Jankipuram encounter
-
జానకీపురం ఎన్‌కౌంటర్‌పై ఆర్డీఓ విచారణ
మిర్యాలగూడ మోత్కూర్ మండలం జానకీపురం వద్ద ఏప్రిల్ 4వ తేదీన సిమి ఉగ్రవాదులు, పోలీసుల మధ్య జరిగిన ఎదురుకాల్పులపై మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో మిర్యాలగూడ ఆర్డీఓ బి.కిషన్‌రావు విచారణ నిర్వహించారు. విచారణకు ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందిన ఎస్ఐ సిద్ధయ్య భార్య ధరినీష, ఆయన సోదరులు దస్తగిరి, పెద్ద పాష, దస్తయ్య, గాంధీ మెడికల్ ప్రొఫెసర్ తఖియొద్ధీన్, ఎన్కౌంటర్లో మృతిచెందిన సిమి ఉగ్రవాది ఎజాజుద్ధీన్ తండ్రి అజాజుద్ధీన్, మోత్కుర్ ఎస్ఐ పురుందర్‌బట్ హాజరు కావల్సి ఉంది. అయితే మోత్కూర్ ఎస్ఐ మాత్రమే విచారణకు హాజరయ్యారు. ఆయన వాంగ్మూలాన్ని ఆర్డీఓ నమోదు చేసుకున్నారు. మోత్కూర్ మండలం జానకిపురం వద్ద పోలీసులు - సిమి ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటనపై మొత్తం 43 మందిని విచారణ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఆరుగురు మినహా అందరినీ విచారించినట్లు ఆర్డీఓ తెలిపారు. ఏడుగురిలో ఆరుగురు హాజరు కాకపోవడంతో విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. -
జానకీపురం ఎన్‌కౌంటర్‌పై బహిరంగ విచారణ
మోత్కూరు: మండలంలోని జానకీపురం వద్ద ఈనెల 4వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌పై బుధవారం మోత్కూరు తహసీల్దార్ కార్యాలయంలో మిర్యాలగూడ ఆర్డీఓ, మెజిస్టీరియల్ విచారణ అధికారి బి.కిషన్‌రావు బహిరంగ విచారణ జరిపారు. పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఉగ్రవాదులు అస్లామ్అయూక్ఖాన్, మహ్మద్ఎజాజొద్దీన్లతో పాటు ఆత్మకూరు ఎస్ఐ సిద్ధయ్య, కానిస్టేబుల్ నాగరాజు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉద యం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు, మృతిచెందిన పోలీ సుల బంధువులను, రెవెన్యూశాఖ, వైద్యాధికారులను విచారించారు. 36 మందికి నోటీసులు పంపగా విచారణకు 24 మంది హాజరై వాంగ్మూలాలను ఇచ్చారు. 12 మంది గైర్హాజర్ అయ్యారని, పోలీసు విచారణ అధికారి బృందానికి చెందిన 7గురిని తదుపరి పిలిపించి విచారించనున్నట్లు ఆర్డీఓ కిషన్‌రావు తెలిపారు. మొదటగా ఉగ్రవాదులకు పోస్టుమార్టం నిర్వహించిన జిల్లా కేంద్ర ఆస్పత్రికి చెందిన సివిల్‌సర్జన్ డాక్టర్లు టి.నర్సింగరావు, మాతృ, కె.ప్రసాద్రా వు, వినోద్‌కుమార్, బి.శోభారాణిలను ఆర్డీఓ విచారించారు. జానకీపురం వీఆర్వో సత్యనారాయణను ఎదురుకాల్పుల సంఘటన స్థలంలో ఏమి చూశా వు, అక్కడ ఏమి పరిశీలించావు, మృతుల పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించి అతడి స్టేట్మెంట్ను ఆర్డీఓ నమోదు చేసుకున్నారు. మృతిచెందిన కానిస్టేబుల్ నాగరాజు భార్య సంజన, ఆయన తల్లిదండ్రులు శ్రీమన్నారాయణ-లక్ష్మమ్మలను నాగరాజు మృతిచెందాడని ఎవరు చెప్పారని, మీకు ఎలా తెలిసిందని ఆర్డీఓ ప్రశ్నించారు. తమకు