Ichchapuram
-
ఇచ్ఛాపురం.. ఇచ్చట పనిచేయలేం!
ఇచ్ఛాపురం రూరల్: జిల్లా శివారు మండలమైన ఇచ్ఛాపురంలో పని చేసేందుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. ఇక్కడ పనిచేయడం కత్తిమీద సాములా మారిందని భయపడుతున్నారు. ధైర్యం చేసి వచ్చిన అధికారులు కూడా నెల తిరిగే లోపే ఏదో ఒక వంకతో ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. ఎన్నికల విధుల నిర్వర్తించడానికి వచ్చిన ఎంపీడీఓ వై.వి.ప్రసాదరావు ఎన్నికల తర్వాత కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేయించుకున్నారు. తర్వాత వచ్చిన ఎంపీడీఓ ఎం.ఈశ్వరరావు తొలుత కొనసాగుదామనే వచ్చారు. అయితే స్థానిక కూటమి నేతల ఒత్తిడి తట్టుకోలేక వారం రోజుల్లోనే రణస్థలం మండలానికి వెళ్లిపోయారు. దీంతో నెల రోజుల నుంచి ఎంపీడీఓ పోస్టు ఖాళీగా ఉంది.⇒ ఈఓపీఆర్డీగా పనిచేసిన సత్యనారాయణ వారం కిందట అరకు వెళ్లిపోయారు. 20 రోజుల క్రితం సెర్ప్ ఏపీఎంగా విధులు నిర్వహించిన సనపల ప్రసాదరావు కంచిలి మండలానికి వెళ్లిపోగా, ఇంత వరకు ఆ పోస్టులో చేర్పించేందుకు డీఆర్డీఏ అధికారులు ఎంత ప్రయత్నం చేసినా.. ఇచ్ఛాపురం వచ్చేందుకు ఏపీఎంలు విముఖత చూపిస్తుండటంతో ప్రస్తుతం ఆ పోస్టు ఖాళీగానే ఉంది.⇒ ఇచ్ఛాపురం, కవిటి మండలాలకు సంబంధించి పంచాయతీరాజ్ డీఈగా పనిచేస్తున్న ఏ.సూర్యప్రకాశరావు మూడు నెలలు క్రితం టెక్కలి ఈఈగా డిప్యూటేషన్‌పై వెళ్లిపోవడంతో కాంట్రాక్టర్లు బిల్లుల కోసం నిత్యం టెక్కలి పరుగులు తీస్తున్నారు.⇒ గృహనిర్మాణ శాఖలో కొంత కాలంగా డీఈ పోస్టు ఖాళీగా ఉండగా, ఇక్కడికి వచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. ఇదే శాఖలో జేఈగా పనిచేసిన దిలీప్‌రెడ్డి కంచిలి మండలానికి బదిలీపై వెళ్లిపోగా, ఈ పోస్టులో చేరేందుకు సంబంధిత శాఖకు చెందిన ఉద్యోగులు ఇష్టపడక పోవడంతో కేశుపురం గ్రామ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న విశ్వనాథంను ఇన్చార్జి ఏఈగా నియమించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.⇒ టి.బరంపురం, మబండపల్లి, తేలుకుంచి, హరిపురం, కేశుపురం, ఈదుపురం, తులసిగాం, కొఠారీ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు బదిలీపై వెళ్లి పోవడంతో ఆ స్థానాల్లో చేరేందుకు ఇతర పంచాయతీ కార్యదర్శులు జంకుతున్నారు.⇒ వీఆర్వోలది కూడా అదే పరిస్థితి. మండలం, పంచాయతీల్లో ప్రతిపక్షం పార్టీకి చెందిన ఎంపీపీ, జెట్పీటీసీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉండటంతో జీర్ణించుకోలేని కూటమి నేతలు తాము చెప్పినట్లే జరగాలంటూ సంబంధిత అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అర్హులైన వారికి సైతం పింఛన్లు తొలగించాలని, గ్రామ స్థాయిలో పనులు జరగాలంటే తాము చెప్పినట్లే జరగాలంటూ ఆదేశాలు జారీ చేస్తుండటం, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్‌చే సంబంధిత అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తుండటంతో ఇక్కడ పనిచేసేందుకు ఇష్టం లేదని అధికారులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. దీంతో సంబంధిత ఖాళీ పోస్టుల్లో ఇన్‌చార్జీలే దర్శనమిస్తున్నారు. -
అమెరికాలో ఇచ్ఛాపురం యువకుడు మృతి
ఇచ్ఛాపురం: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన పి.రూపక్‌రెడ్డి(26) అమెరికాలోని జార్జ్ సరస్సులో మునిగి మృతిచెందాడు. అతని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పి.కవిరాజ్‌రెడ్డి, ధనవతి దంపతుల కుమారుడు పి.రూపక్‌రెడ్డి పది నెలల క్రితం ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడి హరీష్‌బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చేరాడు. డెలావర్‌లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం (ఆగస్టు 27) న్యూయార్క్‌లోని జార్జ్ లేక్‌కు భారతదేశానికి చెందిన ఐదుగురు స్నేహితులతో కలిసి వెళ్లాడు. సరస్సు మధ్యలో పెద్ద రాయి కనిపించడంతో దానిపై నిలుచుని ఫొటోలు తీసుకునేందుకు ఎక్కారు. ఈ క్రమంలో రూపక్‌రెడ్డి, అతని స్నేహితుడు రాజీవ్ ప్రమాదవశాత్తు నీటిలో జారిపడ్డారు. మిగిలిన స్నేహితులు రాజీవ్‌ను కాపాడగా, రూపక్‌రెడ్డి నీటిలో మునిగిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రెస్క్యూ టీం వచ్చి గాలించిం రూపక్‌రెడ్డి మృతదేహాన్ని వెలికితీశారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో పి.కవిరాజ్‌రెడ్డి, ధనవతి దంపతులు, వారి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
-
ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..
-
సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే
-
మీ జగన్ మార్క్ పథకాలు ఇవి...!
