రోజుకు 14 బాటిళ్ల మద్యం తాగేస్తున్న హీరో
మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఫ్రాన్స్‌కు చెందిన ప్రఖ్యాత హీరో గెరార్డ్ డెపార్డీ మాత్రం తనకివేమిపట్టవని చెబుతున్నాడు. బాటిళ్ల మీద బాటిళ్ల మద్యం తాగేస్తున్నాడు. ఏ రోజైనా అతనికి బోర్ కొడితే ఉదయం నుంచి రాత్రికి ఏకంగా 14 బాటిళ్ల మద్యం లాగించేస్తాడట. గెరార్డ్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఈ విషయం చెప్పాడు.
గెరార్డ్ ఉదయం మద్యపానంతోనే దినచర్య మొదలుపెడతాడు. 10 గంటలలోపే రెడ్ వైన్ లేదా షాంపైన్ తీసుకుంటాడు. ఆ తర్వాత షాంపైన్.. భోజనంతో మరో రెండు బాటిళ్ల వైన్.. మధ్యాహ్నం షాంపైన్, బీర్.. సాయంత్రం హాఫ్ బాటిల్.. రాత్రికి వోడ్కా లేదా విస్కీ తీసుకుంటాడట. మొత్తమ్మీద ఆ రోజు 14 బాటిళ్ల మద్యం పూర్తి చేస్తాడట. టాక్స్ సమస్యల కారణంగా దేశం వెలుపల ఉంటున్న గెరార్డ్ మద్యం తాగడం మొదలుపెడితే ఆ రోజంతా ఆపనని చెప్పాడు. విమానాశ్రయాల్లో మద్య తాగడం, యాక్సిడెంట్లు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.