Jagananna Suraksha
-
AP : డిసెంబర్ 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు
సాక్షి, గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బృహత్తర కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్షలో గుర్తించిన రోగుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, సకాలంలో మందులు అందించడంతో పాటు సిబ్బంది.. మందుల కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత మంత్రిత్వ శాఖకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించే విషయంలో ఎక్కడా తగ్గొద్దని సూచించారు. ‘‘ఆరోగ్య శ్రీ వినియోగంపై విస్తృత ప్రచారం చేయాలి. డిసెంబర్ 18 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వాలి. ప్రతి ఒక్కరి ఫోన్లో ఆరోగ్య శ్రీ, దిశ యాప్‌లు ఉండాలి. అలాగే.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి సకాలానికి మందులు అందించాలి. ఆస్పత్రుల్లో ఎక్కడా సిబ్బంది లేదనే మాట వినపడకూడదు.. ఖాళీలు ఉండకూడదు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు చేయూత నిచ్చే కార్యక్రమం ఎలా జరుగుతుందన్న దానిపై నిరంతరం సమీక్ష చేయాలి. దిగువస్థాయి వైద్య సిబ్బంది నుంచి సకాలానికే ఇండెంట్ వస్తే వారికి తగిన సమయానికి మందులు ఇచ్చేందుకు వీలు అవుతుంది. ఫ్యామిలీ డాక్టర్ ప్రతి గ్రామానికీ వెళ్తున్నందున అదే సమయంలో వారికి మందులు అందాయా? లేవా? అనే దానిపై పరిశీలన చేయాలి. జనవరి1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం–2 రెండో దశ కార్యక్రమాలు నిర్వహించాలి’’.. అని అధికారులకు ఆదేశించారాయన. అలాగే.. చైనాలో ప్రస్తుతం విస్తరిస్తున్న H9N2 వైరస్ దృష్ట్యా ఇక్కడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు. ఆస్పత్రుల వారీగా ఉన్నమౌలిక సదుపాయాలపై సమీక్షచేయాలన్న సీఎం. -
పేదల కళ్లల్లో కాంతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. ఇందుకోసం వైద్య రంగంలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టారు. వైద్యాన్ని ప్రజల చెంతకు తీసుకెళ్తున్నారు. గ్రామాల్లోనే వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను అత్యాధునికంగా తీర్చి దిద్దుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రజల్లో కంటి సమస్యలతో బాధ పడుతున్నవారి కోసం వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారు. మూడు విడతల్లో కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు ఇచ్చారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి ఇప్పుడు నిర్వహిస్తున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ వైద్య శిబిరాల్లో కంటి పరీక్షలు చేస్తున్నారు. గత నెల 30వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరాల్లో మంగళవారం వరకు 35 లక్షల మందికిపైగా వైద్య సేవలు పొందారు. వీరిలో 5,26,045 మంది వివిధ రకాల కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. వీరిలో 1,57,614 మందికి మందులతో నయమయ్యే సమస్యలేనని తేల్చారు. వారందరికీ అవసరమైన మందులు ఇచ్చారు. మరో 3,12,478 మందికి కళ్లద్దాలను సూచించారు. వీరందరికీ కళ్లద్దాలను వైద్య శాఖ అందిస్తోంది. 55,953 మందిని తదుపరి వైద్యం కోసం ఆస్పత్రులకు పంపించారు. 