-
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @ఇచ్ఛాపురం (శ్రీకాకుళం జిల్లా)
-
ఇచ్చాపురం: వైఎస్సార్సీపీ సామాజిక బస్సుయాత్ర సభ (ఫొటోలు)
-
‘పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం జగన్‌దే’
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఇచ్చాపురం నుంచి వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆ పార్టీ నేతలు అన్నారు. గురువారం.. ఇచ్ఛాపురంలో మంత్రి బొత్స సత్యనారాయణ జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే వి.కళావతి, గొర్లె కిరణ్ కుమార్, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, వరదు కల్యాణి పాల్గొన్నారు. ‘‘గత నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తాం. ఇచ్చిన హామీలను అమలు చేసిన నాయకుడు సీఎం జగన్. అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలు అందించాం. కేబినెట్లోనూ సామాజిక న్యాయం చేసిన నాయకుడు సీఎం జగన్. వైఎస్సార్సీపీకి ఓటు వేయని వారికి సంక్షేమ పథకాలు అందించాం. సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రతీ నాయకుడూ, కార్యకర్త పనిచేస్తున్నారు, అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అందించాం. విద్యారంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాం. నాడు-నేడుతో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం జగన్‌దే’’ అని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. -
సిక్కోలు గుండెల్లో ఆ గురుతులు పదిలం
ఇచ్ఛాపురం రూరల్: సరిగ్గా నాలుగేళ్ల కిందట.. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి వద్ద.. అశేష జన సందోహం ఓ చారిత్రక ఘట్టానికి సాక్షిగా నిలిచింది. 3,648 కిలోమీటర్ల మేర 341 రోజుల పాటు సాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ఆఖరి అడుగు లొద్దపుట్టిలో పడింది. ఆ అడుగే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు పునాదిని పటిష్టం చేసింది. నాలుగేళ్లయినా ఆ జ్ఞాపకాలు సిక్కోలు గుండెల్లో ఇంకా పచ్చగా మెదులుతున్నాయి. ఒక్కడిగా మొదలై.. ఒక్కొక్కరిని కలుపుకుంటూ.. ఉప నదులు తోడైన మహానదిలా రాష్ట్రమంతా సాగిన ఈ పాదయాత్ర చరిత్రలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. 13 జిల్లాలు, 134 నియోజకవర్గాలు, 231 మండలాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లు, 2,516 గ్రామాల గుండా సాగిన పాదయాత్ర ఆఖరి ఘట్టంలో వైఎస్ జగన్ చేసిన ప్రసంగం ఇంకా చాలా మందికి గుర్తుంది. నేడు అందరితో ప్రశంసలు పొందుతున్న నవరత్నాలను ఆనాడే వైఎస్ జగన్ వివరించారు. పాదయాత్రలో చూసిన కష్టాలతోనే సంక్షేమ పథకాలకు ఊపిరి పోశారు. ఈ యాత్ర ఇచ్చిన సత్తువతోనే జనం గుండెల్లో స్థానాన్ని పదిలం చేసుకున్నారు. యాత్ర ముగింపునకు గుర్తుగా ఇచ్ఛాపురంలో విజయ స్థూపం కూడా ఏర్పాటు చేశారు. ఇదిప్పుడు మంచి పర్యాటక స్థలంగా పేరు పొందింది. కోట్ల హృదయాలను గెలుచుకున్నారు ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగిన ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ముఖ్యంగా ఆయన ప్రజల కష్టాలను నేరుగా చూడటంతో అవి తీర్చడానికే హామీలిచ్చి 97 శాతం నెరవేర్చారు. ఆయనతో అడుగులు కలపడం అదృష్టంగా భావిస్తున్నాను. రానున్న ఎన్నికల్లో ఇచ్ఛాపురం నియోజకవర్గాన్ని జగనన్నకు కానుకగా ఇస్తాం. – పిరియా సాయిరాజు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, ఇచ్ఛాపురం ఆ చెమట చుక్కే అభివృద్ధికి చుక్కాని ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చిందించిన చెమట చుక్కలన్నీ రాష్ట్రాభివృద్ధికి చుక్కానిలయ్యాయి. ఓ సమర్థుడైన పాలకుడి పాలన కోసం ఎదురు చూసిన కోట్లాది మంది ప్రజల కలలను నిజం చేస్తూ ఆయన సంక్షేమ పాలన సాగిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఇచ్ఛాపురంలో పడిన జగనన్న అడుగుల చప్పుళ్లు, ఇచ్చిన హామీలు, నెరవేర్చిన వైనాలు సిక్కోలు ప్రజలు ఎప్పటికీ తమ గుండెల్లో పదిలంగానే ఉంటాయి. – పిరియా విజయ, జిల్లాపరిషత్ చైర్పర్సన్, శ్రీకాకుళం కలలో కూడా ఊహించని అవకాశం ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ము ఖ్యమంత్రి బడుగు, బలహీన వర్గాలకు అత్యున్నత స్థానాలు ఇవ్వలేదు. తన క్యాబినెట్లో దళితులకు ఉన్నత పదవులు ఇచ్చిన జగనన్న ఇచ్ఛాపురం శివారు ప్రాంతంలో నన్ను డీసీఎంఎస్ చైర్‌పర్సన్‌గా ఎంపిక చేశారు. నాకు ఈ అవకాశం వస్తుందని కలలోనైనా అనుకో లేదు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించి, నా లాంటి వంద లాది మందిని అందలమెక్కించారు. – ఎస్.సుగుణ, డీసీఎంఎస్ చైర్పర్సన్ -
వి‘హంగామా’.. విదేశీ పక్షులతో ‘తేలుకుంచి’ పులకింత
