grandhi srinivas
-
చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లకు గ్రంధి శ్రీనివాస్ కౌంటర్
-
పవన్ కు పిచ్చి బాగా ముదిరినట్లు కనిపిస్తోంది
-
పవన్ కు మంచి బుద్ధి పుట్టించాలని దేవుడిని కోరుతున్నా: గ్రంధి శ్రీనివాస్
-
ఎన్ని కుట్రలు చేసినా సీఎం జగనే మళ్లీ వస్తారు: గ్రంధి శ్రీనివాస్
-
భీమవరంలో పిల్లాడిని అడిగినా చెప్తాడు..పవన్ కళ్యాణ్ ఇక్కడ అడుగు పెడితే..!
-
పవన్ కళ్యాణ్ ఇక్కడ అడుగు పెడితే.. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాస్ వార్నింగ్.
-
పవన్ ను ఎర్రగడ్డ ఆసుపత్రిలో జాయిన్ చేయించాలి...!
-
పవన్ కళ్యాణ్ కు ఒక అభిమానిగా చెప్తున్నా.. ఎమ్మెల్యే గ్రంధి
-
పవన్ తోక వంకర..!
-
దమ్ముంటే పులివెందులో పోటీ చెయ్
-
సొంత అన్ననే స్విచ్ ఆఫ్ చేసి కూర్చో పెట్టాడు: గ్రాంధి శ్రీనివాస్
-
పవన్‌కు మానసిక చికిత్స అవసరం: గ్రంధి శ్రీనివాస్
సాక్షి, పశ్చిమగోదావరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడే మాటలు సమాజానికే ప్రమాదకరం. పవన్ మానసిక స్థితి ఆశ్చర్యం కలిగిస్తుందని సెటైర్లు వేశారు ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్. పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే పులివెందులో పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు. బుధవారం ఉదయం గ్రంధి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. పవన్ నన్ను గూండా అని భీమవరం నుండి తరిమి కొట్టాలని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. పవన్‌కు నామీదు ఎందుకంత అసూయ అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. గత నెలలో భీమవరం వచ్చి నామీద ద్వేషం లేదన్నాడు. ఇప్పుడేమో రౌడీ అంటూ మాట్లాడుతున్నాడు. తాను స్థలం కొందామంటే నేను అడ్డుకున్నానని అంటున్నాడు. పవన్ మానసిక స్థితి చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ప్రపంచ కుబేరులు భీమవరంలో ఎక్కడ ఉన్నారు?. చంద్రబాబు కాళ్లు, చేతులు పట్టుకుని 21 సీట్లు తీసుకున్నావ్. జనసైనికుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టావు. నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న జనసైనికులకు.. పార్టీ లేదు.. తొక్కా లేదు అన్న రీతిలో వ్యవహరిస్తున్నావు. జనసేన కార్యకర్తలు సలహాలు ఇవ్వదంటూ చులకనగా మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడే భాష ఏంటి?. నీకు ఎకరం స్థలం కావాలా?. నాకు ఉన్న తొమ్మిది ఎకరాల్లో ఎక్కడ కావాలో చెప్పు నేను ఇస్తాను. మిమ్మల్ని కావాలనుకునే వ్యక్తులకు కనీసం సెల్ఫీ దిగే అవకాశం కూడా లేదు. మీ నిజ స్వరూపం తెలియక పవన్ సీఎం పవన్ సీఎం అంటూ వారు అరుస్తున్నారు. ఇప్పటికే 21 సీట్లకు పరిమితమై చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నావు. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే పులిలా తిరుగబడుతుంది. నువ్వు ఎలా ఉన్నావో ఇప్పటికైనా తెలుసుకో అంటూ హితవు పలికారు. సౌమ్యుడు, వివాదరహితుడైన చిరంజీవికి.. పవన్‌కు అసలు పోలికే లేదు. చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేసి 18 సీట్లు గెలిచారు. పవన్‌కు లాగా సంస్కారం లేక విమర్శలు చేయలేక రాజకీయాల నుండివెళ్ళిపోయారు. మరో సొంత అన్న నాగబాబుకి కూడా పవన్ అన్యాయం చేశారు. 2019లో ఓటమి తర్వాత పవన్ మళ్లీ భీమవరం వైపు చూడలేదు. కోవిడ్ సమయంలో కూడా ఇక్కడి ప్రజల్ని ఏమయ్యారో అని పట్టించుకోలేదు. భీమవరం ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో పవన్ తెలుసుకోవాలి. నేను రౌడీనని పవన్ అంటున్నారు. మరి నా మీద ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదు కదా? అని జనసేన అధినేతను గ్రంధి శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ కంఠస్తం పట్టి మాట్లాడుతున్నాడు. కోవిడ్ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారా మీరు?. సినీ ఇండస్ట్రీకి చెందినవారు రాజకీయాల్లో ఇమడలేరు. నేను ఎమ్మెల్యేగా ఉండగానే పెద్ద పెద్ద సంస్థలన్నీ భీమవరం వచ్చాయి. వాటిని నా చేతులతో ప్రారంభించాను. అభివృద్ధి, నిబద్ధత, అంకితభావంతో పని చేస్తున్నాను. భీమవరం జిల్లా కేంద్రం కోసం మంత్రి పదవి సైతం వదులుకున్నాను. 100 పడకల ఆసుపత్రి కోసం మా కుటుంబానికి చెందిన నాలుగు ఎకరాల భూమిని ఇచ్చాను. ఇప్పటివరకు 185 ఎకరాలు పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించాము. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొలేకనే చంద్రబాబు కూటమితో వస్తున్నాడు. సీఎం జగన్ చెప్పాడంటే చేస్తాడంతే. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశారు. కరోనా సమయంలో కూడా పేదలకు సంక్షేమ పథకాలు చేరువ చేశారు. చంద్రబాబు 600 హామీలతో మేనిఫెస్టో ఇచ్చిన వెబ్సైట్ నుంచి తొలగించాడు. చంద్రబాబు ఎన్నికల ముందు దండాలు పెట్టి ఎన్నికల తర్వాత పంగనామాలు పెడతారని ప్రజలకు తెలుసు. ప్రజలు సీఎం జగన్ వెంట ఉన్నారు. కూటమికి అధికారం వచ్చే ఛాన్స్ లేదు. అవినీతికి తావు లేకుండా పేదల గడప వద్దకు సంక్షేమాన్ని చేరువ చేశారు. నిలకడ లేని మాటలు పూనకాలు వచ్చే ప్రసంగాలతో పవన్ మాట్లాడుతున్నాడు. పవన్ మానసిక స్థితి బాలేదు. ముద్రగడ పద్మనాభం ఇంటిని 5,000 మంది పోలీసులు మొహరించి.. వారి కుమారుడిని కొట్టుకుంటూ తీసుకువెళ్లి వారి భార్యను అనకూడని మాటలంటే నాడు ఆయనకు ఎందుకు సంఘీభావం తెలపలేదు. వంగవీటి రంగాను హత్య చేసిన వారితో పవన్ చేతులు కలిపారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని హరిరామజోగయ్య సలహాలు ఇస్తే ఆయన్ను కూడా అవమానించిన వ్యక్తి పవన్. చంద్రబాబుకు పవన్ బానిసలా మారిపోయారు. పవన్‌కు సంబంధించి చంద్రబాబు దగ్గర ఏ వీడియోలు ఉన్నాయో.. ఎంత