అధికారికంగా బాధ్యులైన పోలీసులు ఎవరూ సమాచారం ఇవ్వలేదని ఆత్మకూరు ఎస్ఐ సిద్ధయ్య కాల్పుల్లో మృతిచెందాడని ఆయనతో పాటు కానిస్టేబుల్ నాగరాజు కూడా చనిపోయాడని టీవీ చానల్స్‌లో స్క్రోలింగ్‌లు చూసి నిర్ధారించుకున్నామని ఆర్డీఓకు వివరించారు. చికిత్స కోసం హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తరలించామని తెలపడంతో అక్కడికి తామువెళ్లిచూశామని తెలిపారు. నాగరాజు కాల్పులు జరపగా ఒక ఉగ్రవాది మరణించాడని ప్రత్యక్ష సంఘటనలో ఉన్న తోటి కానిస్టేబుల్స్ తమతో చెప్పారని ఆర్డీఓకు వారు వివరించారు. నాగరాజు ఉగ్రవాదనికి కాల్చిచంపిన సమాచారాన్ని కొంతమంది పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారని భార్య, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నాగరాజు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందాడని తమ విచారణలో నిర్ధారన జరిగిందని నల్లగొండ డీఎస్పీ రాములు నాయక్ ఆర్డీఓకు వివరించారు. మోత్కూ రు ఎస్ఐ పురేందర్‌భట్, మోత్కూరు, ఆత్మకూరు, రామన్నపేట పోలీస్‌స్టేన్లకు చెందిన కానిస్టేబుల్స్ బి.వెంకటేశ్వర్లు, కొణతం మధు, ఎల్.జానకిరాం, మంద నిరంజన్, టి.శివకోటశ్వర్రావు, ముత్తినేని శ్రీను,హోగార్డు కొంపెల్లి శ్రీనివాస్‌లను ఆయన విచారించారు.వారి ఇచ్చిన స్టేట్మెంట్స్ను రికార్డు చేశారు. భువనగిరి ఆర్డీఓ నూతి మధుసూదన్, డీఎస్పీ సాదుమోహన్‌రెడ్డి, ఎస్ఐ సిద్ధయ్య భార్య ధరణిష, ఆయన సోదరులు దస్తగిరి, పెద్దబాషా, శ్రీకాంత్‌రెడ్డి, ఎఫ్ఏ సీల్ అధికారి తజియోద్దీన్ విచారణకు గైర్హాజరు అయ్యారని ఆర్డీఓ తెలిపారు. -
ఎన్కౌంటర్ స్థలం పరిశీలన
మోత్కూరు మండలం జానకిపురం గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్ స్థలాన్ని ఆదివారం నాలుగు రాష్ట్రాలకు చెందిన పోలీసు యాంటీటెరిస్టుస్వ్కాడ్ బృందాలు సందర్శించి పరిశీలించాయి. శనివారం జానకిపురంలో పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఉగ్రవాదులు అస్లామ్ఆయూక్, జాకీర్బాదల్, కానిస్టేబుల్ నాగరాజు, మృతిచెందగా ఎస్ఐ సిద్ధయ్య ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్న విషయం పాఠకులకు తెలిసిందే. మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన యాంటీటైస్టుస్వ్కాడ్ బృందాలు, ఢిల్లీకి చెందిన జాతీయ పోలీస్ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇంటెలీజెన్స్ బృందాలు సందర్శించి కాల్పుల తీరును ప్రత్యక్ష సాక్షులను, స్థానిక పోలీసులను అడిగి వివరాలు సేకరించారు. గ్రామ శివారులోకి ఎలా ప్రవేశించారు, ఎదురుకాల్పులు జరిగిన తీరును సూర్యాపేట డీఎస్పీ ఎంఏ.రషీద్, తుంగతుర్తి , చౌటుప్పల్ సీఐలు గంగారాం, గంగమల్లు, మోత్కూరు ఎస్ఐ సి.