సాక్షి, శ్రీకాకుళం: పచ్చని చెట్లు తెల్లటి దుప్పటి కప్పుకున్నాయా.. అన్నట్లు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి గ్రామంలో విదేశీ పక్షులు కనువిందు చేస్తున్నాయి. మేఘాల పల్లకిలో వేల కిలోమీటర్లు అలుపూ సొలుపు లేకుండా పయనించి అబ్బురపరుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు చిత్ర విచిత్రమైన చప్పుళ్లతో చెట్లపై సందడి చేస్తున్నాయి. ఇవీ ప్రత్యేకతలు.. చెట్లపై కొమ్మలు, రెమ్మలు ఉంటే తప్ప గూడు ఏర్పాటు చేసుకోలేని ఈ పక్షులు గుడ్లు పెట్టేందుకు చెట్లనే ఆశ్రయిస్తుంటాయి. ఒక్కో పక్షి 2 నుంచి 6 గుడ్లు వరకు పెడుతుంటాయి. 27 నుంచి 30 రోజుల వరకు తల్లి పక్షి గుడ్లు పొదుగుతుంది. పొదిగిన రోజు నుంచి 36 రోజుల పాటు ఆహారాన్ని తీసుకువచ్చి అందించి సంరక్షిస్తాయి. పిల్ల పక్షులు ఎగిరేంత వరకు తల్లి పక్షి గానీ, మగ పక్షి గానీ గుళ్లలో కాపలాగా ఉంటాయి. ఏటా తొలకరి జల్లులు కురిసే జూన్‌లో సైబీరియా నుంచి వస్తోన్న ఈ పక్షుల అసలు పేరు ఓపెన్ బిల్ స్టార్క్స్ (నత్తగొట్టు కొంగలు, చిల్లు ముక్కు కొంగలు). శాస్త్రీయ నామం ‘అనస్థోమస్’. తూర్పు–దక్షిణాసియా ఖండంలో ముఖ్యంగా భారత్, శ్రీలంక నుంచి మొదలుకొని తూర్పు ప్రాంతంలో విస్తారంగా సంచరిస్తుంటాయి. వీటి జీవిత కాలం సుమారు 30 ఏళ్లు. బాగా ఎదిగిన పక్షి 81 సెంటీమీటర్ల పొడవు, 11 కిలోల బరువు ఉంటుంది. రెక్కలు విప్పారినప్పుడు 149 సెంటీ మీటర్ల వరకు ఉంటుంది. పగలంతా తంపర భూములు, వరి చేలల్లో తిరుగుతూ చేపలు, నత్తలు, కప్పలు, పురుగులు, ఆల్చిప్పలను ఆహారంగా తీసుకుంటాయి. 6 నెలల పాటు పిల్లలతో గడిపిన పక్షులు పిల్లలు ఎగిరేంత బలం రాగానే డిసెంబర్, జనవరిలో తమ ప్రాంతాలకు పయనమవుతుంటాయి. మోడువారిన చెట్లపై నివసిస్తున్న పక్షులు ఆడపడుచుల్లా విదేశీ పక్షులు.. ఈ పక్షులను తేలుకుంచి గ్రామస్తులు తమ ఆడపడుచుల్లాగా భావిస్తుంటారు. గ్రామస్తులకు వాటితో విడదీయరాని అనుబంధం ఉంది. సకాలంలో పక్షులు గ్రామానికి చేరకపోతే ఇక్కడి ప్రజలు ఆందోళనపడుతుంటారు. ఏటా జూన్‌లో ఈ పక్షుల రాకతోనే నైరుతి పవనాలు ఆరంభమవుతాయని గ్రామస్తుల నమ్మకం. వీటి రాకతో తమ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండుతాయని వారి విశ్వాసం. తాము కూర్చున్న చోట పక్షులు వాలుతాయే తప్ప ఎవ్వరికీ ఎటువంటి హాని చేయవని, వీటిని వేటగాళ్ల బారినుంచి తామే రక్షిస్తుంటామని గ్రామస్తులు చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా పక్షులకు హాని తలపెట్టాలని చూస్తే గ్రామ కట్టుబాటు ప్రకారం ఆ వ్యక్తికి గుండు గీయించి ఊరేగిస్తారు. తిత్లీ, పైలాన్ తుఫాన్ తీవ్రతకు చెట్లు నేలకొరగడంతో విహంగాలకు తేలుకుంచిలో విడిదిలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఏడాదికి వీటి సంఖ్య 30–40% తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం పక్షులు గూళ్లు పెట్టేందుకు నానాపాట్లు పడుతున్నాయి. చెట్లనే ఆవాసాలుగా ఏర్పాటు చేసుకునే ఈ పక్షులు చెట్లు లేక గడ్డికుప్పలు, ఇళ్లపై, పంట పొలాల చాటున గూళ్లు పెట్టుకునేందుకు సిద్ధపడుతున్నాయి. రాత్రి సమయాల్లో విష పురుగులు బారినపడి పక్షులు మృతి చెందుతున్నాయి. పక్షులను సంరక్షించేందుకు గ్రామంలో చెట్లు పెంచాలని అధికారులకు తేలుకుంచి గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
YSR: గుర్తుందా నాటి విజయ గాథ
ఇచ్ఛాపురం: సమర్థత కలిగిన ఓ నాయకుడు పరిపూర్ణ మహానాయకుడిగా రూపాంతరం చెందిన రోజులవి. అప్పటి అధికార పక్షాన్ని దునుమాడుతూ స్వరంలో భాస్వరాన్ని మండించిన కాలమది. ఊరి మధ్య నిలబడి ధిక్కార పతాకాన్ని ధైర్యంగా ఎగరేసిన నేతను జనాలకు చూపిన సమయమది. ఇప్పటికి పంతొమ్మిదేళ్ల కిందట అంటే 2003లో.. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర పుటలో సువర్ణాక్షరాలతో లిఖితమైంది. మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఆయన చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర సరిగ్గా జూన్ 15వ తేదీన ఇచ్ఛాపురంలో ముగిసింది. పాదయాత్ర ముగిశాక ఆయన ప్రస్థానం చరిత్ర చెప్పుకునేలా సాగింది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీని గద్దె దించడానికి అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2003 ఏప్రిల్ 9 తేదీ రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేపట్టారు. తన పాదయాత్రలో ప్రజలను కలిసి వారి కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగారు. వైఎస్సార్ ఆవిష్కరించిన ప్రజాప్రస్థాన విజయ స్థూపం మండు వేసవిలో పాదయాత్ర చేస్తూ చాలాసార్లు అనారోగ్యానికి గురయ్యారు. అయినా ఆ యజ్ఞాన్ని ఆపలేదు. ఇలా సుమారు 68 రోజుల పాటు 11 జిల్లాలు 56 నియోజక వర్గాల గుండా 1470 కిలోమీటర్ల దూరం అలుపెరుగకుండా నడిచి జూన్ 15 తేదీన ఇచ్ఛాపురం పట్టణంలో ప్రజాప్రస్థాన పాదయాత్రకు ముగింపు పలికారు. ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా ప్రజాప్రస్థాన విజయ స్థూపాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు ఆ ప్రాంతం ఇక్కడ పర్యాటకంగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. -
బోన్ క్యాన్సర్ అని తెలియడంతో...