48,507మందికి కాటరాక్ట్ శస్త్ర చికిత్సలు అవసరమని నిర్ధారించారు. తదుపరి వైద్యం, కాటరాక్ట్ సర్జరీలు అవసరమున్న వారిని స్థానిక పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్,సీహెచ్‌వో, ఏఎన్ఎంలకు మ్యాప్ చేశారు. వీరందరికీ వైద్యం అందిస్తున్నారు. వీరంతా కంటి సమస్యలు తొలగి పూర్తిస్థాయి చూపుతో తిరిగి ఇళ్లకు చేరుకోనున్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుంట్ల మండలం బెలుం గ్రామానికి చెందిన బాలసంటి వయసు 90 ఏళ్లు పైనే. చూపు మందగించడంతో గతంలో కంటి పరీక్ష చేయించుకుని అద్దాలు కొనుక్కున్నాడు. మళ్లీ కొన్నాళ్లుగా కళ్లు సరిగా కనిపించక ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల గ్రామంలోనే ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరానికి వెళ్లాడు. వైద్యులకు తన సమస్య వివరించాడు. కంటి పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఇప్పుడు బాలసంటి ఉల్లాసంగా ఉన్నాడు. బాలసంటిలానే కంటి సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల వరకూ వెళ్లలేని వారికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఓ వరంగా మారింది. ఈ కార్యక్రమంలో తాము ఉంటున్న ఊరిలోనే కంటితో పాటు, ఇతర వైద్య సేవలు అందుబాటులోకి రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వైద్యుల సేవలు కూడా... రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 800 ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నాం. ఈ క్రమంలో పెద్ద ఎత్తున కంటి వైద్యులు అవసరం. మన రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వైద్యులను పిలిపించాం. కంటి సమస్యల బాధితులకు అవసరమైన మందులను శిబిరాల్లోనే అందిస్తున్నాం. అద్దాలు అవసరమైన వారికి స్థానిక విక్రేతల ద్వారా అందజేస్తున్నాం. క్యాటరాక్టర్ సర్జరీలు అవసరమున్న వారిని ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్జీవో ఆస్పత్రులకు తరలించి ఉచితంగా సర్జరీలు చేయిస్తున్నాం. – డాక్టర్ వెంకటేశ్వర్, డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్విసెస్ -
ఆరోగ్య సురక్ష విస్తరణ
సాక్షి, అమరావతి: అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. గ్రామాల్లోనే ప్రజలందరూ ఉచితంగా స్పెషలిస్ట్ వైద్యసేవలు, మందులు పొందడం.. అలాగే, పట్టణ, నగర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న శిబిరాలకూ ప్రజలు పోటెత్తుతుండడంతో వీటిని ప్రతి వార్డుకూ విస్తరించాలని వైద్యశాఖ సంకల్పించింది. ఇప్పటివరకు 8,985 శిబిరాల నిర్వహణ.. గత నెల 30 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 పనిదినాల్లో 8,985 క్యాంపులు నిర్వహించారు. వీటిల్లో 35,11,552 మంది ఉచిత స్పెషలిస్ట్ వైద్యసేవలు పొందారు. వీరిలో 61,971 మందిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేశారు. అలాగే, గ్రామాల్లోని 10,032 విలేజ్ క్లినిక్‌ల పరిధిలో చేయాలన్నది లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 6,500కు పైగా క్యాంపులు పూర్తయ్యాయి. ఇప్పుడు వీటికి అదనంగా పట్టణాల్లో వార్డుల వారీగా విస్తరించారు. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ, నగరాల్లో 542 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 1,626 శిబిరాలు నిర్వహించాలన్నది ప్రణాళిక. దీంతో ఒక్కో కేంద్రం పరిధిలో ప్రస్తుతం మూడుచొప్పున ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఒక్కో శిబిరం వద్దకు వెయ్యి మందికి పైగా జనాభా హాజరవుతున్నారు. ఇలా ప్రజల తాకిడి ఎక్కువగా ఉండడంతో వైద్యం పొందడంలో ఆలస్యం, ఇబ్బందులకు ఆస్కారం లేకుండా ఉండేందుకు వీలుగా వార్డు సచివాలయాల వారీగా సోమవారం నుంచి శిబిరాలను నిర్వహిస్తున్నారు. తాజా నిర్ణయంతో ఇప్పుడు ఈ క్యాంపులు మరింతగా పెరగనున్నాయి. 