హైదరాబాద్‌లో ‘ఐటీ ఆసియా’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతిష్టాత్మక ఐటీ ఆసియా-2015 ప్రదర్శనకు హైదరాబాద్ వేదికవుతోంది. సెప్టెంబర్ 25 నుంచి మూడు రోజులపాటు హైటెక్స్‌లో ఈ కార్యక్రమం జరుగనుంది. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఐసీటీ) కంపెనీల సమాఖ్య అయిన ఎంఏఐటీ దీనిని నిర్వహిస్తోంది. టెక్నాలజీ రంగ సంస్థల వ్యాపార విస్తరణకు ఈ ప్రదర్శన దోహదం చేస్తుందని ఎంఏఐటీ ఈడీ అన్వర్ శిర్పూర్వాలా గురువారమిక్కడ తెలిపారు.
తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. ఐసీటీ హార్డ్‌వేర్ రంగంలో దేశీయంగా తయారీని పెంపొందించే చర్యల్లో భాగంగా ప్లాంట్లు పెట్టేలా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఎంఏఐటీ ప్రోత్సహిస్తోందని చెప్పారు. విదేశీ కంపెనీలు తెలంగాణలో ప్లాంట్లు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశాయన్నారు. ఐటీ ఆసియా కార్యక్రమం ద్వారా మరిన్ని ప్లాంట్లు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందన్నారు.