జలుమూరు: మండలంలోని టి.లింగాలుపాడు పంచాయతీకి చెందిన దువ్వారాపు రాము(32) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో పెయింటర్‌గా పనిచేసిన రాము అనారోగ్యం కారణంగా కొద్ది నెలల క్రితం స్వగ్రామం చేరుకున్నాడు. గతంలో మెదడు సంబంధిత వ్యాధి బారిన పడటంతో రెండుసార్లు శస్త్ర చికిత్స చేశారు. ఇటీవల మళ్లీ అనారోగ్యానికి గురి కాగా వైద్యపరీక్షలు చేయించగా బోన్ క్యాన్సర్ అని తేలడంతో మాసికంగా కుంగిపోయాడు. భార్య, పిన్ని చర్చికి వెళ్లిన సమయంలో శ్లాబ్‌కు చున్నీ కట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. రాముకు బాల్యం నుంచి కష్టాలే. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో పిన్ని అసిరిపోలమ్మ అన్నీ తానై పెంచింది. ఈ క్రమంలో వివాహం కూడా చేసింది. రాముకు భార్య యమున, కుమారుడు హర్షవర్దన్ ఉన్నారు. అసిరిపోలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పారినాయుడు తెలిపారు. లారీని ఢీకొట్టిన బైక్ ఇచ్ఛాపురం: ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచిలి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పులారి జానకిరావు (27), పిన్నింటి దర్మరాజు, మద్దిలి ప్రవీణ్‌కుమార్‌లు ఆదివారం ఒడిశా నుంచి ఆంధ్ర వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. సుమండి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని అదుపు తప్పి ఢీకొట్టారు. ఈ ఘటనలో జానకిరావు అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన ధర్మరాజు, ప్రవీణ్‌కుమార్‌లను 108 వాహనంలో ఇచ్ఛాపురం సీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం బరంపురం తీసుకెళ్లారు. ఒడిశా గొలంత్ర పోలీసులు కేసు నమోదు చేసి జానకిరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బరంపురం పెద్దాసుపత్రికి తరలించారు. (చదవండి: భార్యపై కతితో దాడి చేసి...ఆ తర్వాత...) -
పూజించారు.. పట్టుకుపోయారు
ఇచ్ఛాపురం రూరల్: గ్రామదేవత అంటే ఆ దొంగలకు భయంతో పాటు భక్తి మెండుగా ఉంది కాబోలు...ప్రత్యేక పూజలు చేసి మరీ అమ్మవారి వెండి ప్రతిమను ఎత్తుకుపోయారు. ఇచ్ఛాపురం మండలం మండపల్లిలో ఇటీవల తొమ్మిది రోజుల పాటు గ్రామస్తులు ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు పూజా గది తలుపు తాళాన్ని రంపపు బ్లేడ్‌తో కట్ చేసి లోపలికి ప్రవేశించారు. సుమారు 42 తులాల విలువైన అమ్మవారి వెండి ప్రతిమను ఎత్తుకు పోయే ముందు అమ్మవారి సన్నిధిలో పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయని పూజారి రమేష్ రౌళో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సీఐ డి.వి.వి.సతీష్‌కుమార్, రూరల్ ఎస్సై బడ్డ హైమావతిలు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌ను రప్పించి పరిశోధించారు. అమ్మవారి అలంకరణ నగలు, హుండీలను ప్రతి రోజూ పూజారి ఇంటికి తీసుకువెళ్తుండటంతో పెద్ద మొత్తంలో నష్టం కలగలేదని గ్రామపెద్దలు తెలిపారు. (చదవండి: మితిమీరి.. దిగజారి) -
బతుకు నిత్య నృత్యం
ఆ చీకటి లాంటి రూపం.. నీ దేహంపై మోహం వద్దని చెబుతుంది. చేతిలోని కరవాలం.. నీ దుర్గుణాలను తెగనరుకు అంటూ సూచిస్తుంది. మెడలోని పుర్రెల మాల.. ఎన్ని అవాంతరాలు దాటితే బతుకు అంత బాగుంటుందని వివరిస్తుంది. బయటకు వచ్చిన రక్తపు నాలిక.. నీ విజయాలు ప్రపంచానికి చూపడానికి భయపడవద్దని చెబుతుంది. ఆ భయంకరమైన ఆహార్యం.. మనిషంటే మంచి చెడుల కలబోతని వివరిస్తుంది. కానీ వివరాలన్నీ పల్లెపల్లెకూ వెళ్లేదెలా..? సంస్కృత శ్లోకాలు వినిపించని చోట, సాంస్కృతిక నృత్యాలు జరగని చోట ఈ రహస్యాలు ఆ ప్రాంతానికి చెప్పేదెలా..? దానికి సమాధానమే ఈ నాట్యకారులు. కాళికా మాత వేషధారణలో కనిపించే నాట్యకారులు నిజానికి దైవ రహస్యాలు వివరించే దూతలు. ఇంకాస్త లోపలకు వెళితే.. – ఇచ్ఛాపురం రూరల్ చైత్రం నుంచి జ్యేష్ట మాసం వరకు ఉద్దానం పల్లెలు చూసి తీరాల్సిందే. చిరు జల్లులు చిలకరించడానికి మేఘాలు మూటాముల్లె సర్దుకుని ఆకా శయానం చేసే రోజుల్లో ఉద్దానంలో చల్లదనం సంబరాలు జరుగుతాయి. ఆ తర్వాత గ్రామ దేవతల సంబరాలు కొనసాగుతాయి. ఆది, మంగళవారాల్లో ఊ రూరూ మార్మోగిపోతుంది. కానీ అందరి కళ్లు