ప్యాకేజీ ఇస్తున్నాడో.. ఏం బ్లాక్ మెయిల్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ స్థాయి దిగదారి నన్ను విమర్శలు చేస్తున్నారు అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. పవన్ కళ్యాణ్ పార్టీలో చేర్చుకున్న రామాంజనేయులును కృష్ణాజిల్లా నుంచి తరిమికొడితే ఇక్కడికి వచ్చారు. తరిమికొడితే పారిపోయే వ్యక్తిని కాదు నేను.. చిన్నతనం నుంచి ఇక్కడే ఉన్నాను. ప్రజల ఆశీర్వాదంతో ఐదేళ్లపాటు నియోజకవర్గంలో పనిచేశాను. వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన బాటలో సీఎం జగన్ ఆశీస్సులతో సంక్షేమ పాలన అందిస్తున్నాను. టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను అడుగుతున్నాను. ముఖ్యమంత్రి జగన్ వల్ల మీ ఇంట్లో మేలు జరిగిందా లేదా?. మీరు పార్టీ, కులం వదిలి సీఎం జగన్‌ను బలపరచండి’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేస్తా: గ్రంధి శ్రీనివాస్
సాక్షి, పశ్చిమగోదావరి: ఆంధ్రజ్యోతి పత్రికపై పరువు నష్టం దావా వేయడానికి సిద్ధమైనట్టు ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్ తెలిపారు. ఆధారాలు లేకుండా తనపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని తన పరువుకు భంగం కలిగేలా ఆంధ్రజ్యోతి చెత్త రాతలు రాసిందన్నారు. వారి రాతలపై కోర్టు వచ్చి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కాగా, గ్రంధి శ్రీనివాస్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కొందరు రైతులకు సొంత డబ్బు ఇచ్చి పేదలకు ఇళ్ళు పట్టాలు ఇచ్చాము. నియోజకవర్గంలో పేదలకు ఇళ్ళ పట్టాలివ్వాలంటే 180 ఎకరాల భూమి కావాలి కానీ 75 ఎకరాల భూమిని దొరికింది. ఆంధ్రజ్యోతి పత్రికలో భూములు ఎక్కువ ధరలు ఇచ్చేసారని మా బంధువులకు తొమ్మిది కోట్ల రూపాయలు లాభం పొందామని అక్రమాలు చేశామని తప్పుడు రాతలు రాసుకొచ్చారు. మా పరుపుకి భంగం కలిగేలా ఆంధ్రజ్యోతి రాతలు రాసింది. కనీసం కామన్ సెన్స్ లేకుండా బురద చల్లాల్నే రాతలు రాస్తున్నారు. ప్రజలకు సేవ చేయడం నేరమా?.. వంద పడకల ఆసుపత్రికి నాలుగు ఎకరాలు మా సొంత భూమి ఇచ్చాము. జూనియర్ కాలేజీ నిర్మాణం కోసం మా సొంత భూమి ఇచ్చాము. నన్ను డామేజ్ చేయాలని ఎన్నో అవాస్తవాలను రాసింది. ఆంధ్రజ్యోతి పత్రికపై పరువు నష్టం దావా వేయడం జరుగుతుంది. పూర్తి ఆధారాలతో కోర్టుకి వచ్చి నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నాము. లేఅవుట్స్, మట్టి పూడికలు, బిల్డింగ్ పర్మిషన్ల అంశంలో నా ప్రమేయాలు ఉన్నట్లు వక్రీకరించారు. ప్రజలకు మేము సేవ చేయడం నేరమా?. వారు మా దగ్గరికి వచ్చి అడగటం నేరమా అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. హౌసింగ్ సొసైటీ పేరుతో కొందరు ప్లాట్లు కొనుక్కుంటే రిజిస్ట్రేషన్లు జరగకపోతే వారి తరఫున నిలబడితే దీన్ని కూడావక్రీకరించారు. ప్రజలకు