Kite Festival
-
పతంగుల పరిశ్రమ వృద్ధిలో ప్రధాని మోదీ పాత్ర ఏమిటి?
మకర సంక్రాంతి పర్వదినం గుజరాత్‌కు ఎంతో ప్రత్యేకమైనది. దీనికి కారణం గుజరాత్ అంతటా గాలిపటాలు ఎగరడమే. ఈసారి వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన పలువురు ప్రతినిధులు గాలిపటాలు ఎగురవేయడంపై ఆసక్తి చూపారు. మునుపెన్నడూ లేనంతగా పతంగులపై ప్రజలు ఇంత ఆసక్తి చూపడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది అంతర్జాతీయ పతంగుల పండుగలో గతానికంటే భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. అయితే ఇదంతా ఒక్కరోజులో హఠాత్తుగా జరిగినది కాదు. దీని వెనుక 20 ఏళ్లకు పైగా శ్రమ ఉంది. ఈ గాలిపటాల పండుగ గుజరాత్ సంస్కృతిని అందరికీ తెలిసేలా చేసింది. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయానికి అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఎంతో ప్రాధాన్యతనిచ్చి, ప్రపంచం గుర్తించేలా చేశారు. అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ గుజరాత్లో 1989 నుండి అధికారిక కార్యక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ, 2005లో వైబ్రెంట్ గుజరాత్ ఇన్వెస్టర్ సమ్మిట్‌తో ఈ ఉత్సవానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అయితే గుజరాత్ పతంగులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రణాళికను 2003లో అప్పటి ముఖ్యమంత్రి మోదీ సిద్ధం చేశారు. అది గుజరాత్లో గాలిపటాల పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందేందుకు దోహదపడింది. తమిళనాడులోని గాలిపటాల పరిశ్రమలపై అధ్యయనం చేసి, స్థానికంగా గాలిపటాల పరిశ్రమ అభివృద్ధికి వ్యూహాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అప్పటి సీఎం నరేంద్ర మోదీ అధికారులను కోరారు. 2003లో నిపుణుల బృందం గాలిపటాల పరిశ్రమలు కలిగిన అనేక ప్రదేశాలలో సమగ్ర సర్వేను నిర్వహించింది. అప్పటి నుంచి ప్రభుత్వం స్థానికంగా గాలిపటాల పరిశ్రమ వృద్ధిని ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. 2003లో నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లోని గాంధీ లేబర్ ఇన్స్టిట్యూట్లో గుజరాత్ కైట్ ఇండస్ట్రీ వర్క్ క్యాంప్ నిర్వహించారు. దీనిద్వారా గాలిపటాల కళాకారులు, పంపిణీదారులు, ప్రభుత్వ సంస్థలు, డిజైనర్లు, ఆర్థిక సంస్థల మధ్య కమ్యూనికేషన్ కోసం ప్రయత్నించారు. ఈ వర్క్‌క్యాంప్‌కు భాను భాయ్ షాను కూడా ఆహ్వానించారు. భాను భాయ్ ప్రముఖ కైట్‌సర్ఫర్. 50 సంవత్సరాలుగా గాలిపటాలు సేకరించడం అంటే అతనికి ఎంతో ఇష్టం. అవసరమైన ముడి పదార్థాల లభ్యతను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా గాలిపటాల పరిశ్రమను మరింత సులభతరం చేయాలని మోదీ కార్పొరేట్ సంస్థలను కోరారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న లక్షకుపైగా కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా గాలిపటాల పరిశ్రమను మోదీ అభివృద్ది చేశారు. గాలిపటాల తయారీ అనేది 2003-04 లో కుటీర, గ్రామీణ పరిశ్రమల స్థాయికి చేరింది. ఫలితంగా గుజరాత్లో గాలిపటాల పరిశ్రమ కొత్త మలుపు తిరిగింది. 2003-04 సంవత్సరంలో గాలిపటాల పరిశ్రమ టర్నోవర్ రూ. 15-20 కోట్లుగా ఉంది. కైట్ ఫెస్టివల్ విజయవంతం కావడంతో ఈ పరిశ్రమ పరిధి మరింత విస్తరించింది. 2007లో ఈ పరిశ్రమ టర్నోవర్‌తో రూ. 100 కోట్లకు చేరుకుంది. 2010నాటికి ఇది రూ. 400 కోట్ల పరిశ్రమగా మారింది. 2014 సంవత్సరంలో, గుజరాత్ గాలిపటాల ప్రపంచ వ్యాపారం రూ. 500 కోట్ల రూపాయలకు చేరింది. ఇది గుజరాత్లో మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సాధించిన పెద్ద విజయంగా చెబుతారు. గుజరాత్‌లోని గాలిపటాల పరిశ్రమలో పనిచేస్తున్న వారిలో 70 శాతం మంది మహిళలే ఉన్నారు. మోదీ అనంతర ప్రభుత్వాలు నేటికీ గాలిపటాల వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇది కూడా చదవండి: ‘బుల్డోజర్ బాబా’ పతంగులకు డిమాండ్! -
‘బుల్డోజర్ బాబా’ పతంగులకు డిమాండ్!
