improved facilities
-
మెరుగైన సౌకర్యాలు కల్పిస్తేనే మరిన్ని పతకాలు
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పతకం సాధించాలంటే... ఆ మెగా టోర్నీకి సరితూగే శిక్షణ సౌకర్యాలను రెజ్లర్లకు అందించాలని అంటోంది వినేశ్ ఫొగాట్. ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడలు, స్పెయిన్ గ్రాండ్‌ప్రి టోర్నీల్లో స్వర్ణాలు సాధించి మంచి ఫామ్‌లో ఉన్న 23 ఏళ్ల ఈ హరియాణా రెజ్లర్ జాతీయ శిబిరాల్లో క్రీడాకారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. రెజ్లర్లకు అత్యుత్తమ సౌకర్యాలు అందడం లేదని వాపోయింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నూతన స్పాన్సర్ టాటా మోటార్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఆసియా క్రీడల వీడ్కోలు సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న వినేశ్ ఫొగాట్ గతంతో పోలిస్తే రెజ్లర్ల పరిస్థితి కాస్త మెరుగైందని తెలిపింది. ‘ఆసియా క్రీడల కోసం లక్నోలో నిర్వహిస్తోన్న జాతీయ శిబిరంలో తగిన సౌకర్యాలు లేవు. రెజ్లింగ్ హాల్లో బాగా ఉక్కపోతగా ఉంటోంది. కరెంట్ కూడా ఉండకపోవడంతో ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టాల్సి వస్తోంది. గతంతో పోలిస్తే ఇక్కడ ఆహారం నాణ్యత పెరిగింది. కానీ చాలా విషయాల్లో ఇంకా మార్పు రావాలి. కుస్తీలో ఒలింపిక్స్ పతకం ఆశిస్తారు. కానీ రెజ్లర్లకు అందించే సదుపాయాలు మాత్రం ఆ స్థాయిలో ఉండవు. డబ్ల్యూఎఫ్ఐ రెజ్లర్లకు అండగా నిలుస్తున్నప్పటికీ మిగతా వ్యవస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మెరుగైన ప్రదర్శనకు మెరుగైన శిక్షణ పరిస్థితులుండాలి’ అని ఆమె వివరించింది. -
హజ్‌యాత్రికులకు మెరుగైన ఏర్పాట్లు
సాక్షి, సిటీబ్యూరో: హజ్ యాత్రికులకు మెరుగైన వసతులు కల్పించే విధంగా ప్రభుత్వపరంగా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఎ షుకూర్ వెల్లడించారు. ఆది వారం స్థానిక ఆజాంపురాలోని సహిఫా మసీదులో ఏర్పాటు చేసిన హజ్‌యాత్ర అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. హజ్‌యాత్రికుల కోసం హజ్‌హౌస్‌లో ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హైదారబాద్ క్యాంప్ నుంచి యాత్రికులు బయలుదేరి మక్కా మదీనాలో ప్రార్థనలు పూర్తి చేసుకొని తిరిగి క్యాంపునకు చేరుకునే వరకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సకల సదుపాయలతో కూడిన ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హజ్ యాత్ర–2016 ఆగస్టు 21 నుంచి ప్రారంభమవుతుందని, నిర్దేశించిన ఫ్లైట్ షెడ్యూలు కంటే రెండు రోజుల ముందు క్యాంప్‌కు చేరుకోవాలని సూచించారు. మక్కా మదీనాలో సైతం ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రుబాత్ బసకు ఎంపికైన వారికి మాత్రం బస రుసుం తిరిగి చెల్లిం చడం జరుగుతుందన్నారు. హజ్‌యాత్రపై పూర్తి స్థాయి అవగాహన చేసుకొని విజయవతంగా ప్రార్థనలు ముగించుకొని రావాలని ఆయన ఆకాంక్షిం చారు. కుల్‌హింద్ కార్యదర్శి, మాజీ రాష్ట్ర హజ్ కమటీ సభ్యుడు సయ్యద్ అబుల్ పత్హే బందగి బాషా రియాజ్ ఖాద్రీ, హజరత్ సయ్యద్ అజమ్ అలీ సుఫీ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
