Edappadi K. Palaniswami
-
పన్నీర్ సెల్వంకు భారీ షాక్
తమిళనాడు రాజకీయాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామం ఒకటి చోటుచేసుకుంది. ప్రతిపక్ష అన్నాడీఎంకేలో వర్గ పోరులో.. కోర్టు తీర్పు ద్వారా పళనిస్వామి మళ్లీ పైచేయి సాధించారు. పార్టీ నుంచి తనను బహిష్కరించడంతో పాటు ఏఐఏడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి పళనిస్వామి చేపట్టడాన్ని సవాల్ చేస్తూ పన్నీర్‌సెల్వం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఇవాళ(మంగళవారం) ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువడినవెంటనే.. అన్నాడీఎంకే పార్టీ అధికారికంగా ఈపీఎస్(ఎడపాడి కే పళనిస్వామి)ని పార్టీ ప్రదాన కార్యదర్శిగా ప్రకటించింది పార్టీ సీఈసీ. ఈ మేరకు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సంబురాలు జరుగుతున్నాయి. ఇక తాజా తీర్పుతో ఓపీఎస్(ఓ పన్నీర్ సెల్వం).. ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్‌ను ఆశ్రయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక.. అన్నాడీఎంకే పార్టీ కార్యదర్శి (తాత్కాలిక) పదవికి పళనిస్వామి నియామకాన్ని వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. కిందటి ఏడాది జులైలో పార్టీ జనరల్ కౌన్సిల్ ద్వారా ఈ నియామకం జరగ్గా.. దానిని వ్యతిరేకిస్తూ పన్నీర్ సెల్వం వర్గం న్యాయస్థానాలను ఆశ్రయించింది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు అన్నాడీఎంకే సాధారణ కౌన్సిల్‌ను చట్టబద్ధమైనదిగానే సమర్థించింది. అయితే తీర్మానాల చట్టబద్ధతపై నిర్ణయం మాత్రం మద్రాసు హైకోర్టుకు వదిలివేసింది. ఇదిలా ఉంటే.. గత శనివారం పార్టీ జనరల్ సెక్రటరీ పదవి ఎన్నికకు ఈపీఎస్ నామినేషన్ దాఖలు చేయగా.. ఇదంతా దొంగచాటు వ్యవహారమంటూ పన్నీర్‌సెల్వం మండిపడ్డారు. అంతలోనే మద్రాస్ హైకోర్టు ఈపీఎస్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం గమనార్హం. -
తమిళనాడు: అన్నాడీఎంకేలో డిప్యూటీ చిచ్చు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష నేత ఎడప్పాడి కే పళనిస్వామి(ఈపీఎస్), అన్నాడీఎంకేలో ఆయన అనుకూల వర్గీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాళ్లను రాజారత్నం మైదానంలో నిర్బంధించారు. నల్ల చొక్కాలతో అసెంబ్లీ ఎదుట నిహారదీక్షకు ఆయన సిద్ధపడిన క్రమంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎకేం వర్గపోరులో డిప్యూటీ చిచ్చు రాజుకుంది. అన్నాడీఎంకేలోని ఒక వర్గ నేత అయిన పళని స్వామి.. పార్టీ తరపున డిప్యూటీ నేతగా తాజాగా ఆర్బీ ఉదయకుమార్‌ను ఎన్నుకున్నారు. ఈ క్రమంలో ఓ పన్నీర్ సెల్వం(ఓపీఎస్)ను డిప్యూటీ లీడర్‌గా తొలగించాలని, అసెంబ్లీలో ఓపీఎస్ సీటును తన పక్క నుంచి వేరే చోటుకి మార్చాలని స్పీకర్‌కు లేఖలు రాశారు పళనిస్వామి. అయినా చర్యలు లేకపోవడంతో.. స్పీకర్ చర్యను నిరసిస్తూ పళనిస్వామి నిరహార దీక్షకు దిగారు. దీంతో ఈపీఎస్ వర్గీయుల నినాదాల హోరుతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తతకు తెర లేపింది. ఈ క్రమంలోనే శాంతి భద్రతల పరిరక్షణకు పళనిని, ఆయన వర్గీయులను పోలీసులు అదుపులోకి ప్రత్యేక వాహనంలో తీసుకున్నారు. పళనిస్వామి వర్గంలోని ఉదయ్‌కుమార్‌ను తాజాగా అన్నాడీఎంకే ఉప నేతగా కార్యవర్గం ఎన్నుకుంది. మరోవైపు అసెంబ్లీలో తన పక్కన సీటులో పన్నీర్ సెల్వంను కూర్చోనివ్వొద్దంటూ స్పీకర్‌కు లేఖలు రాశారు పళనిస్వామి. ఈ విషయమై మంగళవారం అసెంబ్లీలో వాగ్వాదం చెలరేగగా.. మార్షల్స్ సాయంతో ఈపీఎస్‌ను ఆయన ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి స్పీకర్ బయటకు పంపించేశారు. ఇక సీటింగ్ విషయమై తన దృష్టికి ఎవరూ తీసుకురాలేదని.. ఆ అంశాన్ని పరిశీలిస్తామని స్పీకర్ అప్పావు చెప్తున్నారు. అయితే పళనిస్వామి మాత్రం అధికార పార్టీ ఆదేశాలతోనే పన్నీర్ సెల్వం వర్గానికి స్పీకర్ అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు మంగళవారం అసెంబ్లీలో గొడవ జరిగినప్పుడు.. పన్నీర్‌సెల్వం ప్రశాంతంగా పళనిస్వామి పక్క సీటులోనే కూర్చోవడం గమనార్హం. விடியா அரசின் அராஜகத்தை எதிர்த்து உண்ணாவிரத போராட்டம் நடத்திய எதிர்கட்சித் தலைவர் அண்ணண் திரு.@EPSTamilNadu அவர்கள் மற்றும் சட்டமன்ற உறுப்பினர்கள் கைது!! திராணியற்ற #திமுக அரசை வண்மையாக கண்டிக்கின்றேன்..#DMKFailsTN #TNAssembly #AIADMK #ValluvarKottam pic.twitter.com/a1FMffDzBD — Thiruverkadu S UDHAYA KUMAR (@tssudhayakumar) October 19, 2022 -
Tamil Nadu: ‘పళని’ దూకుడుకు కళ్లెం..
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళని స్వామి దూకుడుకు సుప్రీంకోర్టు శుక్రవారం కళ్లెం వేసింది. ప్రధాన కార్యదర్శి ఎన్నికలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఆర్ షా స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ దసరా సెలవుల అనంతరం కొనసాగించేందుకు నిర్ణయించారు. అన్నాడీఎంకేలో పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య సాగుతున్న వివాదాలు కోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుతో తొలుత అన్నాడీఎంకే పార్టీ కార్యాలయాన్ని పళని స్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. అలాగే జూలై 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి అనుకూలంగా మరో తీర్పు రావడంతో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పగ్గాలు స్వీకరించారు. ఈ హోదాతో పార్టీపై పట్టు సాధించే పనిలో పడ్డారు. సమావేశాలు, సభలు అంటూ విస్తృతంగా దూకుడు పెంచారు. త్వరలో పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టారు. ఇందులో భాగంగా పార్టీ సర్వసభ్య సమావేశం సభ్యులతో ముందుగానే తనకు మద్దతు తెలిపే విధంగా సంతకాలతో కూడిన ప్రమాణ పత్రాలను సేకరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో జూలై 11న జరిగిన సర్వసభ్య సమావేశానికి అనుకూలంగా మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం సుప్రీం కోర్టులో అప్పీలు పిటిషన్ వేశారు. నిబంధనలు ఉల్లంఘించారని వాదనలు పన్నీరుసెల్వం దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఆర్ షా నేతృత్వంలోని బెంచ్ ముందుకు శుక్రవారం వచ్చింది. దసరా సెలవుల అనంతరం ఈ పిటిషన్‌ను విచారించేందుకు తొలుత న్యాయమూర్తి నిర్ణయించినా, పన్నీరు సెల్వం తరఫు న్యాయవాదులు బలమైన వాదనలు ఉంచారు. అన్నాడీఎంకేలో నిబంధనలకు అనుగుణంగా పన్నీరుసెల్వం నడుచుకున్నా, పళని స్వామి తరపున వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం మొదలెట్టారని వివరించారు. పార్టీ పరంగా సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో కన్వీనర్ పళని స్వామి సమష్టిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని గుర్తు చేశారు. అయితే, పన్నీరును పార్టీ నుంచి బయటకు పంపించినట్లు ప్రకటించి, వ్యక్తిగతంగా పళని స్వామి నిర్ణయాలు తీసుకుని, పార్టీ నిబంధనలను తుంగలో తొక్కినట్టు వివరించారు. సర్వసభ్య సమావేశాన్ని ఆగమేఘాలపై నిర్వహించారని, ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి లక్ష్యంగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. పళనిస్వామి అన్నాడీఎంకే నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారని, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఆయన తీసుకున్న నిర్ణయాలన్ని రద్దు చేయాలని కోరారు. అరగంట పాటుగా వాదనలు సాగాయి. పళని శిబిరానికి షాక్ పళనిస్వామి తరఫు న్యాయవాదులు సైతం కోర్టు ముందు వాదనలు ఉంచినా చివరకు ఈ కేసుతో పాటు అన్నాడీఎంకే వ్యవహారాలకు సంబంధించిన అన్ని కేసులను ఒకే గొడుగు కిందకు తెచ్చి దసరా సెలవుల అనంతరం విచారణ కొనసాగించేందుకు న్యాయమూర్తి నిర్ణయించారు. అదే సమయంలో ప్రధాన కార్యదర్శి పదవికి ఎలాంటి ఎన్నికలు నిర్వహించేందుకు వీలు లేదని పేర్కొంటూ స్టే విధించారు. దసరా సెలవుల అనంతరం విచారణ కొనసాగింపు అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో పళని స్వామి శిబిరానికి షాక్ తప్పలేదు. దసరా సెలవుల అనంతరం జరిగే విచారణ, వెలువడే ఉత్తర్వుల మేరకు ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. పళని స్వామి మద్దతు నేత, ఎంపీ సీవీ షన్ముగం కోర్టు ఆవరణలో మీడియా మాట్లాడారు. తాము ప్రధాన కార్యదర్శి ఎన్నికకు ఇంత వరకు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని, అయితే కోర్టుకు పన్నీరు తరఫున తప్పుడు సమాచారం ఇచ్చి స్టే పొందారని పేర్కొన్నారు. చట్టాన్ని తాము గౌరవిస్తామని, ఆ మేరకు వెలువడే ఉత్తర్వుల ఆధారంగా ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నిక నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం కోర్టు ఉత్తర్వులు తనకు అనుకూలంగా రావడంతో ఇదే అదనుగా పార్టీ కేడర్‌ను తన వైపుకు తిప్పుకునే విధంగా దక్షిణ తమిళనాడులో పర్యటనలకు పన్నీరు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవడం గమనార్హం. -
అన్నాడీఎంకే ఆఫీస్‌లోకి వెళ్లేందుకు పన్నీరు ప్రయత్నాలు.. మళ్లీ టెన్షన్
