IPL runs
-
51 పరుగుల దూరంలో వార్నర్.. తొలి విదేశీ ఆటగాడిగా!
ఐపీఎల్లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఓ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. గత కొన్ని సీజన్లగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన డేవిడ్ వార్నర్ ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నాడు. ఇక ఐపీఎల్-2022లో భాగంగా ఏప్రిల్ 7న లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ మరో 51 పరుగులు సాధిస్తే.. ఐపీఎల్లో 5500 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. కాగా ఇప్పటి వరకు ఐపీఎల్లో 150 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 5449 పరుగులు సాధించాడు. ఓవరాల్‌గా చూస్తే తొలి స్థానంలో 6341 పరుగులతో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఉన్నాడు. ఇక రెండో స్థానంలో 5876 పరుగులతో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఉన్నాడు. ఐపీఎల్లో ఐదు వేల పరుగులు సాధించిన ఆటగాళ్లు వీరే విరాట్ కోహ్లి-5876 పరుగులు శిఖర్ ధావన్-5665 పరుగులు రోహిత్ శర్మ- 5565 పరుగులు సురేష్ రైనా -5528 పరుగులు డేవిడ్ వార్నర్-5549 పరుగులు ఏబీ డివిలియర్స్-5162 పరుగులు చదవండి: IPL 2022: లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ షాక్.. విధ్వంసకర ఆటగాడు దూరం! -
కోహ్లిని వెనక్కునెట్టిన రైనా
కోల్‌కతా: టీ20 స్పెషలిస్ట్ సురేశ్ రైనా మళ్లీ అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ లో అర్ధసెంచరీతో జట్టును గెలిపించిన గుజరాత్ లయన్స్ కెప్టెన్ మళ్లీ టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లిని వెనక్కు నెట్టి మొదటి స్థానానికి దూసుకొచ్చాడు. 4,341 పరుగులతో అందరికంటే ముందు నిలిచాడు. 4,264 పరుగులతో కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ(3923), కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్(3863) మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఐపీఎల్ లో ఇప్పటిరకు 153 మ్యాచుల్లో 149 ఇన్నింగ్స్ ఆడిన సురేశ్ రైనా 139.09 స్ట్రైక్ రేటుతో 4,341 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 30 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 167 సిక్సర్లు, 384 ఫోర్లు బాదాడు. అయితే రైనా, కోహ్లి మధ్య పరుగుల తేడా తక్కువగా ఉండడంతో టాప్ ప్లేస్ కోసం వీరిద్దరూ పోటీపడుతున్నారు. ఈ సీజన్ లోనే రైనాను అధిగమించి కోహ్లి అగ్రస్థానానికి వెళ్లాడు. మళ్లీ ఇప్పుడు రైనా టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు.