emirate flight
-
తమిళనాడు: ఎమిరేట్స్ విమానానికి తప్పిన ప్రమాదం
సాక్షి, చెన్నై: తమిళనాడు ఎమిరేట్స్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యే సమయానికి విమానం నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే నిలిపివేశారు. దీంతో, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.వివరాల ప్రకారం.. చెన్నై విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్ అయ్యే సమయానికి ఫ్లైట్ వింగ్స్ భాగం నుంచి పొగ రావడం కనిపించింది. దీంతో, అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అక్కడే నిలిపివేశారు.ఈ క్రమంలో అలర్ట్ అయిన విమాన సిబ్బంది, టెక్నికల్ టీమ్ విమానాన్ని పరిశీలించి ప్రమాదాన్ని గుర్తించారు. పది నిమిషాల సమయంలో పొగ ఆగిపోయినట్టు అధికారులు తెలిపారు. అయితే, పొగ రావడానికి గల కారణాలను సిబ్బంది వెల్లడించలేదు. దీంతో, ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. ఇక, రాత్రి 9:15 గంటలకు దుబాయ్ వెళ్లాల్సిన విమానం నాలుగు గంటలు ఆలస్యంగా అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత టేకాఫ్ అయినట్టు సమాచారం. ఇక, ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 320 మంది ప్రయాణీకులు ఉన్నారు.ఇది కూడా చదవండి: తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం -
ప్రాణం నిలిచి.. ఆరు కోట్ల బంపర్ లాటరీ
కేరళ: ఓ వ్యక్తికి అదృష్టం కలిసిరావడమే అరుదు.. అలాంటిది రెండు పెద్ద అదృష్టాలు వారం రోజులలోపే వస్తే.. ఒక అదృష్టం ప్రాణాన్ని ఇచ్చి మరొకటి ఏకంగా బంపర్ లాటరీని అందిస్తే.. కేరళకు చెందిన ఓ వ్యక్తికి ఇలాగే జరిగింది. విమాన ప్రమాదం నుంచి బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహ్మద్ బషీర్ అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తికి ఏకంగా ఆరు కోట్లకు(రూ.6,66,70,000)పైగా కళ్లు చెదిరే లాటరీ తగిలింది. ఈ నెల(ఆగస్టు) 3న కేరళలోని తిరువనంతపురం నుంచి దుబాయ్ కు బయల్దేరిన ఎమిరేట్స్‌కు చెందిన విమానం (బోయింగ్ 777-300) రన్ వే పై ల్యాండ్ అయ్యే క్రమంలో క్రాష్ అయిన విషయం తెలిసిందే. దాదాపు 300 మంది ప్రాణాలతో బయటపడ్డారు. పలువురు గాయాలపాలయ్యారు. ఇలా గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో బషీర్ కూడా ఉన్నాడు. గత 30ఏళ్లకు పైగా దుబాయ్ లో పనిచేస్తున్న అతడు ఓ దుబాయ్ లాటరీ టికెట్ కొన్నాడు. దానికి సంబంధించిన డ్రాను దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో తీయగా దాదాపు ఒక మిలియన్ డాలర్ల బంపర్ లాటరీ తగిలింది. దీనిపై బషీర్ పట్టరాని సంతోషం వ్యక్తం చేశాడు. విధుల నుంచి విశ్రాంతి తీసుకునే సమయంలో తనకు అదృష్టం లాటరీ రూపంలో తగలడం చెప్పలేని ఆనందంగా ఉందని వర్ణించాడు.