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే కార్యాలయంలోకి అడుగు పెట్టేందుకు పన్నీరు సెల్వం ప్రయత్నాలు చేశారు. ఇందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే ఆయన మద్దతుదారులు చొచ్చుకెళ్లవచ్చన్న సమాచాంతో భద్రతను పెంచారు. ఈ పరిణామాల నేపథ్యంలో చిన్నమ్మ శశికళతో పన్నీరు మద్దతుదారుడు వైద్యలింగం శుక్రవారం భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకేలో ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నేతృత్వంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి కోర్టు ఆమోద ముద్ర వేయడంతో పళనిస్వామి పార్టీ వ్యవహారాల్లో దూకుడు పెంచారు. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి హోదాలో తొలిసారిగా గురువారం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో అడుగు పెట్టారు. పార్టీ నేతలతో సమావేశాలు, బలోపేతం, సర్వ సభ్య సమావేశంతో పూర్తి స్థాయి ప్రధాన కార్యదర్శి పదవి చేజిక్కించుకునేందుకు వ్యూహాలకు పదును పెట్టారు. పళనిస్వామికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాత్కాలిక బా«ధ్యతలతో తిరుమల శ్రీవారి దర్శనానికి పళనిస్వామి బయలుదేరి వెళ్లారు. అదే సమయంలో తానేమి తక్కువ తిన్నానా..? అన్నట్టు పన్నీరు సెల్వం సైతం పావులు కదుపుతున్నారు. చిన్నమ్మతో భేటీ. అన్నాడీఎంకే వివాదాల నేపథ్యంలో చిన్నమ్మ శశికళ సైతం రాజకీయంగా దూకుడు పెంచారు. శుక్రవారం తంజావూరులో ఆమె పర్యటించారు. ఆమెను పన్నీరు సెల్వం మద్దతుదారుడు, ఎమ్మెల్యే వైద్యలింగం కలిశారు. ఆమెతో భేటీ కావడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఇప్పటికే చిన్నమ్మను కలిసేందుకు పన్నీరు సైతం ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ఐకమత్యంగా ఉందామని చిన్నమ్మ పిలుపునిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ భేటికి ప్రాధాన్యత నెలకొంది. నేను సైతం.. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ హోదాలో పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టేందుకు పన్నీరు సెల్వం సిద్ధమవుతున్నారు. గతంలో చోటు చేసుకున్న వివాదాల నేపథ్యంలో ఈసారి ముందుగానే పోలీసు భద్రత కోరే పనిలో పడ్డారు. తమకు భద్రత కల్పించాలని పన్నీరుసెల్వం మద్దతు నేత జేసీడీ ప్రభాకరన్ చెన్నై పోలీసులకు శుక్రవారం విజ్ఞప్తి చేశారు. అయితే, ఆయన విజ్ఞప్తిని పోలీసులు తోసిపుచ్చారు. అన్నాడీఎంకే కార్యాలయం వ్యవహారం కోర్టులో ఉన్న దృష్ట్యా, అక్కడే తేల్చుకోవాలని సూచించారు. పోలీసుల అనుమతి నిరాకరణతో పార్టీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు పన్నీరు మద్దతుదారులు ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. ఆ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం పన్నీరు సెల్వం శ్రీవిల్లిపుత్తూరు అండాల్ అమ్మవారిని, వనపేచ్చి అమ్మన్ ఆలయాల్లో పూజలు నిర్వహించడం గమనార్హం. -
మాతో టచ్‌లో 10 మంది ఎమ్మెల్యేలు.. త్వరలోనే పార్టీలోకి
తిరువళ్లూరు (చెన్నై): అన్నాడీఎంకేతో 10 మంది డీఎంకే ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనాయకుడు ఎడపాడి పళణిస్వామి చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి మాజీ ఎమ్మెల్యే కేఎస్ విజయకుమార్ కుమార్తె వివాహానికి ఎడపాడి పళణిస్వామి బుధవారం ఉదయం హాజరయ్యారు. ఎడపాడి పళణిస్వామికి పార్టీ నేతలు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. వధూవరులను ఆశ్వీరించిన మాజీ ముఖ్యమంత్రి, ఈగువారిపాళ్యం వెళ్లి యూనియన్ చైర్మన్ శివకుమార్ కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. అనంతరం మీడియా సమావేశంలో ఈపీఎస్ మాట్లాడుతూ అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు డీఎంకేతో టచ్‌లో ఉన్నారనే వార్తలు అవాస్తమన్నారు. డీఎంకే ఏడాదిన్నర పాలనలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు విసిగిపోయారని, వారిపై ఉన్న అసంతృప్తి త్వరలో బయటపడుతుందని వ్యాఖ్యానించారు. డీఎంకేకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని త్వరలో వారిని పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో మేయర్, డిప్యూటి మేయర్లను వెనుక సీట్లు కేటాయించడం వివాదస్పదంగా మారిన విషయంపై స్పందిస్తూ, డీఎంకే కార్పొరేట్ కంపెనీ లాంటింది. ఇక్కడ సీఈఓలుగా ఉన్న ఉదయనిధి స్టాలిన్, కనిమొళికి ఉన్న ప్రాధాన్యత ప్రజాప్రతినిధులకు వుండదన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న ఉదయనిధిను షాడో సీఎంగా ప్రమోట్ చేస్తున్నారని విమర్శించారు. శశికళ– దినకరన్‌లకు చోటులేదు అన్నాడీఎంకేలోకి శశికళ, టీటీవీ దినరకన్ ఓపీఎస్ ఆహ్వానించడం హర్షిందగ్గ విషయం కాదన్నారు. అన్నాడీఎంకేలో కార్యకర్తలే పాలకులని, గతంలో పార్టీకి ద్రోహం చేసిన వారిని మళ్లీ పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తామన్నారు. అన్నాడీఎంకే జనరల్ కమిటీ సమావేశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓపీఎస్ సుప్రీంకోర్టుకు వెళ్తున్న విషయంపై ఎడపాడి సీరియస్ అయ్యారు. సుప్రీంకోర్టుకు వెళ్లినా తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున అంతకు మించి తాము మాట్లాడనన్నారు. వేగంగా స్పందించలేదు అన్నాడీఎంకే కార్యాలయంలోని కీలక డాక్యుమెంట్ల చోరీ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పళణి స్వామి ఆరోపించారు. డీఎంకే హయాంలో సాధారణ ప్రజలకే భద్రత లేనప్పుడు తమ కార్యాలయానికి భద్రత కల్పిస్తారనే నమ్మకం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమిళనాడు సరిహద్దుల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై పునరాలోచన చేయాలని కోరారు. -
పళణి కోటలోకి శశికళ!
సాక్షి, చెన్నై : మాజీ సీఎం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళని స్వామి సొంత జిల్లాలో పర్యటించేందుకు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ సిద్ధమయ్యారు. చెన్నై నుంచి బుధవారం ఆమె తంజావూరు మీదుగా పర్యటనకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. అన్నాడీఎంకేను కైవసం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలను చిన్నమ్మ శశికళ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తన మద్దతుదారులను ఏకం చేస్తూ పర్యటనలపై దృష్టి పెట్టారు. ఈసారి ఆమె అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి జిల్లాను టార్గెట్ చేశారు. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, పళణి స్వామి మధ్య వివాదం సాగుతోన్న నేపథ్యంలో చిన్నమ్మ శశికళ సేలం, నామక్కల్ జిల్లాలపై దృష్టి పెట్టడం రాజకీయంగా ప్రాధాన్యతకు దారి తీసింది. పళణి స్వామి ఆయన సన్నిహితుడు, మాజీ మంత్రి తంగమణి మద్దతుదారుల్ని తన వైపునకు తిప్పుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటనలో చిన్నమ్మ వ్యూహరచన చేసినట్లు సమాచారం. అక్రమాస్తుల కేసులో తాను జైలుకు వెళ్తూ పళణి స్వామిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆమెను పళణి స్వామి సాగనంపి ఆ పార్టీని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో పళణి సొంతజిల్లాలో పర్యటించే చిన్నమ్మ శశికళ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే విషయం ఆసక్తి కలిగిస్తోంది. రెండు రోజుల పర్యటన ఖరారు సేలం, నామక్కల్‌లో చిన్నమ్మ శశికళ పర్యటన రెండు రోజులు సాగనుంది. ఇందుకు తగ్గ రూట్ మ్యాప్‌ను మంగళవారం విడుదల చేశారు. బుధవారం ఉదయం టీ నగర్ నివాసం నుంచి తంజావూరు వైపుగా శశికళ పర్యటన ప్రారంభమవుతుంది. గురువారం తిరుత్తొరై పూండిలో కొత్తగా నిర్మించిన షిరిడీ సాయిబాబా ఆలయ కుంభాభిషేకం వేడుకల్లో ఆమె పాల్గొంటారు. తంజావూరు, తిరువారూర్, సేలం, నామక్కల్, పుదుకోట్టై, ఈరోడ్ జిల్లాల నేతలతో 9.10 తేదీల్లో సమావేశాలు నిర్వహిస్తారు. 11వ తేదీ ఉదయం తంజావూరు నుంచి తిరువయ్యారు. తిరుమానూరు, కీల పలలూరు, అరియలూరు, పెరంబలూరు జిల్లాల వైపుగా ఆమె పర్యటన ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం సేలంలో పలు ప్రాంతాల్లో శశికళ పర్యటించనున్నారు. పార్టీ కేడర్, నాయకులతో వివిధ అంశాలపై చర్చిస్తారు. ఆ రాత్రి సేలంలో బస చేసి 12వ తేదీ నామక్కల్ జిల్లాలో, అరియలూరు కొన్ని ప్రాంతాల్లో పర్యటించనున్నారు. శశికళ పర్యటన నేపథ్యంలో తన మద్దతు దారులు, సర్వ సభ్య సభ్యులు, ముఖ్యులు చేజారకుండా పళణిస్వామి ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. -
పన్నీరుకు షాక్.. పళనిస్వామికే అన్నాడీఎంకే పగ్గాలు
అన్నాడీఎంకే బాధ్యతలు పళనిస్వామి గుప్పెట్లోకి చేరాయి. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళని ఎంపికకు పరోక్షంగా శుక్రవారం మద్రాసు హైకోర్టు ద్విసభ్య బెంచ్ పచ్చ జెండా ఊపింది. జూలై 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశాన్ని ఆమోదించింది. సింగిల్ బెంచ్ విధించిన స్టేను రద్దు చేసింది. దీంతో పళని మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. కాగా ద్విసభ్య బెంచ్ తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీకోర్టులో అప్పీలుకు వెళ్లనున్నామని పన్నీరు సెల్వం ప్రకటించారు. సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళనిస్వామి మధ్య రాజకీయ చదరంగం కొనసాగుతోంది. జూలై 11వ తేదీ జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ద్వారా పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. దీనిని వ్యతిరేకిస్తూ పన్నీరు సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌ను గత నెల న్యాయమూర్తి జయచంద్రన్ బెంచ్ విచారించింది. సర్వసభ్య సమావేశానికి సింగిల్ బెంచ్ స్టే విధించింది. జూన్ 23వ తేదీకి ముందు అన్నాడీఎంకేలో ఉన్న పరిస్థితులు కొనసాగే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పళని స్వామి శిబిరానికి చెక్ పెట్టే విధంగా పన్నీరుసెల్వం దూకుడు పెంచారు. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె ప్రతినిధి దినకరన్‌ను కలుపుకుని ముందుకు సాగేందుకు తగ్గ వ్యూహాలకు పదును పెట్టారు. అడియాసే.. పన్నీరు ఆశలన్నీ ప్రస్తుతం ఆవిరయ్యాయి. సింగిల్ బెంచ్ విధించిన స్టేకు వ్యతిరేకంగా పళనిస్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తులు దురైస్వామి, సుందర మోహన్ బెంచ్ ఈ పిటిషన్‌పై శుక్రవారం తీర్పు వెలువరించింది. పళనిస్వామి తరఫు న్యాయవాది ఇన్బదురై బలమైన వాదనలను కోర్టు ముందు ఉంచారు. అన్నాడీఎంకే నిబంధనలకు అనుగుణంగానే జూలైన 11న సర్వసభ్య సమావేశం జరిగిందని వివరించారు. జూన్ 23వ తేదీ జరిగిన సమావేశంలో జూలై 11న జరిగే సమావేశం గురించి ప్రిసీడియం చైర్మన్ ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఈ సమయంలో పన్నీరుసెల్వం అదే వేదికపై ఉన్నారని, అలాంటప్పుడు ఈ సమావేశం గురించి సమాచారం లేదని చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు. వీటిని ద్విసభ్య బెంచ్ పరిగణనలోకి తీసుకుంది. 