పతంగులు ఎగురవేసే అభిరుచి కలిగినవారికి మకర సంక్రాంతి ఎంతో ప్రత్యేకం. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో కైట్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలోని వారణాసి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. వారణాసి గగనతలంలో ప్రత్యేక గాలిపటాలు సందడి చేస్తున్నాయి. ఈసారి వారణాసి మార్కెట్లో ‘బుల్డోజర్ బాబా’ గాలిపటాలకు అత్యధిక డిమాండ్ ఏర్పడింది. ఈ బుల్డోజర్ బాబా గాలిపటంపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలు ఉన్నాయి. దీంతోపాటు బుల్డోజర్ బాబా బొమ్మకు కూడా చోటు దక్కింది. అంతే కాదు ఈ గాలిపటంపై భారతీయ జనతా పార్టీ ఎన్నికల గుర్తు కమలాన్ని కూడా ముద్రించారు. దుకాణదారుడు అరవింద్ మాట్లాడుతూ బుల్డోజర్ బాబా గాలిపటాలను యువత అమితంగా ఇష్టపడుతున్నారని, అందుకే వాటిని కొనుగోలు చేస్తున్నారని అన్నారు. వారణాసిలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లోనూ ‘బుల్డోజర్ బాబా’ పతంగికి డిమాండ్ ఉంది. ఈ గాలిపటం ధర 5 నుంచి 15 రూపాయల వరకు ఉంది. గాలిపటాలంటే అమితమైన ఇష్టం ఉన్న వారణాసి కుర్రాడు ఆదిత్య ఈసారి మకర సంక్రాంతికి బుల్డోజర్ బాబా గాలిపటం ఎగురవేస్తానని చెప్పాడు. యోగి ఆదిత్యనాథ్ యూపీలో తన ‘బుల్డోజర్’ చర్యలతో మాఫియా వెన్ను విరిచి, చట్టబద్ధ పాలనను తీసుకొచ్చారని ఆదిత్య పేర్కొన్నాడు. సీఎంకు మద్దతుగా తాను ఈ గాలిపటాన్ని ఎగురవేస్తానన్నారు. ఇది కూడా చదవండి: 25 అడుగుల జాయింట్ కైట్ ఎగురుతుందిలా.. -
పరేడ్ గ్రౌండ్స్‌లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ (ఫొటోలు)
-
తొలి గాలిపటాన్ని ఎవరు తయారు చేశారు? ఎందుకు ఉపయోగించారు?
దేశంలోని వివిధ ప్రాంతాలలో మకర సంక్రాంతిని అక్కడి ఆచార సంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారు. అయితే సంక్రాంతి అనగానే ముందుగా గాలిపటాలు గుర్తుకువస్తాయి. జైపూర్, ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో సంక్రాతి సందర్భంగా కైట్ ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. మకర సంక్రాంతి సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు గాలిపటాలు ఎగరేస్తూ ఎంతగానో ఆనందిస్తారు. అయితే గాలిపటం అనేది భారతదేశంలో ఆవిష్కృతం కాలేదు. గాలిపటాన్ని చైనాలో కనుగొన్నారు. క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలో చైనాలో గాలిపటాన్ని ఆవిష్కరించారని చెబుతుంటారు. ప్రపంచంలోనే మొట్టమొదటి గాలిపటాన్ని చైనీస్ తత్వవేత్త హువాంగ్ హెంగ్ తయారు చేశారు. చైనాలో గాలిపటాలు దూరాలను కొలవడానికి, గాలిని పరీక్షించడానికి, సైనిక కార్యకలాపాలలో ఉపయోగించేందుకు కనుగొన్నారు. అయితే గాలిపటం భారతదేశంలో ఎంతగానో ప్రాచుర్యం పొందింది. భారతదేశంలో నాటి కాలపు రాజులు, చక్రవర్తులు కూడా గాలిపటాలు ఎగురవేసేవారు. ఇది కాలక్రమేణా ప్రజాదరణ పొందింది. ప్రస్తుత రోజుల్లో సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకూ అందరూ గాలిపటాలు ఎగురవేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి కూడా గాలిపటాలు ఎగురవేయడం అంటే ఎంతో ఇష్టం. ఆయన వీలు చిక్కినప్పుడు గాలిపటాలు ఎగురవేస్తుంటారు. మకర సంక్రాంతి నాడు దేశంలోని జైపూర్, అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో గాలిపటాల ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పతంగులు ఎగురవేసేందుకు, వాటిని చూసేందుకు పలు దేశాల టూరిస్టులు భారత్‌కు వస్తుంటారు. సంక్రాంతి నాడు ఆకాశం గాలిపటాలతో నిండిపోతుంది. దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయల పతంగుల వ్యాపారం జరుగుతుండగా, జైపూర్, అహ్మదాబాద్, ముంబైలలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. పతంగుల తయారీ వలన లక్షలాది మందికి ఉపాధి కూడా లభిస్తుంది. గాలిపటం ఎగురవేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. కొన్నిసార్లు గాలిపటం ఎగురవేసేటప్పుడు దాని దారం విద్యుత్ తీగలకు చిక్కుకుపోతుంది. ఇటువంటి సందర్భంలో ఆ దారాన్ని లాగితే షాక్ తగిలే అయ్యే ప్రమాదం ఉంది. చాలా మంది పిల్లలు గాలిపటాలు ఎగురవేసేటప్పుడు ప్రమాదాల బారినపడుతుంటారు. ఇటువంటి సందర్భాల్లో తల్లిదండ్రుల పర్యవేక్షణ మరింత అవసరం. -
గాలిపటం ఎగురవేస్తూ 11 ఏళ్ల బాలుడు మృతి
-
Hyderabad Kite Festival 2024: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కైట్ ఫెస్టివల్ 2024 (ఫొటోలు)
-
అహ్మదాబాద్ : ‘ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్’ (ఫొటోలు)
-
Makar Sankranti 2023: పదపదవె ఒయ్యారి గాలిపటమా..