గుంతకల్లు, న్యూస్‌లైన్ : రైల్వే ప్రయాణికులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని గుంతకల్లు రైల్వే డివిజనల్ మేనేజర్ మనోజ్‌జోషి వెల్లడించారు. శుక్రవారం డీఆర్ఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన 144వ డీఆర్‌యూసీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో 11 సెక్షన్లు ఉండగా, ఆయా సెక్షన్ల పరిధిలో 1304.71 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ఉందన్నారు. ఇందులో ఏ-1 రైల్వేస్టేషన్ ఒకటి ఉండగా ‘ఏ’ క్లాస్ రైల్వేస్టేషన్లు ఆరు, ‘బీ’ క్లాసు రైల్వే స్టేషన్లు ఎనిమిది, ‘డి’ క్లాసు రైల్వేస్టేషన్లు పది, ‘ఈ’ క్లాసు రైల్వే స్టేషన్లు తొంబై ఒకటి, ‘ఎఫ్’ రైల్వేస్టేషన్లు పదిహేడు రైల్వేస్టేషన్లు ఉన్నాయన్నారు. ఏటా గుంతకల్లు రైల్వే డివిజన్ 200 నుంచి 250 కోట్ల రుపాయలు ఆదాయం ఆర్జిస్తోందన్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో 227.62 కోట్ల రుపాయలు ఆదాయం రాగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 276.86 కోట్ల రుపాయలు ఆదాయం వచ్చిందన్నారు. ప్రయాణీకుల ఆదాయం పెంచే విషయంలో, సౌకర్యాలు కల్పించేందుకు సీనియర్ డీసీఎం స్వామినాయక్తోపాటు డీసీఎం రఘునాథరెడ్డిలు చక్కని ప్రయత్నాలు చేశారన్నారు. గూడ్స్ రవాణా ద్వారా 2012-13లో రూ.472.22 కోట్లు, 2013-14లో రూ.486.60 కోట్లు ఆదాయం లభించిందన్నారు. సండ్రీ ఎర్నింగ్స్, ఇతర కోచింగ్ ద్వారా 47.74 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా ఆదాయం ఆర్జించామన్నారు. ఆయా అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. రైల్వే డివిజన్ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లను ఆధునీకరించడంతోపాటు టాయ్లెట్లు, తాగునీటి సౌకర్యం కల్పించడానికి, వసతీ గదులు ఏర్పాటుకు ప్రయత్నాలు విస్తృతం చేశామన్నారు. ప్రయాణీకుల కోసం కోట్లాది రుపాయలతో చేపట్టిన పనుల్లో ఇప్పటికే 38 పనులు పూర్తి అయ్యాయన్నారు. మరో 106 పనులు చకచకా సాగుతుండగా, అదనంగా చేపట్టిన 147 పనులు ప్రోగ్రెస్‌లో ఉన్నాయన్నారు. ఇదే సమయంలో కొన్ని రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచగా, మరికొన్ని రైళ్లకు అదనపు స్టాపింగులు ఇచ్చామన్నారు. కొన్ని రైళ్లు పొడగింపులు కూడా రైల్వేబోర్డు ఇచ్చినట్లు చెప్పారు. ఇక డీఆర్‌యూసీసీ సభ్యులు అడిగిన విధంగా కొన్ని వినతులు పరిగణనలోకి తీసుకుని పరిష్కరించగా, మరికొన్నింటికి రైల్వేబోర్డు అనుమతి అవసరమన్నారు. త్వరలోనే సభ్యులు అడిగిన డిమాండ్లను రైల్వేబోర్డు దష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌యూసీసీ మెంబర్లు జవహర్జైన్(రాయచూర్), ఎం.రామ్‌జీ ( ధర్మవరం), ఓంప్రకాష్యాదవ్ (తాడిపత్రి), కాటమయ్య( అనంతపురం), పీవీ శేషారెడ్డి( తిరుపతి), జి.రామయ్యపిళ్లై( తిరుపతి), ఏ.గిరిధర్(గుత్తిఆర్‌ఎస్), విజయ్‌శంకర్(తిరుచానూర్, చిత్తూరు), ఎం.జనార్దన్‌రెడ్డి(నంద్యాల), వి. సుంకప్ప(గుంతకల్లు), జి.వెంకటరమణ( తిరుపతి), ఎస్.రమణ (మదనపల్లి), బి.నాగేంద్ర(అనంతపురం)లతోపాటు ఏడీఆర్ఎం సత్యనారాయణ, పలువురు రైల్వే డివిజన్ అధికారులు పాల్గొన్నారు.