havy rain
-
అయ్యో.. మళ్లీ కొట్టుకుపోయిందే...
హైదరాబాద్: ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికి మూడుసార్లు జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్లోని వినాయకనగర్ బస్తీలోని చదును చేసిన మట్టి రోడ్డు వర్షానికి వచ్చిన వరద తాకిడికి కొట్టుకుపోయింది. వినాయనగర్ బస్తీలో వరద నీటి కాల్వ నిర్మించిన అనంతరం దానిపై సీసీ రోడ్డు వేయాలని జీహెచ్ఎంసీ అధికారులు తలపెట్టారు. ఇందులో భాగంగా వారం రోజుల క్రితం ఇక్కడ మట్టితో రోడ్డును చదును చేసి సిద్ధంగా ఉన్నారు. ఇంతలోనే వర్షానికి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. రెండు రోజుల విరామం ఇచ్చి మళ్లీ రోడ్డును చదును చేశారు. అదే రోజు రాత్రి భారీ వర్షం రావడంతో రోడ్డు కొట్టుకుపోయింది. గత మూడు రోజులుగా వర్షాలు రావడం లేదని భావించిన అధికారులు గురువారం రాత్రి రోడ్డును చదును చేసి సీసీ రోడ్డు వేసేందుకు పూర్తిగా ఏర్పాట్లు చేశారు. కాగా రాత్రి 10 గంటల సమయంలో ఒక్కసారిగా కుంభవృష్టిలా వానరావడంతో మరోసారి రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ఏం చేయాలో జీహెచ్ఎంసీ అధికారులకు, బస్తీవాసులకు తోచడం లేదు. వానలు పూర్తిగా ఆగిపోయిన తర్వాతే రోడ్డు పనులు మొదలు పెట్టాలని బస్తీవాసులు కోరుతున్నారు. -
ఆ భవనాలను కూల్చివేస్తాం: మేయర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆదివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం ముంచెత్తడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది చేపట్టిన సహాయక చర్యలను మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. కేబీఆర్ పార్కులో ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో 267 మాన్సున్ ఎమర్జెన్సీ బృందాలను అందుబాటులో ఉంచామని తెలిపారు.16 డిఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.70 జేసీబీలను కూడా అందుబాటులో ఉంచామన్నారు. చెట్లు పడిన 10 ప్రాంతాల్లో వెంటనే క్లియర్ చేశామని పేర్కొన్నారు. అధికంగా నీళ్లు నిలిచిపోయే 30 ప్రాంతాలను గుర్తించామని.. అక్కడ నీళ్లు తోడేందుకు మోటార్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గత మూడేళ్లుగా నగరంలో 1500 శిథిల భవనాలను కూల్చివేశామని.. మరో 200 భవనాలను గుర్తించామన్నారు. వాటిని త్వరలోనే కూల్చివేస్తామని బొంతు రామ్మోహన్ వెల్లడించారు. -
వరద బీభత్సం
-
తిరుమలలో కుండపోత వర్షం