సంప్రదాయాలను చెడగొట్టేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. చైనా మాంజాలూ అనవసర పోటీలతో గాలిపటాలకు అడ్డంకులేర్పరుస్తుంటారు. నిజానికి గాలిపటం ఎగుర వేయడం చలికాలంలో మంచి వ్యాయామం. సంక్రాంతి వేళ ఖాళీ పొలాల్లో పతంగాలు ఎగురేస్తే వినోదమూ ప్లస్ డి విటమిన్. గాలిపటం చుట్టూ ఎన్నో జీవనసత్యాలు. అది ఆకాశాన్ని అందుకోమని అంటుంది. కాని సూత్రం సరిగా లేకపోయినా దారం చేజారినా తనలాగే జీవితమూ గిరికీలు కొడుతుందని హెచ్చరిస్తుంది. దేశంలో కైట్ ఫెస్టివల్స్ జరిగే సమయం ఇది. పిల్లలకు గాలిపటాలు చాలా ఇష్టం. సంక్రాంతి గాలిపటం ఒక పసిడి జ్ఞాపకం. ఇప్పుడు ప్లాస్టిక్ షీట్‌తో గాలిపటాలు తయారు చేస్తున్నారుగాని ఒకప్పుడు గాలిపటం అంటే రంగు కాగితమే. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, వంకాయ రంగు.... డార్క్ కలర్ కాగితాలతో తయారయ్యి, తోకలు తగిలించుకుని దుకాణాల్లో అమ్మకానికి పెట్టి ఉంటే వాటి అందమే వేరు. పిల్లలకు తమ ఇష్టానికి తగిన రంగు గాలిపటం దొరికేది. ‘నీది ఎరుపు... నాది పచ్చ’ అని తగాదాలు లేకుండా గుర్తుగా ఇళ్లల్లో దాచుకునేవారు. మైదానంలో, మిద్దెక్కి ఎగరేసేవారు. గాలిపటం సం΄ాదించడానికి అమ్మ, నాన్నల దగ్గర మారాము చేసేవారు. గాలిపటం, పతంగి, కైట్... పేరు ఏదైనా ఎగిరే కాగితం పిట్ట అది. బాల్య కుతూహలం గాలిపటం ఒక బాల్య కుతూహలం. తాను ఎగరలేక΄ోయినా తాను ఎగిరించగలడు అనే ఇగో సంతృప్తికి సంకేతం. పక్షిలా ఎగరలేని మనిషి పక్షితో సమాంతరంగా ఆకాశంలో గాలిపటం ఎగురవేసి అబ్బురపడ్డాడు. అలా ఎగరడానికి అవసరమైన సూత్రాన్ని కనుగొన్నాడు. కాలాన్ని కూడా గమనించాడు. మితిమీరిన ఎండల కాలం, వానల కాలం గాలిపటం ఎగురవేయడానికి అనువైనది కాదు. ఒకప్పుడు దీపావళి ముగిశాక... అప్పటి నుంచి మొదలయ్యి ఫిబ్రవరి వరకు గాలిపటాలు ఎగుర వేసేవారు. ఇప్పుడు మెల్లగా అది సంక్రాంతి సీజన్‌గా మారింది. దానికి కారణం పొలాలు కోత పూర్తయ్యి ఖాళీగా ఉంటాయి. పల్లెల్లో జనం విశ్రాంతిలో ఉంటారు. సీజన్ అనుకూలంగా ఉంటుంది. సంక్రాంతితో ఎండ మొదలవుతూ ఉష్ణం ఒంటికి తగులుతూ ఉంటుంది. అందుకని ఇది గాలిపటాల సీజన్‌గా మారింది. ఒక్క తెలుగు ప్రాంతంలోనే కాదు... తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్‌లలో కూడా సంక్రాంతి సమయంలో గాలిపటాలు ఎగురవేస్తారు. హైదరాబాద్‌లో ఈ క్రీడ విఖ్యాతం. గుజరాత్లో ‘ఉత్తరాయణ్’ పేరుతో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ప్రతాప చిహ్నం ఆధిక్య ప్రదర్శన చేయడం కూడా మనిషికి ఇష్టం. గాలిపటాలు ఎగురవేసి ఏది ఎక్కువ ఎత్తుకు ఎగరితే ఆ ఎగరేసిన మనిషికి ఆ కాసేపు ఆధిక్యం వస్తుంది. ‘కోయడం’ కూడా ఈ ఆటలో ఒక ఆధిక్యప్రదర్శనే. ఎగురుతున్న గాలిపటాల మీదకు వెళ్లి తమ గాలిపటంతో (దారంతో/మాంజాతో) కోసి దానిని నేలకూల్చడం గొప్ప. రాను రాను ఇలా కోతకు గురికాని దారం కోసం అంటే ప్రత్యర్థులు దాడి చేసినా తెగని దారం కోసం రకరకాల ప్రయోగాలు, పదార్థాలు కలిపిన దారం తయారు చేసి నేడు పక్షులకు, మనుషులకు ప్రమాదకరంగా మారి గాలిపటాల ఆటకే చేటుకాలాన్ని తెచ్చారు కొందరు. ఈ ఆధిక్య ప్రదర్శను పక్కన పెడితే గాలిపటం ఎగురవేయడం ఎంతో ఆహ్లాదం కలిగించే ఆట. గాలిపటం పాటలు గాలిపటం పాటలు సినిమాల్లో చాలా ఉన్నాయి. ‘తోడికోడళ్లు’లో ‘గాలిపటం గాలిపటం రయ్యిన ఎగిరే గాలిపటం’ అని అక్కినేని పాడతాడు. ‘కులదైవం’ సినిమాలో హీరో చలం ‘పద పదవే ఒయ్యారి గాలి పటమా’ పాడితే నేటికీ అది హిట్ పాటగా ఉంది. ‘చంద్రముఖి’లో ‘చిలుకా పద పద మైనా పద పద’ అని రజనీకాంత్ కూడా గాలిపటాలు ఎగురవేస్తాడు. గాలిపటంలో తత్త్వం కూడా మనిషి వెతికాడు. అదను