నేడు, రేపు ఖమ్మం జిల్లాలో పొంగులేటి పర్యటన | Ponguleti srinivasa reddy to tour in Khamma district from today | Sakshi
Sakshi News home page

నేడు, రేపు ఖమ్మం జిల్లాలో పొంగులేటి పర్యటన

Published Wed, Jan 28 2015 7:28 AM | Last Updated on Thu, Aug 9 2018 4:45 PM

నేడు, రేపు ఖమ్మం జిల్లాలో పొంగులేటి పర్యటన - Sakshi

నేడు, రేపు ఖమ్మం జిల్లాలో పొంగులేటి పర్యటన

సాక్షి, ఖమ్మం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధ, గురువారాలలో జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.
 
 అనంతరం ముదిగొండ మండలం గంధసిరిలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. గురువారం ఉదయం పెనుబల్లి మండలంలోని నీలాద్రి, కుంపెనకుంట్ల గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం వైరా మండలంలో పర్యటిస్తారు. అలాగే ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా చేపట్టిన పనులకు శంకుస్థాపన చేస్తారు. వీటితోపాటు ఈ రెండు రోజులలో పలు శుభకార్యాలకు హాజరవుతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement