వెలంగణి మాత ఉత్సవాలు ప్రారంభం
హాజరైన బిషప్ ఉడుముల బాల
తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు
\కాజీపేట రూరల్ : కాజీపేట డీజిల్‌కాలనీలోని వెలంగణి ఆరోగ్య మాత పుణ్యక్షేత్రంలో వెలంగణి మాత ఉత్సవాలు ప్రా రంభమయ్యాయి. సోమవారం నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు కొనసాగే వేడుకలను వరంగల్ పీఠాధిపతి బిషప్ ఉడుముల బాల జెండాను ఎగురవేసి ప్రారంభించారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఉత్సవాలకు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.
ప్రతి రోజు ఉదయం 6 నుంచి 8 వరకు ప్రత్యక ప్రార్థన ఉంటుం దని, 8వ తేదీన ఉదయం 7 గంటలకు ఆంగ్లంలో ప్రత్యేక పూజ ఉంటుందని, 10 గం టలకు ఫాదర్ బెన్ని ముత్తంగి ఆధ్వర్యంలో పండుగ బలిపూజ, మధ్యాహ్నం 12 గంటలకు డీజిల్‌కాలనీలోని వెలంగణి మాత ఉత్సవ విగ్రహాంతో ఊరే గింపు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 1 నుంచి 3 గంట ల వరకు స్వస్థత ప్రార్థనలు ఉంటాయని, సాయంత్రం 6 గంటలకు ఫాదర్ సామ్యేల్‌తో ముగింపు పూజ ఉంటుందని వారు పేర్కొన్నారు.
వెలంగణి మాత క్షేత్రంలో సౌకర్యాలు
వెలంగణి మాత పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల కోసం సౌకర్యాలు కల్పించినట్లు వెలంగణì మాత విచారణ గురువు ఫాదర్ గాలి రాయపురెడ్డి తెలిపారు. వాస్తవంగా వెలంగణి మాత భక్తులు చెన్నైలోని నాగపట్నం వద్ద ఉన్న వెలంగణి నగర్‌కు వెళ్లి మాతను దర్శించుకుంటారని.. అయితే అక్కడికి వెళ్లలేని వారి కోసం అధునాతన సదుపాయాలతో డీజిల్‌కాలనీలో చర్చిని అభివృద్ధి చే సినట్లు తెలిపారు. నాగపట్నం మాదిరిగా ఇసుక మార్గంలో వెళ్లి కొవ్వత్తులు వెలిగించుట, ప్రధాన ద్వారాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు.