khm
-
న్యాయ సహాయానికి కృషి
జిల్లా న్యాయమూర్తి సిహెచ్.విజయ్‌కుమార్ ఖమ్మం లీగల్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో త్రివర్ణ పతాకాన్ని జిల్లా న్యాయమూర్తి సిహెచ్.విజయ్‌కుమార్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరికీ న్యాయ సహాయం అందించేందుకు న్యాయ సేవాసదన్ కృషి చేస్తున్నదన్నారు. అదనపు జిల్లా జడ్జి రాధాకృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండారుపల్లి గంగాధర్, జడ్జీలు మాధవీకృష్ణ, అమరావతి, పంచాక్షరి, సతీష్‌కుమార్, న్యాయ సేవాసదన్ కార్యదర్శి వీఏఎల్ సత్యవతి, న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దండి ప్రేమ్‌కుమార్, బార్ అసోసియేషన్ బాధ్యులు మేకల సుగుణారావు, శ్రీనివాస గుప్తా, ఎన్.రాము, అమర్నా«ద్, లక్ష్మీనారాయణ, ఇంద్రాచారి, కన్నాంబ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
ఖమ్మం సిటీ : ఇల్లెందు ఏరియాలో పోడు భూముల్లో పంటల విధ్వంసం, ఆదివాసీలపై పోలీసుల నిర్బంధాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. తొలుత ఆ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలు దేరి బైపాస్ రోడ్డు వరకు చేరుకుని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు కెచ్చెల రంగయ్య మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతో ఆదివాసీల పంటలను ధ్వంసం చేస్తోందని విమర్శించారు. అడ్డు వచ్చిన మహిళలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేసి వారికి పట్టాలివ్వాలని ప్రభుత్నాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వరరావు, ఆవుల వెంకటేశ్వర్లు, రామయ్య పాల్గొన్నారు.