మరిస్తే జీవితం తెగిన గాలిపటం అవుతుందని గ్రహించాడు. ఎంత ఎత్తుకు ఎగిరినా దారం లాంటి ఆధారం తప్పక ఉండాలని గ్రహించాడు. గాలిపటంలా మిడిసి పడకూడదని, చివరకు దానిలాగే నేలకు దిగాల్సి వస్తుందని బుద్ధి చెప్పుకున్నాడు. అపశ్రుతులు లేకుండా గాలిపటం మన దృష్టిని పైన ఉంచుతుంది. ముందు వెనుకా చూడ వీలు కల్పించదు. అందుకే పిల్లల చేత మైదానాల్లోనే గాలిపటాలు ఎగురవేయించాలి. లేదా రెయిలింగ్ ఉన్న మిద్దెల మీదే ఎగుర వేయించాలి. గోడలు ఎక్కనివ్వరాదు. తెగిన గాలిపటాల కోసం కరెంటు స్తంభాల దగ్గరకు వెళ్లనివ్వరాదు. దారం వదిలేప్పుడు వేలు తెగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. -
సంక్రాంతి: శుభాలకు వాకిలి
మన మహర్షులు ఏర్పరచిన పండుగలలో మనకు అత్యంత ప్రధానమైనది ‘సంక్రాంతి.‘ మకర సంక్రాంతి పుష్యమాసంలో వస్తుంది. పుష్ – అంటే పోషించటం, పుష్టిని కలిగించటం. సర్వ్రపాణికోటికీ పుష్టిని కలిగించే పంటలు ఇంటికి వచ్చే పండుగ సంక్రాంతి పండుగ. మన దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలే కాక ఒకప్పుడు మన భారతదేశంలోని భాగాలే అయిన శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, మలేషియా వంటి ప్రాంతాల్లో కూడా మకర సంక్రాంతిని జరుపుకుంటున్నారు. ‘సం’ అంటే ‘సమ్యక్’ – మంచి, చక్కని. ‘క్రాంతి’ అంటే మార్పు. సమ్యక్ క్రాంతి – సంక్రాంతి. ‘సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే – ‘చేరటం’ అని అర్థం. మేషం మొదలైన పన్నెండు రాశులలో సంచరించే సూర్య భగవానుడు ముందున్న రాశి నుండి తరువాత రాశి లోనికి ప్రవేశించటమే సంక్రాంతి. ప్రతి నెలలో సూర్యుడు రాశులు మారుతుంటాడు. అలా మేష సంక్రాంతి, వృషభ సంక్రాంతి, మిథున సంక్రాంతి మొదలైన పన్నెండు సంక్రాంతులు ఏర్పడతాయి. వాటిలో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే పుణ్యకాలాన్ని‘మకర సంక్రాంతి పండుగ‘ గా జరుపుకుంటున్నాం. సూర్యుడు ఈ మకర రాశిలో ప్రవేశించటాన్నే ఎందుకు పెద్ద పండుగగా జరుపుకుంటున్నాం అంటే, వెలుగు ఎక్కువగా ఉండే దీర్ఘమైన పగళ్ళకూ, ఆరోగ్యాన్ని వృద్ధిపరిచే సుందరమైన, ఆహ్లాదకరమైన కాలానికి నాంది కాగల ఉత్తరాయణ పుణ్యకాలం ్రపారంభమవుతుంది కనుక. ప్రకృతి లో ఇది గొప్ప మార్పు. మన ఉత్తరాయణం ఆరు నెలలు దేవతలకు పగటి కాలం. అందువల్ల కూడా ఉత్తరాయణం అత్యంత పవిత్రమైన కాలం. ఉత్తరాయణంలోనే మనం ఉపనయనాలు, వివాహాది శుభకార్యాలను జరిపిస్తాం. కనుకే ఉత్తరాయణం ్రపారంభంలో వచ్చే మకర సంక్రమణాన్ని‘సంక్రాంతి పండుగ‘గా జరుపుకుంటున్నాం. వెలుగుకు, జ్ఞానానికి సూచకమైన ‘మకర సంక్రాంతి’ మనకు పెద్ద పండుగ. సాధారణంగా మనం పండుగలకు చాంద్రమానాన్ని పాటిస్తాం. కనుక తిథులను బట్టి ఆయా పండుగలను జరుపుకుంటాం. కానీ సంక్రాంతి పండుగ మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకుంటాం. కనుకే ప్రతి సంవత్సరం జనవరి 13, 14, 15, 16 తేదీలలోనే ఈ పండుగ మూడు రోజులు ఉంటాయి. తెలుగువారి ముఖ్య పండుగలలో ఒకటి సంక్రాంతి పండుగ. ఈ పండుగను భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజుల పండుగగా జరుపుకుంటాం. మన సనాతన సంప్రదాయాలను, ఆచారవ్యవహారాలను, సామాజిక స్పృహను, నైతిక విలువలను తెలియజేస్తూ, ఆరోగ్యాన్ని కలిగించే, ఆయుష్షును వృద్ధిపరిచే ఎన్నో అంశాలతో కూడి ఉంటుంది ఈ పండుగ. ప్రకృతి, జీవుడు, దేవుడు, పశుపక్ష్యాదుల సమైక్యతను నిరూపిస్తూ, ఆధ్యాత్మికతను కలిగిన గొప్ప పండుగ సంక్రాంతి పండుగ. మనది వ్యవసాయ ప్రధానమైన దేశం. ఏడాది పాటు కష్టపడి పని చేసిన ఫలితంగా ధాన్యపు రాశులు ఇంటికి వచ్చిన ఆనందంతో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. కొత్తధాన్యంతో పులగం, ΄÷ంగలి, పాయసం చేసి, శ్రీ సూర్యనారాయణ స్వామికి, ఇష్టదైవానికి, కులదైవానికి నివేదన చేస్తారు. ప్రతి సంక్రమణంలోనూ పితృతర్పణాలివ్వాలి, శ్రీ సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యమివ్వాలి. అయితే అప్పుడు ఇవ్వలేకపోయినా, కనీసం ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి పండుగ రోజున అయినా సూర్యుని తప్పక ధ్యానించాలి, పూజించాలి, అర్ఘ్యమివ్వాలి. పితృతర్పణాలివ్వాలి, పితృదేవతలను స్తోత్రించాలి. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు గడలు, ఉదకుంభం మొదలైనవి దానమివ్వాలి. వీలున్నవారు గోదానం చెయ్యటం శ్రేష్ఠం. మనం మనకు తొలి పండుగ అయిన ఉగాదినాడు ఎలా పంచాంగ శ్రవణం చేస్తామో, అలాగే సంక్రాంతి పండుగనాడు దైవజ్ఞుల ద్వారా సంక్రాంతి పురుషుని గురించి తెలుసుకోవాలి. ఈ ఏడాది సంక్రాంతి పురుషుడు ఎటువంటి ఆకార విశేషాలను కలిగి, ఏ రంగు దుస్తులు ధరించి, ఏ వాహనం మీద ఎక్కి వస్తాడో, దానినిబట్టి దేశ భవిష్యత్తు తెలుస్తుంది, దానివల్ల రాబోయే ఫలితాలను గుర్తించి తగిన విధంగా మెలగటానికి ప్రయత్నం చెయ్యాలి. సంక్రాంతి రోజే జప తప దానాదుల నాచరించాలి. పండితులకు ధాన్యం, గోధుమలు, తిలలు, వస్త్రాలు, బంగార ం, ధనం, కూరలు, పళ్ళు, ఉదకుంభం వంటి వాటిని దానమివ్వాలి. దానివలన ఆరోగ్యం, వర్చస్సు, ఆత్మ సంస్కారం, గ్రహదోష నివారణ జరుగుతాయి. పితృతర్పణాల వలన వంశాభివృద్ధి జరుగుతుంది. సంక్రాంతి రోజున గంగిరెద్దులను అందంగా అలంకరించి, ఇంటింటికీ గంగిరెద్దు మేళం తెస్తారు. అందరూ గంగిరెద్దుకు నూతన వస్త్రాలు కప్పుతారు. సన్నాయి వాద్యకారులకు ధన, ధాన్య, వస్త్రాదులనిస్తారు. సంక్రాంతి రోజున ఉదయమే శ్రీ మహావిష్ణు స్వరూపునిగా భావించబడే హరిదాసు తలపైన రాగి అక్షయ పాత్రను పెట్టుకుని, రెండు చేతులతో చిరతలు వాయిస్తూ, ‘హరిలొ రంగ హరీ‘ అంటూ గానం చేస్తూ వస్తాడు. హరినామం గానం చేస్తూ సాతాని జియ్యరు కూడా వస్తాడు. ప్రజలు సాక్షాత్తు శ్రీహరే తమ ఇంటి ముంగిటికి వచ్చినంతగా ఆనందిస్తూ ఆ రాగి చెంబులో ధాన్యం పోస్తారు. డబ్బులిచ్చి సత్కరిస్తారు. ‘అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు‘ అంటూ చేతిలో డమరుకం పట్టుకుని వాయిస్తూ, జోస్యం చెప్పటానికి బుడబుక్కలవాడు వస్తాడు. ఈశ్వరుని వలె విభూతి రేఖలు నుదుటి మీద ధరించి, చేతిలో శంఖం పట్టుకుని ఓంకార నాదం చేస్తూ ‘హర హర మహాదేవ’ అంటూ శివ నామ సంకీర్తన చేస్తూ జంగమదేవర వస్తాడు. వీరందరూ మన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకలు. వీరందరినీ గౌరవిస్తూ, స్వయంపాకాలనిస్తూ, డబ్బులిస్తూ మన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిదీ. వీరందరూ మనందరినీ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో విలసిల్లమని ఆశీర్వదిస్తారు. సంక్రాంతికి ఆంధ్రులు తమ ఇళ్ళల్లో బొమ్మలకొలువును ఏర్పాటు చేసి, బొమ్మలకు ప్రతీకగా పరమాత్మను ్రపార్థిస్తారు.బొమ్మలకు హారతిస్తారు, పేరంటం చేస్తారు. పిల్లలకు పప్పు బెల్లాలు, నువ్వుండలు పంచిపెడతారు. కొత్తగా పెళ్ళైన కూతుళ్ళను, అల్లుళ్ళను ఇంటికి పిలుస్తారు, విందుభోజనాలు, చీరసారె, అల్లుళ్లకు కానుకలూ ఇచ్చి ఆనందిస్తారు. తెలంగాణ ్రపాంతంలో సంక్రాంతి రోజున నోము పడతారు. ముత్తైదువులను ఇంటికి పిలిచి సంక్రాంతి నోము పేరంటం చేస్తారు. కనుమనాడు మనకు పాడిపంటలనిచ్చే గోవులను, ఎద్దులను, పుడమి తల్లినీ పూజిస్తారు. ‘కనుమనాడు మినుము తింటే ఎనుమంత బలం వస్తుంది‘ అంటారు కనుక కనుమనాడు గారెలు, ఆవడలు చేసి దైవానికి నివేదించి భుజిస్తాం. పంటలు, సమృద్ధికి దోహదపడే, వ్యవసాయానికి సహకరించే ఎద్దులను గౌరవించే శుభ దినం కనుమ పండుగ. ఈ విధంగా పుడమికీ, ప్రకృతికీ, మానవులకూ, గోవృషభాలకూ ఉన్న సంబంధాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ మకర సంక్రాంతి పండుగ. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, సామాజిక పరంగా భారత దేశ ప్రజలందరూ జరుపుకునే పెద్ద పండుగ ‘మన సంక్రాంతి పండుగ’. సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలు, యువకులు అత్యంత ఉత్సాహంగా గాలిపటాలను ఎగురవేస్తారు. రంగురంగుల గాలిపటాలతో ఆకాశం పగలే అందమైన కదిలే చుక్కలతో ప్రకాశిస్తున్న భ్రాంతిని కలుగజేస్తుంది. గాలిపటం మనకు గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని స్తుంది. దారం మన చేతిలో సవ్యంగా ఉన్నంతసేపే గాలిపటం ఆకాశంలో ఎగురుతుంది. అదుపు తప్పిందా, ఎగిరిపోతుంది. అదేవిధంగా మనం నైతిక విలువలు అనే పట్టులో మెలుగుతున్నంత కాలం సమాజాకాశంలో ఆనందంగా విహరించ గలుగుతాం. విలువలు తప్పితే పతనం తప్పదు, అన్న సత్యాన్ని బోధిస్తుంది. – డా. తంగిరాల విశాలాక్షి, – సోమంచి రాధాకృష్ణ -
హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఘనంగా కైట్ ఫెస్ట్ వల్
-
హైదరాబాద్ లో కైట్ ఫెస్టివల్ సందడి
-
నెక్లెస్ రోడ్లో పతంగులతో యువత సందడి
-
ఉత్సాహంగా కైట్ ఫెస్టివల్
-
వారి పాలనలో బసంత మాసంలో పతంగుల పండగ
సంక్రాంతి తెలుగు నేలపై ఒక్కోచోటా ఒక్కో తీరుగా జరిగే పండగ.. కోడి పందాలు, ఎడ్ల బండ్ల పందాలు, డూడూ బసవన్నలు.. రంగురంగుల రంగవల్లులు.. పిండి వంటకాలు.. వాటితో పాటు గాలిపటాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. అయితే హైదరాబాద్ స్టయిలే వేరు.. సంక్రాంతి పండగ వచ్చిందంటే రంగుల పతంగుల సందడి మొదలైపోతుంది. కేవలం ఓ మతానికే పరిమితం కాకుండా అన్ని వర్గాల ప్రజలు గాలిపటాలు ఎగరవేస్తారు. జనవరి ప్రారంభంతోనే నగరంలో గాలిపటాల సందడి షురూ అవుతుంది. ఈ ఏడాది ఇప్పటికే సందడి మొదలైంది. వందల ఏళ్ల క్రితం నుంచే.. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల నిలయం హైదరాబాద్. వందల ఏళ్ల క్రితం నుంచే అన్నివర్గాల ప్రజలు కలిసిమెలిసి పండగలను జరుపుకుంటున్నారు. కుతుబ్ షాహీల కాలం నుంచి ప్రతి ఏటా నగరంలో పతంగుల పండగ కొనసాగేదని చారిత్రక ద్వారా తెలుస్తోంది. ఆ రోజుల్లో రాజులు వారి కుమారులు పతంగులు ఎగరేసేవారట.. అంటే తరతరాలుగా పతంగుల పండగ నగరంలో కొనసాగుతుందన్నమాట. మతసామరస్యానికి చిహ్నంగా ఈ పండగ నిలుస్తుంది. అతిప్రాచీన వేడుక ఇబ్రాహీం కులికుతుబ్ షా హయంలో గోల్కొండ కోటలో పతంగుల పండగ బసంత్ నెలలో అధికారికంగా జరిగేదట. ఆ రోజుల్లో కాగితాలతో చేసిన పతంగులు, మూలికలతో చేసిన మాంజాతో పతంగుల పోటీలు కూడా జరిగేవని చరిత్రకారులు పుస్తకాల్లో రాసారు. కుతుబ్ షాహీల పాలన అనంతరం ఆసీఫ్ జాహీల పాలనలో పాతబస్తీలోని మైదానాల్లో అదే బసంత మాసంలో పతంగుల పండగ ఘనంగా నిర్వహించే వారు. ఇక ఆరో నిజాం మీర్ మహెబూబ్ అలీ ఖాన్ పాలనా కాలంలో పతంగుల పండగకు మరింత గుర్తింపు వచ్చింది. మైదానాల్లో పతంగుల పోటీలు నిర్వహించి ఎక్కువ పతంగులను పడగొట్టిన వారికి బహుమతులు కూడా ఇచ్చేవారు. ఈ పోటీల ప్రక్రియ ఏడో నిజాం హయంలో కూడా కొనసాగింది. హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అనంతరం 1985 వరకు పాతబస్తీలో పతంగుల పోటీలు నిర్వహించే వారు. జోరందుకున్న విక్రయాలు ధూల్‌పేట్, మల్లేపల్లి, నాంపల్లితో పాటు పాతబస్తీలోని గుల్జార్‌హౌజ్, చార్‌కమాన్, డబీర్‌పురా తదితర ప్రాంతాల్లోని పతంగుల దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. ప్రసుత్తం