3,842 వార్డు సచివాలయాల పరిధిలో.. పట్టణ ప్రాంతాల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే శిబిరాలు పూర్తయినవి మినహాయించి మిగిలిన ప్రతి సచివాలయం పరిధిలో శిబిరాలు నిర్వహించేలా ప్రణాళిక రచించారు. ► సచివాలయం పరిధిలో శిబిరం నిర్వహించడానికి ముందే ప్రతి ఇంటిని వలంటీర్లు, గృహ సారథులు సందర్శిస్తున్నారు. ► ఆ తర్వాత.. వలంటీర్లు, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు ప్రతి ఇంటిని సందర్శించి ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ► బీపీ, సుగర్ పరీక్షలతో పాటు, అవసరం మేరకు డెంగీ, మలేరియా, వంటి ఇతర ఏడు పరీక్షలు చేపడుతున్నారు. ► ఈ స్క్రీనింగ్‌లో గుర్తించిన వివిధ సమస్యల ఆధారంగా బాధితులు శిబిరాలకు హాజరవ్వడానికి టోకెన్లు ఇస్తున్నారు. ► టోకెన్లతో సంబంధం లేకుండా ప్రజలు నేరుగా శిబిరాలకు హాజరయ్యే వెసులుబాటు కూడా అధికారులు కల్పించారు. ► ఇక ప్రతి క్యాంపులో ఇద్దరు ఎంబీబీఎస్, ఇద్దరు స్పెషలిస్ట్ వైద్యులు, సరిపడా మందులను సమకూరుస్తున్నారు. ఇబ్బందులకు తావు లేకుండా.. పట్టణాల్లోని ప్రతి వార్డు సచివాలయంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శిబిరాల నిర్వహణ ప్రారంభించాం. రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేసిన వారికి ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం. స్థానిక మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలకు ఆ బాధత్యలు అప్పగించాం. - ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, సీఈఓ, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ -
సబ్ రిజిస్ట్రార్ ప్రాణాలు కాపాడిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’
సింగరాయకొండ/ఆత్మకూరు రూరల్(నంద్యాల) : జగనన్న సురక్ష క్యాంపులు ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాయి. ఇటీవల ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ ప్రాణాలు కాపాడగా, తాజాగా ఓ మహిళ గుండె జబ్బుతో బాధపడుతున్నట్టు గుర్తించి ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఒంగోలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ వైకే నందకిషోర్ రోజూ నెల్లూరు నుంచి ఒంగోలుకు ఉద్యోగం నిమిత్తం వస్తుంటారు. ఈ నెల 5న రైల్లో వస్తుండగా కావలి దాటగానే స్వల్పంగా గుండెనొప్పి వచ్చింది. మొదట గ్యాస్ సమస్య అని మందులు వేసుకున్నా.. నొప్పి తగ్గకపోవడంతో వెంటనే తనకు రైల్లో పరిచయం ఉన్న సింగరాయకొండ ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఉజ్వలకు ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. ఆ సమయంలో ప్రభుత్వ ఆస్పత్రిలో విధుల్లో ఉన్న ఉజ్వల.. సింగరాయకొండ గ్రామ సచివాలయం–2 పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష పథకం మెడికల్ క్యాంపు జరుగుతోందని, కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకటేశ్వరరావు క్యాంపులో ఉన్నారని.. సింగరాయకొండలో దిగాలంటూ స్టేషన్‌కు 108ను పంపించి సురక్ష క్యాంపునకు తీసుకొచ్చారు. అనంతరం డాక్టర్ ఉజ్వల, డాక్టర్ వంశీధర్‌లు ఆయనకు ఈసీజీ పరీక్షలు నిర్వహించి.. రిపోర్టును పరిశీలించిన డాక్టర్ వెంకటేశ్వరరావు.. రిజిస్ట్రార్ కు గుండె నొప్పి వచ్చిందని నిర్ధారించి వెంటనే ప్రథమ చికిత్స చేయించి తర్వాత ఒంగోలు కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కిమ్స్‌లోని డాక్టర్లు రిజిస్ట్రార్ నందకిషోర్‌కు యాంజియోగ్రామ్ పరీక్ష చేసి రెండు వాల్వస్ దెబ్బతిన్నాయని గుర్తించి.. వెంటనే స్టంట్ వేసి చికిత్స చేశారు. సకాలంలో అక్కడకు రావడంతో ఆయన ప్రాణాలు దక్కాయని కిమ్స్ డాక్టర్లు కుటుంబ సభ్యులకు చెప్పారు. సరైన సమయంలో చికిత్స అందించి తన భర్త ప్రాణాలు కాపాడారని అతని భార్య విజయలక్ష్మి.. