ద్విచక్రవాహనాల ఢీ
ఇద్దరికి తీవ్రగాయాలు పరిస్థితి విషమం
తుర్కపల్లి : ఎదురెదురుగా వచ్చిన రెం డు ద్విచక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. తుర్కపల్లి మండలం వెంకటాపూర్లో ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు రాజాపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన ఇప్ప ప్రశాంత్, ఇప్ప శ్రీకాంత్ బైక్పై హైదరాబాద్కు వెళ్తున్నారు. అదే విధంగా మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం లింగరెడ్డిపల్లి నుంచి జాపా గోపి, జాపాకిష్టయ్య, జాపా బుచ్చమ్మ, లత ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఒకే బైక్పై యాదగిరిగుట్టకు బయలుదేరారు.
వీరి వాహనాలు వెంకటాపూర్ శివారులో మలుపు వద్దకు రా గానే ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇప్పా శ్రీకాంత్, జాపా గోపి కి తీవ్రంగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను తుర్కపల్లిలోని ఓ ప్రైవేట్ ఆ స్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయ పడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తీసుకెళ్లారు.