పనిచేసే వాళ్లు భారత్లోనే ఎక్కువ!
వాషింగ్టన్: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 2050కల్లా పనిచేసే వయసు వారు(15-64 ఏళ్లు) ఎక్కువగా ఉన్న దేశంగా భారత్ నిలుస్తుందని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్డీపీ) పేర్కొంది. మరో 30 ఏళ్లలో వందకోట్లకు పైగా భారత జనాభా ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశించేందుకు అర్హత సాధిస్తారని ప్రాంతీయ మానవ అభివృద్ధి నివేదిక తెలిపింది.
2050 కల్లా భారత్లో 68శాతం మంది పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటారని, 32 శాతం మందే వీరిపై ఆధారపడి ఉంటారని వెల్లడించింది. 65 ఏళ్లలో ఆసియా పసిఫిక్ జనాభా 3రెట్లు పెరిగిందని పేర్కొంది.