ఒక్కరి మీదే ఉంటాయి. వారే కాళికా వేషధారులు. అమ్మోరు రూపాలుగా పిలిచే కాళీమాత, రాజమ్మ, సంతోషి మాత, భద్రకాళీ, దానప్ప, గురప్ప, మంకినమ్మ అ మ్మవార్ల వేషధారణలో కళాకారులు ఊరూరా నాట్యాలు చేస్తూ కనిపిస్తారు. శ్రమ, అంకితభావం కాళికా దేవి నాట్యమంటే ఆషామాషీ కాదు. తరాలు మారిన కొద్దీ ఆ వేషధారణలోని రహస్యాన్ని విడమరిచి చెప్పే వారు కనుమరుగైపోతున్నారు. కానీ కాలం మళ్లీ మారుతోంది. ఈ నాట్యాలకు పునరుజ్జీవం వస్తోంది. ఎంతో శ్రమ, అంకిత భావం ఉంటే తప్ప ఈ నాట్యం కుదరదు. నిష్టతో, మాంసాహారం తీసుకోకుండా వస్త్రాలంకరణ చేయాలి. కాలికి గజ్జెలు, చేతికి గాజులు, ఒళ్లంతా పసుపు పూసుకొని తలపై కిరీటం ధరించి, నెమలి పింఛాలను ధరించి, రెండు చేతుల్లో పొడవైన కత్తులను చాకచక్యంగా తిప్పుతూ సన్నాయి మేళానికి అనువుగా పాదం కదపాలి. ఒక్కో సమయంలో పూన కం వచ్చి వేష«ధారణలో కళాకారుడు స్పృహ కో ల్పోయిన సందర్భాలు కోకోల్లాలు. దరువుకు అనువుగా.. సాధారణంగా అమ్మవార్ల నృత్యాని కి పద్నాలుగు దరువులుగా డప్పు వాయిస్తారు. ఈ దరువులకు వేషధారణల్లో కళాకారులు వివిధ భంగిమల్లో తాండవం చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. రెండు కత్తులతో గరిడీ దరువు, జులవా దరువు, వసంతమ్మోరు దరువు, భద్రకాళీ దరువు, జాలారీ దరువు, రాజమ్మ దరువు, మంకినమ్మ దరువు, దానప్ప దరువు, మూడు వరసల సవర దరువులతో పాటు మరికొన్ని సన్నాయి మేళం ద్వారా దరువులు వాయిస్తుంటారు. ఈ దరువులకు తగ్గట్టుగా కళాకారుడు ఉగ్ర రూపంలో నృత్యం చేస్తుంటాడు. నిష్టతో వేషధారణ ఆహార నియమాలు పాటి స్తూ నిష్టతో అమ్మవారి వేషధారణ చేస్తుంటాం. కేవలం చిన్న రంధ్రం నుంచే చుట్టూ చూస్తుంటాం. చుట్టూ వందలాది మంది ఉంటూ మమ్మల్ని ఉత్సాహపరుస్తుంటారు. ఆ సమయంలో మాలో పూర్తిగా ఆధ్యా త్మికత్వం నిండిపోతుంది. – కె.కోటేశ్వరరావు, నృత్య కళాకారుడు ఇదే ఉపాధి అమ్మవారి మేళం అంటే నాకు ఎంతో ఇష్టం. సరదా గా నేర్చుకున్న ఈ నృత్యం ఇప్పుడు నాకు ఉపాధి మార్గంగా మారింది. యువకుల్లో ఈ నాట్యంపై ఉన్న అపోహలు కూడా ఇప్పుడు పోయా యి. చాలా మంది నేర్చుకుంటున్నారు. – సురేష్ పండిట్, కాళీమాత నృత్య కళాకారుడు తరతరాలుగా.. మాది ఈదుపురం గ్రామం మా పూర్వీకుల నుంచి తరతరాలుగా ఈ ఆట కడుతున్నాం. ఉద్దానం ప్రాంతంలో చాలా మంది యువకులు ఇప్పుడు మంచి ఆటను ప్రదర్శిస్తున్నారు. – నారాయణ సాహూ, కాళికా ఉపాసకుడు, నృత్య కళాకారుడు -
ఏం జరిగిందో.. ఏ కష్టం వచ్చిందో..?
సాక్షి, ఇచ్ఛాపురం (శ్రీకాకుళం): ఏం కష్టం వచ్చిందోగాని వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మున్సిపాలిటీ పరిధి రత్తకన్న గ్రామం సంతోషం వీధిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకోగా.. ఈది జయలక్ష్మి (21) ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. జయలక్ష్మికి గత ఏడాది మే నెలలో ఒడిశా రాష్ట్రంలోని కోటిలింగి గ్రామానికి చెందిన మంచాల పితాంబర్‌తో వివాహమైంది. ఈమె తల్లిదండ్రులు చంద్రమ్మ, మోహనరావులు కొన్నేళ్ల క్రితం వివిధ ప్రమాదాల్లో మృతి చెందడంతో సోదరి, సోదరులు ఈది నాగమ్మ, రామయ్యలవద్ద పెరిగింది. ఈమె ఆదివారం సాయంత్రం అత్తవారింటి నుంచి కన్నవారిల్లైన సోదరింటికి వచ్చింది. అయితే ఏం జరిగిందోగాని.. సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో వంటగదిలో సీలింగ్ హుక్‌కి ఉరివేసుకొని మృతి చెందింది. చదవండి: (యువతిపై అత్యాచారం, హత్య.. కట్టెల కోసమని అడవిలోకి వెళ్లగా..) ఇంటికి వచ్చిన సోదరి హుక్‌కి వేలాడుతున్న జయలక్ష్మిని చూసి కేకలు వేయడంతో సమీపంలో ఉన్నవారు అక్కడకు చేరుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని సోదరి నాగమ్మ ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్ఐ వి.సత్యనారాయణ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఉద్దానం గూనచారు.. తింటే వదల్లేరు