పతంగులన్నీ ప్లాస్టిక్‌తోనే తయారు చేస్తున్నారు. ⇔ గతంలో కాగితంతో తయారు చేసే వారు. ప్లాస్టిక్‌తో తయారు చేయడంతో అవి తేలికగా ఉంటాయి తొందరగా ఎగరడానికి అనుకూలంగా ఉంటాయి. గతంలో ఒకే రంగులో పతంగులు అందుబాటులో ఉండేవి. ప్రసుత్తం ప్లాస్టిక్‌తో తయారు కావడంతో వీటిపై డిజైన్లతో పాటు ఫొటోలు కూడా ముద్రిస్తున్నారు. ⇔ ప్రసుత్తం పతంగులపై రాజకీయ నేతల, సినీ నటుల ఫొటోలను ముద్రిస్తున్నారు. దీంతో పాటు కరోనా కాలంలో గో కరోనా గో అంటూ ముద్రిస్తున్నారు. అన్ని సైజుల్లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దూల్‌పేట మాంజాకు క్రేజ్ ⇔ ఎగిరే గాలిపటానికి దారం.. ఆధారం. ఎదుటి వారి పతంగులను కట్ చేసేందుకు మాంజా అవసరం. పతంగులు ఎగిరేసేటప్పుడు దారానికి ముందు కొద్దిగా మాంజాను ఉపయోగించడం తప్పనిసరి. మాంజా లేనిదే ఎదుటి వారి పతంగులను కట్ చేయలేం. అందుకే పతంగుల పండగలో మాంజాదే కీలకపాత్ర. ⇔ మాంజా తయారీ చాలా కష్టం గాలిపటాలతో పాటు మాంజాగా పిలిచే దారాన్ని కూడా ఓల్డ్‌సిటీలోనే తయారు చేస్తున్నారు. దూల్‌పేట మాంజాకు క్రేజ్ ఎక్కువ. ఇక్కడి నుంచే వివిధ రాష్ట్రాలకు మాంజా ఎగుమతి అవుతుంది. ⇔ పంతంగుల సీజన్లో నగరంలో దాదాపు రూ.100 కోట్ల వ్యాపారం జరుగుతుందని మార్కెట్ వర్గాల అంచనా. ఇక మాంజాకు ఫెమస్ అయిన దూల్పేట్లో మాంజా వ్యాపారం రూ.25 కోట్ల వరకు ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. మంజా రకాలు మాంజాలను ‘గీటి’లుగా విక్రయిస్తారు. ఒక్కో గీటి 45 మీటర్లుంటుంది. మోతీయా, గంధక్, గాజర్, ఫేరొజా, టీలా, హరా, కాశ్మీ, ఎర్రగులాబి, కాలా, అండేకా తదితర రకాలుంటాయి. వీటిలో పాండా, సి–28 మాంజాలకు ఎక్కువగా గిరాకీ ఉంటుంది. చైనా నుంచి దిగుమతి అవుతున్న ప్లాస్టిక్ మాంజాలను ప్రభుత్వం నిషేదించడంతో స్థానిక మాంజాలకు గిరాకీ పెరిగింది. -
ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం
-
వైరల్ వీడియో.. ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం
తైపీ: నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదానికి సంబధించిన వీడియో ఒకటి తెగ ట్రెండ్ అవుతోంది. మూడేళ్ల చిన్నారి గాలిపటం తోకలో చిక్కుకుని.. దాదాపు 100 అడుగుల ఎత్తు మేర ఆకాశంలోకి దూసుకెళ్లింది. లేచిన వేళ బాగుంది కాబట్టి.. ఆ చిన్నారి ఈ భయంకరమైన ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడింది. వివరాలు.. తైవాన్‌లో కైట్ ఫెస్టివల్ జరగుతోంది. ఈ నేపథ్యంలో జనాలు ఒకచోట చేరి ఉత్సాహంగా పతంగులు ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలో సదరు చిన్నారి అక్కడ నిలబడి ఎంజాయ్ చేస్తోంది. ఇంతలో అకస్మాత్తుగా బలమైన గాలి వీచడం ప్రారంభించింది. దాంతో ఓ పెద్ద గాలి పటం తోక ఆ చిన్నారి నడుముకు చుట్టుకుంది. ఇంతలో గాలి వేగం పెరగడంతో కైట్.. అది చుట్టుకున్న చిన్నారి కూడా ఆకాశంలోకి దూసుకెళ్లింది. (చదవండి: కలవరపాటుకు గురైన డేవిడ్ వార్నర్..!) గాలిపటం సుమారు 100 అడుగుల ఎత్తు(30 మీటర్లు) వరకు వెళ్లింది. ఇది చూసిన జనాలు భయంతో కేకలు వేస్తూ.. సాయం కోసం అరిచారు. ఇంతలో కొందరు సభ్యులు గాలిపటాన్ని నెమ్మదిగా నేలమీదకు చేర్చారు. దాని తోకలో చిక్కుకున్న చిన్నారిని బయటకు తీశారు. ఈ పీడకల ముగియడానికి దాదాపు 30 సెకన్లు పట్టింది. చిన్న చిన్న గీతలు మినహా చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంటర్నెట్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇప్పటికే మిలియన్ల మంది దీన్ని వీక్షించారు. మీరు చూడండి.. -
కలవరపాటుకు గురైన డేవిడ్ వార్నర్..!