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులో ఉన్న వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ వంశీధర్ మాట్లాడుతూ సోమవారం పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన జగనన్న సురక్ష కా>్యంపులో 35 మందికి ఈసీజీ పరీక్షలు చేయగా వారిలో ముగ్గురికి గుండె సమస్యలున్నట్టు తేలిందని చెప్పారు. ఓ మహిళను కాపాడిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ఇదిలా ఉండగా, నంద్యాల జిల్లా ఆత్మకూరు శ్రీపతిరావుపేటలో సోమవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఓ మహిళను కాపాడింది. జయలక్ష్మీదేవి కొద్దిగా ఆయాసం ఉందంటూ గ్రామంలో ఏర్పాటు చేసిన శిబిరానికి వచ్చింది. వైద్యులు ఆమెకు గుండె పరీక్షలు చేసి గుండె సమస్యతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. అప్పటికప్పుడు ప్రాథమిక వైద్యం చేసి హుటాహుటిన అక్కడే ఉన్న అంబులెన్స్‌లో కర్నూలు జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. -
అవ్వలతో మంత్రి విడదల రజిని సరదా సన్నివేశం
-
45 రోజులపాటు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం
-
కలెక్టర్లు అందరూ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి: సీఎం జగన్
-
గ్రామస్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములే
-
జగనన్న ఆరోగ్య సురక్ష పేదల పాలిట వరం
-
ఏడు రకాల వైద్య పరీక్షలను ఇళ్ల వద్దనే నిర్వహించనున్న వైద్యులు: సీఎం జగన్
-
గ్రామాల్లో సురక్ష క్యాంపుల ద్వారా ప్రజలకు వైద్య పరీక్షలు: సీఎం జగన్
-
ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి సమస్య నయం అయ్యేవరకు తోడుంటాం: సీఎం జగన్
-
ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాం: సీఎం జగన్
-
జల్లెడ పట్టి మరీ ఆరోగ్య సమస్యకు పరిష్కారం: సీఎం జగన్
-
ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష
-
జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రతి ఒక్కరి ఆరోగ్యం సురక్షితం
-
ఐదు దశల్లో 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమం.. జగనన్న సురక్ష తరహాలోనే 'జగనన్న ఆరోగ్య సురక్ష'..!
-
రూ 1 ఖర్చు కూడా లేకుండా ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడం ప్రభుత్వ ఉద్దేశ్యం
-
రేపటి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్
-
ఇంటింటికీ ఆరోగ్య రక్షణ కోసమే జగనన్న ఆరోగ్య సురక్ష పథకం అని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
AP: ఇంటింటికీ ఆరోగ్య రక్ష
రాష్ట్రంలో ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ఆరోగ్యపరంగా సురక్షితంగా ఉంచే కార్యక్రమమే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడంతోపాటు వాటిని పరిష్కరించే గొప్ప బాధ్యతను ప్రభుత్వం స్వీకరిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే ఇప్పటికే అమలు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమం తరహాలోనే ఇప్పుడు ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. మొత్తం ఐదు దశల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని హెల్త్ క్యాంపులతో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జగనన్న సురక్ష ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించామని, సుమారు 98 లక్షలకు పైగా సర్టిఫికెట్లను నెల రోజుల వ్యవధిలో అందించినట్లు గుర్తు చేశారు. దీని ద్వారా ప్రభుత్వం మీకు అందుబాటులో, మీ గ్రామంలోనే ఉందనే భరోసా ఇవ్వగలిగామన్నారు. అదే మాదిరిగానే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వివరించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ కార్యక్రమం అమలుపై అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్య పొందడంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ రూపొందించిన బ్రోచర్‌ను ఈ సందర్భంగా సీఎం జగన్ ఆవిష్కరించారు. సమీక్షలో సీఎం ఏమన్నారంటే.. ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెను మార్పులకు శ్రీకారం జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఇంటినీ సందర్శించి మ్యాపింగ్ చేస్తారు. ఏ ఇంట్లో ఎవరు ఎలాంటి ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారో గుర్తిస్తారు. గ్రామాల్లో నిర్వహించే ప్రత్యేక హెల్త్ క్యాంప్‌ల ద్వారా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన పరీక్షలు చేయడం పాటు మందులు, కళ్లద్దాలు అందిస్తారు. క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు లాంటి దీర్ఘకాలిక జబ్బుల బాధితులను (క్రానిక్ డీసీజెస్) గుర్తించడం, రెగ్యులర్‌గా చెకప్ చేయడం, డాక్టర్లు ఎప్పటికప్పుడు పరిశీలించడం, మందులను అందించడం, అవసరమైతే ఆస్పత్రులకు పంపడం లాంటి జాగ్రత్తలతో అనారోగ్య బాధితులను పూర్తిగా చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. గ్రామం పూర్తి బాధ్యతను ఫ్యామిలీ డాక్టర్ తీసుకోవాలి. రెగ్యులర్‌గా ఒకవైపు తనిఖీలు చేస్తూనే మందులు కూడా ఇవ్వబోతున్నాం. ఎక్కడా మందులు లేని పరిస్థితి ఉండకూడదు. ఇలా చాలా పెద్ద మార్పులకు శ్రీకారం చుడుతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇల్లూ కవర్ కావాలి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులున్న ఇళ్లను ప్రత్యేకంగా పరిగణించి కాలానుగుణంగా పరీక్షలు చేస్తూ మందులు, చికిత్స అందించాలి. సంపూర్ణ రక్తహీనత నివారణ రాష్ట్రంలో జీరో అనిమిక్ (రక్తహీనత) లక్ష్యంగా పని చేయాలి. ఆరోగ్య సురక్షలో గర్భిణులు, బాలింతలతో పాటు రక్తహీనత బాధితులను కూడా గుర్తించి మందులతో పాటు, పుడ్ సప్లిమెంటేషన్ అందచేస్తాం. దీర్ఘకాలిక వ్యాధులు, నియోనేటల్ అండ్ ఇన్ఫాంట్ కేర్ (నవజాత శిశువులు, చిన్నారులు) కేసులను పరిగణలోకి తీసుకోవడంతో పాటు బీపీ, షుగర్ లాంటి సమస్యలున్న వారికి చికిత్స అందించాలి. ఒకవైపు సరైన సమయంలో చికిత్స అందిస్తూనే జీవన విధానాల్లో తీసుకోవాల్సిన మార్పులు, ఆయా వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై (ప్రివెంటివ్ కేర్) ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. దీన్ని కూడా ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టాలి. 45 రోజుల తర్వాత కూడా.. మనం 45 రోజుల పాటు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఆ తర్వాత కూడా చేపట్టాలి. ప్రతి మండలంలోనూ నెలకు కనీసం 4 గ్రామాల్లో ఈ క్యాంపులను నిర్వహించాలి. దీంతో ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ హెల్త్ క్యాంపు నిర్వహించినట్లు అవుతుంది. క్యాంప్‌లలో నలుగురు వైద్యులు హెల్త్ క్యాంప్‌లలో నలుగురు డాక్టర్లు పాల్గొంటారు. ఇందులో ఇద్దరు పీహెచ్సీ డాక్టర్లు, మరో ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లు ఉంటారు. స్పెషలిస్ట్ వైద్యుల్లో గైనిక్/పీడియాట్రిక్ స్పెషలిస్టు డాక్టర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. కంటి పరీక్షలను కూడా క్యాంపులో భాగంగా చేపట్టాలి. స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటుంది. ఎంపీడీవో, ఎమ్మార్వోలు ఈ మెడికల్ క్యాంపు నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలి. హెల్త్ క్యాంపు నిర్వహణకు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అధికారులకు ఈ కార్యక్రమంపై ఎలాంటి సందేహాలున్నా సీఎంవో (ముఖ్యమంత్రి కార్యాలయం)తో నివృత్తి చేసుకోవాలి. ప్రతి పేషెంట్‌కు ఉచిత వైద్యమే లక్ష్యం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులందరికీ రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందాలి. పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి. ఆరోగ్య సురక్ష తొలి, రెండో దశల్లో వలంటీర్లు, సీహెచ్‌వోలు, ఏఎన్ఎంలు, ఆశాలు ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్యశ్రీ బ్రోచర్లను ప్రజలకు అందజేయాలి. ఆరోగ్యశ్రీ యాప్‌ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం, వినియోగంపై వివరించాలి. ఆరోగ్యశ్రీలో గతంలో 1,050 ప్రొసీజర్లు మాత్రమే ఉంటే మనం 3,256కి పెంచాం. పథకం పరిధిని విస్తృతం చేశాం. ప్రతి పేషెంట్ ఈ సేవలను ఉచితంగా అందుకోవాలన్నదే మన లక్ష్యం. ఏ ఒక్కరూ వైద్యం కోసం అప్పులపాలయ్యే పరిస్థితులు ఉండకూడదు. ప్రివెంటివ్ కేర్‌లో నూతన అధ్యాయం ఈ నాలుగేళ్లలో ఒక్క వైద్య, ఆరోగ్య శాఖలోనే 53,126 పోస్టులను భర్తీ చేశాం. ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే వెంటనే భర్తీ చేసేలా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో ఈ తరహా కార్యక్రమాన్ని ఎవరూ, ఎప్పుడూ చేయలేదు. నాడు–నేడుతో అన్ని ఆసుపత్రులను జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేశాం. రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలతోపాటు వీటికి అదనంగా 5 మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏజెన్సీలో నిర్మిస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్‌ల పాత్ర ప్రివెంటివ్ కేర్‌లో ఒక కొత్త అధ్యాయం. ► సమీక్షలో వైద్య శాఖ మంత్రి మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సాయిప్రసాద్, వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ జానకి, సీసీఎల్ఏ కార్యదర్శి ఇంతియాజ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ వెంకట మురళీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఐదు దశల్లో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ఇలా... (( 1)) వలంటీర్లు, గృహ సారథులు, ప్రజాప్రతినిధులు.. ఈ ముగ్గురూ కలిసి ప్రతి ఇంటినీ సందర్శిస్తారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి ప్రజలకు వివరిస్తారు. తేదీతో పాటు ఏయే సేవలు అందిస్తారో గ్రామం/పట్టణం వారీగా తెలియజేస్తారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీపై కూడా అవగాహన కల్పిస్తారు. ఆరోగ్యశ్రీ పథకంలో నెట్వర్క్ ఆస్పత్రులు ఎక్కడ ఉన్నాయి? ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఎలా ఆ ఆస్పత్రులకు వెళ్లాలి? ఉచిత వైద్య సేవలను ఎలా వినియోగించుకోవాలనే దానిపై అవగాహన కల్పిస్తారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో), ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల బృందం ఆయా కుటుంబాల వద్దకు వస్తుందని, ప్రతి ఇంట్లోనూ పౌరులందరితో మాట్లాడి 7 రకాల టెస్టులకు సంబంధించిన అంశాలను మీతో చర్చిస్తారని తెలియజేస్తారు. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ క్యాంపెయిన్ మొదలవుతుంది. ((2)) సీహెచ్‌వో ఆధ్వర్యంలో ఏఎన్ఎం, ఆశావర్కర్, వలంటీర్లు అన్ని ఇళ్లను సందర్శిస్తారు. ప్రజలకు వారి ఇంటివద్దే బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, యూరిన్, స్పూటమ్ (కఫం) పరీక్షలతోపాటు జ్వరంతో బాధపడుతున్న వారికి మలేరియా, డెంగీ లాంటి మొత్తం ఏడు రకాల పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షల ఫలితం ఆధారంగా సేకరించిన వివరాలను మొబైల్ యాప్‌లో నమోదు చేస్తారు. అనంతరం ప్రతి ఇంటికి, పేషెంట్‌కి ఒక కేష్ షీట్ జనరేట్ అవుతుంది. ఈ డేటా వివరాలు హెల్త్ క్యాంపు జరిగే నాటికి ఉపయోగపడతాయి. ((3)) మరోసారి ఓరియెంటేషన్ కార్యక్రమం ఉంటుంది. గ్రామం/పట్టణంలో హెల్త్ క్యాంప్ నిర్వహించటానికి మూడు రోజులు ముందుగానే వలంటీర్, గృహ సారధులు, ప్రజా ప్రతినిధులు ఆయా చోట్ల ప్రజలకు మరోసారి గుర్తు చేస్తారు. క్యాంప్ నిర్వహించే రోజు అందుబాటులో ఉండాలని సమాచారం ఇస్తారు. ((4)) గ్రామం/పట్టణంలో హెల్త్ క్యాంపు నిర్వహిస్తారు. ఈ నెల 30వతేదీ నుంచి హెల్త్ క్యాంపులు ప్రారంభం అవుతాయి. ప్రతి రోజూ ప్రతి మండలంలో ఏదో ఒక గ్రామం/పట్టణంలో క్యాంపు నిర్వహిస్తారు. గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్/పట్టణాల్లో వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపులు జరుగుతాయి. ((5)) ప్రతి గ్రామంలో జల్లెడ పట్టిన తర్వాత ప్రజల ఆరోగ్య వివరాలు హ్యాండ్ హోల్డింగ్‌లో ఉండాలి. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించాక వారికి కాలానుగుణంగా టెస్టింగ్, కన్సల్టేషన్, మందులు ఇవ్వడం అన్నది ఈ కార్యక్రమంలో ప్రధాన అంశం. మందులు లేవు, దొరకడం లేదు అన్న మాటే వినిపించకుండా చర్యలు. -
జగనన్న ఆరోగ్య సురక్షపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
ప్రజలందరికీ.. ‘ఆరోగ్య సురక్ష’
సాక్షి, అమరావతి/చిలకలూరిపేట: రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్య రక్షణ లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం మరో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించడం, ప్రాథమిక పరీక్షలతో ఆరోగ్య సమస్యలను గుర్తించడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి స్పెషలిస్ట్ డాక్టర్లు, పీహెచ్సీ డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ద్వారా చికిత్సలు, మందులను ఉచితంగా అందించబోతోంది. ఎవరైనా రోగులకు అవసరమైతే ప్రభుత్వాస్పత్రులు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసి వైద్య చికిత్సలు చేయించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈనెల 15 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఆరోగ్య సమస్యలకు ‘స్పెషల్’ చికిత్స.. ప్రజల ఆరోగ్య సమస్యలకు స్థానికంగానే స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా చికిత్స అందించడమే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమ ధ్యేయమని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో భాగంగా ఈనెల 15 నుంచి గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పిస్తారు. ఆరోగ్యశ్రీ కరపత్రాన్ని పంపిణీ చేసి.. సేవలను వివరిస్తారు. ఈనెల 16 నుంచి వైఎస్సార్ విలేజ్ క్లీనిక్, వైఎస్సార్ అర్బన్ క్లీనిక్‌ల పరిధిలోని గృహాలను ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు(సీహెచ్‌ఓలు) సందర్శిస్తారు. ప్రజలకు ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి.. ఆరోగ్య సమస్యలను గుర్తిస్తారు. ఆ ఫలితాలను డాక్టర్లకు అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య సమస్యలున్న వారు వైద్య శిబిరాలకు హాజరయ్యేందుకు వీలుగా ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు టోకెన్ నంబర్లు ఇస్తారు. ఈనెల 30 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ శిబిరాలను వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయనుంది. ప్రతిరోజూ.. ప్రతి మండలంలోనూ ఏదో ఒక వైఎస్సార్ విలేజ్ క్లీనిక్‌తో పాటు ప్రతి పట్టణంలోనూ ఏదో ఒక వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తారు. నెల రోజుల పాటు ఈ శిబిరాల నిర్వహణ కొనసాగుతుంది. ఈ వైద్య శిబిరాల్లో మొత్తం 342 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు సేవలందిస్తారు. అలాగే ఆయా మండలాల్లోని ఇద్దరు పీహెచ్సీ వైద్యులతో పాటు ఫ్యామిలీ డాక్టర్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొంటారు. 162 రకాల మందులతో పాటు 18 రకాల శస్త్రచికిత్సల వస్తువులు, 14 రకాల ఎమర్జెన్సీ కిట్లు తదితరాలను అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య సమస్యలున్న వారిని వైద్యులు పరీక్షిస్తారు. అవసరమైన వారికి ఈసీజీ వంటి వైద్య పరీక్షలు కూడా చేసి.. ఉచితంగా మందులిస్తారు. ఎవరికైనా పెద్ద చికిత్సలు అవసరమైతే డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రిఫర్ చేస్తారు. విజయవంతం చేద్దాం: సీఎస్ జవహర్‌రెడ్డి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వలంటీర్లు, ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు అవసరమైన శిక్షణ, ప్రచార సామగ్రి, టెస్టింగ్ కిట్లు, మందులు తదితరాలను అందజేయాలని సూచించారు. ఇంటింటి సర్వే సమయంలో సాధారణ, దీర్ఘకాలిక వ్యాధులు, గర్భిణులు, బాలింతలు, తగిన బరువు లేని పిల్లలు, క్షయ, కుష్టు, సంక్రమించని, సంక్రమించే వ్యాధులు, గిరిజన ప్రాంతాల్లో సికిల్‌సెల్, మలేరియా, డెంగీ తదితరాలతో బాధపడుతున్నవారిపై దృష్టి పెట్టాలన్నారు. శిశువులు, పిల్లలు, గర్భిణులు, బాలింతలు రక్తహీనతకు గురికాకుండా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందజేయాలని సూచించారు. సమావేశంలో ఉన్నతాధికారులు కృష్ణబాబు, ప్రవీణ్ ప్రకాశ్, జయలక్ష్మి, కోటేశ్వరరావు, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ సేవలు: మంత్రి రజిని రాష్ట్ర ప్రజలకు ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం రక్షగా నిలవబోతోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఇప్పటికే విప్లవాత్మక సంస్కరణలతో ప్రజారోగ్యానికి అండగా నిలిచిన సీఎం జగన్ మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. గురువారం మంగళగిరిలోని వైద్య శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నెల రోజుల పాటు రాష్ట్రమంతా వైద్య శిబిరాలు నిర్వహించి.. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందిస్తామని తెలిపారు. స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ వైద్యమందిస్తామన్నారు. ఈ వైద్య శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం రూ.120 కోట్ల మేర ఖర్చు చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తహశీల్దార్, ఎంపీడీవో, పీహెచ్సీ వైద్యాధికారులు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, మున్సిపాలిటీ ఆరోగ్య అధికారి, యూపీహెచ్సీ వైద్యాధికారులు ఈ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తారని చెప్పారు. సమీక్షలో ఉన్నతాధికారులు ఎం.టి.కృష్ణబాబు, నివాస్, మురళీధర్‌రెడ్డి, హరేంధిరప్రసాద్, డాక్టర్ వెంకటేశ్వర్, డాక్టర్ రామిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం చిలకలూరిపేట నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ గురించి ఆమె దిశానిర్దేశం చేశారు. -
'జగనన్న సురక్ష' కు నీరాజనం
-
నేటితో ముగియనున్న జగనన్న సురక్ష కార్యక్రమం