Heading
-
విడాకులంటూ ప్రచారం: మనీష్ పాండే- ఆశ్రిత శెట్టి ఫొటోలు వైరల్
-
మ్యాచ్ చేజారిపోతోంది..టీమిండియా పోరాటం ఎంతవరకూ!
హెడింగ్లీ టెస్టుపై ఇంగ్లండ్ పట్టు బిగించింది... తొలి రోజు తమ బౌలింగ్‌తో భారత్‌ను దెబ్బ తీసిన ఆతిథ్య జట్టు రెండో రోజు బ్యాటింగ్ జోరును చూపించింది. ఓపెనర్లు వేసిన బలమైన పునాదిపై వరుసగా మూడో టెస్టులోనూ సారథి రూట్ శతకంతో భారీ స్కోరుకు బాట వేశాడు. దాంతో ఇప్పటికే ఇంగ్లండ్ 345 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. ఇలాంటి స్థితిలో భారత్ ఎదురీది ఎంత వరకు ఈ మ్యాచ్‌లో పోరాడగలదో చూడాలి. లీడ్స్: రెండో రోజూ ఇంగ్లండ్‌దే! వాళ్ల ఆటతీరు బంతి నుంచి బ్యాట్‌కు బదిలీ అయింది తప్ప ఆడిన తీరు, క్రీజులో జోరు ఏమాత్రం తగ్గలేదు. పరుగుల హోరు ఆగలేదు. బ్యాటింగ్ వరుసలో టాపార్డర్ ‘టాప్’ ప్రదర్శన చేసింది. కెప్టెన్ జో రూట్ (165 బంతుల్లో 121; 14 ఫోర్లు) మరో శతకంతో చెలరేగగా, డేవిడ్ మలాన్ (128 బంతుల్లో 70; 11 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 129 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 423 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ప్రస్తుతం 345 పరుగుల ఆధిక్యంలో నిలవగా, ఓవర్టన్ (24 బ్యాటింగ్), రాబిన్సన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 3, జడేజా, సిరాజ్ చెరో 2 వికెట్లు తీశారు. మలాన్ అర్ధసెంచరీ... రెండో రోజు 120/0 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్... కాసేపటికే ఓపెనర్ బర్న్స్ (61; 6 ఫోర్లు, 1 సిక్స్) వికెట్‌ను కోల్పోయింది. దీంతో 135 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి షమీ తెరదించాడు. మరో ఓపెనర్ హమీద్‌కు డేవిడ్ మలాన్ జతయ్యాడు. మూడేళ్ల క్రితం (2018) భారత్‌తోనే తన చివరి టెస్టు ఆడిన మలాన్ మళ్లీ ఇప్పుడు అదే ప్రత్యర్థిపై పునరాగమనం చేశాడు. టి20 నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ అయిన మలాన్ కాస్త వేగంగా ఆడగా... హమీద్ (195 బంతుల్లో 68; 12 ఫోర్లు)మాత్రం టెస్టుకు తగిన ఇన్నింగ్సే ఆడాడు. అయితే అతన్ని జడేజా బౌల్ట్ చేయడంతో 159 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. రెండు టెస్టులాడినా ఒక్క వికెట్ కూడా తీయని జడేజాకు ఈ సిరీస్‌లో దక్కిన తొలి వికెట్ ఇదే! అనంతరం సూపర్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రూట్, మలాన్‌కు జతయ్యాడు. ముచ్చటగా మూడో శతకం... స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్ జాగ్రత్త పడింది. మరో అవకాశమివ్వకుండా రూట్, మలాన్ సమన్వయంతో ఆడారు. 182/2 స్కోరు వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లారు. రెండో సెషన్లో రూట్ వన్డే ఆట ఆడేశాడు. జడేజా వేసిన ఇన్నింగ్స్ 71వ ఓవర్లో రెండు వరుస బౌండరీలు బాదిన రూట్ పేసర్లు ఇషాంత్, షమీల బౌలింగ్‌లోనూ యథేచ్చగా ఫోర్లు బాదాడు. ఈ క్రమంలోనే ముందుగా వచ్చిన మలాన్ కంటే 57 బంతుల్లోనే (7 ఫోర్లు) రూట్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు 250 పరుగులు దాటింది. ఆపై మలాన్ కూడా 99 బంతుల్లో (8 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. టీ విరామానికి ముందు మలాన్‌ను సిరాజ్ అవుట్ చేయడంతో మూడో వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆఖరి సెషన్లో 5 ఇంగ్లండ్ వికెట్లు కూలినా అప్పటికే భారత్‌కు జరగాల్సినంత నష్టం జరిగిపోయింది. ఇంగ్లండ్‌కు ఆధిక్యం అమాంతం పెరిగింది. బెయిర్ స్టో అండతో రూట్ సెంచరీ 124 బంతుల్లో సెంచరీ (12 ఫోర్లు) సాధించాడు. షమీ స్వల్ప వ్యవధిలో బెయిర్ స్టో (29), బట్లర్ (7) వికెట్లను పడేశాడు. తర్వాత రూట్‌ను బుమ్రా బౌల్డ్ చేశాక... టెయిలెండర్లు ఓవర్టన్, స్యామ్ కరన్ (15) జట్టు స్కోరును 400పైచిలుకు తీసుకెళ్లారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 78 ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (బి) షమీ 61; హమీద్ (బి) జడేజా 68; మలాన్ (సి) పంత్ (బి) సిరాజ్ 70; రూట్ (బి) బుమ్రా 121; బెయిర్‌స్టో (సి) కోహ్లి (బి) షమీ 29; బట్లర్ (సి) ఇషాంత్ (బి) షమీ 7; మొయిన్ అలీ (సి) (సబ్) అక్షర్ (బి) జడేజా 8; స్యామ్ కరన్ (సి) (సబ్) మయాంక్ (బి) సిరాజ్ 15; ఓవర్టన్ బ్యాటింగ్ 24; రాబిన్సన్ బ్యాటింగ్ 0; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (129 ఓవర్లలో 8 వికెట్లకు) 423. వికెట్ల పతనం: 1–135, 2–159, 3–298, 4–350, 5–360, 6–383, 7–383, 8–418. బౌలింగ్: ఇషాంత్ 22–0–92–0, బుమ్రా 27–10–58–1, షమీ 26–7–87–3, సిరాజ్ 23–3–86–2, జడేజా 31–7–88–2. 2021లో రూట్ జోరు అత్యద్భుత ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రికార్డులను తిరగరాస్తున్నాడు. 2021లో ఇప్పటి వరకు 11 టెస్టుల్లో 21 ఇన్నింగ్స్‌లు ఆడిన అతను 69.90 సగటుతో 1398 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు ఉన్నాయి. భారత్‌పైనే 875 పరుగులు చేయగా 4 సెంచరీలు సాధించాడు. ఇదే జోరును అతను కొనసాగిస్తే ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగుల మొహమ్మద్ యూసుఫ్ (1788) రికార్డును అతను అధిగమించవచ్చు. ప్రస్తుత సిరీస్‌తో పాటు ఈ ఏడాది ‘యాషెస్’తో కలిపి రూట్ కనీసం మరో ఐదు టెస్టులు ఆడే అవకాశం ఉంది. అతను మరో 391 పరుగులు చేస్తే చాలు. -
ఫుట్‌బాల్‌తో మెదడుకు డేంజర్
న్యూఢిల్లీ : సాకర్‌గా పిలిచే ఫుట్‌బాల్ ఆట పట్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో క్రేజీ ఉన్న విషయం తెల్సిందే. అందుకు కారణం ప్రత్యర్థి పద్మ వ్యూహాలను తప్పించుకుంటూ క్రీడాకారులు ఫుట్‌బాల్‌ను పాదాలతో, మోకాళ్లతో గోల్‌వైపు తీసుకెళ్లి కాళ్లతోనో, తలతోనో గోల్ చేయడం ఉత్కంఠను రేపుతుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘పీలే’ లాగే వెనుతిరిగి రివర్స్ కిక్ కొడితే ఉత్సాహం రెండింతలు అవుతుంది. ఫుట్‌బాల్ క్రీడకు సంబంధించి ఓ ప్రమాదకరమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. క్రీడాకారులు తలతో ఫుట్‌బాల్‌ను కొట్టడం వల్ల సామాన్యులకన్నా మూడున్నర రెట్లు ఎక్కువగా మెదడు జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అమెరికా ఫుట్బాలర్లపైన అధ్యయనం జరిపిన ప్రముఖ డాక్టర్ బెన్నెట్ ఒమలు కనుగొన్నారు. అందుకని ఫుట్ బాల్ క్రీడలో తలతో బాల్‌ను కొట్టడాన్ని నిషేధించాలని, అది సాధ్యం కాకపోతే కనీసం 18 లోపు పిల్లలు అలా చేయకుండా నిబంధన విధించాలని ఆయన ప్రపంచ క్రీడాధికారులకు పిలుపు ఇచ్చారు. క్రీడల్లో రాణించడం కోసం చిన్న పిల్లలప్పటి నుంచి ఫుడ్‌బాల్ నేర్పిస్తున్నారని, అందులో భాగంగా వారు తలతో బాల్‌ను కొడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు మెదడు సంపూర్ణంగా అభివృద్ధి చెందదని, ఫుట్‌బాల్ దెబ్బల వల్ల వారిలో మెదడు అభివృద్ధి మందగిస్తుందని ఆయన హెచ్చరించారు. తలవొంచి బాల్‌ను కొట్టినప్పుడల్లా మెదడుకు కనిపించనంత సూక్ష్మ స్థాయిలో గాయం అవుతుందని, ఊహాత్మకంగా చెప్పడం లేదని సైంటిఫిక్‌గా చెబుతున్నానని ఆయన తెలిపారు. ఫుట్‌బాల్‌ను