kamalini mukerjhi
-
స్క్రీన్ టెస్ట్
1. హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ మొదట ఏ సినిమాకు డబ్బింగ్ చెప్పుకున్నారో తెలుసా? ఎ) ధృవ బి) జయ జానకీ నాయకా సి) సరైనోడు డి) నాన్నకు ప్రేమతో 2. అదితీ రావు హైదరీ సిల్వర్ స్క్రీన్‌పై మొదట ఏ హీరోతో నటించారో తెలుసా? ఎ) మమ్ముట్టి బి) కార్తీ సి) సుధీర్ బాబు డి) ధనుశ్ 3. హీరో నాని గతంలో కబడ్డీ ఆటగాడిగా నటించారు. ఇప్పుడు ఆయన మరో క్రీడా నేపథ్యం ఉన్న చిత్రంలో నటిస్తున్నారు. ఏ క్రీడకు సంబంధించిన చిత్రంలో ఆయన నటిస్తున్నారు? ఎ) బ్యాడ్మింటన్ బి) క్రికెట్ సి) హాకీ డి) ఖోఖో 4. దాసరి దర్శకత్వం వహించిన సూపర్‌హిట్ సినిమా ‘గోరింటాకు’. ఆ చిత్రంలో కథానాయిక పాత్ర చేశారు నటి సుజాత. మొదట దర్శక,నిర్మాతలు అనుకున్న హీరోయిన్ సుజాత కాదట. మరి మొదట అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) మాధవి బి) సరిత సి) రాధిక డి) సుహాసిని 5. కృష్ణ నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రానికి రచయితెవరో తెలుసా? ఎ) పద్మరాజు బి) జంధ్యాల సి) పరుచూరి బ్రదర్స్ డి) మహారధి 6. ఐశ్వర్యారాయ్ ఏ హీరోని సినిమాలో చిట్టీ అని పిలిచారో గుర్తుందా? ఎ) రజనీకాంత్ బి) కమల్ హాసన్ సి) విజయ్ డి) విక్రమ్ 7. ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలోని ‘పెనివిటి...’ పాటను పాడింది ఎవరు? ఎ) కాలభైరవ బి) శ్రీరామచంద్ర సి) హేమచంద్ర డి) దీపు 8. ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రంలో హీరో రామ్. ఆ చిత్రంలో ఓ హీరోయిన్గా అనుపమా పరమేశ్వరన్ నటించారు. మరో హీరోయిన్ ఎవరు? ఎ) రష్మికా మండన్నా బి) ప్రణీత సుభాశ్ సి) లావణ్య త్రిపాఠి డి) రాశీ ఖన్నా 9. ప్రభాస్ హీరోగా తెలుగులో ఇప్పటివరకు ఎన్ని చిత్రాలు రిలీజ్ అయ్యాయో కనుక్కోండి? ఎ) 14 బి) 24 సి) 16 డి) 18 10. ‘హౌస్‌ఫుల్ 4’ నుంచి నానా పటేకర్ తప్పుకున్నాక ఆ పాత్రకు ఓ తెలుగు హీరోని తీసుకున్నారు. అతనెవరో తెలుసా? ఎ) రానా బి) సందీప్ కిషన్ సి) నాని డి) అఖిల్ 11. అల్లు అర్జున్, మంచు మనోజ్ ఈ ఇద్దరు హీరోలు నటించిన ‘వేదం’ చిత్రంలో వేశ్య పాత్రలో నటించిన నటి ఎవరు? ఎ) ధీక్షాసేథ్∙ బి) కమలినీ ముఖర్జీ సి) అనుష్క డి) శ్రియ 12. ప్రముఖ నటి సౌందర్య తనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్లారో తెలుసా? ఎ) 42 బి) 36 సి) 32 డి) 35 13. ‘బొబ్బిలి రాజా’ చిత్రంలో వెంకటేశ్‌కు అత్తగా పవర్ఫుల్ క్యారెక్టర్లో నటì ంచిన ప్రముఖ నటి ఎవరో గుర్తున్నారా? ఎ) శారద బి) వాణీశ్రీ సి) జయచిత్ర డి) జయంతి 14. ‘స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్’ చిత్రంలో నటించిన హీరోయిన్ నిరోషా ఓ ప్రముఖ హీరోయిన్‌కి చెల్లెలు. ఆ హీరోయిన్ పేరేంటి? ఎ) రాధిక బి) జయసుధ సి) జయప్రద డి) రాధ 15. ‘మహానటి’ చిత్రంలో జెమినీ గణేశన్ మొదటి భార్యగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) మాళవికా నాయర్ బి) నిత్యామీనన్ సి) కీర్తీ సురేశ్ డి) మాళవికా శర్మ 16. 2018లో విడుదలైన మూవీ ‘గీతగోవిందం’ లోని ‘‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలి..’’ అనే సూపర్‌హిట్ పాట రచయితెవరో కనుక్కోండి? ఎ) శ్రీమణి బి) అనంత శ్రీరామ్ సి) వరికుప్పల యాదగిరి డి) చంద్రబోస్ 17. శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’ లో నటిస్తున్న హీరోయిన్ ఎవరు? ఎ) రెజీనా బి) కాజల్ అగర్వాల్ సి) ఇలియానా డి) నయనతార 18. జయప్రద లీడ్ రోల్లో నటించిన సూపర్‌హిట్ సినిమా ‘అంతులేని కథ’ చిత్రానికి దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) దాసరి నారాయణరావు బి) కె.బాలచందర్ సి) భారతీరాజా డి) మణిరత్నం 19. ఈ ఫోటోలో ఉన్న చిన్నప్పటి బాలీవుడ్ భామ ఎవరో తెలుసా? ఎ) దీపికా పదుకోన్∙ బి) కాజోల్ సి) అయేషా టకియా డి) కరీనా కపూర్ 20. చిరంజీవి నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో కనుక్కోండి? ఎ) కొండవీటి దొంగ బి) సింహపురి సింహం సి) మంచి దొంగ డి) రాజా విక్రమార్క మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) డి 2) ఎ 3) బి 4) డి 5) డి 6) ఎ 7) ఎ 8) బి 9) డి 10) ఎ 11) సి 12) సి 13) బి 14) ఎ 15) ఎ 16) బి 17) సి 18) బి 19) ఎ 20) బి నిర్వహణ: శివ మల్లాల -
కమలిని కవిత్వం
సెలబస్ ‘‘యమునాతీరం... సంధ్యారాగం’’ అంటూ ‘ఆనంద్’ సినిమాలో ఆడిపాడిన కమలినీ ముఖర్జీ అందరికీ అభిమాన నటి అయ్యింది. ‘‘వచ్చే వచ్చే వానజల్లుల్లారా’’ అంటూ ‘గోదావరి’ నీళ్లల్లో పడవ మీద తుళ్లిపడుతూ అందరినీ అలరించింది. ఆమెలో ఎంత గొప్ప నటి ఉందో ప్రతి ప్రేక్షకుడూ చెబుతాడు. కానీ ఆమెలో ఎంత మంచి కవయిత్రి ఉందో, ఆమె కలం ఎంత చక్కటి కవితలను లిఖించగలదో మాత్రం ఎవరికీ తెలియదు. హావభావాలతో ఆకట్టుకునే కమలిని అక్షరాలతో మనసులను ఎలా పెనవేయగలదో తెలుసుకోవాలంటే... ఇదిగో, ఆమె రాసిన ఈ కవిత చదివితే సరి! ఇది నా తొలి కవిత. ఎప్పుడు రాశానో, ఎందుకు రాశానో, ఎలా రాశానో కూడా నాకు గుర్తు లేదు. ఇప్పుడా కవితని చదువుతుంటే... ఎప్పుడో రాత్రివేళ, రకరకాల ఆలోచనలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో రాశానేమో అనిపిస్తుంది. అప్పుడు నేను ఏ మూడ్‌లో ఉన్నానో తెలియదు... బహుశా మౌనంగా, ప్రశాంతంగా, ఏవేవో ఊహల్లో తేలియాడుతూ ఉండి ఉంటాననిపిస్తోంది. ప్రేమలో పడినప్పుడు ఇలా ఉంటారని అంటారు కదూ! ప్రేమలో పడ్డానని కాదుగానీ... ఆ క్షణంలో ప్రేమ గురించిన తలపుల్లో మునకలు వేస్తూ ఉండి ఉంటానేమో! - కమలినీ ముఖర్జీ తలపులు నీలి రంగు పులుముకున్న ఆకాశంకేసి నిశితంగా చూస్తున్నాను. సన్నగా వీస్తోన్న పిల్ల తెమ్మెరలను ఆస్వాదిస్తున్నాను. దూరం నుంచి వినిపిస్తోన్న సాగరపు ఉచ్ఛ్వాస, నిశ్వాసల్ని ఆలకిస్తూ .... భ్రాంతిపూరితమైన నా భావనలను నేను తరచి చూసుకుంటున్నాను. హాయియైన ఆ భ్రమను, భావనలను అలాగే నిలిపి ఉంచేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాను. చామంతి పూపానుపుపై పవళించి... నీ తలపుల మత్తులో తూగుతున్నాను. నువ్వు నా హృదయాన్ని పూర్తిగా ఆక్రమించేశావు. దాని స్పందనలన్నింటినీ నువ్వే నిర్దేశిస్తున్నావు. నేను ఎడారిలో ఎండమావి కోసం గానీ వెతుకుతున్నానా...? తెలియదు. కానీ శిశిరం తరువాత వచ్చే వసంతం కోసం ఎదురు చూడకుండా ఉండలేను కదా! అదేమిటో... అల్పమైన వాటిలో కూడా అందమైన విషయాలను గుర్తిస్తున్నాను. లేత గులాబీరంగు అద్దాల గుండా చూసి జీవితాన్ని వర్ణచిత్రంగా భావిస్తున్నానా అని సందేహం కలుగుతోంది. అందుకే ఆ అనుభూతిలో ఉండగా ఒక్కసారి ఉలిక్కిపడి నన్ను నేను ప్రశ్నించుకుంటాను... ఒక వేళ నేను స్వప్నంలో గానీ జీవిస్తున్నానా అని!!! (కమలినీ ముఖర్జీ రాసిన ‘థాట్స్’ అనే ఆంగ్ల కవితకి స్వేచ్ఛానువాదం)