128 పేజీలతో కూడిన తీర్పును న్యాయమూర్తులు వెలువరించారు. చదవండి: పొలిటికల్ గేమ్‌లో ప్లాన్ ఛేంజ్.. టీఆర్ఎస్కు షాకిచ్చిన బీజేపీ! తీర్పుతో పళని శిబిరంలో సంబరాలు సింగిల్ బెంచ్ విధించిన స్టేను ద్విసభ్య బెంచ్ రద్దు చేసింది. జూలై 11న జరిగిన సర్వ సభ్య సమావేశానికి ఆమోదం తెలిపింది. దీంతో పళని శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. చెన్నైలో ఎంజీఆర్ యువజన విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీల్ నేతృత్వంలో స్వీట్లు పంచుకుని బాణాసంచాతో హోరెత్తించారు. పళని, దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. పళని మద్దతుదారులు జయకుమార్, ఆర్బీ ఉదయకుమార్, వైగై సెల్వం, ప్రిసీడియం చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ తదితరులు మీడియా ముందుకు వచ్చారు. ఇది చారిత్రక తీర్పుగా పేర్కొన్నారు. పన్నీరు సెల్వంను అన్నాడీఎంకే నుంచి ఇప్పటికే తొలగించామని, ఆయనకు పార్టీలో చోటు లేదని స్పష్టం చేశారు. మూడు నెలల్లో మరోమారు పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి పళనిస్వామిని పూర్తి స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటామని ప్రకటించారు. కోర్టు తీర్పు ఏకనాయకత్వానికి ఆమోదముద్ర వేసిందని హర్షం వ్యక్తం చేశారు. తాత్కాలికం ద్విసభ్య బెంచ్ తీర్పుతో పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇది పన్నీరు సెల్వం శిబిరానికి షాక్ గా మారింది. దీంతో సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేయడానికి పన్నీరు సెల్వం నిర్ణయించారు. ఇదిలా ఉండగా, ద్విసభ్య బెంచ్ తీర్పు తాత్కాలికంగా మారేనా అన్న చర్చ నెలకొంది. ఇందుకు కారణం న్యాయమూర్తి జయచంద్రన్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్‌లో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ వ్యవహారం ప్రధాన కేసుగా విచారణలో ఉండటమే. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ రద్దు చేశారా.? కాలం చెల్లిందా..? అన్న వ్యవహారాలపై ఈ బెంచ్‌లో వాదనలు జరగాల్సి ఉంది. కేవలం సింగిల్ బెంచ్ విధించిన స్టేను మాత్రమే ద్విసభ్య బెంచ్ రద్దు చేసింది. అయితే, సింగిల్ బెంచ్‌లో మున్ముందు ప్రధాన కేసు విచారణ ఎలాంటి మలుపులకు దారి తీస్తాయో, తుది వాదనలు ఎలా ఉంటాయో అన్నది వేచి చూడాల్సిందే. దీనిపై పన్నీరు శిబిరం నేత వైద్యలింగం స్పందిస్తూ ఈ తీర్పు తాత్కాలికమేనని.. సుప్రీంకోర్టులో తమ న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తిరువళ్లూరులో.. పట్టణంలో పళనిస్వామి మద్దతుదారులు బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ఎంజీఆర్, అన్నాదురై విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి రమణ, పార్టీ నేతలు వెంకటేషన్, బాబు, ఎయిళరసన్, సుధాకర్, మాధవన్ పాల్గొన్నారు. తిరుత్తణి: హైకోర్టు తీర్పుతో అన్నాడీఎంకే శ్రేణులు తిరుత్తణిలో సంబరాలు చేసుకున్నారు. పట్టణ కార్యదర్శి సౌందర్‌రాజన్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండు వద్ద బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. పళ్లిపట్టు మండల కార్యదర్శి టీడీ.శ్రీనివాసన్, నాయకులు కుప్పుస్వామి, త్యాగరాజన్, జయశేఖర్‌బాబు పాల్గొన్నారు. -
కీలక మలుపు తిరిగిన రాజీనామా వ్యవహారం.. పళనికి కొత్త చిక్కులు
సాక్షి, చెన్నై: ప్రతిపక్ష నాయకుడు పళనిస్వామికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపికయ్యేందుకు ముందుగా ఆ పార్టీ సమన్వయ కమిటీ కో– కన్వీనర్ పదవికి ఆయన చేసిన రాజీనామా కొత్త సమస్యగా మారింది. ఈ రాజీనామాపై సీఈసీ విచారణకు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఈ రాజీనామాను ఆమోదించాలని కోరుతూ పన్నీరు సెల్వం సీఈసీకి లేఖ రాసినట్లు శనివారం వెలుగు చూసింది. అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళని స్వామి శిబిరాల మధ్య వివాదం ఆసక్తికరంగా మారుతోంది. సర్వసభ్య సమావేశం చెల్లదని రెండు రోజుల క్రితం హైకోర్టు ప్రకటించడంతో పళనిస్వామికి పెద్దషాక్ తగిలింది. దీంతో పన్నీరు సెల్వం వ్యూహాలకు పదును పెట్టారు. ఓ వైపు కలిసి పనిచేద్దామని పిలుపునిస్తూనే.. మరోవైపు పళని స్వామికి ఎలాగైనా చెక్ పెట్టాలనే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా సీఈసీకి గత నెల పళనిస్వామి రాసిన లేఖ ప్రస్తుతం పన్నీరుకు అస్త్రంగా మారింది. ఆమోదించండి.. అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా గత నెల పళనిస్వామి ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సమయంలో తన చేతిలో ఉన్న అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో– కన్వీనర్ పదవిని ఆయన రాజీనామా చేశారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు(సీఈసీ) లేఖ ద్వారా పంపించారు. ఇన్నాళ్లూ పెండింగ్‌లో ఉన్న ఈ వ్యవహారాన్ని ప్రస్తుతం ఎస్ఈసీ విచారించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం కోర్టు తీర్పుతో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి దూరం కావడంతో డీలా పడిన పళనికి, ఈ రాజీనామా లేఖ కొత్త చిక్కులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: పన్నీరు సెల్వానికి షాకిచ్చిన పళనిస్వామి.. తమిళ పాలిటిక్స్‌లో ట్విస్ట్ కో– కన్వీనర్‌గా వైద్యలింగం పళనిస్వామి రాజీనామా నేపథ్యంలో ఆ పదవిని తన సన్నిహితుడు, ఎమ్మెల్యే వైద్యలింగంకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ హోదాలో పన్నీరుసెల్వం కేటాయించారు. కోర్టు తీర్పుతో ప్రస్తుతం పార్టీకి పెద్ద దిక్కుగా సమన్వయ కమిటీ మారడంతో పళనికి ఒక దాని తర్వాత మరొకటి చొప్పున సమస్యలు ఎదురు కాబోతున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు కారణం, పళని స్వామి పంపించిన రాజీనామా లేఖను ఆమోదించాలని సీఈసీకి పన్నీరు సెల్వం లేఖ ద్వారా కోరడమే. ఒకవేళ సీఈసీ పళని రాజీనామాను ఆమోదించిన పక్షంలో, ఆయనకు పార్టీలో ఎలాంటి పదవి లేకుండా పోయినట్టే. ఇక పార్టీ కో– కన్వీనర్‌గా వైద్యలింగం కొనసాగే అవకాశాలు ఎక్కువే. ఈ పరిణామా లు పళని శిబిరంలో కలవరం రేపుతున్నాయి. మంతనాల్లో పన్నీరు.. హైకోర్టు తీర్పుతో పార్టీ వ్యవహారాలు తన గుప్పెట్లోకి రావడంతో పన్నీరు దూకుడు పెంచారు. జిల్లా కార్యదర్శులతో సమావేశాలు విస్తృతం చేశారు. శనివారం తన నివాసంలో ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. తదుపరి కార్యచరణపై దృష్టి పెట్టారు. తాజా పరిణామాల నేపథ్యంలో పళని స్వామి ఒంటరిగా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని, ఈ దృష్ట్యా, మరింత దూకుడుగా ముందుకు సాగి, కేడర్‌ను తమ వైపునకు తిప్పుకునే వ్యూహాలకు పన్నీరు శిబిరం పదును పెట్టినట్లు తెలుస్తోంది. -
తమిళనాడు.. దిక్కుతోచని స్థితితో పన్నీరుసెల్వం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో పరిణామాలన్నీ ఎడపాడి పళనిస్వామికే అనుకూలంగా మారడంతో పన్నీర్‌సెల్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. న్యాయస్థానాల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతుండడంతో ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎడపాడి నేతృత్వంలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశం, తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చెల్లదు..అని ఆదేశించాలని కోరుతూ వేసిన అప్పీల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పైగా మద్రాసు హైకోర్టులోనే ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాలని ఆదేశించడం,అప్పటి వరకు అన్నాడీఎంకేలో యథాతధ స్థితి కొనసాగుతుందని స్పష్టం చేయడం ఓపీఎస్‌కు మింగుడుపడలేదు. అన్నాడీఎంకే వ్యవహారంపై 3 వారాల్లోగా తీర్పు చెప్పాలని కూడా మద్రాసు హైకోర్టును ఆదేశించింది. ఈ మేరకు ఆగస్టు 1వ తేదీన విచారణ ప్రారంభం కానుండగా, సుప్రీంకోర్టు ఆదేశాలను అధిగమించి చేపట్టాల్సిన తదుపరి చర్యలపై తన మద్దతుదారులు, చట్ట నిపుణులతో ఓపీఎస్ శనివారం సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. ఇక అన్నాడీఎంకేలో కుమ్ములాటలు ఇలా ఉండగా, శశికళ, పన్నీర్‌సెల్వం ఏకమై రాజకీయంగా ముందుకు సాగాలని వంద దేవర్ సంఘాల ప్రతినిధులు వారిద్దరికీ శనివారం లేఖలు పంపడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: రాష్ట్రపతి అంటే గౌరవం లేదా? కేంద్రమంత్రి క్షమాపణలు చెప్పాల్సిందే.. అఖిలపక్ష సమావేశానికి ఈపీఎస్.. ఓటరు కార్డుతో ఆధార్‌కార్డు అనుసంధానంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈనెల 1వతేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. దీనికి డీఎంకే, కాంగ్రెస్, బీజేపీ, అన్నాడీఎంకే తదితర గుర్తింపు పొందిన పార్టీలను ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో అన్నాడీఎంకే తరపున ఎడపాడి పళనిస్వామికి ఈసీ నుంచి పిలుపు వచ్చింది. చెన్నై రాయపేటలోని అన్నాడీంకే ప్రధాన కార్యాలయానికి ఆహ్వానపత్రం అందింది. దీంతో అన్నాడీఎంకే కో కన్వీనర్ పదవి నుంచి ఎడపాడిని బహిష్కరించినట్లు, ఆయన స్థానంలో వైద్యలింగంను నియమించినట్లుగా ప్రధాన ఎన్నికల కమిషన్ కార్యాలయానికి పన్నీర్‌సెల్వం ఉత్తరం పంపారు. ఓపీఎస్ ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు ఎడపాడి సైతం శనివారం తన అనుచరగణంతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. -
