Khammam district tour
-
రేపటి నుంచి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ పర్యటన
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రేపటి నుంచి రెండు రోజుల పాటు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ýసోమవారం ఉదయం 11 గంటలకు కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఖమ్మం బయల్దేరి వెళతారు. ముందుగా ఆయన ఖమ్మం నగరంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రెండో రోజు మంగళవారం రోడ్డు మార్గంలో కేసీఆర్ ముదిగొండ చేరుకుని అక్కడ నుంచి ముత్తారం గ్రామంలోని రామాలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం తిరుమలాయపాలెంలో రామదాసు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి బహరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం టేకులపల్లి మండలం రోళ్లపాడులో శ్రీరామ నీటి పథకానికి శంకుస్థాపన చేసి అక్కడ ప్రజలతో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 2.30గంటలకు రోళ్లపాడు నుంచి కేసీఆర్ హైదరాబాద్ పయనం అవుతారు. -
నేడు, రేపు ఖమ్మం జిల్లాలో పొంగులేటి పర్యటన
సాక్షి, ఖమ్మం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధ, గురువారాలలో జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. అనంతరం ముదిగొండ మండలం గంధసిరిలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. గురువారం ఉదయం పెనుబల్లి మండలంలోని నీలాద్రి, కుంపెనకుంట్ల గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం వైరా మండలంలో పర్యటిస్తారు. అలాగే ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా చేపట్టిన పనులకు శంకుస్థాపన చేస్తారు. వీటితోపాటు ఈ రెండు రోజులలో పలు శుభకార్యాలకు హాజరవుతారు.