ఎన్‌కౌంటర్ స్థలం పరిశీలన | Jankipuram Encounter space observation | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్ స్థలం పరిశీలన

Published Mon, Apr 6 2015 4:23 AM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM

ఎన్‌కౌంటర్ స్థలం పరిశీలన - Sakshi

ఎన్‌కౌంటర్ స్థలం పరిశీలన

మోత్కూరు మండలం జానకిపురం గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్ స్థలాన్ని ఆదివారం నాలుగు రాష్ట్రాలకు చెందిన పోలీసు యాంటీటెరిస్టుస్వ్కాడ్ బృందాలు సందర్శించి పరిశీలించాయి. శనివారం జానకిపురంలో పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఉగ్రవాదులు అస్లామ్‌ఆయూక్, జాకీర్‌బాదల్, కానిస్టేబుల్ నాగరాజు, మృతిచెందగా ఎస్‌ఐ సిద్ధయ్య ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్న విషయం పాఠకులకు తెలిసిందే. మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు  చెందిన యాంటీటైస్టుస్వ్కాడ్ బృందాలు, ఢిల్లీకి చెందిన జాతీయ పోలీస్ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇంటెలీజెన్స్ బృందాలు సందర్శించి కాల్పుల తీరును ప్రత్యక్ష సాక్షులను, స్థానిక పోలీసులను అడిగి వివరాలు సేకరించారు.
 
 గ్రామ శివారులోకి ఎలా ప్రవేశించారు, ఎదురుకాల్పులు జరిగిన తీరును సూర్యాపేట డీఎస్పీ ఎంఏ.రషీద్, తుంగతుర్తి , చౌటుప్పల్ సీఐలు గంగారాం, గంగమల్లు, మోత్కూరు ఎస్‌ఐ సి.పురేందర్‌భట్‌లను అడిగి తెలుసుకున్నారు. కర్నాటకు చెందిన  ఇంటెలీజెన్స్ ఇన్‌స్పెక్టర్ ఈరన్న, సబ్ ఇన్‌స్పెక్టర్ నర్సింహమూర్తి మాట్లాడుతూ ఘటనాస్థలంలో దొరికిన ఢిల్లీ-హైదరాబాద్  రైలు టికెట్ ద్వారా ఉగ్రవాదులుగా గుర్తించడానికి అవకాశం ఉందని తెలిపారు.
 
  బీజనూర్ బ్లాస్టింగ్‌లో తీవ్రమైన జననష్టం జరిగిన సంఘటనలో వీరి ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫైజల్ గ్యాంక్‌కు సంబంధించిన  ముఠా సభ్యులని అనుమానిస్తున్నట్లు వివరించారు. సంఘటన  ప్రాంతానికి సంబంధించిన ఫొటో, వీడియోలను యాంటీటైస్టుస్వ్కాడ్ బృందాలు సేకరించారు. ప్రత్యక్షంగా కాల్పులు జరిపి తీవ్రవాదులను చంపిన రామన్నపేటకు చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్ల యాంటీటెరిస్టుస్వ్కాడ్ బృందాలకు వివరించారు. పోలీసులు తీవ్రవాదులను వెంటాడిన తీరు, గ్రామ యువకులు సహకరించిన పరిస్థితిని బృందాలకు తెలిపారు.  
 
 ఉగ్రవాదుల మృతదేహాలను పరిశీలించిన ఏటీఎస్ బృందం

 నార్కట్‌పల్లి :  మోత్కూర్ మండలం జానకీపురంలో పోలీసుల కాల్పులో మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను స్థానిక కామినేని ఆస్పత్రిలో భద్రపరిచారు. ఆదివారం మధ్యప్రదేశ్, ఢిల్లీకి  చెందిన ఏటీఎస్( ఆంటి టైస్టు బృందం ) కామినేని ఆస్పత్రికి  మధ్యాహ్నం రెండు కార్లలో చేరుకొని ఆస్పత్రిలోని మార్చురీలో ఉన్న మృతదేహాలను పరిశీలించింది. మృతదేహాల వేలుముద్రలు సేకరిం చి మధ్యప్రదేశ్ జైలు నుంచి తప్పించుకున్న వార్లని గుర్తించారు. బృం దంలో 10 మంది ఉండగా అందు లో మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఐపీఎస్‌లు, ఇద్దరు డీఎస్‌పీలు, మిగతావార్లు సీఐలు ఉన్నారు. ఢిల్లీ నుంచి సీఐఎస్ (కౌంటర్ ఇంటలీజెన్సీ స్వ్కాడ్ ) సమాచారం మేరకు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి వచ్చినట్లు సమాచారం.   

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement