గుంటూరు మీదుగా బై వీక్లీ రైళ్లు
సంగడిగుంట(గుంటూరు): ప్రయాణికుల రద్దీ కారణంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే రెండు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించింది. సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య గుంటూరు, నల్గొండ మీదుగా 2014 డిసెంబరు, 2015 జనవరి నెలల్లో బై వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ జి.శ్రీరాములు శుక్రవారం తెలిపారు.
08505 నంబరుతో నడిచే రైలు విశాఖపట్నంలో 21.45 గంటలకు బుధ, శనివారాల్లో బయలుదేరి 05.30/35 గంటలకు గుంటూరు మీదుగా ప్రయాణించి గురు, ఆదివారాల్లో 11.30 గంటలకు సికింద్రాబాద్ చేరనుంది. ఈ రైలు 2014 డిసెంబరు 3, 6, 10, 13, 17, 20, 24, 27, 31 తేదీల్లో, 2015 జనవరి 3, 7, 10, 14, 17, 21, 24, 28, 31 తేదీల్లోను నడపనున్నారు.
08506 నంబరుతో సికింద్రాబాద్లో గురు, ఆదివారాల్లో 19.45 గంటలకు బయలుదేరి 2014 డిసెంబరు 4, 7, 11, 14, 18, 21, 25, 28 తేదీల్లోను, 2015 జనవరి 1, 4, 8, 11, 15, 18, 22, 25, 29 తేదీల్లో నడపనున్నారు. ఈ రైళ్లు మార్గంమధ్యలోని మౌలాలి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ స్టేషన్లలో ఆగనుంది. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాల్సిందిగా శ్రీరాములు కోరారు.