ఇచ్ఛాపురం రూరల్: ఉద్దానం ప్రాంతంలో చేసే విందుల్లో విశేష వంటకం ‘గూనచారు’. వేడివేడి అన్నంలో గూనచారు వేసుకుంటే ‘ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి’ అంటూ పాట పాడక తప్పదు. ఈ వంటకం అంత రుచికరంగా ఉంటుంది మరి. అరచేతికి అంటిన గూనచారు వాసన వారం రోజులపాటు పోదంటే అతిశయోక్తి కాదు. శ్రీకాకుళం జిల్లాలో ‘భోజీ పులుసు’గా పిలిచే గూనచారు కేవలం ఉద్దానం ప్రాంతానికే సొంతం. మట్టి బాన (పెద్ద కుండ)లో తయారు చేసే ఈ చారు 10 నుంచి 15 రోజులపాటు నిల్వ ఉంచినా చెక్కు చెదరకుండా.. రంగూ, రుచి పోకుండా అంతే రుచిగా ఉంటుంది. ఈ చారును ఉద్దానం వాసులు ఇతర రాష్ట్రాల్లో ఉండే మిత్రులు, బంధువులు, సహోద్యోగులకు పంపిస్తుంటారు. పోషకాల రారాజు గూనచారులో అన్నిరకాల పోషక విలువలు ఉంటాయని విశ్రాంత వైద్యాధికారి డాక్టర్ పూడి రామారావు తెలిపారు. ముఖ్యంగా ఇందులో ఏ, బీ, సీ, డీ, కే విటమిన్లు ఉంటాయని చెప్పారు. ఇది క్యాన్సర్ నిరోధకంగా పని చేస్తుందని.. రక్తహీనతను తగ్గించే ఔషధ గుణాలు, నరాల బలహీనతను తగ్గించే గుణాలు, వీర్యకణాల వృద్ధి, ఐరన్, మాంసకృత్తులు, శరీర నిర్మాణానికి అవసరమైన ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయని ఆయన వివరించారు. గూనచారు ఎసిడిటీని రూపుమాపుతుందని పేర్కొన్నారు. ఇలా తయారు చేస్తారు ► మొదట చింతపండు నానబెట్టి రసం తీయాలి. ఆ రసాన్ని కనీసం గంటపాటు బానలో మరిగించాలి. మరిగించిన రసంలో బెల్లం, పసుపు పొడి, కారం, అరటి ముక్కలు, మునగ, పనస ఇత్యాది కూర ముక్కలు కలపాలి. ► ఇలా తయారైన రసాన్ని మరో గంటసేపు మరిగించాలి. అందులో బాగా వేయించిన బియ్యం పిండిని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ► పోపు పెట్టడం చాలా ముఖ్యమైన ఘట్టం. మొదటిగా వంటనూనెను పావుగంట మరిగించాలి. తరువాత ఉల్లికి గాట్లు పెట్టి ఆ నూనెలో వేసి బాగా వేయించాలి. తర్వాత ఎండుమిరప కాయల్ని దోరగా వేయించాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి ముద్దలు వేయాలి. ఈ పోపు కార్యక్రమం ఇంచుమించు గంటసేపు సాగాలి. ► తయారైన పోపుని బియ్యం పిండి కలిపి, మరిగించిన చింతపండు రసంలో కలిపి తగినంత ఉప్పు, కారం పొడి అందులో వేయాలి. ఆ తరువాత బానపై మూతపెట్టి అరగంట సేపు ఉంచాలి. అంతే.. భోజీ పులుసు అదేనండీ.. అదే ఉద్దానం ‘పేటెంట్’ గూనచారు తయార్. మామూలుగా ఉండదు ఉద్దానం ప్రాంతంలో వివిధ ఫంక్షన్లకు ప్రత్యేకంగా తయారు చేసే గూనచారు మామూలుగా ఉండదు. నాకెంతో ఇష్టమైన వంటకం ఇది. ఉద్యోగరీత్యా ఇతర దేశంలో ఉన్న నేను స్వదేశానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈ చారును తయారు చేయించుకుని విందారగిస్తాను. స్థానికంగా దొరికే మసాలా దినుసులతో తయారు చేసే ఈ చారును ఇతర రాష్ట్రాల్లోని వారికి ఉద్దానం వాసులు బహుమతిగా పంపిస్తుంటారు. ఇప్పటివరకు నేను ఎన్నో రాష్ట్రాలు, దేశాలు తిరిగినప్పటికీ ఉద్దానం ప్రాంతంలో తయారు చేసే గూనచారును ఎక్కడా చూడలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉద్దానం పేటెంట్ గూనచారు. – తిప్పన శంకరరావురెడ్డి, ప్రవాసాంధ్రుడు, తిప్పనపుట్టుగ, ఇచ్ఛాపురం మండలం ఫంక్షన్లలో భలే డిమాండ్ మా తాతల కాలం నుంచీ ఉద్దానం ప్రాంతంలో జరిగే ప్రతి ఫంక్షన్లో గూనచారు వండాల్సిందే. చింతపండు, బెల్లం, పనస పొట్టుతో ప్రత్యేకంగా తయారు చేసే ఈ చారు చాలా రుచికరంగా ఉంటుంది. పెళ్లిళ్ల సీజన్లో మాకు చాలా డిమాండ్ ఉంటుంది. దీనిని చాలా జాగ్రత్తగా తయారు చేయాలి. ముఖ్యంగా చింతపండు, బెల్లం, ఉల్లిపాయలతో తయారు చేసే పాకం బాగుండాలి. చారు వాసన సుమారు అర కిలోమీటరు వరకు వ్యాపిస్తుంది. 15 రోజులపాటు నిల్వ ఉంచుకుని దర్జాగా తినొచ్చు. – దున్న ఢిల్లీరావు, గూనచారు తయారీదారు, బూర్జపాడు, ఇచ్ఛాపురం మండలం -
అచ్చెన్న ఎత్తులు చిత్తు, రెండు చోట్లా పరాభవం
సాక్షి, శ్రీకాకుళం: పలాస–కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఒక ఎంపీ, మరో ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు, జిల్లాలోని మిగతా మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ ప్రతినిధులు దృష్టి సారించారు. ఎన్నికల ఆద్యంతం అక్కడే తిష్ట వేశారు. ఫోన్లో బెదిరింపులకు దిగారు. నేరుగా బేరసారాలు సాగించారు. అక్కడితో ఆగకుండా పెద్ద ఎత్తున డబ్బును సమకూర్చి దగ్గరుండి పంపిణీ చేయించారు. ఎలాగైన గెలవాలని విశ్వప్రయత్నాలు చేశారు. కానీ ప్రజలు వాటిన్నింటినీ తిప్పికొట్టారు. జిల్లాలో పలాస, ఇచ్ఛాపురం, పాలకొండలో