పళనిస్వామికి కొత్త తలనొప్పి.. కలకలం రేపిన రహస్య సంభాషణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: మొన్నటి వరకు పన్నీర్‌సెల్వంతో పోరాడిన ఎడపాడి పళనిస్వామికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. పార్టీ నుంచి పొన్నయ్యన్‌ను బహిష్కరించాలని మాజీ మంత్రులు కొందరు అప్పుడే నిరసన గళం విప్పారు. కన్యాకుమారి జిల్లాకు చెందిన పార్టీ ప్రముఖుడొకరు పొన్నయన్‌తో రహస్య సంభాషణ చేసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆడియో, ఆయనను బహిష్కరించాలనే డిమాండ్ ఎడపాడిని ఇరుకునపెట్టింది. చదవండి: మరో కొత్త వివాదం.. అన్నాడీఎంకే ఖజానాపై ‘వారిద్దరి’ కన్ను ఆడియోలోని వివరాలు.. మాజీ మంత్రి కేపీ మునుస్వామి డీఎంకే మంత్రి దురైమురుగన్ సిఫార్సుతో క్వారీల కాంట్రాక్టు పొంది నెలకు రూ.2 కోట్లు సంపాదిస్తున్నట్లు, అలాగే మాజీ మంత్రి తంగమణి సైతం తన అక్రమాస్తులను ఏసీబీ దాడుల నుంచి కాపాడుకునేందుకు సీఎం స్టాలిన్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్నారని, మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం గురించి విమర్శలు చేసినట్లు, ఎంజీఆర్, జయలలితల గురించి అమర్యాదగా మాట్లాడినట్లు ఆ సంభాషణల్లో ఉన్నాయి. అంతేగాక తంగమణి, వేలుమణి దొంగలు, డబ్బు, కాంట్రాక్టులు ఇచ్చి 42 మంది ఎమ్మెల్యేలను గుప్పిట్లో పెట్టుకున్నారని, వాస్తవానికి ఎడపాడికి కేవలం 9 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతు పలుకుతున్నారని కూడా మాట్లాడారు. ఈ కారణంగా పొన్నయ్యన్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని ఎడపాడిపై మాజీ మంత్రులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆడియో సంభాషణలను పొన్నయ్యన్ ఖండించారు. సాంకేతిక పరిజ్ఞానంతో తన గొంతుకను ప్రచారంలోకి తెచ్చారని ఆరోపించారు. మాజీ మంత్రులపై తాను తప్పుగా మాట్లాడలేదని పేర్కొన్నారు. అయితే, మొత్తం ఈ ఆడియోల వివాదం కోర్టుకెక్కగా గురువారం విచారణ జరగనుంది. పన్నీర్, శశికళపై నిఘా పార్టీ పగ్గాలు చేజారిపోవడంతో పన్నీర్‌సెల్వం, శశికళ ఏకంకావాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు అన్నాడీఎంకే నేతలు అనుమానిస్తున్నారు. వీరిద్దరూ రహస్యంగా కలుసుకుని మంతనాలు సాగిస్తున్నారనే సమాచారం అందడంతో నిఘాపెట్టి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎడపాడిపై జరుపుతున్న న్యాయపోరాటంలో నెగ్గకుంటే మరో మార్గంలో రాజకీయంగా దెబ్బకొట్టేందుకు పన్నీర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా పన్నీర్‌ను తమవైపు తిప్పుకోవాలని కొందరు, జయ అన్న కుమార్తె, కుమారులైన దీప, దీపక్ పన్నీర్‌సెల్వంను ఇంటికి విందుకు ఆహా్వనించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ విందుకు శశికళను కూడా ఆహ్వానిస్తాం, కలిసి కొత్త పార్టీ స్థాపించి ఎడపాడి ఎత్తుగడలను చిత్తుచేయవచ్చని పన్నీర్‌కు గాలం వేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రచారాన్ని ఓపీఎస్ వర్గీయులు నిర్ధారించడం లేదు. 17న ఎమ్మెల్యేలతో ఎడపాడి సమావేశం పారీ్టలో ఇంతటి గందరగోళ పరిస్థితులు కొనసాగుతుండగా ఈనెల 17వ తేదీన ఎమ్మెల్యేలతో ఎడపాడి పళనిస్వామి సమావేశం నిర్వహిస్తున్నారు. 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్, పన్నీర్ బహిష్కరణతో ప్రధాన ప్రతిపక్ష ఉపనేత పదవి భర్తీపై ఆనాటి సమావేశంలో చర్చించనున్నారు. అత్యవసర విచారణకు నో అన్నాడీఎంకే కార్యాలయానికి వేసిన సీలును తొలగించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను అత్యవసర కేసుగా విచారించాలని ఎడపాడి పళనిస్వామి, ఓ పన్నీర్‌సెల్వం తరపున చేసిన అభ్యర్థనను మద్రాసు హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్లు బుధవారం విచారణకు రాగా, ఎడపాడి తరపున పిటిషన్ వేసింది ఎమ్మెల్యే కావడం వల్ల ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లి సాధారణ కేసుగా జాబితాలో చేరుస్తామని తెలిపారు. ఇక పన్నీర్‌సెల్వం తరపున దాఖలైన పిటిషన్‌పై కూడా ఆదే విధానాన్ని అనుసరిస్తామని స్పష్టం చేశారు. -
పన్నీర్ సెల్వానికి భారీ షాక్.. పార్టీ నుంచి బహిష్కరిస్తూ తీర్మానం
సాక్షి, చెన్నై: ఏఐఏడీఎంకే నేత ఓ పన్నీర్‌సెల్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. చెన్నైలోని వనగరంలో సోమవారం జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో జయలలిత మరణం తర్వాత ఎడప్పాడి పళనిస్వామి, ఓ పన్నీర్ సెల్వం వర్గాల మధ్య సయోధ్య కోసం ఏర్పాటు చేసిన ద్వంద్వ నాయకత్వ విధానాన్ని రద్దు చేశారు. పార్టీకి ఎకైక తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి(ఈపీఎస్) ఎన్నికయ్యారు. దీంతో పార్టీ పగ్గాలు పళనిస్వామి చేతులోకి చేరాయి. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి పునరుద్ధరించి.. కోఆర్టినేటర్, సంయుక్త కోఆర్డినేటర్ పోస్టులను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో మొత్తం 16 తీర్మానాలకు ఆమోదం తెలిపారు. #UPDATE | AIADMK passes a resolution to remove O Paneerselvam from party's primary membership at E Palaniswami-led General Council meeting in Vanagaram, Tamil Nadu pic.twitter.com/vigbNP32df — ANI (@ANI) July 11, 2022 ఈ సందర్భంగా అన్నాడీఎంకే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి పన్నీర్ సెల్వాన్ని తొలగించాలని ఎమ్మెల్యే నాథం విశ్వనాథన్ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. పన్నీర్ సెల్వాన్ని పార్టీ ముఖ్య పదవులు, సభ్యత్వం నుంచి తొలగిస్తూ అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ తీర్మానించింది. ఓపీఎస్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఓపీఎస్ మద్దతుదారులపైనా బహిష్కరణ వేటు పడింది. పదవులు, సభ్యత్వం నుంచి ఓపీఎస్ మద్దతురాలను తొలగిస్తూ తీర్మానించింది. ఓపీఎస్‌తోపాటు వైతిలింగం, జేసీడీ ప్రభాకర్, పీహెచ్ మనోజ్ పాండియన్ కూడా బహిష్కరణకు గురయ్యారు. చదవండి: అన్నాడీఎంకే కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. పళనిస్వామి ఫోటోపై చెప్పుతో దాడి ఏకైక పార్టీ అన్నాడీఎంకేనే పార్టీలో ఒకే నాయకత్వాన్ని తీసుకురావాలని జనరల్ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారని అన్నాడీఎంకే నేత పళనిస్వామి అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేస్తున్న ఏకైక పార్టీ అన్నాడీఎంకే అని పేర్కొన్నారు. తన చిత్తశుద్ధితో కూడిన పనులను చూసి దివంగత సీఎం జయలలిత రహదారులు & పీడబ్ల్యూడీ వంటి శాఖలను ఇచ్చారని గుర్తు చేశారు. మంత్రిగా ప్రజల కోసం అనేక పథకాలు తీసుకొచ్చానని పేర్కొన్నారు. ఆ పథకాలనే ప్రస్తుతం సీఎం స్టాలిన్ తమ పార్టీ స్టిక్కర్లను అతికించి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. కాగా ఓపీఎస్‌గా ప్రసిద్ధి చెందిన పన్నీర్ సెల్వం మూడుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆగస్టు 21, 2017 నుంచి అన్నాడీఎంకే సమన్వయకుడిగానూ వ్యవహరిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో జయలలితను ముఖ్యమంత్రి పదవికి అనర్హురాలిగా కోర్టు రెండుసార్లు నిర్థారించడంతో పన్నీర్‌సెల్వం తమిళనాడు 7వ ముఖ్యమంత్రిగా(వ్యక్తుల పరంగా) సేవలందించారు. జయలలితకు బదులుగా సీఏం పీఠాన్ని ఆయన రెండుసార్లు అధిరోహించారు. జయలలిత మరణానంతరం ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2 నెలలు గడిచిన తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. -
అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అంతర్గత కలహాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పన్నీరు సెల్వం పిటిషన్‌ను జస్టిస్ కృష్ణన్ రామసామి తిరస్కరించారు. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశంపై నిషేధం లేదని తేల్చి చెప్పింది. మద్రాస్ హైకోర్టు తీర్పుతో అన్నాడీఎంకే చీఫ్ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. నేడు(సోమవారం) జరగనున్న సర్వసభ్య సమావేశంతో ఎడపాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య సాగుతున్న ఆధిపత్యపోరుకు తెరపడుతుంది. ఇదిలా ఉండగా అన్నాడీఎంకే కార్యాలయం వద్ద ఉద్రికత్త నెలకొంది. ఓపీఎస్-ఈపీఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలు, రాళ్లతో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వసం అయ్యాయి. అసలు కథ ఏంటంటే.. అన్నాడీఎంకేలో ఒక ఒరలో రెండుకత్తులు ఇమడవన్నట్లుగా ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. పన్నీర్‌సెల్వంను పక్కనపెట్టడం ద్వారా ప్రధాన కార్యదర్శిగా అవతరించాలని ఎడపాడి ఎత్తులు వేయడం ప్రారంభించగానే.. పన్నీర్‌సెల్వం కూడా తానేమీ తక్కువకాదన్నట్లు పైఎత్తులతో న్యాయపోరాటానికి దిగారు. గత నెల 23వ తేదీన జరిగిన సర్వసభ్య సమావేశం వేదికగా ఈపీఎస్, ఓపీఎస్ మద్దతుదారులు భౌతికదాడులకు కూడా సాహసించారు. పన్నీర్‌సెల్వంను పార్టీ నుంచి శాశ్వతంగా తప్పించమే శ్రేయస్కరమనే స్థాయికి ఎడపాడి వర్గం సిద్ధమైంది. ఈ క్రమంలో సోమవరాం మరోసారి సర్వసభ్య సమావేశం నిర్వహించి ఒకే దెబ్బకు రెండు పిట్టలు చందంగా పన్నీర్‌పై రాజకీయ బాణం ఎక్కుపెట్టనున్నారు. ఎడపాడిని ప్రధాన కార్యదర్శిని చేయడం, పన్నీర్‌సెల్వంను ఇంటిబాట పట్టించాలనే పట్టుదలతో ఉన్నారు. మెజార్టీ వర్గం ఎడపాడి పంచన చేరిపోవడంతో సర్వసభ్య సమావేశం జరగకుండా స్టే కోరుతూ పన్నీర్‌సెల్వం కోర్టును ఆశ్రయించారు. సోమవారం ఉదయం 9.15 గంటలకు సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుండగా 9 గంటలకు తీర్పు చెబుతామని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రెండురోజుల క్రితం ప్రకటించారు. కోర్టు తీర్పు కోసం ఎదురుచూడకుండా ఎడపాడి వర్గీయులు ఆదివారం సభాస్థలికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించి వచ్చారు. పన్నీర్ ఆశిస్తున్నట్లుగా స్టే మంజూరవుతుందా..? లేక ఎడపాడి ఏర్పాట్లకు అనుగుణంగా సర్వసభ్య సమావేశానికి కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందా..? అని ఇరువర్గాలు నరాలు తెగే ఉత్కంఠను ఎదుర్కొంటున్నారు. ఇదిగాక, రూ.4,800 కోట్ల టెండర్ కుంభకోణానికి పాల్పడ్డారనే అభియోగం కింద ఎడపాడి పళనిస్వామిపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ ప్రారంభం కానుండటం ఆయన మద్దతుదారులకు మరో తలనొప్పిగా మారింది. చదవండి: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. ‘భారత్ కూడా శ్రీలంకలాగే.. మోదీకి అదే గతి’ ఎవరికి వారు.. ఈపీఎస్, ఓపీఎస్ ఎవరికివారు సర్వసభ్య సమావేశానికి సమాయత్తం అవుతున్నారు. ‘విజయమో వీర స్వర్గమో తేల్చుకుందాం’ అన్నట్లుగా ఎడపాడి, పన్నీర్ మద్దతుదారులు కార్లు, వ్యాన్లు, బస్సుల్లో, మరికొందరు విమానాల్లో ఆదివారం చెన్నైకి చేరుకున్నారు. సుమారు 2,650 మంది కోసం చెన్నై నగరం, శివార్లలోని లగ్జరీ హోటళ్లలో ముందుగానే రిజర్వ్ చేసుకున్న గదుల్లో బసచేసి ఉన్న తమ వర్గం నేతలతో ఈపీఎస్, ఓపీఎస్ సమాలోచనల్లో మునిగిపోయారు. వీరుగాక నేతలు, కార్యకర్తలతో హోటళ్లన్నీ నిండిపోయాయి. పార్టీపరంగా 75 జిల్లాలకు గాను 70 జిల్లాల కార్యదర్శులు ఎడపాడి వైపు ధీమాగా నిలిచి ఉన్నారు. ఎడపాడి దూకుడును అడ్డుకోవడం ఎలా.. అని న్యాయనిపుణులతో ఓపీఎస్ ఎడతెగని చర్చలు జరుపుతున్నారు. సోమవారం ఉదయం ఓపీఎస్ మరోసారి మద్దతుదారులతో సమావేశం అవుతుండగా, ఎలాంటి వ్యూహం పన్నుతాడోనని ఎడపాడి వర్గం అప్రమత్తంగా గమనిస్తోంది. సమావేశం జరుపుకునేలా తీర్పు వెలువడటంతో పన్నీర్‌సెల్వం సహా ఆయన మద్దతుదారులు కార్యక్రమాన్ని బహిష్కరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
AIADMK: ఊ అంటారా.. ఊహూ అంటారా !
