hospital bills payment
-
హెల్త్ ఇన్సూరెన్స్ సగటు క్లెయిమ్ రూ.42,000
న్యూఢిల్లీ: దేశంలో సగటు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తం రూ.42,000గా ఉంది. మొత్తం మీద 15 శాతం క్లెయిమ్‌లు మాత్రమే రూ.లక్ష మించి ఉంటున్నాయి. సెక్యూర్ నౌ ఈ వివరాలను ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. హాస్పిటల్లో 5 రోజులకు పైగా ఉండి చికిత్స తీసుకోవాల్సి వచ్చినప్పుడు, క్లెయిమ్ రూ.5 లక్షలు మించుతుందనే విషయాన్ని పాలసీదారులు పరిగణనలోకి తీసుకోవాలని.. అలాగే, బీమా సంస్థలు సైతం పాలసీల రూపకల్పనలో ఈ విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని నివేదిక ప్రస్తావించింది. రీయింబర్స్మెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను పరిశీలించినప్పుడు.. హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉంటున్నారు, క్లెయిమ్ మొత్తం? పరిష్కార శాతం, భారత్‌లో క్లెయిమ్ పరిష్కార ప్రక్రియలో సమర్థత అంశాలు తెలుస్తాయని సూచించింది. 3,846 రీయింబర్స్మెంట్ క్లెయిమ్‌ల పత్రాలను సెక్యూర్‌నౌ విశ్లేషించింది. భౌగోళికంగా భిన్న ప్రాంతాలు, వివిధ బీమా సంస్థల క్లెయిమ్‌లను పరిశీలించినప్పుడు ఈ అంశాలు తెలిశాయి. క్లెయిమ్‌లలో 3 శాతం ప్రమాదం కారణంగా ఉంటున్నాయి. వీటి సగటు క్లెయిమ్ రూ.33,000గా ఉంటోంది. హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉంటున్నారనేది హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లలో కీలక అంశంగా సెక్యూర్ నౌ ఇన్సూరెన్స్ బ్రోకర్ సహ వ్యవస్థాపకుడు కపిల్ మెహతా తెలిపారు. సాధారణంగా హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకోవడం అన్నది రెండు రోజులుగా ఉంటుంటే, 21 శాతం కేసుల్లో మూడు రోజులకంటే ఎక్కువగా ఉంటున్నట్టు ఈ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. దీంతో ఎక్కువ రోజుల పాటు హాస్పిటల్లో చేరాల్సి వస్తే రక్షణ ఇచ్చే కాంప్రహెన్సివ్ కవర్ అవసరమని తెలిపింది. మేటర్నిటీ క్లెయిమ్‌లు ఎక్కువ 50 శాతానికి పైగా క్లెయిమ్‌ల్లో పరిష్కార రేటు 80 శాతానికి పైన ఉంటోంది. మేటర్నిటీ క్లెయిమ్‌లు మొత్తం క్లెయిమ్‌ల్లో 20 శాతంగా ఉంటున్నాయి. జ్వరానికి సంబంధించి 5, కంటి సర్జరీలకు సంబంధించి 5 శాతం, ప్రమాదాలకు సంబంధించి 3 శాతం క్లెయిమ్‌లు వస్తున్నాయి. మొత్తం క్లెయిమ్‌లలో కేన్సర్ కేసులకు సంబంధించినవి కేవలం ఒక్క శాతంగానే ఉన్నాయి. కాకపోతే సగటు క్లెయిమ్ మొత్తం అధికంగా ఉంటోంది. -
ఐసీయూలో నటుడు.. ఆదుకున్న హీరో