ఎన్నికలను టీడీపీ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వీటిపైనే ఎక్కువ దృష్టిసారించారు. పోలింగ్ వరకు తమ శక్తియుక్తులన్నీ ప్రదర్శించారు. అచ్చెన్నతో పాటు ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్, మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర్ శివాజీ, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌతు శిరీష, మిగతా మాజీ ఎమ్మెల్యేలంతా టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం అడ్డదారులు తొక్కారు. కానీ జనం మాత్రం వైఎస్సార్ సీపీ వైపే నిలబడ్డారు. నిజంగా ఇది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడికి ఘోర పరాభవమే. ఎంపీ రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌కు కూడా చావు దెబ్బ వంటిదే. పంచాయతీ ఎన్నికల్లోనూ కళా వెంకటరావు వంటి వారు ఎంత ప్రయత్నించినా గెలవలేకపోయారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముందు కుట్రలు, కుతంత్రాలు నడవవని ఈ ఎన్నికలు రుజువు చేశాయని వైఎస్సార్సీపీ నేతలు భావిస్తున్నారు. పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు, పాలకొండలో విశ్వాసరాయి కళావతి, పాలవలస విక్రాంత్, ఇచ్ఛాపురంలో పిరియా సాయిరాజ్, నర్తు రామారావు తదితర నేతలే బాధ్యత తీసుకుని గెలిపించారు. చదవండి: గూగుల్ పే ఉందా.. అయితే డబ్బులు పంపండి చిన్నారి ఉసురు తీసింది.. కుక్కలు, కోతులా? హత్యా? -
కన్నీటితో కడుపు నింపలేక..
మందులు కొనడమనే మాట మర్చిపోయి అన్నం పెడితే చాలు అనుకునే స్థితికి వచ్చారు. ఆస్పత్రికి తీసుకెళ్లాలనే ఆలోచన వదిలేసి ఆ పూటకు కడుపు నింపితే అదే పదివేలు అనుకుంటున్నారు. పిల్లలు పుట్టడం, వారు చక్కగా ఎదగడం.. పేదల బతుకుల్లో కనిపించే సంతోషాలివే. కానీ ఆ దంపతులకు ఈ సంతోషం కూడా మిగల్లేదు. కడుపున పుట్టిన బిడ్డ కదల్లేక మంచంపై పడి ఉంటే కనీసం చికిత్స కోసం ఆలోచన చేయలేని దుస్థితి వారిది. కూలికి ఒకరు.. బిడ్డ వద్ద కాపలాకు మరొకరుగా ఉంటూ బతుకీడుస్తున్నారు. కూలి డబ్బులతో కుటుంబం గడవడం కష్టమవుతున్న తరుణంలో బిడ్డ భవిష్యత్ కోసం చేతులు చాచి సాయం కోరుతున్నారు. శ్రీకాకుళం ఇచ్ఛాపురం మండలంలోని కొఠారి గ్రామానికి చెందిన దువ్వు తులసయ్య, తోయమ్మ దంపతులు చేస్తున్న అభ్యర్థన ఇది. సాక్షి, ఇచ్ఛాపురం : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం కొఠారీ గ్రామానికి చెందిన దువ్వు తులసయ్య, తోయమ్మలకు పుట్టిన ఒక్కగానొక్క కొడుకు మోహనరావు. కొడుకు పుట్టగానే తమకు వంశోద్ధారకుడు పుట్టాడన్న సంతోషంతో ఆ దంపతులు మురిసిపోయారు. 7వ తరగతి వరకు ఎంతో చలాకీగా ఉన్న మోహనరావు ఆ తర్వాత ఒక్కసారిగా నీరసించిపోయాడు. కాళ్లు ముందుకు పడకపోవడం, చేతుల్లో చలనం లేకపోవడంతో మంచానికే పరిమితమైపోయాడు. కూలి చేసుకుని బతికే ఆ దంపతులకు కొడుకు పరిస్థితి అర్థం కాలేదు. అప్పులు చేసి మరీ విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, బరంపురం ఆస్పత్రులకు తిప్పారు. అయినా ఫలితం కనిపించలేదు. రోజూ కూలి పనికి వెళ్తే గానీ వారి కడుపు నిండదు. ఇలాంటి పరిస్థితుల్లో రూ. లక్షలు ఖర్చు పెట్టి కుమారుడికి చికిత్స చేయించడం వారికి అసాధ్యమైపోయింది. ఎదిగొచ్చిన కొడుకుకు తల్లి తోయమ్మ చిన్నపిల్లాడిలా సపర్యలు చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో 64 శాతం అంగ వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం ఉండగా,స్థానిక టీడీపీ నేతలు కేవలం వెయ్యి రూపాయలు పింఛన్ ఇప్పించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దివ్యాంగులకు రూ.3 వేలు అందిస్తున్నారు. అయితే తల్లిదండ్రులిద్దరూ ఒకప్పుడు కూలికి వెళ్లేవారు. కానీ మోహనరావు పరిస్థితి మారినప్పటి నుంచి ఒకరు బిడ్డ వద్ద ఉంటే మరొకరు పనికి వెళ్తున్నారు. ఒకరి కూలి డబ్బులతో కుటుంబం గడవడం, మోహనరావుకు మందులు కొనడం సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దంపతులు సాయం కోరు తున్నారు. బిడ్డ భవిష్యత్‌ను కాపాడడానికి దాతలు చేయూతనిస్తారని ఆశ పడుతున్నారు. సాయమందించాలనుకునే వారు 90590 67952 నంబరును సంప్రదించాలని కోరుతున్నారు. -
వెళ్లిపోయావా నేస్తం..!