సాక్షి, చెన్నై: సర్వసభ్య సమావేశం విషయంలో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ‘ఊ’అంటూ మార్గాన్ని సుగమం చేసేనా...లేదా ‘ఊ..హూ’అంటూ అడ్డు పడేనా అన్న ఉత్కంఠ అన్నాడీఎంకే నెలకొంది. సోమవారం ఉదయం 9.15 గంటల నుంచి పది గంటలలోపు సమావేశం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అదే రోజు ఉదయం 9 గంటలకు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించేందుకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శుక్రవారం నిర్ణయించారు. అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, ఎడపాడి పళని స్వామి మధ్య సాగుతున్న వార్ తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే. పళని ప్లాన్లు.. పన్నీరు సెల్వంను పార్టీ నుంచి శాశ్వతంగా సాగనంపి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టేందుకు ఎడపాడి పళని స్వామి వ్యూహాలకు పదును పెట్టారు. ఇందు కోసం ఈనెల 11వ తేదీ ఉదయం వానగరం శ్రీవారు వెంకటాచలపతి ప్యాలెస్ వేదికగా సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశం ఉదయం 9.15 గంటల నుంచి 10 గంటలలోపు ప్రారంభం అవుతుందని ముందుగానే ప్రకటించారు. ఇందుకు తగ్గ ఆహ్వానాలు సభ్యులకు పంపించారు. 2441 మంది సభ్యులు ఈనెల 10వ తేదీ ఉదయానికి చెన్నైకి చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. వీరి కోసం చెన్నైలో పలు చోట్ల ప్రత్యేక క్యాంపుల్లో వసతి సౌకర్యాలు సిద్ధం చేశారు. అలాగే, పార్టీ పరంగా ఉన్న 75 జిల్లాల కార్యదర్శుల పర్యవేక్షణలో సభ్యుల హాజరు వివరాల సేకరణకు ప్రత్యేక సాంకేతికను ఉపయోగించేందుకు నిర్ణయించారు. శరవేగంగా సర్వ సభ్య సమావేశ ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు ప్రత్యేక బెంచ్ చేసిన ప్రకటన అన్నాడీఎంకే వర్గాలను ఉత్కంఠలో పడేసింది. చదవండి: (Priya Anand: 'నిత్యానందస్వామిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా') వాడీ వేడిగా వాదనలు అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి స్టే విధించాలని కోరుతూ పన్నీరు సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట వాదనలు జరిగాయి. స్టే విధించాల్సిన అవసరం లేదని, వ్యక్తిగత స్వలాభం కోసం పన్నీరు సెల్వం అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని పళని స్వామి తరఫున వాదనలు వినిపించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ సోమవారం ఉదయం 9 గంటలకు ఉత్తర్వులు వెలువరిస్తామ న్నారు. అయితే, శనివారం లేదా ఆదివారం ఉత్తర్వులు వెలువరించాలని పన్నీరు సెల్వం తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేసినా న్యాయమూర్తి అంగీకరించ లేదు. అయితే, సర్వసభ్య సమావేశానికి కోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు వెలువరిస్తుందన్న ఆశాభావం పన్నీరు వర్గంలో వ్యక్తమవుతోంది. అదే సమయంలో సమావేశానికి వ్యతిరేకంగా ఏదైనా ఉత్తర్వులు వెలువడిన పక్షంలో సీజే బెంచ్ లేదా, ద్విసభ్య బెంచ్‌ను ఆశ్రయించి అడ్డంకులను తొలగించుకునేందుకు తగ్గ ముందస్తు కసరత్తుల్లో పళని స్వామి తరఫున న్యాయవాదులు ఉన్నారు. అయితే, 9.15 గంటలకు సమావేశం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో 9 గంటలకు ఉత్తర్వుల ప్రకటనతో న్యాయమూర్తి ‘ఊ.. అంటారా.. ఊహూ’అంటారా..? అనే ఉత్కంఠ పన్నీరు, పళని శిబిరాలతో పాటు, అన్నాడీఎంకే కేడర్‌లోనూ నెలకొంది. -
నీకు ఎలాంటి అధికారం లేదు: పళనిస్వామి బహిరంగ ప్రకటన
చెన్నై: తమిళనాడు అన్నాడీఎంకేలో వర్గపోరు ఆసక్తికర పరిణామానికి దారి తీసింది. పన్నీర్ సెల్వంపై బహిరంగంగా తొలిసారి వ్యతిరేక కామెంట్లు చేశారు మాజీ సీఎం పళనిస్వామి. ఈ మేరకు పన్నీర్‌సెల్వంకు ఇక మీదట పార్టీ కో-ఆర్డినేటర్ కాదంటూ ఈపీఎస్ ఓ లేఖ రాశారు. ఇకపై ఓ.పన్నీర్‌సెల్వం.. అన్నాడీఎంకే పార్టీ కో-ఆర్డినేటర్ కాదని, ఇద్దరి ఆమోదం తర్వాత ఏర్పాటు చేసిన జనరల్ కౌన్సిల్ భేటీ(జూన్ 23న) రసాభాసకు కారణం పన్నీర్ సెల్వమేనని పళని స్వామి ఆరోపించారు. 2021, డిసెంబర్ 1న పార్టీ రూపొందించిన ప్రత్యేక చట్టాలను పన్నీర్‌సెల్వం ఉల్లంఘించారని, జనరల్ కౌన్సిల్ భేటీ జరగకుండా పోలీసులను.. కోర్టును ఆశ్రయించారని, భేటీలో గందరగోళంతో పాటు కీలక తీర్మానాల ఆమోదానికి కొందరు కార్యకర్తల ద్వారా అడ్డుతగిలారని.. కాబట్టి పన్నీర్‌సెల్వం ఇకపై అన్నాడీఎంకే పార్టీ కో ఆర్డినేటర్ కొనసాగే అర్హత లేదని పళనిస్వామి ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు.. స్థానిక ఎన్నికలకు సంబంధించి.. అభ్యర్థుల పేర్లతో ఓపీఎస్ పంపిన లేఖను సైతం పళనిస్వామి పక్కనపెట్టారు. గడువు ముగిశాక పంపిన పేర్లను పరిశీలించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు పళనిస్వామి. ఇదిలా ఉంటే.. పళనిస్వామి పంపిన లేఖలో తనను తాను పార్టీ హెడ్‌క్వార్టర్స్ సెక్రటరీగా పేర్కొనగా.. ఓపీఎస్‌ను కోశాధికారిగా(ట్రెజరర్) ప్రస్తావించారు. కిందటి ఏడాది ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికలో పన్నీర్ సెల్వంను కో-ఆర్డినేటర్‌గా, పళనిస్వామిని జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎనుకున్నారు. అయితే పళనిస్వామి పార్టీ అధికారం అంతా ఒకరి చేతుల్లోనే ఉండాలని వాదిస్తుండగా, పన్నీర్‌సెల్వం మాత్రం పాత విధానం కొనసాగాలని డిమాండ్ చేస్తున్నాడు. -
అర్ధరాత్రి హైడ్రామా.. పన్నీర్ సెల్వంకు భారీ ఊరట
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో వర్గ పోరు పంచాయితీ మరోసారి న్యాయస్థానాన్ని చేరింది. అయితేసారి జరిగిన అర్ధరాత్రి హైడ్రామాలో పళనిస్వామికి ఝలక్ తగిలింది. అధికారం ఒక్కరి చేతుల్లోనే ఉండాలన్న తీర్మానంపై చర్చ మాత్రమే జరగొచ్చని అయితే.. ఆ తీర్మానంపై ఆమోదించడం లాంటి నిర్ణయం తీసుకోకూడదని డివిజన్ బెంచ్ ఆదేశించింది. దీంతో పన్నీర్‌సెల్వం వర్గానికి భారీ ఊరట లభించినట్లు అయ్యింది. జూన్ 23న(ఇవాళ) అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ భేటీ వెంకటాచలపతి ప్యాలెస్‌లో నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో.. సమావేశంలోనే అధికారం ఒక్కరి చేతిలోనే ఉండాలని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ కో-కోఆర్డినేటర్ పళనిస్వామి(EPS) తీర్మానం చేయాలనుకున్నాడు. అయితే.. మాజీ డిప్యూటీ సీఎం.. పార్టీ కోఆర్డినేటర్ పన్నీరుసెల్వం ఆ నిర్ణయాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ జరపకుండా నిలువరించాలని పోలీసులకు ఫిర్యాదుతో పాటు కోర్టుకు చేరింది ఈ వర్గపోరు పంచాయితీ. అయితే.. మద్రాస్ హైకోర్టు భేటీని, తీర్మానాలు చేయకుండా ఆపేలా పార్టీని ఆదేశించలేమని, అది పూర్తిగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే దీనిపై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది పన్నీర్ సెల్వం వర్గం. జనరల్ కౌన్సిల్ సభ్యుడు షణ్ముగం అభ్యర్థనతో అర్ధరాత్రిపూట మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ న్యాయమూర్తి ఎం దురై స్వామి ఇంట్లో వాదనలు నడిచాయి. ఈ విచారణకు జస్టిస్ సుందర్ మోహన్ సైతం హాజరయ్యారు. వాదనల అనంతరం మద్రాస్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తూ.. ముందుగా ప్రకటించిన 23 తీర్మానాలపై మాత్రం అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ఇతర వ్యవహారాలపై చర్చ మాత్రమే జరగాలని పేర్కొంది. దీంతో ఇవాళ భేటీ జరుగుతుండగా.. ఒక్కరి చేతిలోనే అన్నాడీఎంకే పగ్గాలు ఉండాలన్న పళనిస్వామి తీర్మానానికి ఆమోదం లభించడం కుదరదనే చెప్పాలి. Chennai, Tamil Nadu | AIADMK workers, leaders gather at Shrivaaru Venkatachalapathy Palace, Vanagaram for party's General Council meeting to be held today. pic.twitter.com/9lnaL8OJvD — ANI (@ANI) June 23, 2022 చదవండి: ‘డమ్మీ రాష్ట్రపతి’గా ద్రౌపది ముర్ము.. తీవ్ర ఆరోపణలు -
Tamil Nadu: పెత్తనం.. పళనిదే!
