Exchange lists
-
‘అణు’ సమాచారం పంచుకున్న భారత్–పాక్
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్‌లు తమ దేశాల్లో అణువిద్యుత్ కేంద్రాలు, అణు ఇంధనశుద్ధికి సంబంధించిన ఇతర సదుపాయాల సమాచారాన్ని వరుసగా 31వ సంవత్సరం ఇచ్చిపుచ్చుకున్నాయి. ఒకరి అణు సదుపాయాలపై మరొకరు దాడి చేయకుండా నివారించే లక్ష్యంతో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం శనివారం రెండు దేశాలు దౌత్యమార్గాల ద్వారా న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లలో ఈ సమాచార మార్పిడి చోటుచేసుకున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. జనవరి ఒకటిన తమ అణు కేంద్రాలు, ఇతర సదుపాయాల సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలంటూ రెండు దేశాలు 1991లో ఒప్పందం చేసుకున్నాయి. సీమాంతర ఉగ్రవాదం, కశ్మీర్ అంశంపై రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలోనూ ఈ ఒప్పందం అమలు యథావిథిగా కొనసాగడం గమనార్హం. చదవండి: (వైష్ణోదేవి మందిరంలో విషాదం.. అసలేం జరిగింది?) -
చరిత్ర సృష్టించిన బీఎస్ఈ
న్యూఢిల్లీ : ఆసియాలోనే అత్యంత పురాతన ఎక్స్చేంజ్, దేశంలోనే రెండో అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ శుక్రవారం చరిత్ర సృష్టించింది. తన ప్రత్యర్థి ఎన్ఎస్ఈలో బ్లాక్‌బస్టర్ హిట్‌తో లిస్టు అయింది. ఇష్యూ ధర రూ.806కు 34.62 శాతం ప్రీమియంతో షేర్లు రూ.1,085కు జంప్ అయ్యాయి. భారత్‌లో లిస్టవుతున్న మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ ఇదే. 5-15 శాతం ప్రీమియంతో బీఎస్ఈ స్టాక్ లిస్టవుతుందని విశ్లేషకులు అంచనావేశారు. జనవరి 23న మొట్టమొదటిసారి ఐపీఓకు వచ్చిన బీఎస్ఈకి మూడు రోజుల బిడ్డింగ్‌లో ఆఖరి రోజు బంపర్ డిమాండ్ వచ్చిన సంగతి తెలిసిందే. 51 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌తో అదరగొట్టేసింది. అదేమాదిరి ఇప్పుడు కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌తో మార్కెట్లో లిస్టు అయింది. అన్ని సెగ్మెంట్లో బీఎస్ఈకి 1,440 యునిక్ మెంబర్లున్నారు. ఆసియాలో పురాతనమైన ఎక్స్చేంజ్ అయిన బీఎస్ఈ 1875 జూలై 9న ఏర్పాటైంది. 2016 జూలై 30కు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్చేంజ్ల్లో ఒకటిగా నిలిచింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ఇది ప్రపంచంలో 11వ అతిపెద్ద ఎక్స్చేంజ్. లిస్టెడ్ కంపెనీలతో దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.52 ట్రిలియన్ డాలర్లు.