పురేందర్భట్లను అడిగి తెలుసుకున్నారు. కర్నాటకు చెందిన ఇంటెలీజెన్స్ ఇన్స్పెక్టర్ ఈరన్న, సబ్ ఇన్స్పెక్టర్ నర్సింహమూర్తి మాట్లాడుతూ ఘటనాస్థలంలో దొరికిన ఢిల్లీ-హైదరాబాద్ రైలు టికెట్ ద్వారా ఉగ్రవాదులుగా గుర్తించడానికి అవకాశం ఉందని తెలిపారు. బీజనూర్ బ్లాస్టింగ్‌లో తీవ్రమైన జననష్టం జరిగిన సంఘటనలో వీరి ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫైజల్ గ్యాంక్కు సంబంధించిన ముఠా సభ్యులని అనుమానిస్తున్నట్లు వివరించారు. సంఘటన ప్రాంతానికి సంబంధించిన ఫొటో, వీడియోలను యాంటీటైస్టుస్వ్కాడ్ బృందాలు సేకరించారు. ప్రత్యక్షంగా కాల్పులు జరిపి తీవ్రవాదులను చంపిన రామన్నపేటకు చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్ల యాంటీటెరిస్టుస్వ్కాడ్ బృందాలకు వివరించారు. పోలీసులు తీవ్రవాదులను వెంటాడిన తీరు, గ్రామ యువకులు సహకరించిన పరిస్థితిని బృందాలకు తెలిపారు. ఉగ్రవాదుల మృతదేహాలను పరిశీలించిన ఏటీఎస్ బృందం నార్కట్‌పల్లి : మోత్కూర్ మండలం జానకీపురంలో పోలీసుల కాల్పులో మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను స్థానిక కామినేని ఆస్పత్రిలో భద్రపరిచారు. ఆదివారం మధ్యప్రదేశ్, ఢిల్లీకి చెందిన ఏటీఎస్( ఆంటి టైస్టు బృందం ) కామినేని ఆస్పత్రికి మధ్యాహ్నం రెండు కార్లలో చేరుకొని ఆస్పత్రిలోని మార్చురీలో ఉన్న మృతదేహాలను పరిశీలించింది. మృతదేహాల వేలుముద్రలు సేకరిం చి మధ్యప్రదేశ్ జైలు నుంచి తప్పించుకున్న వార్లని గుర్తించారు. బృం దంలో 10 మంది ఉండగా అందు లో మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఐపీఎస్‌లు, ఇద్దరు డీఎస్పీలు, మిగతావార్లు సీఐలు ఉన్నారు. ఢిల్లీ నుంచి సీఐఎస్ (కౌంటర్ ఇంటలీజెన్సీ స్వ్కాడ్ ) సమాచారం మేరకు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి వచ్చినట్లు సమాచారం. -
కానిస్టేబుల్ నాగరాజుకు కన్నీటి వీడ్కోలు
మోత్కూరు మండలం జానకీపురంలో జరిగిన ఎన్కౌంట ర్లో మృతి చెందిన చెవుగోని నాగరాజు (29) అంత్యక్రియలు అతని స్వగ్రామమైన కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామపంచాయతీ పరిధిలోని రసూల్‌గూడెంలో ఆదివారం అధికారలాంఛనాలతో నిర్వహించారు. స్పెషల్ పార్టీ పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి నివాళులర్పించారు. నాగరాజు పార్ధీవదేహానికి అతని తండ్రి శ్రీమన్నారాయణ తలకొరివి పెట్టారు. నాగరాజును కడసారిగా చూసేందుకు బంధువులతో పాటు చుట్టుపక్క గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. తెలంగాణ శాంతిభద్రతల విభాగం అడిషనల్ డీజీ సుదీప్ లక్టాకియా, ఐజీ వి. నవీన్‌చంద్, ఎస్పీ ప్రభాకర్‌రావు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు నాగరాజు మృతదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. కట్టంగూర్ మోత్కూరు మండలం జానకిపురం గ్రామంలో జరిగిన ఎన్కౌంట ర్లో మృతి చెందిన చెవుగోని నాగరాజు (29) స్వగ్రామమైన మండలంలోని అయిటిపాముల గ్రామపంచాయతీ పరిధి రసూల్‌గూడెంలో ఆదివారం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. నాగరాజును కడసారిగా చూసేందుకు బంధువులతో పాటు