అడ్డొచ్చిన పన్నీరుకు కన్నీరు తెప్పిస్తూ పార్టీపై పట్టు నిలుపుకుంటూ.. అన్నాడీఎంకేలో తొలి స్థానం తనదేనని.. మాజీ సీఎం పళనిస్వామి నిరూపించారు. పన్నీర్ వద్దు.. పళనే ముద్దు అంటూ ఎమ్మెల్యేల ఆమోదం పొంది.. ప్రధాన ప్రతిపక్ష నేత పాత్రను పోషించేందుకు సిద్ధమయ్యారు. ఫలితంగా అన్నా ద్రవిడ మున్నే ట్ర కలగంలో నాయకత్వ స్థానంపై ఇన్నాళ్లూ నెలకొన్న ఊగిసలాటకి తెరపడినట్లయ్యింది. సాక్షి ప్రతినిధి, చెన్నై : రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కోసం హోరాహోరీగా నడిచిన రాజకీయ పోరులో చివరికి ఎడపాడి పళనిస్వామి పైచేయి సాధించారు. అన్నాడీఎంకే సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వల్ల తలెత్తిన అడ్డంకిని ఆయన విజయవంతంగా అధిగమించారు. తమిళనాడు అసెంబ్లీకి ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే ఘనవిజయం సాధించి అధికారంలోకి రాగా, అన్నాడీఎంకే 65 స్థానాల్లో గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే శాసనసభపక్ష నేత (ప్రధాన ప్రతిపక్ష నేత)ను ఎన్నుకునే నిమిత్తం ఈనెల 7న ఎమ్మెల్యేలు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమయంలో పార్టీ సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, ఉప సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి మధ్య వివాదం నెలకొంది. అగ్రనేతల అనుచరులు సైతం పార్టీ కార్యాలయం ప్రాంగణంలో వాగ్యుద్దానికి దిగారు. పన్నీర్‌సెల్వం మద్దతుదారులు కనీసం ఎడపాడి కారును కూడా పార్టీ కార్యాలయంలోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. దీంతో కొందరు సీనియర్ నేతలు కలుగజేసుకుని ఇద్దరి కార్లను ఒకవైపు పెట్టించారు. అనంతరం ప్రధాన ప్రతిపక్ష హోదా తనకంటే తనకని.. పోటీపడి వాగ్వాదానికి దిగడంతో సమావేశం 10వ తేదీకి వాయిదాపడింది. అయితే 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రాష్ట్రంలో పూర్తి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ సమావేశాలు మినహా మరేమీ జరుపుకునేందుకు వీలులేదు. అయితే షెడ్యూలు ప్రకారం సమావేశం ఏర్పాటుకు అనుమతించాల్సిందిగా కోరుతూ పార్టీ మాజీ ఎంపీ, జిల్లా కార్యదర్శి ఎన్. బాలగంగ డీజీపీ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. కరోనా ఆంక్షలు అను సరించి కార్యకర్తలకు ప్రవేశం లేకుండా కేవలం ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించుకునేందుకు అనుమతి కోరినట్లు బాలగంగ మీడియాకు తెలిపా రు. పోలీస్‌శాఖ సైతం అనుమతివ్వడంతోపాటూ పార్టీ కార్యాలయం వద్ద 50 మందితో బందోబస్తు కల్పించింది. వీరుగాక సాధారణ పోలీసులు లాఠీలతో పహారాకాశారు. దీంతో పార్టీ కార్యాలయ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. సోమవారం ఉదయం చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యా లయం ఎడపాడి, పన్నీర్‌సెల్వంలతోపాటూ వారి ద్దరి మద్దతుదారులు, ఎమ్మెల్యేలు చేరుకోగా 9.30 గంటలకు సమావేశం ప్రారంభమైంది. మొత్తం 65 మంది ఎమ్మెల్యేల్లో 61 మంది ఎడపాడికి మద్దతు పలికారు. కొంగుమండలం, మధ్యమండలం, దక్షిణ జిల్లాల ఎమ్మెల్యేలతోపాటూ ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు కూడా ఎడపాడినే సమర్థించారు. అన్నాడీఎంకే అభ్యర్థుల గెలుపుకోసం అన్ని నియోజకవర్గాల్లో పర్యటించిన ఏకైక వ్యక్తి ఎడపాడి అని.. ప్రధాన ప్రతిపక్ష నేత పదవికి ఆయనే అర్హుడని సీనియర్ నేతలు పేర్కొన్నారు. అయితే బీజేపీ అధిష్టానం మద్దతుతోపాటూ పార్టీ సమన్వయకర్తగా ఉన్న పన్నీర్‌సెల్వమే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండటం సమంజసమని ఆయన మద్దతుదారులు వాదనకు దిగారు. 61 మంది ఎమ్మెల్యేలు ఎడపాడిని కోరుకున్నందున ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయనకేనని మరో వర్గం వాదించింది. పార్టీని సమర్థంగా నడిపించే బాధ్యతలను కొనసాగించాలని ఎడపాడి మద్దతుదారులు చేసిన సూచనకు పన్నీర్‌సెల్వం సమ్మతించినట్లు సమాచారం. అనేక తర్జనభర్జనల అనంతరం ఎట్టకేలకూ ఎడపాడి పళనిస్వామి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఈ వెంటనే ఎడపాడి మద్దతుదారు లు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అసంతృప్తికి లోనైన పన్నీర్‌సెల్వం సమావేశం నుంచి అందరికంటే ముందుగా బయటకు వచ్చి ఇంటికి వెళ్లిపోయారు. అనంతరం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎడపాడి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పన్నీ ర్, ఎడపాడి సంతకాలతో కూడిన ప్రకటనను పార్టీ కార్యాలయం విడుదల చేసింది. బీజేపీ శానసభా పక్షనేతగా నైనార్ నాగేంద్రన్ ఎంపికయ్యారు. పుదుచ్చేరి ప్రధాన ప్రతిపక్ష నేతగా శివ.. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీలో డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యే శివ ఎంపికయ్యారు. ఆయనే ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్–బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి 16 స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చింది. డీఎంకే–కాంగ్రెస్ కూటమి 6 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్నికల ముందు వరకు అధికారంలో ఉండిన కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో పోటీ చేసి కేవలం రెండు స్థానాల్లో గెలవడంతో ఆపార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా అందుకోలేక పోయింది. చదవండి: కరోనా పరిస్థితులు చక్కబడ్డాకే కాంగ్రెస్‌కు కొత్త చీఫ్ -
నాన్ స్టాప్‌గా చిన్నమ్మ రాజకీయం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ రాజకీయాలకు రాంరాం చెప్పేశారు. అస్త్ర సన్యాసం తీసుకున్న తరువాత ఆధ్యాత్మిక పర్యటనలో మునిగిపోయారు. కానీ, అన్నాడీఎంకేపై న్యాయస్థానంలో ఆమె సాగిస్తున్న ఆధిపత్య పోరు కొనసాగడం ఆశ్చర్యకరం. జయలలిత జీవించి ఉన్నంత వరకు నీడలా ఆమె వెన్నంటి ఉండిన శశికళ ఆ తరువాత ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. అంతా జయను పోలినట్లుగా చీరకట్టు, నుదుటన బొట్టు, పాద నమస్కారాలు, ఆశీర్వచనాలతో ప్రారంభమైన చిన్నమ్మ వైభవం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునే వరకు సాగింది. జయ మరణించిన సమయంలో ముఖ్యమంత్రిగా ఉండిన పన్నీర్‌సెల్వంను బలవంతంగా బాధ్యతల నుంచి తప్పించి సీఎం సీటును అధిరోహించడమే తరువాయి అనే స్థితిలో చిన్నమ్మ జైలు పాలయ్యారు. కథ అడ్డం తిరగడంతో జైలు కెళ్లే ముందు తన ప్రియశిష్యుడైన ఎడపాడి పళనిస్వామిని తనకు బదులుగా శాసనసభాపక్ష నేత (సీఎం)ను చేశారు. అలాగే తన అన్న కుమారుడు టీటీవీ దినకరన్‌ను అన్నాడీఎంకే ఇన్చార్జ్గా నియమించారు. పార్టీ, ప్రభుత్వం రెండునూ పరోక్షంగా తన చెప్పుచేతుల్లో ఉన్నాయనే సంతృప్తితో జైలు జీవితం ప్రారంభించారు. అయితే, తన చేత బలవంతంగా సీఎం పదవికి రాజీనామా చేయించిన శశికళపై తిరుగుబాటు చేసిన పన్నీర్‌సెల్వం అనతికాలంలోనే ఎడపాడితో చేతులు కలిపారు. ఇద్దరూ కలిసి టీటీవీ దినకరన్‌ను పార్టీ నుంచి సాగనంపారు. శశికళ, దినకరన్‌లను బహిష్కరిస్తూ అన్నాడీఎంకే జనరల్ బాడీ సమావేశంలో తీర్మానాలు చేశారు. అన్నాడీఎంకేను కైవసం చేసుకునేందుకు శశికళ, దినకరన్ న్యాయస్థానంలో జరిపిన విఫలమైంది. పార్టీ కోసం పట్టుబట్టి.. రాజకీయాలు విడిచిపెట్టి ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష ముగించుకుని జైలు నుంచి విడుదలైన శశికళ అన్నాడీఎంకే తన చేతుల్లోకి వచ్చేస్తుందని ఆశించారు. అది జరగకపోవడంతో అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించి అన్నాడీఎంకేను దెబ్బతీయాలని నిర్ణయించుకున్నారు. అనేక రకాలుగా పావులు కదిపారు. అయితే అన్నాడీఎంకే–బీజేపీ కూటమి సీట్ల సర్దుబాటులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు శశికళ అధికారికంగా ప్రకటించి అందరికీ షాకిచ్చారు. జయలలిత ఎంతగానే ప్రేమించిన అన్నాడీఎంకేను దెబ్బతీయడం, అమ్మ తీవ్రంగా ద్వేషించిన డీఎంకేకు సహకరించడమే అవుతుందనే ఆలోచనతో రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు శశికళ స్పష్టం చేశారు. అంతటితో ఆమె ఆగలేదు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న రోజుల్లో ఆధ్యాత్మిక బాటపట్టారు. రాష్ట్రంలోని ఆలయాలను సందర్శిస్తూ కాలం గడిపారు. కోర్టులో కొనసాగుతున్న పోరు: అయితే, రాజకీయ అస్త్రసన్యాసం తీసుకున్నా అన్నాడీఎంకేపై ఆమె పోరు కొనసాగిస్తూనే ఉండడం గమనార్హం. న్యాయస్థానం సాక్షిగా ఈ విషయాన్ని నమ్మక తప్పదు. ఆదాయానికి మించిన ఆస్తు కేసులో శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో 2017 సెప్టెంబర్ 12న అన్నాడీఎంకే జనరల్ బాడీ సమావేశం జరిగింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ, నిర్వాహకునిగా టీటీవీ దినకరన్‌లను గత సమావేశంలో ఎన్నుకోవడం చెల్లదని పేర్కొంటూ తీర్మానం చేశారు. ఈ తీర్మానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన శశికళ, దినకరన్ సదరు జనరల్ బాడీ సమావేశం చెల్లదని ప్రకటించాల్సిందిగా మద్రాసు సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. అంతేగాక ఆనాటి సమావేశంలో చేసిన 12 తీర్మానాలు చెల్లవని ప్రకటించాలని కోరారు. ఇదిలాఉండగా, తాను అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంను స్థాపించి పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నందున ఈ కేసు నుంచి తప్పుకుంటున్నట్లు టీటీవీ దినకరన్ కోర్టుకు తెలిపాడు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన శశికళ ఈ కేసును మాత్రం వెనక్కి తీసుకోలేదు. ఇదే సమయంలో శశికళ కేసును కొట్టి వేయాలని కోరుతూ అన్నాడీఎంకే తరఫున మరో పిటిషన్ దాఖలైంది. అన్నాడీఎంకే వేసిన పిటిషన్‌కు బదులివ్వాల్సిందిగా న్యాయస్థానం గత విచారణ సమయంలో శశికళను కోరింది. ఈ కేసు శుక్రవారం విచారణకు రాగా, న్యాయమూర్తి సెలవుపై ఉన్నందున జూన్ 18వ తేదీకి వాయిదావేశారు. శశికళ వైఖరి ఏమిటో వాయిదా తేదీ విచారణ వరకు వేచిచూడాల్సిందే. -
