తండ్రి ఆఫీసులో కూతురిపై దారుణం
న్యూఢిల్లీ: ఉత్తర ఢిల్లీలోని బురారి ప్రాంతంలోని ఓ ఆఫీసులో యజమాని కూతురి (7)పై ఓ పెయింటర్ (35) లైంగికదాడికి పాల్పడ్డాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
పెయింటర్ అయిన నిందితుడు తాత్కాలికంగా పొరుగున్న ఉన్న బాధితురాలి తండ్రి ఆఫీసులో పనిచేశాడు. గత శుక్రవారం చిన్నారి తన స్నేహితులతో కలసి ఆడుకోవడానికి తండ్రి లేని సమయంలో ఆఫీసుకు వెళ్లింది. ఆ సమయంలో ఆఫీసులో పనిచేస్తున్న పెయింటర్ బాలిక స్నేహితులను అక్కడి నుంచి పంపేసి, ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలు జరిగిన దుశ్చర్య గురించి కుటుంబ సభ్యులకు చెప్పింది. స్థానికులు నిందితుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.