మంచి చేస్తున్నాము కాబట్టే.. ఇలాంటి రాతలు రాస్తున్నారు. ఎల్లో మీడియాకు బాబు స్కామ్‌లు కనిపించవా? చంద్రబాబు ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 850 ఎకరాల్లో లక్ష కోట్ల కుంభకోణం చేశాడు. దీనిపై సీబీఐ విచారణ వేయమంటే మాకు సిబ్బంది లేరు అని నాడు వారు చెప్పారు. చంద్రబాబు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తాడో అది ఆంధ్రజ్యోతికి కనపడదు. చంద్రబాబు అవినీతి లక్ష కోట్ల కుంభకోణం మీద ఎక్కడైనా రాశారా?. ఎల్లో మీడియా రైతులు, పేదల ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా రాతలు రాస్తుంది. చంద్రబాబును గద్దెనెక్కించడం కోసం.. అవినీతికి ఆస్కారం లేకుండా నిజాయితీగా పనిచేసే మాలాంటి వారిని అల్లరి చేయాలని చూస్తున్నారు. దగా, వెన్నుపోటు, కుట్ర రాజకీయాలకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. ప్రజలను మోసం చేయడం, దగా చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికల ముందు ప్రజలను మోసం చేయడం.. వారికి పంగనామాలు పెట్టడం చంద్రబాబుకు మామూలే. ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే 23 సీట్లు కూడా రావని చంద్రబాబుకు తెలిసింది. అందుకే అందరితో పొత్తులు పెట్టుకుంటున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల పక్షాన నిలుస్తూ పొత్తులపై యుద్ధానికి సిద్ధమయ్యారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చారు. చెప్పాడంటే చేస్తాడు.. అనే బలమైన నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేక ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నీకు ఇక సినిమా షూటింగ్ లే.. పవన్ పై ఎమ్మెల్యే గ్రంధి సెటైర్లు
-
పవన్ భీమవరం పర్యటన... ఏకిపారేసిన ఎమ్మెల్యే గ్రంధి
-
పురందేశ్వరిపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫైర్
-
పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు గ్రంధి శ్రీనివాస్ ఓపెన్ ఛాలెంజ్
-
టిడ్కో ఇళ్ళలో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారు
-
జనసైనికులను కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
-
పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు
-
పవన్, లోకేష్ పై గ్రంధి శ్రీనివాస్ సెటైర్లు
-
పక్కా ప్రణాళికతోనే భీమవరంలో టీడీపీ గూండాల దాడి
-
నారా లోకేష్‌కు భీమవరం పోలీసుల నోటీసులు
సాక్షి, పశ్చిమగోదావరి: భీమవరం సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్‌కు భీమవరం పోలీసులు నోటీసులు ఇచ్చారు. యువగళం పాదయాత్రలో టీడీపీ రౌడీమూకలు మరోసారి రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. పుంగనూరులో చంద్రబాబు కనుసన్నల్లో దౌర్జన్యాలకు తెగబడగా... భీమవరంలో లోకేశ్ ప్రోద్బలంతో పేట్రేగి పోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్‌లో