చుట్ట పక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. కానిస్టేబుల్ నాగరాజు మృతితో రసూల్‌గూడెం గ్రామం శోకసముద్రంలో మునిగింది. ఎండతీవ్రతను లెక్కచేయకుండా గ్రామస్తులు, పలుగ్రామాల ప్రజలు సాయంత్రం 3 గంటల వరకు అంతియ యాత్రలో పాల్గొన్నారు. కానిస్టేబుల్ తల్లిదండ్రులైన చెవుగోని శ్రీమన్నారాయణలక్ష్మమ్మ, భార్య సంజన రోదనలు పలువురిని కంటతడిపెట్టించాయి. చేతికి అందివచ్చిన ఏకైక కుమారుడు కాటికివెళ్లటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. నల్లగొండ ఎస్పీ ప్రభాకర్‌రావు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యేవరకు దగ్గరుండి పర్యవేక్షించారు. మృతదేహాన్ని నాగరాజు వ్యవసాయబావి వద్ద స్పెషల్‌పార్టీ పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు తుపాకులు పేల్చి నివాళులర్పించారు. వివిధ పార్టీల నాయకులు మృతదేహంపై పుష్పగుచ్ఛాలు, పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తండ్రి శ్రీమన్నారాయణ నాగరాజుకు తలకొరివి పెట్టారు. పోలీసు అధికారుల తరపున శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ సుదీప్ లఖాతియా, ఐజీ వి.నవీన్‌చంద్, ఎస్పీ ప్రభాకర్‌రావు, డీ ఎస్పీ రాములునాయక్, సీఐలు బాలకృష్ణ, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రమీల, డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, బడుగుల లింగయ్యయాదవ్, చెరుకు సుధాకర్, నోముల నర్సింహయ్య, సర్పంచ్ పెద్ది మంగమ్మసుక్కయ్య, పీఏసీఎస్ చైర్మన్ చెవుగోని సాయిలు, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దెంకి దయాకర్, బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, కటికం సత్తయ్యగౌడ్, మాజీ జెడ్పీటీసీ ఎస్. నర్సింహ, రెడ్డిపల్లి సాగర్, నర్సింహగౌడ్, ఎంపీటీసీలు పబ్బు వెంకటేశ్వర్లు, వైస్‌ఎంపీపీ బొడ్డుపల్లి జానయ్య, వైఎస్ఆర్సీపీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు ముశం రామానుజం తదితరులు పాల్గొన్నారు. పోలీసు అమరుల కుటుంబాలను ఆదుకుంటాం : ఎంపీ బూర ముష్కరుల కాల్పుల్లో మృతిచెందిన పోలీసు అమరుల కుటుంబాలను ఆదుకుంటామని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. కానిస్టేబుల్ నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. మృతుడి కుటుంబానికి *40లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఉగ్రవాదులను హతమార్చటంలో నల్లగొండ జిల్లా పోలీసులు చూపించిన తెగువను ఆయన కొనియాడారు. ఇలాంటి సమయంలో ప్రజ లందరూ ప్రభుత్వానికి అండగా ఉండి ఉగ్రవాదంపై పోరు సాగించాలని పిలపునిచ్చారు. భవిష్యత్‌లో పోలీసులకు మరిన్ని అధునాతన సౌకర్యాలను కల్పిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలు పూల రవీందర్, నేతి విద్యాసాగర్, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, జెడ్పీటీసీ మాద యాదగిరి పాల్గొన్నారు. -
టార్గెట్ ఏపీ!