బాలీవుడ్ నటుడు ఫారజ్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫరాజ్ చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చైందని, ఆర్థికంగా తమ పరిస్థితి బాగా లేనందున సహాయం అందించాల్సిందిగా కోరుతూ ఆయన సోదరుడు ఫండ్‌రైజింగ్ ప్లాట్‌ఫాంలో తమ దీనస్థితిని వివరిస్తూ సుదీర్ఘ పోస్టు షేర్ చేశాడు. దీనిపై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పందించారు. ఫరాజ్ మెడికల్ బిల్లులన్నింటిని భాయి జాన్ చెల్లించారు. ఈ విషయాన్ని నటి కాశ్మీరా షా వెల్లడించారు. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా సల్మాన్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆమె ‘మీరు నిజంగా చాలా గొప్ప మనిషి. ఫరాజ్ ఖాన్‌కి సాయం చేసినందుకు ధన్యవాదాలు. అతడి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఈ సమయంలో మీరు అతడికి మద్దతుగా నిలిచి సాయం చేశారు. నేను ఎల్లప్పుడు మిమ్మల్ని ఆరాధిస్తాను. జనాలు ఈ పోస్ట్‌ని ఇష్టపడకపోవచ్చు. కానీ నేను పట్టించుకోను. వారు నన్ను ఫాలో కాకపోయినా నాకు అభ్యంతరం లేదు. చిత్ర పరిశ్రమలో నేను కలుసుకున్న అత్యంత గొప్ప వ్యక్తి మీరు’ అంటూ కాశ్మీరా ఇన్స్టాగ్రామ్ వేదికగా సల్మాన్‌పై ప్రశంసలు కురిపించారు. (చదవండి: భాయ్ బరిలో దిగుతున్నారు) ఇక నెటిజనులు కూడా ‘ఆయనలాంటి వ్యక్తి ఎవరూ లేరు.. సల్మాన్ నిజంగా ఓ లెజెండ్’.. ‘భాయిజాన్‌ని గౌరవించండి.. మీ వెనక ఎలా అయినా మాట్లాడుకోనివ్వండి.. మా అందరికి తెలుసు మీరు మీ చుట్టూ ఉన్న వారిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో.. నిస్సహాయులు, ఆపదలో ఉన్న వారికోసం మీరు ఎంత శ్రద్ధ వహిస్తారో మాకు తెలుసు’ అంటూ అభినందిస్తున్నారు. ఇక 1990 నాటి నటుడు ఫారజ్ ఖాన్ చెస్ట్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధ పడుతున్నారు. ప్రస్తుతం ఆయనను బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యం నిమిత్తం 25 లక్షల రూపాయలు అవసరం ఉందని ఆదుకోవాలని ఆయన సోదరుడు కోరారు. ఇప్పటికే పూజా భట్ తన వంతు సాయం చేసిన సంగతి తెలిసిందే. -
మామీద పడి తినొద్దు.. మీ దేశానికి పొండి!
-
మామీద పడి తినొద్దు.. మీ దేశానికి పొండి!
జాతి విద్వేష వ్యాఖ్యలతో కొందరు అమెరికన్ పౌరులు విదేశీయులను తీవ్రంగా అవమానిస్తున్నారు. దీనికి సంబంధించిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా డల్లస్ కౌంటీ పరిధిలోని ఇర్వింగ్ నగరంలో గల వాల్‌మార్ట్ దుకాణంలో జరిగిన ఓ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపిస్తోంది. తాము కష్టపడి పనిచేసి పన్నులు కడుతుంటే విదేశీయులు తమ మీద పడి బతికేస్తున్నారని, ''మీ సొంత దేశానికి వెళ్లిపోండి'' అని అతగాడు అన్నాడు. వాల్‌మార్ట్ దుకాణంలో పనిచేసే ఆదెలా అనే మహిళ ఎల్ సాల్వెడార్ నుంచి 20 ఏళ్ల క్రితమే వచ్చారు, ఆమెకు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. వాల్‌మార్ట్ దుకాణానికి వచ్చిన శ్వేత జాతీయుడు ఆమెతో దురుసుగా మాట్లాడటమే కాక, తనకు సాయం చేయడానికి తెల్లజాతివారే కావాలని అడిగాడు. విషయం ఏమిటంటే.. వాల్ మార్ట్ స్టోర్‌కు