తహశీల్దార్ సస్పెన్షన్
ఈపూర్ (గుంటూరు) : భూముల ఆన్లైన్ నమోదు విషయంలో అవకతవకలకు పాల్పడిన తహశీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుంటూరు జిల్లా ఈపూర్ మండల తహశీల్దార్ నాగూసింగ్తో పాటు ముగ్గురు వీఆర్వోలు, ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.