రైల్లో లైంగికదాడి; సీఎం పళనికి మద్రాస్ హైకోర్టు నోటీసులు
సాక్షి, చెన్నై: సీఎం పళనిస్వామికి మద్రాసు హైకోర్టు నోటీసు జారీ చేసింది. సీఎంపై డీఎంకే నేత సూళూరు ఎ. రాజేంద్రన్ పరువు నష్టం దావా వేయడంతో కోర్టు స్పందించింది. ప్రతిపక్షాల నేతలు సీఎంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే చాలు ప్రభుత్వ తరఫు న్యాయవాదులు చటుక్కున కోర్టుల్లో పరువునష్టం దావాలు వేయడం జరుగుతూ వచ్చింది. అయితే, ఈ సారి పరిస్థితి భిన్నం అన్నట్టుగా సీఎం పళనిస్వామిపై డీఎంకే నేత రాజేంద్రన్ దావా వేయడం చర్చకు దారితీసింది. ఎన్నికల ప్రచారంలో కోయంబత్తూరు వేదికగా సీఎం పళనిస్వామి రాజేంద్రన్‌ను టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైలులో ఓ యువతిపై లైంగిక దాడి యత్నం చేశాడని ఆరోపించారు. దీనిని రాజేంద్రన్ తీవ్రంగా పరిగణించారు. తాను చేయని నేరాన్ని, తనపై వేస్తూ, పరువుకు భంగం కల్గించే రీతిలో సీఎం వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దావా వేశారు. నోటీసులు.. ఇటీవల తాను రైలులో పయనిస్తున్న సమయంలో అత్యవసరంగా మూత్ర విసర్జన నిమిత్తం పై బెర్త్ నుంచి కింది బెర్త్‌కు దిగాల్సి వచ్చిందని, ఆ సమయంలో కింద ఉన్న యువతిపై జారిపడ్డానని ఆ దావాలో వివరించారు. తనకు మధుమేహం ఉందని, అందుకే మూత్ర విసర్జన కోసం అత్యవసరంగా పరుగులు తీశానని, అయితే, తానేదో అసభ్యకరంగా ప్రవర్తించినట్టుగా భావించిన ఆ యువతి పోలీసులకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ఆ తర్వాత తన పరిస్థితిని ఆ యువతికి వివరించినానంతరం ఆమె శాంతించారని గుర్తు చేశారు. అయితే హఠాత్తుగా తనపై పదిహేను రోజుల అనంతరం పోలీసులు కేసు పెట్టారని, ఈ వ్యవహారంలో కోర్టు సైతం తనకు క్లీన్చిట్ ఇచ్చినట్టు వివరించారు. అయితే, ఎన్నికల సమయంలో తానేదో రైలులో లైంగిక దాడి యత్నం చేసినట్టుగా సీఎం ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం తన పరువుకు భంగం కల్గించే రీతిలో ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. కోటి నష్టపరిహారం కోరుతూ సీఎం పళనిస్వామికి దావా ద్వారా నోటీసులు ఇచ్చారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి పార్థిబన్ నేతృత్వంలోని బెంచ్ ముందు గురువారం విచారణకు వచ్చింది. వాదనల అనంతరం సీఎం పళనిస్వామికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదే వ్యవహారంలో మంత్రి ఎస్పీ వేలుమణిపై కూడా రాజేంద్రన్ దావా వేశారు. చదవండి: ‘కొడుకు పెళ్లైనప్పటి నుంచీ విడిగానే.. మాకు సంబంధం లేదు’ -
మళ్లీ గండం.. బంగాళాఖాతంలో ద్రోణి..
సాక్షి, చెన్నై: బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. నివర్ తుపాన్ రూపంలో కుండపోతగా కురిసిన వర్షాలకు ఇప్పటికే అనేక జిల్లాల్లో జలాశయాలు, చెరువులు పూర్తిగా నిండాయి. ఉబరి నీటి విడుదల సాగుతోంది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కగా, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. చెన్నై శివార్లలో అనేక చోట్ల నీటిని తొలగించినా, కొన్ని చోట్ల మాత్రం కష్టతరంగా మారింది. దీంతో తాంబరం పరిసరవాసులు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి. ఇక్కడికి భారీ మోటార్ల ద్వారా నీటిని తరలించేందుకు చర్యల్ని అధికారులు చేపట్టారు. నివర్ రూపంలో రైతులకు నష్టాలు ఎక్కువే. చేతికి పంట అంది వచ్చే సమయంలో వరదలు ముంచెత్తడంతో కన్నీళ్లు తప్పడం లేదు. దీంతో నష్ట పరిహారం చెల్లింపునకు తగ్గ చర్యల్ని వేగవంతం చేయాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పనిలో పడ్డాయి. ఇందుకు తగ్గ చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టే పనిలో పడింది. ప్రస్తుతం నీట మునిగిన ప్రాంతాలలో భవిష్యత్తులో మరో ముప్పు ఎదురుకాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని శనివారం ఆయా జిల్లాల కలెక్టర్లను సీఎం పళనిస్వామి ఆదేశించారు. ప్రధానంగా తాంబరం పరిసరాలపై తొలుత దృష్టి పెట్టనున్నారు. నివర్ ప్రభావం కారణంగా మరణించిన కుటుంబాలకు రూ. 12 లక్షలు సాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో, సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయో అని ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. వరద బాధిత ప్రాంతాల్లో పోలీసుల పాత్రపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నైలో కొన్ని ప్రాంతాల్లో వెయ్యి మందిని తమ భుజాలపై వేసుకుని మరీ సురక్షిత ప్రాంతాలకు పోలీసులు తరలించడం అభినందనీయం. చదవండి: (బుల్లెట్‌కి బలయ్యే అవకాశమివ్వండి) సాగరంలో ద్రోణి.. నివర్ సహాయక చర్యలు సాగుతున్న నేపథ్యంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం శనివారం మధ్యాహ్నం బయలుదేరింది. దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో నెలకొన్న ఈ ద్రోణి వాయుగుండంగా మారి, తుపాన్‌గా అవతరించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ ద్రోణి పశ్చిమ దిశలో పయనిస్తుండడంతో రాష్ట్రంలోని సముద్రతీర జిల్లాల్లో ఆదివారం నుంచి వర్షాలు పడనున్నాయి. ఇది తుపాన్‌గా మారనున్న దృష్ట్యా, దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ద్రోణి తుపాన్‌గా మారినానంతరం డెల్టా జిల్లాల వైపు లేదా, దక్షిణ తమిళనాడు వైపు దూసుకొచ్చేనా అన్నది వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి దక్షిణ తమిళనాడు, సముద్రతీర జిల్లాల్లో ఆదివారం నుంచి తేలిక పాటి వర్షం మొదలై, క్రమంగా పెరుగుతోంది. డిసెంబర్ ఒకటి, రెండు, మూడు తేదీల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో దక్షిణ తమిళనాడు, డెల్టా జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు అధికారయంత్రాంగం సిద్ధమైంది. జాలర్లు వేటకు దూరంగా ఉండాలన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్రంలో గాలి వేగం గంటకు 55 కి.మీ వరకు ఉండవచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో మేట్టుపట్టిలో 9 సె.మీ, అవినాశిలో 8 సె.మీ, చోళవందాన్, వాడి పట్టిలో 7 సె.మీ మేరకు వర్షం పడింది. బురేవి తర్వాత మరో తుపాన్‌కు అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. చదవండి: (మానవత్వంతో ఆదుకోండి) రూ. వంద కోట్లు ఇవ్వండి.. పుదుచ్చేరి, రాష్ట్రంలోని నివర్ బాధిత ప్రాంతాల్లో ఏ మేరకు నష్టం జరిగిందో పరిశీలించి కేంద్రానికి నివేదిక సమర్పించేందుకు ఢిల్లీ నుంచి సోమ వారం ప్రత్యేక బృందం చెన్నైకు రానుంది. దీంతో నష్టం నివేదిక తయారీకి అధికారులు పరుగులు తీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నివర్ రూపంలో పుదుచ్చేరికి రూ. 400 కోట్లు నష్టం జరిగినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణస్వామి శనివారం ప్రకటించారు. అధికారులతో సమావేశానంతరం నష్టం తీవ్రతను పరిగణించి, సహాయక చర్యల కోసం రూ. 100 కోట్లు తక్షణం కేటాయించాలని ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేస్తూ ఆయన లేఖ రాశారు. -
విషమంగా వ్యవసాయశాఖ మంత్రి ఆరోగ్యం
సాక్షి, చెన్నై: వ్యవసాయ మంత్రి దురైకన్ను(72) ఆరోగ్యం క్షీణించింది. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు తీవ్రచికిత్స అందిస్తున్నారు. సీఎం పళనిస్వామి, మంత్రులు సోమవారం పరామర్శించారు. దురైకన్ను ఈ నెల 13న కారులో సేలంకు వెళుతుండగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో విల్లుపురం ముండియంబాక్కం ఆస్పత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుగా తేల్చారు. క్రమంగా పల్స్ తగ్గడంతో హుటాహుటిన చెన్నైకు తరలించారు. (ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్) ప్రైవేటు ఆస్పత్రిలో రెండు వారాలుగా చికిత్స అందిస్తున్నారు. సోమవారం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. సీఎం పళనిస్వామి, మంత్రులు జయకుమార్, విజయభాస్కర్, తంగమణి, వేలుమణి, సీవీ షణ్ముగం వేర్వేరుగా ఆస్పత్రికి వెళ్లి దురైకన్నును పరామర్శించారు. వైద్య బృందాలతో సీఎం పళనిస్వామి మాట్లాడారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఎక్మో చికిత్స అందిస్తున్నామని.. పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. -
ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్