వచ్చిన ఆ శ్వేతజాతి కస్టమర్, తన కళ్లద్దాలతో ప్యాకెట్ల మీద ఉన్నవి సరిగా కనిపించడం లేదని చెప్పాడు. దాంతో ఆదెలా ఆయనకు ఒక వైద్యుడిని కలవాల్సిందిగా సూచించారు. అయితే ఆమె సాయం తీసుకోవడానికి నిరాకరించిన అతడు.. తనకు తెల్లవాళ్లే కావాలని చెప్పాడు. దాంతో ఆదెలా మీరు జాతి విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని అతడికి చెప్పడమే కాక, సూపర్వైజర్కు కూడా తెలియజేసినా, ఆయన కాన్ఫరెన్స్ కాల్లో బిజీగా ఉండటంతో పట్టించుకోలేదు. అంతలో అక్కడే ఎలక్ట్రిక్ వీల్‌చెయిర్‌లో ఉన్న ఓ నల్లజాతి మహిళ గురించి కూడా ఆ శ్వేతజాతీయుడు దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. ''ఆమెను చూడండి, ఆమె ఆస్పత్రి బిల్లులు ఎవరు చెల్లిస్తున్నారు, నేనే.. అవును, నేను ఆమె బిల్లులు చెల్లిస్తున్నాను. ఆమె విదేశీయురాలు. ఇక్కడికి వచ్చింది. అనారోగ్యం పాలై బాగా లావెక్కింది. అందువల్ల ఆమె ఏమీ చేయలేదు, పని కూడా చేయలేదు. కానీ నేను ఆమె బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. నేనేమైనా లావుగా ఉన్నానా? నేను రోజూ పనికి వెళ్లి, పన్నులు చెల్లిస్తున్నాను. ఆ పన్నులతోనే ఆమెకు చికిత్స జరుగుతోంది'' అన్నాడు. అయితే, తాను కూడా ఉద్యోగం చేసి, పన్నులు చెల్లిస్తున్నానని ఆదెలా అతడికి సమాధానం ఇచ్చారు. కానీ అతడు అక్కడితో ఆగలేదు. ''తెల్లవాళ్లు కష్టపడి పనిచేస్తుంటే విదేశీయులంతా మామీద పడి బతికేస్తున్నారు. అవును. నేను నీకు నిజం చెబుతున్నాను. మీరు ఇక్కడి నుంచి వెళ్లడానికి రాలేదు, ఇక్కడే ఉండిపోతారని నాకు తెలుసు. కానీ మీరు మీ సొంత దేశాలకు వెళ్లిపోయి అక్కడ మీ దేశాలను బాగు చేసుకోండి'' అని వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత సూపర్వైజర్ రావడంతో అతడు అక్కడినుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత సూపర్వైజర్కు ఆదెలా అతడి సంభాషణ మొత్తాన్ని రికార్డు చేసిన వీడియో చూపించారు. తనకు ఏం చేయాలో తెలియలేదని, ఏడవాలో వద్దో కూడా అర్థం కాలేదని అన్నారు. ఆ శ్వేతజాతీయుడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలని వాల్‌మార్ట్‌లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులకు సూపర్వైజర్ చెప్పారు గానీ, అతడు అప్పటికే వెళ్లిపోయాడు. ఇలాంట జాతివివక్షను తాను ఇంతవరకు ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆదెలా వాపోయారు. అమెరికాలో జాతివిద్వేషంపై మరిన్ని కథనాలు చూడండి... అమెరికాలో భారతీయులపై మళ్లీ దాడి అమెరికాలో జాతి విద్వేష కాల్పులు విద్వేషపు తూటా! మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా? భారతీయుల రక్షణకు కట్టుబడి ఉండాలి కాల్పులపై శ్వేతసౌదం ఏం చెబుతుందో? నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి ‘తరిమేయండి.. లేదా తలలో బుల్లెట్లు దించండి’