సీఎం కేసీఆర్ పెద్ద మోసగాడు
వికారాబాద్ అర్బన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మోసగాడని, ఆయన ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు అన్ని అబద్ధాలు ఆడుతారని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గడ్డం ప్రసాద్‌కుమార్ విమర్శించారు. వికారాబాద్ జిల్లా ను జోగులాంబ జోన్లో కలుపడాన్ని వ్యతిరేకిస్తూ పా ర్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో రిలే నిరహార దీక్షలను సోమవారం ప్రారంభించారు.
అం తకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కేసీఆర్ తె లంగాణకు ముఖ్యమంత్రి అయినా ఆయన ప్రాణమంతా సంగారెడ్డి జిల్లా అభివృద్ధి మీదనే ఉంటు ందన్నారు. అందుకే హైదరాబాద్‌కు దూరంగా ఉ న్న సంగారెడ్డిని చార్మినార్ జోన్లో కలిపి తన ప్రే మను ప్రదర్శించాడన్నారు.
వికారాబాద్‌కు 250 కి. మీ దూరంలో ఉన్న జోగులాంబ జోన్లో జిల్లా ను కలపడానికి కారణాలు ఏమిటో చెప్పాలని డి మాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చై ర్మన్ సత్యనారాయణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు సు ధాకర్‌రెడ్డి, కమాల్‌రెడ్డి, సంగమేశ్వర్, కౌన్సిలర్లు మధు, నర్సింలు, అబ్దుల్ ఖాలెద్, రాజలింగం, సుభాన్ రెడ్డి,రామస్వామి,రవిశంకర్ పాల్గొన్నారు.