‘సూర్యాపేట ముష్కరులు’ వెళ్లాల్సింది విజయవాడకు మిస్టరీగా మారిన మరోనలుగురు ముష్కరుల జాడ రాష్ట్రంలోకి ప్రవేశించి ఉంటారని అనుమానిస్తున్న ఇంటెలిజెన్స్ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: నిషేధిత ‘స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)’ ఉగ్రవాదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై గురిపెట్టారా? ఆర్థిక కార్యకలాపాలు బాగా పెరిగిన నేపథ్యంలో ఏపీలో ఏదైనా భారీ దోపిడీకో, విద్రోహ చర్యకో కుట్రపన్నారా? ఈ ప్రశ్నలకు నిఘా వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. నల్లగొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్‌లో బుధవారం అర్ధరాత్రి పోలీసులపై కాల్పులకు తెగబడి.. శనివారం జానకిపురం ఎన్కౌంటర్లో మృతి చెందిన సిమి ఉగ్రవాదులు అస్లం అయూబ్, జకీర్‌ల ఉదంతాన్ని విశ్లేషించిన అధికారులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే ముఠాకు చెందిన మరో నలుగురి జాడ తెలియకపోవడంతో... వారు ఇప్పటికే రాష్ట్రంలోకి ప్రవేశించి ఉంటారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందిగా అన్ని జిల్లాల ఎస్పీలు, సిటీ కమిషనర్లకు హెచ్చరికలు జారీచేశాయి. గమ్యం విజయవాడ.. దాదాపు రెండేళ్లుగా పరారీలో ఉన్న సిమి ఉగ్రవాది అబు ఫైజల్ గ్యాంగ్‌లో సభ్యులుగా ఉన్న ఉత్తరప్రదేశ్ వాసులు అస్లాం, జకీర్ బుధవారం విజయవాడకు బయలుదేరారు. హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ సమీపంలో తాండూరు డిపోకు చెందిన బస్సు ఎక్కిన వీరిద్దరూ విజయవాడకు టికెట్ కూడా తీసుకున్నారు. అయితే మార్గమధ్యలో సూర్యాపేట బస్టాండ్‌లో పోలీసులు బస్సును తనిఖీ చేయడం, కిందికి దిగిన ఉగ్రవాదులు కాల్పులు జరిపి పారిపోవడం జరిగింది. లేదంటే వారు నేరుగా విజయవాడకు చేరుకునే వారేనని నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి. సిమి కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులు సేకరించిన సమాచారం ప్రకారం.. ఈ ముఠాలో మొత్తం ఆరుగురు సభ్యులు ఉన్నారు. ఇద్దరు ఎన్కౌంటర్లో హతం కాగా.. మిగతా నలుగురు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టి ఉంటారని భావిస్తున్నారు. విడివిడిగా.. అబు ఫైజల్ నేతృత్వంలో ఏడుగురు ఉగ్రవాదులు 2013లో మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్నారు. ఇది జరిగిన రెండు నెలల్లోనే అబు ఫైజల్‌తో పాటు మరో ఉగ్రవాది పోలీసులకు దొరికారు. మిగతా ఐదుగురు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠాలోకి గత ఏడాది మరో సభ్యుడు చేరినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. పోలీసు, నిఘావర్గాల వేట ముమ్మరం కావడంతో.. వీరంతా విడివిడిగా నివసించడం, సంచరించడం వంటివి చేస్తున్నారు. కేవలం ‘ఆపరేషన్’ చేపట్టే ముందు ఎంపిక చేసుకున్న స్థలంలో మాత్రమే కలుస్తుంటారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ ఆరుగురు ఉగ్రవాదులు ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్లో ఉన్నట్లు గుర్తించిన యూపీ యాంటీ టైస్ట్ స్క్వాడ్ దాడి చేసింది. ఆ సమయంలోనే వారు ముగ్గురు చొప్పున వేర్వేరు ఇళ్లలో ఉండటంతో ప్రతి దాడి చేసి తప్పించుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కీ ఆరుగురూ విడివిడిగా వెళుతున్నట్లు అనుమానిస్తున్నారు. నేరాలకా.. విద్రోహ చర్యలకా? ఈ ఉగ్రవాదులు నేరాలకు పాల్పడి డబ్బు సమకూర్చుకుంటూనే.. మరోవైపు విద్రోహక చర్యలకూ పాల్పడుతున్నారు. ప్రధానంగా దోపిడీలు, భారీ దొంగతనాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ ముఠా గత ఏడాది కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎస్బీఐలో భారీ దోపిడీ చేసింది. దేశంలోని మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి నేరాలకు పాల్పడి... దోపిడీ చేసిన సొమ్మును వివిధ ఉగ్రవాద సంస్థలకు, ప్రస్తుతం జైళ్లలో ఉన్న ఉగ్రవాదుల కుటుంబాలకూ అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వారు ఇప్పుడు ఏపీలోకి అడుగుపెట్టడం దేనికోసమనే అంశంలో నిఘావర్గాలు లోతుగా ఆరా తీస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక లావాదేవీలు బాగా పెరగడంతో నేరాలు చేయడానికి వచ్చారా, లేక విద్రోహ దాడి కోణం ఉందా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హనుమాన్ జయంతికి రెండు రోజుల ముందు వారు మారణాయుధాలతో రాష్ట్రంలోకి ప్రవేశించే యత్నం చేయడంతో... ఏదైనా విద్రోహ చర్యకు కుట్ర పన్నారనే అంశాన్ని కొట్టిపారేయలేమని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. వివరాలెలా తెలుస్తున్నాయి? ఈ ముఠా గత ఏడాది కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఉన్న ఎస్బీఐని టార్గెట్ చేసింది. ఇప్పుడు అస్లాం, జకీర్ నల్లగొండ జిల్లా అర్వపల్లిలో ఉన్న ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గాలో షెల్టర్ తీసుకున్నారు. ఈ రెండూ ప్రాంతాలు ప్రధాన రహదారికి దూరంగా ఉన్నవే. వీటికి తోడు జనవరిలో నెల్లూరు జిల్లా తడలోని మారుమూల ప్రాంతంలో ఈ ఉగ్రవాదుల కదలిక ఉన్నట్లు నిఘావర్గాలకు సమాచారం అందింది. ఇలా అంతగా ప్రాచుర్యం లేని ప్రాంతాల వివరాలు ఈ ఉగ్రవాదులకు ఎలా తెలుస్తున్నాయనేది నిఘావర్గాలకు అంతు చిక్కడం లేదు. బిజునూరు మాదిరిగా ఇతర ప్రాంతాల్లోనూ వీరికి స్థానికులు లేదా స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్నవారు సహకరిస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాద సానుభూతిపరుల జాబితాలో ఉన్న వారిపై నిఘా ముమ్మరం చేశారు. -
రాజధానిలోనే మకాం..!
కొన్నాళ్లుగా హైదరాబాద్‌లోనే ముష్కరుల అడ్డా అప్రమత్తమైన నగర పోలీసులు.. మిగతా వారి కోసం గాలింపు సాక్షి, హైదరాబాద్: సూర్యాపేటలో పోలీసులను కాల్చి పరారై.. జానకీపురం ఎన్కౌంటర్లో హతమైన ముష్కరులు కొన్నాళ్లుగా హైదరాబాద్‌లోనే మకాం వేసినట్లుగా తెలుస్తోంది. ఖాండ్వా జైలు నుంచి పారిపోయిన వారిలో అస్లాం, జకీర్‌లు జానకీపురం ఎన్కౌంటర్లో మృతి చెందగా... ఫైజల్, అబీద్ గతేడాదే పోలీసులకు చిక్కారు. మిగిలిన మహబూబ్, అంజద్, ఇజాజ్‌లు నేటికి పరారీలో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు సూర్యాపేట కాల్పుల ఘటన తర్వాత అస్లాం, జకీర్‌లతో కలిసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మరో ఇద్దరు కూడా హైదరాబాద్‌లో మకాం వేసి ఉండవచ్చనే అనుమానాలున్నాయి. దీంతో హైదరాబాద్ పోలీసులతో పాటు నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఈ ముఠా హైదరాబాద్‌ను షెల్టర్‌గా చేసుకుంటే... వారికి ఎవరు సహకరించారనే దిశగా కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక అస్లాం, జకీర్‌ల వద్ద లభించిన రెండు సెల్ఫోన్లకు సంబంధించిన కాల్ లిస్టును పోలీసులు పరిశీలిస్తున్నారు. అందులోని నంబర్ల ఆధారంగా హైదరాబాద్‌లో జల్లెడ పట్టడంలో ఉన్నారు. వారిద్దరూ హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్టాండ్ (ఎంజీబీఎస్) ఔట్‌గేట్ వద్ద గిద్దలూరు వెళ్తున్న బస్సు ఎక్కారని ఆ బస్సు డ్రైవర్లు మహేందర్‌రెడ్డి, ప్రసాద్‌లు పోలీసులకు వాం గ్మూలం ఇచ్చారు. జానకీపురం ఎన్కౌంటర్లో మృతి చెందిన వారిలో ఒక ముష్కరుడి వద్ద గురువారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించిన రైలు టికెట్ లభించింది. అంటే సూర్యాపేట కాల్పుల ఘటన తర్వాత ఒకరు వచ్చి వీరితో కలిశారు. అతను గురువారం సాయంత్రం 3.45 గంటలకు న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో ప్రయాణించి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు నాంపల్లి రైల్వేస్టేషన్ వచ్చాడు. అక్కడి నుంచి నల్లగొండ జిల్లాలో సంచరిస్తున్న తమ సహచరులను కలుసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే జానకీపురం ఎన్‌కౌం టర్లో హతమైంది ఇద్దరు మాత్రమే కాబట్టి... మరొకరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.