సాక్షి, ఇచ్ఛాపురం(శ్రీకాకుళం) : అప్పటి వరకు తరగతి గదిలో ఆనందంగా గడిపిన ఆ స్నేహితులు మధ్యాహ్న భోజనం చేసిన వెంటనే ఇళ్లకు పయనమయ్యారు. మరికొద్ది క్షణాల్లో ఇంటికి చేరుకుంటారనగా గుర్తు తెలియని వాహనం రూపంలో మృత్యువు వెంటాడింది. కళ్ల ముందే ప్రాణస్నేహితుడు మృత్యుఒడిలోకి జారుకుంటే.. ఎదురుగా తీవ్ర గాయాలతో మరో స్నేహితుడు చేసిన ఆర్తనాదాలు అరణ్యరోదనలయ్యాయి. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం గ్రామానికి చెందిన రెయ్యి త్రినాథ్, ఒడిశా రాష్ట్రం చీకటి కేవిటి సువానీ గ్రామానికి చెందిన గారపాన నర్సింహం ప్రాణ స్నేహితులు. వీరిద్దరూ పురుషోత్తపురం మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఇచ్ఛాపురం మండలం బెన్నుగానిపేటకు చెందిన నారద అజయ్ సైతం వీరితో స్నేహంగా మెలిగేవాడు. త్రినాథ్ ఇంటి వద్ద తన బావకు చెందిన ద్విచక్ర వాహనం ఉండేది. ఆయన విదేశాలకు వెళ్లిపోవడంతో త్రినాథ్ అప్పుడప్పుడూ బైక్ నడుపుతుండేవాడు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలకు ఒంటిపూట సెలవులు కావడంతో శుక్రవారం స్కూల్ విడిచిపెట్టిన వెంటనే బెన్నుగానిపేటకు చెందిన స్నేహితుడు అజేయ్‌ను ఇంటివద్ద దించేసి అక్కడి నుంచి కె.సువానీకి చెందిన మరో స్నేహితుడు నర్సింహులను దింపేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో బెన్నుగానిపేట సమీపంలో ఒడిశా నుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో త్రినాథ్ రోడ్డు ఎడమ వైపు తుళ్లిపోగా, బైక్ వెనుక కూర్చున్న నర్సింహ(14) రోడ్డుపై పడిపోవడంతో ముఖానికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. కొంత సమయానికి అటువైపుగా వచ్చిన స్థానికులు 108 అంబులెన్సుకు సమాచారం అందించి త్రినాథ్‌ను ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకు ఒడిశా బరంపురం రిఫర్ చేశారు. నర్సింహ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రికి తరలించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు బైరాగి, నర్సమ్మ, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రూరల్ ఎస్సై కె.లక్ష్మీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సోంపేట బహిరంగ సభలో వైఎస్ విజయమ్మ
-
మీ కోసం పుట్టిన పార్టీ : వైఎస్ విజయమ్మ
సాక్షి, శ్రీకాకుళం : గత ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటైనా నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. చంద్రబాబు మాయమాటలు, తీపి మాటలు విని మోసపోవద్దని ప్రజలకు సూచించారు. డ్వాక్రా మహిళలు, రైతులు, నిరుద్యోగుల ఇలా ప్రతి ఒక్కరిని చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచిస్తున్న వైఎస్ జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని వైఎస్ విజయమ్మ కోరారు. వైఎస్సార్సీపీ ప్రజల కోసమే పుట్టిందని.. ఇది అందరి పార్టీ అని అన్నారు. ఈ ఎన్నికల్లో ఇచ్చాపురం వైఎస్సార్సీపీ అభ్యర్థి పిరియా సాయిరాజ్, ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ను భారీ మెజారిటీతో గెలిపించి వైఎస్ జగన్‌కు ముఖ్యమంత్రిగా ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేటలో జరిగిన ప్రచారసభలో ఆదివారం విజయమ్మ ప్రసంగించారు. ఆమె ఏం మాట్లాడారంటే.. ఒక్క హామీ అయిన నేరవేర్చారా? గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 600 వాగ్దానాలు ఇచ్చారు. వాటిల్లో ఒక్క హామి అయినా నెరవేర్చారా? ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామన్నారు. తెరిచారా? డ్వాక్రా అక్క చెల్లమ్మలకు రుణమాఫీ జరిగిందా? రెండు రూపాయలకే ఇరవైలీటర్ నీళ్లు ఇస్తామన్నారు. ఇచ్చారా? బ్రాందీ షాపులు రద్దు చేస్తామన్నారు. రద్దు చేసారా? నీళ్లు ఇవ్వడం లేదు గాని మద్యం మాత్రం అందుబాటులో ఉంచారు. ప్రతి ఇంటికి రెండువేల రూపాయిలు నిరుద్యోగ భృతి ఇస్తా మన్నారు. ఇచ్చారా? బాబు వస్తే జాబు వస్తుంది అన్నారు. ఒక్కటైనా వచ్చిందా? వీటిపై ప్రజలు ఆలోచన చేయాలి. వైఎస్సార్ పాలన ఒక్కసారి గుర్తుచేసుకోండి.. ఈ రోజు ప్రతి ఒక్కరిని రాజశేఖరరెడ్డిగారి పాలనను గుర్తు చేసుకోమని అడుగుతున్నా. ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకం గుర్తు చేసుకోమని కోరుతున్నా. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104, పంటలకు గిట్టుబాటు ధరలు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు పావలా వడ్డీకే రుణాలు, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు.. ఇలా ప్రతి ఒక్కటీ గుర్తు చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టమని మీ అందర్నీ కోరుతున్నా. రైతే రాజుగా చేశాడు. మళ్లీ జగన్ బాబు అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం వస్తుంది. 9 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎలాంటిదో చూస్తున్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి. రాజన్న రాజ్యం తీసుకొస్తాడు. ఈ ఎన్నికల్లో ఇచ్చాపురం వైఎస్సార్సీపీ అభ్యర్థి పిరియా సాయిరాజ్, ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌లను భారీ మెజారిటీతో గెలిపించండి’ అని విజయమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
ప్రజాసంకల్పయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నాను
-
ఇడుపులపాయ టూ ఇచ్ఛాపురం @ 3648 కీ.మీ
-
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో జనసందోహం