతుండగా వారిది రాక్షస సంతతి అంటూ చుట్టుపక్కలపక్కల వారు వేధిస్తున్నారు. అయితే, వారు వాస్తవానికి బాధపడుతున్నది 'ఎక్టోడర్మల్ డిస్ప్లాసియా' అనే వ్యాధితో. అత్యంత అరుధుగా ఎవరో ఒకరికి వచ్చే ఈ వ్యాధి సోకిన వారిలో విపరీతమైన మార్పులు వస్తాయి. అలాగే, పాంగ్ బాయ్‌గా పిలిచే లాన్ హాయ్ అనే పదిహేనేళ్ల చైనా బాలుడిపై కూడా ఈ వ్యాధి తీవ్ర ప్రభావాన్ని చూపింది.
2001లో తొలిసారి అతడి తల్లి ఈ విషయం తెలిసి దిగ్బ్రాంతికి లోనైంది. ఎన్నో ఆస్పత్రులు తిప్పింది కానీ ఫలితం మాత్రం రాలేదు. కాల క్రమంలో అతడికి జుట్టు ఊడింది. చేతి వేళ్ల గోర్లలో మార్పులు వచ్చాయి. కనుబొమ్మల్లో కూడా తేడా వచ్చింది. దీంతోపాటు వారు ఎక్కువగా వెళుతురులోకి కూడా రాలేరు. ఇలాంటి లక్షణాలన్నీ సాధారణంగా హాలీవుడ్ చిత్రాల్లో చూపించే డ్రాకులాలకు ఉంటాయి. అందికి వీరిది రాక్షస జాతి అని పలువురు తిడుతుంటారు. అతడికి తాజాగా వైద్యం కోసం చాంగింగ్ లోని థర్డ్ మిలటరీ మెడికల్ యూనివర్సిటీ కి తల్లి మా యాంగ్జు తీసుకొచ్చింది. ఈ సందర్భంగా రిపోర్టర్లు ప్రశ్నించగా ఈ విషయాలు వెలుగుచూశాయి.