కొట్టేటప్పుడు తల అటూ ఇటు తిప్పుతారని, అప్పుడు కపాలం లోపల మెదటు అటూ ఇటూ ఊగుతుందని, ఫుట్‌బాల్ తగిలినప్పుడల్లా మెదడుకు ఒక చోట కాకుండా పలు చోట్ల గాయాలు అయ్యే ప్రమాదం ఉందని, తొలుత దీని ప్రభావం పెద్దగా కనిపించక పోవచ్చని, గాయాలు పెరిగినప్పుడు, వయస్సు మీరినప్పుడు మెదడుకు సంబంధించిన సమస్యలు వేధిస్తాయని ఆయన చెప్పారు. ఫుట్‌బాల్ వల్ల రిస్క్ ఉందనే విషయం 2002లో ప్రముఖ అమెరికా ఫుట్‌బాల్ ప్లేయర్ మైక్ వెబ్‌స్టర్‌కు అటాప్సీ చేసినప్పుడు ఆయన మెదడులో వచ్చిన మార్పులు గమనించానని అప్పటికే న్యూరాలజిస్ట్ అయిన బెన్నెట్ చెప్పారు. ఆయన 50 ఏళ్లకు మరణించాడని, అప్పటికే ఆయన మెదడులో అన్ని మార్పులు రాకూడదని ఆయన అన్నారు. మెదడుకు పునరుత్పత్తి లక్షణం లేదుగనుక దాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. ఆ తర్వాత చాలా మంది ఫుట్‌బాలర్లపై పరీక్షలు జరపగా, వారిలో కొందరికి ‘క్రానిక్ ట్రామాటిక్ ఎన్సిఫాలోపతి’ ఉన్నట్లు తేలిందని ఆయన చెప్పారు. దీనివల్ల డిమెన్షియా కూడా వస్తుందని ఆయన హెచ్చరించారు. తన హెచ్చరికలను పరిగణలోకి తీసుకున్న అమెరికా సాకర్ ఫెడరేషన్, 11 ఏళ్ల లోపు పిల్లలు తలతో ఫుట్‌బాల్ ఆడకుడదంటూ నిషేధం విధించిందని, 11 నుంచి 13 ఏళ్ల పిల్లలు పరిమితంగా ఆడాలంటూ ఆంక్షలు విధించిదని డాక్టర్ బెన్నెట్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఆయన ప్రస్తుతం కాలిఫోర్నియా యూనివర్శిటీలోని మెడికల్ పాథాలజీ విభాగంలో అసోసియేట్ క్లినికల్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. -
‘నగర పాలన’పై ఆరా
గజ్వేల్: నగర పంచాయతీ పాలన తీరుపై ‘బాబోయ్ ఇదేం నగర పాలన’ శీర్షికన శనివారం ప్రచురితమైన ‘సాక్షి’ కథనం సంచలనం సృష్టించింది. ప్రధానంగా ఇళ్ల నిర్మాణ అనుమతుల్లో దళారుల ప్రమేయం, జాప్యం, పన్నుల పెరుగుదల తదితర అంశాలను వివరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయ పేషీ ఆరాతీయడమే కాకుండా.. విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు శనివారం పట్టణంలోని తన కార్యాలయంలో నగర పంచాయతీకి చెందిన అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను ఇబ్బందికి గురిచేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. ఇళ్ల నిర్మాణ అనుమతి కోసం ఎవరు ధరఖాస్తు చేసుకున్నా వారంలో అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. ఏదేని కారణంతో అనుమతిని ఇవ్వకపోతే...సంబంధిత నిర్మాణాదారులకు కారణాలను వివరిస్తూ నోటీసు అందజేయాలని సూచించారు. అలాకాకుండా అవకతవకలకు పాల్పడితే ఊరుకునేదిలేదన్నారు. ఇదిలావుంటే నగర పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం నుంచి ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ బాక్స్‌ను వారానికోసారి తెరిచి ఫిర్యాదులను తానే స్వయంగా పరిశీలించి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అనుమతుల విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడినా, జాప్యం చేసినా నిర్మాణాదారులు నేరుగా తన దృష్టికి తీసుకువస్తే..బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ముగ్గురు అధికారులపై ఫిర్యాదులు... నగర పంచాయతీలో కీలకమైన ముగ్గురు అధికారులపై శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో మంత్రి హరీష్‌రావుకు మెజార్టీ కౌన్సిలర్లు ఫిర్యాదుచేసినట్లు తెలిసింది. ఆ ముగ్గురు అవకతవకలకు పాల్పడటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు వివరించారని తెలిసింది.