మంగళవారం రాత్రి బహిరంగ సభ అనంతరం గునుపూడి శివారులో టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు బరి తెగించాయి. లోకేశ్ పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభ వద్ద టీడీపీ కార్యకర్తలు వ్యూహాత్మకంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. గతంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీపై వాటర్ బాటిళ్లు, రాళ్లు రువ్వడంతో పాటు ఫ్లెక్సీని తొలగించడానికి ప్రయత్నించారు. వివేకానందరెడ్డిని చంపింది ఎవరంటూ ఫ్లెక్సీలను ప్రదర్శించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలను పట్టుకుని నినాదాలు చేస్తూ ఉద్రిక్తత సృష్టించారు. చదవండి: భీమవరంలో మరో పుంగనూరు.. -
‘ఐటీ నోటీసుల అంశాన్ని దృష్టి మరల్చేందుకే బాబు అరాచకం’
సాక్షి, భీమవరం: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడమే చంద్రబాబు లక్ష్యమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐటీ నోటీసుల అంశాన్ని దృష్టి మరల్చేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని, పుంగనూరులో చేసిన అరాచకాన్నే భీమవరంలో చేశారని దుయ్యబట్టారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే.. ఎంత ప్రయత్నించినా తన పాదయాత్రకు ఎలాంటి స్పందన లేకపోవటం, మరోవైపు తండ్రి చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులతో దిక్కుతోచక ఉక్కిరి బిక్కిరి అవుతున్న లోకేశ్, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. తాజాగా ఉంగుటూరులో టీడీపీ గుండాలు చేసిన అరాచకాలు అందరూ చూశారు. సంయమనం పాటించాం లోకేశ్ పాదయాత్రతో రెచ్చిపోతున్న టీడీపీ కార్యకర్తలు మా పార్టీ ఫ్లెక్సీ చింపేసినా, మేం సంయమనం పాటించాం. పూర్తి సహనంతో ఉన్నాం. భీమవరంలో మా పార్టీ ఆరు నెలల క్రితం పేదలకు, పెత్తందారులకు పోరాటం పేరుతో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. భీమవరంలోకి లోకేశ్ ప్రవేశానికి ఒక రోజు ముందు టీడీపీ గూండాలు ఆ ఫ్లెక్సీపై రాళ్లు వేశారు. చింపేశారు. అందుకు ఈ పోటోనే సాక్ష్యం.. అంటూ ఒక ఫోటో చూపారు. ఆ విధంగా శాంతిభద్రతల సమస్యలు çసృష్టించి మమ్మల్ని రెచ్చగొట్టాలని టీడీపీ ప్రయత్నం చేసినా, మేం పూర్తి సంయమనం పాటించాం. నిజానికి మేం తల్చుకుంటే టీడీపీకి చెందిన ఒక్క ఫ్లెక్సీ కూడా ఉండేది కాదు. లోకేశ్ నోరు అదుపులో పెట్టుకో భీమవరం ప్రజల మనస్సు గెలిచి నేను ఎమ్మెల్యేను అయ్యాను. నీలా దొడ్డిదారిన ఎమ్మెల్సీని అయి, మంత్రి పదవి చేపట్టలేదు. మా ఫ్లెక్సీ చింపేసినా, మేము మౌనంగా ఉండడం లోకేశ్‌కు మింగుడు పడలేదు. దీంతో మాటలు, అసభ్య పదజాలంతో మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నన్ను గజదొంగ, క్యాన్సర్ గడ్డ అంటూ లోకేశ్ నోరు పారేసుకున్నాడు. లోకేశ్ ఇకనైనా తగ్గు. నోరు అదుపులో పెట్టుకో. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. అవెక్కడున్నాయో చూపాలి భీమవరంలో లోకేశ్ పాదయాత్ర అట్టర్‌ఫ్లాప్. యాత్రకు ఎక్కడా ప్రజల నుంచి స్పందన రావడం లేదు. పట్టుమని 500 మంది కూడా యాత్రలో పాల్గొనలేదు. దీంతో వేర్వేరు ప్రాంతాల నుంచి డబ్బులతో జనాన్ని పోగేశారు. అయినా, స్థానిక ప్రజలు పట్టించుకోకపోవడంతో.. నేను గజదొంగనని, అవినీతి పరుడ్ని అని, రూ.52 కోట్లు దోచుకున్నానని, వంద ఎకరాల భూమిని ఆక్రమించుకున్నానని, ఇంకా భూదందాలు చేస్తున్నానని లోకేశ్ పిచ్చిపిచ్చిగా వాగాడు. రాష్ట్ర ప్రజలంతా అనుకుంటున్నట్లు లోకేశ్ పప్పు మాత్రమే కాదు. అతడొక సన్నాసి. నీవు ఆరోపించిన ఆ రూ.52 కోట్లు, 100 ఎకరాల భూమి ఎక్కడున్నాయో చూపించు. నేను లోకేశ్ మాదిరిగా అడ్డగోలు సంపాదనతో కాకుండా, అప్పు చేసి స్థలాలు కొన్నాను. ఈరోజు లోకేశ్ పక్కన కూర్చున్న చాలా మంది దొంగనోట్ల మార్పిడి చేసి కోట్లు సంపాదించారు. ఈ విషయం భీమవరంలో చాలా మందికి తెలుసు. ఎవడు రాసిచ్చాడో తెలియదు కానీ.. లోకేశ్ నాపై పిచ్చి ఆరోపణలు చేశాడు. ఆ రూ. 52 కోట్లు ఎక్కడున్నాయో లోకేశ్ చెబితే, ఆయన ఫోటోకు దండేసి, రెండు అరటిపళ్లు, నాలుగు అగరబత్తులతో దండం పెట్టుకుంటాను. బ్యాంకు రుణంతో ఇల్లు కట్టుకున్నా: నేను భీమవరంలో ప్యాలెస్ కట్టుకుంటున్నానని లోకేశ్ ఆరోపించాడు. చంద్రబాబుకు, లోకేశ్‌కు మాత్రమే ఇళ్లు ఉండాలా? మాలాంటి వాళ్లకు ఉండకూడదా? నేను ఉంటున్న ఇళ్లు నాది కాదు. మా తాత మా తమ్ముడికి రాసిచ్చారు. తమ్ముడి ఇంట్లో ఉంటున్నాను. రెండో తమ్ముడు నాకు కొంత భూమి దానంగా ఇస్తే బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఇల్లు కట్టుకున్నాను. వారే అభివృద్ధికి శాపం నిజానికి ఇక్కడ అభివృద్ధి పనులకు టీడీపీనే ఒక శాపంలా మారింది. ఆ పార్టీ నాయకులే భీమవరం అభివృద్ధికి అడ్డంకులు సృష్టించారు. టీడీపీ నుంచి 5 ఏళ్లు ఎంపీగా (రాజ్యసభ సభ్యురాలిగా) పని చేసిన ఆమె, కనీసం తన ఇంటి ముందు రోడ్డు కూడా వేయించుకోలేక పోయింది. మున్సిపాలిటీలో 10 ఏళ్లు ఆ పార్టీనే అధికారంలో ఉన్నా, ఊరి కోసం ఒక్క మంచి పని కూడా చేయలేదు. చివరకు ఛైర్మన్ కనీసం ఇంటి ముందు కూడా రోడ్డు వేయించుకోలేకపోయాడు. భీమవరంలో నీటి సరఫరా కోసం చినమెరం ప్రాంత రైతుల నుంచి భూసేకరణ మొదలుపెడితే టీడీపీ వారే అడ్డుపడ్డారు. ఆ భూములు ప్రభుత్వానికి అప్పగిస్తే.. డబ్బులు రావని టీడీపీ నాయకుడు తన పేరు మీద రాయించుకున్నారు. తర్వాత ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించకుండా భీమవరం మండలానికి తాగునీటి సమస్య వచ్చేలా చేసింది టీడీపీ నాయకుడే. పట్టణంలో కంపోస్టు యార్డు కోసం 10 ఎకరాలు సేకరిస్తే, ఆ పక్కనే 50 ఎకరాలు తక్కువ ధరకు కొట్టేసిన టీడీపీ నాయకులు, ఆ తర్వాత కోర్టులో కేసు వేసి, కంపోస్టు యార్డు ఏర్పాటు కాకుండా అడ్డుపడ్డారు. ఇవన్నీ తెలిసినా, లోకేశ్ మాత్రం మమ్మల్నే నిందిస్తూ భీమవరంలో కంపోస్టు యార్డు ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించడం సరికాదు. ఇవీ మేం చేసిన అభివృద్ధి పనులు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, భీమవరంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. కంపోస్టు యార్డు కోసం సేకరించిన భూమి అన్యాక్రాంతమైతే, అందులో 6 ఎకరాల 60 సెంట్లు తిరిగి స్వాధీనం చేసుకున్నాం. 60 ఎకరాల్లో సమ్మర స్టోరేజీ ట్యాంక్ ఏర్పాటు చేశాం. టిడ్కో ఇళ్లకు బకాయి పెట్టిపోతే, ఆ సంస్థ పనులు పూర్తి చేయలేదు. దీంతో రివర్స్ టెండరింగ్ ద్వారా మళ్లీ టెండర్లు పిల్చి, పనులు అప్పగించాం. దీని వల్ల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. టిడ్కో ఇళ్లూ పూర్తవుతున్నాయి. నాడు మహానేత వైఎస్ఆర్ హయాంలో సేకరించిన భూముల్లోనే మా ప్రభుత్వం టిడ్కో ఇళ్లు కడుతోంది. వాటిని పూర్తి చేసి, లబ్ధిదారులకు అందించబోతున్నాం. రూ.2 కోట్లతో ఓల్డ్ యనమలదుర్ర డ్రైయిన్ నిర్మాణం, సోమగుండం ఔట్లెట్, సోమగుండం చెరువు అభివృద్ధి చేశాం. తాడేరు బ్రిడ్జిని యుద్దప్రాతిపదికన పూర్తి చేశాం. యనమలదర్రు డ్రైయిన్ మీద అప్రోచ్ బ్రిడ్జిలకు త్వరలో రూ.32 కోట్లతో టెండర్లు పిలిచి రోడ్లకు అనుసంధానం కార్యక్రమం చేస్తున్నాం. భీమవరానికి జిల్లా కేంద్రాన్ని తెచ్చాం. వారే దాడి చేసి.. మాపై ఎదురుదాడి టీడీపీ గూండాలు ఇళ్లలోకి వెళ్లి వృద్ధులు, మహిళలపై దాడి చేశారు. మా పార్టీకి కంచుకోట అయిన ఇందిరమ్మ కాలనీపై టీడీపీ గూండాలు దాడి చేశారు. మా పార్టీ అభిమానులు జెండాలు పట్టుకుంటే వాటిని లాక్కొని దహనం చేసి.. కాళ్లతో తొక్కి.. వారి ఇళ్లలోకి ప్రవేశించి దాడులకు తెగబడ్డారు. రాళ్లతో దాడులు చేశారంటూ.. ఇలాంటి గులకరాళ్లు ఈ ప్రాంతంలో ఉంటాయా?.. అంటూ వాటిని చూపారు. వ్యాన్లలో రాళ్ల బస్తాలు పెట్టుకొచ్చిన టీడీపీ గుండాలు, ప్రజల ఇళ్లపై దాడి చేశారంటూ.. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వీడియోలు ప్రదర్శించారు.ఆ విధంగా యథేచ్ఛగా దాడి చేసిన టీడీపీ గుండాలు.. మమ్మల్ని నిందిస్తూ, మాపైనే ఎదురుదాడికి దిగారు. ఎప్పుడూ శాంతియుతంగా ఉండే భీమవరంలో ఏనాడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. మీడియా అండగా ఉందని.. మీడియా ఉందని ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? లోకేశ్ నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మా జిల్లా దాటిపోవు. ఇక ఎల్లో మీడియా కూడా పచ్చిగా వాస్తవాలు వక్రీకరిస్తోంది అంటూ.. తమ పార్టీ ఫ్లెక్సీపై ఎవరు రాళ్లు విసిరి, చింపేశారో చూడండి అంటూ.. ఆ ఫోటోలు చూపిన ఎమ్మెల్యే.. వాళ్లు ఎవరో చెప్పాలని ప్రెస్మీట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రతినిధులను ప్రశ్నించారు. చదవండి: భీమవరంలో మరో పుంగనూరు.. -
భీమవరంలో మరో పుంగనూరు..