సాక్షి, చెన్నై: కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రకటించారు. అందుకయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. కరోనా వైరస్ పరిస్థితులను సమీక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సీఎం ఎడపాడి పుదుక్కోట్టైలో అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం గురువారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ కరోనా ప్రభావం ప్రజలను భయాందోళనకు గురిచేసిందని, వేల సంఖ్యలో పాజిటివ్‌కు గురికాగా, మరెందరో ప్రాణాలు కూడా కోల్పోయారని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల కరోనా చాలా వరకు తగ్గుముఖం పట్టిందని తెలిపారు. వైరస్ మహమ్మారి పూర్తిగా నశించిపోయే వరకు అహర్నిశలు పాటుపడతామని, కరోనా సోకకుండా వ్యాక్సిన్‌పై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది చివర్లోగా వ్యాక్సిన్ మార్కెట్లో విడుదల అవతుందని ఆశిస్తున్నామన్నారు. ఆశుభ ఘడియ రాగానే ప్రభుత్వమే పూర్తి ఖర్చును భరించి రాష్ట్ర ప్రజలందరికీ పూర్తి ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని చెప్పారు. చెన్నై ఎయిర్‌పోర్టులో శాశ్వత కరోనా కేంద్రం కరోనా భయం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో చెన్నై విమానాశ్రయంలో శాశ్వత కరోనా పరీక్షా కేంద్రాన్ని నెలకొల్పనున్నారు. వందే భారత్ విమానాలు మినహా విదేశాల నుంచి విమానాల రాకపోకలు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే స్వదేశంలో నలుమూలలకు విమానాలు నడుపుతున్నారు. రైళ్ల సౌకర్యం ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకపోవడంతో సగటున రోజుకు 17 వేల మందికి పైగా ప్రయాణికులు విమానాలపైనే ఆధారపడుతున్నారు. అయితే ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో విమానాశ్రయంలో భౌతికదూరం మృగ్యమైంది. శుక్రవారం 172 విమానాలు సేవలందించగా సెక్యూరిటీ చెకింగ్‌కు ఒకే ఒక కౌంటర్ పెట్టడంతో కిక్కిరిసిన విధానంలో ప్రయాణికులు బారులుతీరడం కరోనా వైరస్ వ్యాప్తికి దారితీస్తుందనే భయపడుతున్నారు. ఇదిలా ఉండగా, విదేశీ విమానాల పునరుద్ధరణ జరిగేలోగా ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో శాశ్వత ప్రాతికపదికన కరోనా వైరస్ పరీక్షా కేంద్రాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ ఏర్పాటు చేయనుంది. విదేశీ, స్వదేశీ విమానాల్లో వచ్చే ప్రయాణికులను ఈ కేంద్రంలో పరీక్షలు చేసి నగరంలోకి అనుమతిస్తారని తెలుస్తోంది. లోకల్ రైళ్లకు అనుమతివ్వండి.. కేంద్రానికి సీఎం లేఖ లాక్‌డౌక్ కారణంగా మార్చి 24వ తేదీ నుంచి నిలిచిపోయిన ఎలక్ట్రిక్ లోకల్ రైళ్ల సేవల పునరుద్ధరణకు అనుమతి ఇవ్వాలని సీఎం ఎడపాడి రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు శుక్రవారం ఉత్తరం రాసారు. తమిళనాడు రాష్ట్రం నుంచి దక్షిణరైల్వే వివిధ రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోందని, అయితే వివిధ వర్గాల ప్రజలు విధులకు హాజరయ్యేందుకు ఎంతో అనుకూలమైన లోకల్ రైళ్లు మాత్రం ఇంకా నడవడం లేదని తెలిపారు. లాక్డౌన్ సడలింపులతో బస్సు సేవలు కూడా అందుబాటులోకి వచ్చినందున లోకల్ రైళ్లను అనుమతించాలని సీఎం కోరారు. చెన్నైలో ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉండిన మెట్రోరైలు సేవలను 11 గంటల వరకు పొడిగించారు. -
జల్లికట్టు ఎద్దుకు విగ్రహం
సాక్షి, చెన్నై: తమిళనాట సాహసక్రీడ జల్లికట్టుకు ప్రత్యేక గౌరవాన్ని కల్పిస్తూ పుదుకోట్టైలో విగ్రహాన్ని ప్రతిష్టించారు. జల్లికట్టు ఎద్దు పొగరును క్రీడాకారుడు అణగదొక్కే రీతిలో రూపొందించిన ఈ విగ్రహాన్ని గురువారం సీఎం పళనిస్వామి ఆవిష్కరించారు. సీఎం పళనిస్వామి పుదుకోట్టై పర్యటన నిమిత్తం ఉదయం చెన్నై నుంచి తిరుచ్చికి విమానంలో వెళ్లారు. అక్కడి విమానాశ్రయంలోమంత్రులు వెల్లమండి నటరాజన్, వలర్మతి, విజయభాస్కర్, తిరుచ్చి కలెక్టర్ శివరాజ్ సీఎంకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పుదుకోట్టైకు సీఎం పయనం అయ్యారు. (పది రోజుల్లో చిన్నమ్మ విడుదల!) విరాళిమలైలో ఐటీసీ సంస్థ ఆహార ఉత్పత్తి పరిశ్రమల విస్తరణ పనుల్ని ప్రారంభించారు. అనంతరం విరాళిమలై కామరాజ నగర్ జంక్షన్లో జల్లికట్టు ఎద్దు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇటీవల పుదుకోట్టై జిల్లాలో 110 చోట్ల జరిగిన జల్లికట్టు గిన్నిస్ రికార్డులోకి ఎక్కడంతో, ఆ గుర్తింపుతో పాటు జల్లికట్టు ఎద్దుకు, క్రీడాకారుడికి గౌరవాన్ని కల్పించే విధంగా విగ్రహాన్ని ప్రతిష్టించారు. రంకెలేస్తున్న ఎద్దును లొంగదీసుకునే క్రీడాకారుడి రూపంలో ఈ విగ్రహాన్ని కొలువుదీర్చారు. ఈ సందర్భంగా బారులు తీరిన జల్లికట్టు ఎద్దులను సీఎం పరిశీలించారు. ఆ ఎద్దుల ముక్కుతాడు పట్టుకున్నారు. ఎడ్లబండిలోకి ఎక్కి, తోలుకుంటూ ముందుకు సాగారు. అక్కడే జరిగిన రైతుల సమస్యల పరిష్కార కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. రైతుగా రైతు కష్టాలు తనకు తెలుసునని పేర్కొంటూ, పుదుకోట్టై వాసుల కల త్వరలో సాకారం అవుతుందని ప్రకటించారు. కావేరి – వైగై – గుండారుల అనుసం«ధానం త్వర లో జరిగి తీరుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో జరిగిన కరోనా, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమీక్షకు సీఎం హాజరయ్యారు. -
సీఎం పళనిస్వామిని పరామర్శించిన ఆర్కే రోజా
సాక్షి, చెన్నై: సీఎం పళనిస్వామిని వైఎస్సార్ సీపీ నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా పరామర్శించారు. సీఎం ఎడపాడి తల్లి తవసాయమ్మ గతవారం అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో సీఎంను పరామర్శించి, సానుభూతి తెలియజేయడానికి రాజకీయాలకు అతీతంగా నేతలు గ్రీన్‌వేస్ రోడ్డులోని పళనిస్వామి ఇంటికి వెళ్లి వస్తున్నారు. మంగళవారం ఎండీఎంకే నేత వైగో, సీపీఐ నేత ముత్తరసన్, సినీ నటి, బీజేపీ నేత కుష్బూ, డీఎండీకే నేత సుధీప్, సినీ నిర్మాత ఆర్బీ చౌదరి పళనిస్వామిని కలిసి సానుభూతి తెలిపారు. ముందుగా భర్త ఆర్కే సెల్వమణితో కలసి రోజా అక్కడకు వచ్చారు. తవసాయమ్మ చిత్ర పటం వద్ద పుష్పాంజలి ఘటించారు. కొంతసేపు పళనిస్వామితో మాట్లాడి తన సానుభూతి తెలియజేశారు. వీరులకు వందనం.... సాయంత్రం డీజీపీ కార్యాలయ ఆవరణలో పోలీసు అమరవీరులకు వందనం సమర్పించే కార్యక్రమం జరిగింది. బుధవారం పోలీసు సంస్మరణ దినోత్సవం. ఈసందర్భాన్ని పురష్కరించుకుని ఇప్పటి వరకు విధుల్లో అమరులైన పోలీసుల పేర్లు, వివరాలను పొందు పరుస్తూ డీజీపీ కార్యాలయం ఆవరణలో శిలాఫలకాన్ని రూపొందించారు. దీనిని సీఎం పళనిస్వామి ఆవిష్కరించారు. అలాగే, అక్కడ ఓ మొక్కను నాటారు. డీజీపీ కార్యాలయంలో పోలీ సుల అధికారులతో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం, మంత్రులు జయకుమార్, ఎస్పీ వేలుమణి, హోంశాఖ కార్యదర్శి ప్రభాకర్, డీజీపీ త్రిపాఠి, చెన్నై పోలీసుకమిషనర్ మహేశ్‌కుమార్ అగర్వాల్ పాల్గొన్నారు. -
సీఎంని పరామర్శించిన ఎంకే స్టాలిన్
సాక్షి, చెన్నై : సేలం నుంచి సోమవారం ఉదయం చెన్నై చేరుకున్న సీఎం పళనిస్వామిని పలువురు నేతలు పరామర్శించారు. సీఎం పళనిస్వామి తల్లి తవసాయమ్మ గత వారం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. దీంతో వారం రోజులుగా సీఎం సేలంలోనే ఉన్నారు. సోమవారం చెన్నై వచ్చిన సీఎంను పరామర్శించేందుకు నేతలు గ్రీన్ వేస్ రోడ్డుకు ఉదయాన్నే చేరుకున్నారు. తవసాయ మ్మ చిత్ర పటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ప్రధాన కార్యదర్శి దురై మురుగన్, సీనియర్ నేత పొన్ముడి తదితరులు పళనిస్వామికి సానుభూతి తెలియజేశారు. గతంలో అన్నాడీఎంకేకు చెందిన ముఖ్యులు ఎవరైనా మరణించినా డీఎంకే వారు వెళ్లే వారు కాదు. అన్నాడీఎంకే వారి పరిస్థితి కూడా అంతే. జయలలిత, కరుణానిధి మరణంతో రెండు పారీ్టల నేతలు పరామర్శించుకోవడం మొదలుపెట్టారు. (జయలలిత మరణంపై అనుమానాలు: స్టాలిన్) ప్రస్తుతం సీఎం పళనిస్వామిని పరామర్శించి స్టాలిన్ తన రాజకీయ నాగరికతను చాటుకున్నారు. ముందుగా మంత్రులు జయకుమార్, కడంబూరు రాజు, కామరాజ్, కేసి వీరమణి, విజయ భాస్కర్, కేటి రాజేంద్ర బాలాజీ తదితరులు సీఎంను పరామర్శించారు. సాయంత్రం గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్, సినీ నటుడు విజయ్ సేతుపతి సీఎంను పరామర్శించారు. సానుభూతి తెలియజేశారు. -
పార్టీ విజయానికి సమష్టిగా పనిచేద్దాం
సాక్షి, చెన్నై: పార్టీ ప్రస్థానంలో వచ్చే ఏడాది ఎంతో ముఖ్యమైందని, అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించడం ద్వారా చరిత్ర సృష్టిద్దామని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్, పన్నీర్‌సెల్వం, కో–కన్వినర్ ఎడపాడి పళనిస్వామి పార్టీ శ్రేణులకు శుక్రవారం లేఖ రాశారు. అన్నాడీఎంకే 49వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శనివారం జరుపుకోనున్న సందర్భంగా వారిద్దరూ రాసిన లేఖలోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘ప్రాణాల కంటే మిన్నగా కాపాడుకుంటూ వస్తున్న మన పార్టీ 48 ఏళ్లు పూర్తి చేసుకుని 49 సంవత్సరంఅడుగుపెడుతోందని తెలిపారు. వచ్చే ఏడాది అన్నాడీఎంకే పార్టీ స్వర్ణోత్సవం జరుపుకోనుందని పేర్కొన్నారు. ఈ ఏడాది మనం చేసే కార్యక్రమాలన్నీ స్వర్ణోత్సవాల ప్రారంభంగా ఉండాలని ప్రేమ పూర్వకంగా కోరుకుంటున్నామని తెలిపారు. పురట్చి తలైవర్ ఎంజీ రామచంద్రన్ సేవలను ఒక్కసారి గుర్తుచేసుకోవాలని చెప్పారు. అన్నాదురై మరణం తరువాత ఏర్పడిన ప్రభుత్వం, కొత్తగా పార్టీ పగ్గాలు చేపట్టిన వ్యక్తి ద్రవిడ పార్టీ లక్ష్యాలను విస్మరించి స్వప్రయోజనాలు, అధికారానికి వాడుకున్నారని తెలిపారు. (కాంగ్రెస్ మునిగే నౌక అని తెలిసినా.. : కుష్బూ) ఇలాంటి దుష్టశక్తుల చేతిలో చిక్కుకున్న రాష్ట్రాన్ని కాపాడేందుకే 1972 అక్టోబర్ 17వ తేదీన అన్నాడీఎంకే ఆవిర్భవించిందని, అధికారాన్ని చేపట్టి ఎంజీఆర్ నేతృత్వంలో ప్రజావసరాలను తీర్చిందని తెలిపారు. తమిళనాడులో సరికొత్త చరిత్రను సృష్టించిందని చెప్పారు. ఆయన తరువాత పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలిత ఎంజీఆర్ చూపిన మార్గంలో ప్రజల మన్ననలు పొందారు. వారిద్దరిని ఆదర్శంగా తీసుకుని అందరం ముందుకు సాగుదాం. పార్టీ ప్రస్తానంలో 2021 ఎంతో ముఖ్యమైంది. పార్టీ స్వర్ణోత్సవ ఏడాదిలో అన్నాడీఎంకేను అధికార పీఠంపై కూర్చోబెట్టి చరిత్ర సృష్టిద్దాం. స్వర్ణోత్సవం దిశగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిద్దాం..’ అంటూ ఆ లేఖలో పిలుపునిచ్చారు.