సాక్షి, భీమవరం / భీమవరం (ప్రకాశంచౌక్): నిన్న రాయలసీమ.. నేడు పచ్చని సీమ! అక్కడ చల్లా బాబు.. ఇక్కడ చింతమనేని..!! యువగళం పాదయాత్రలో టీడీపీ రౌడీమూకలు మరోసారి రెచ్చిపోయాయి. పుంగనూరులో చంద్రబాబు కనుసన్నల్లో దౌర్జన్యాలకు తెగబడగా... భీమవరంలో లోకేశ్ ప్రోద్బలంతో పేట్రేగి పోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్‌లో మంగళవారం రాత్రి బహిరంగ సభ అనంతరం గునుపూడి శివారులో టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు బరి తెగించాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు వారి నుంచి తప్పించుకొని స్థానికంగా ఉన్న ఇళ్లలో తలదాచుకున్నా వదలకుండా వెంటాడారు. మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తూ దారుణంగా కొట్టారు. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ నేరుగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపైకి వెళ్లి దాడులకు పురిగొల్పారు. ఆ ప్రాంతంలో అధిక సంఖ్యలో దళితులు నివసిస్తుండటం గమనార్హం. యువగళంలో ఒక టీమ్ ఆ ప్రాంతాన్ని డ్రోన్‌తో చిత్రీకరిస్తూ దూరంగా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తల గురించి టీడీపీ శ్రేణులకు సమాచారాన్ని చేరవేసింది. దీంతో రౌడీమూకలు అక్కడకు చేరుకుని దాడులకు తెగించాయి. రెచ్చగొట్టి.. రచ్చ చేసి లోకేశ్ పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభ వద్ద టీడీపీ కార్యకర్తలు వ్యూహాత్మకంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. గతంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీపై వాటర్ బాటిళ్లు, రాళ్లు రువ్వడంతో పాటు ఫ్లెక్సీని తొలగించడానికి ప్రయత్నించారు. వివేకానందరెడ్డిని చంపింది ఎవరంటూ ఫ్లెక్సీలను ప్రదర్శించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలను పట్టుకుని నినాదాలు చేస్తూ ఉద్రిక్తత సృష్టించారు. వన్‌టౌన్ సీఐ అడబాల శ్రీను, ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తమ సిబ్బందితో వారిని వారించగా తోసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు సహనంతో వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. కాగా, బహిరంగ సభ కోసం టీడీపీ నాయకులు మహిళలకు రూ.300, పురుషులకు రూ.500 చొప్పున ఇచ్చి జనాన్ని తరలించారు. భీమవరంతో పాటు పాలకోడేరు, కుముదవల్లి, శృంగవృక్షం, వీరవాసరం తదితర ప్రాంతాల నుంచి ఆటోలు ఏర్పాటు చేసి వృద్ధులను సైతం డబ్బు ఆశ చూపి లోకేశ్ సభకు తీసుకొచ్చారు. లోకేశ్ ప్రసంగం ప్రారంభించగానే వారంతా వెనుదిరిగారు. ముగ్గురు పోలీసుల తలలకు తీవ్ర గాయాలు తమను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను టీడీపీ రౌడీ మూకలు తీవ్రంగా గాయపరిచాయి. రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడికి దిగడంతో వన్‌టౌన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, టూటౌన్ కానిస్టేబుల్ రమేష్‌తో పాటు మరో కానిస్టేబుల్ తలకు బలమైన గాయాలయ్యాయి. ఇతర పోలీస్ సిబ్బంది కూడా గాయపడ్డారు. వీరికి భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పాదయాత్రలో తనతో పాటు రౌడీ గ్యాంగ్‌ను వెంటేసుకుని తిరుగుతున్న లోకేశ్ తీరును ప్రశాంతతకు నిలయమైన భీమవరం ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా లోకేశ్ నిర్వహిస్తున్న పాదయాత్ర ఎవరి కోసమని మండిపడుతున్నారు. కానిస్టేబుళ్లు, కార్యకర్తలకు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పరామర్శ టీడీపీ రౌడీ గ్యాంగ్ దాడిలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుళ్లు, కార్యకర్తలను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పరామర్శించారు. లోకేశ్ పాదయాత్రకు బందోబస్తుగా ఉన్న పోలీసులపై సైతం దాడి చేసి తీవ్రంగా గాయపరచటాన్ని తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి టీడీపీ మూకలు అరాచకం సృష్టించాయన్నారు. కవ్వింపు చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.