ముంబై : భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో ఓ గాలిపటం ఆటకు అంతరాయం కలిగించింది. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 50 వ ఓవర్ మొదలవుతుందనగా గాలిపటం మైదానంలో పడింది. స్పైడర్కెమెరాకు చిక్కుకుంది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న డేవిడ్ వార్నర్ దానిని చూసి కాస్త కలవరపాటుకు గురయ్యాడు. గాలిపటాన్ని తొలగించేందుకు సంశయించాడు. దాంతో క్రీజులో ఉన్న జస్ప్రీత్ బుమ్రా గాలిపటం దారాన్ని తెంచి కెమెరా నుంచి తీసేశాడు. ఈక్రమంలో అది ఏ పేద పిల్లాడి గాలిపటమోనని, దానిని చించొద్దని బుమ్రాతో అన్నాడట. ఇదే విషయాన్ని పోస్ట్ మ్యాచ్ మీడియా సమావేశం అనంతరం వార్నర్ చెప్పాడు. (చదవండి : బుమ్రా బౌలింగ్‌లో ఆడడం చాలా కష్టం : వార్నర్) ‘గాలి పటాల పండుగ జరుగుతోందని విన్నాను. చాలా వింతగా అనిపించింది. స్పైడర్క్యామ్లో చిక్కుకున్న గాలిపటాన్ని చూసి కంగారు పడ్డా. అది ప్రమాదకరమైందేమోనని భావించా. క్రీజులో ఉన్న బుమ్రా వెంటనే దారాన్ని తెంచి తొలగించాడు. అయితే, బుమ్రా దానిని తొలగిస్తున్న సమయంలో.. అది ఏ పేద పిల్లాడి గాలిపటం కావొచ్చునని.. చించొద్దని చెప్పా. ఈ ఘటన కొత్తగా అనిపించింది’అని వార్నర్ చెప్పాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘరో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. టీమిండియా 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌట్‌కాగా.. వికెట్ నష్టపోకుండా ఆసిస్ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ వార్నర్ (112 బంతుల్లో 128 నాటౌట్; 17 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ ఆరోన్ ఫించ్ (114 బంతుల్లో 110 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోయారు. (చదవండి : పది వికెట్ల పరాభవం) -
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కైట్,స్వీట్ ఫెస్టివల్
-
13 నుంచి కైట్, స్వీట్ ఫెస్టివల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం బ్రాండ్ ఇమేజ్‌ని మరింత పెంచే లా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించాలని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం, పర్యాటక, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గత ఐదేళ్లుగా ఇంటర్నేషనల్ కైట్, స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జనవరి 13 నుంచి 15వ తేదీ వరకు జరిగే ఈ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఇంటర్నేషనల్ కైట్, ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ 2020 నిర్వహణపై శనివారం ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఫెస్టివల్‌ను సందర్శించడానికి వచ్చే సందర్శకులకు మెరుగైన సదుపాయాలు, సౌకర్యాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్‌కు వివిధ దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించి ఆ దేశాల స్వీట్స్ వెరైటీలను ప్రదర్శనలో పాల్గొనేలా ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నగరంలో స్థిరపడి ఉన్న వివిధ రాష్ట్రాల ప్రతినిధులు స్వీట్ ఫెస్టివల్లో పెద్దఎత్తున స్వచ్ఛందంగా పాల్గొనే విధంగా ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుతో పాటు నిర్వహణ చేపట్టాలన్నారు. -
ప్రాణాలు తీసిన పతంగులు
జియాగూడ: విద్యుత్ తీగలకు తట్టుకున్న గాలిపటాన్ని తీసేందుకు యత్నించిన ఓ బాలుడు విద్యుదాఘాతంతో మృతి చెందిన సంఘటన కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. కుల్సుంపురా ఇన్స్పెక్టర్ పి.శంకర్ తెలిపిన వివరాల ప్రకారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కేశవస్వామినగర్‌లో ఉంటున్న సంతోష్, మీనాక్షిల కుమారుడు కృష్ణ(12) మంగళవారం ఇంటి మొదటి అంతస్తుపై స్నేహితులతో కలిసి పతంగులు ఎగరవేస్తున్నారు. కాగా ఇంటి పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు పతంగి తట్టుకోవడంతో అక్కడే ఉన్న ఇనుప రాడ్డుతో పతంగిని తీసేందుకు కృష్ణ యత్నించాడు. దీంతో కరెంటు షాకు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. పక్కనే ఉన్న స్నేహితుడు శత్రుకు కూడా కొంత మేరకు గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కృష్ణ మృతదేహాన్ని తరలించి, శత్రుకు వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. గాలిపటం కోసం వెళ్లి రైలు ఢీకొని మృతి... కాచిగూడ: రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ ఆర్ లాల్యా నాయక్ తెలిపిన వివరాల ప్రకారం... బండ్లగూడ బాబానగర్ ప్రాంతానికి చెందిన మహబూబ్ కుమారుడు షేక్ షరీఫ్ (36) చికెన్ సెంటర్లో వర్కర్‌గా పనిచేస్తుంటాడు. మంగళవారం కాచిగూడ – విద్యానగర్ రైల్వే స్టేషన్ల మధ్య దారం తెగిన గాలిపటాన్ని పట్టుకొనేందుకు షరీఫ్‌తో పాటు మరికొందరు రైలు పట్టాలపై పరుగులు తీస్తుండగా విద్యానగర్ నుంచి ఫలక్‌నుమా వైపు వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు ఢీకొని షరీఫ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పతంగి ఎగురవేస్తూ కిందపడిన బాలుడి మృతి... సనత్‌నగర్: పండగ రోజు స్నేహితులతో కలిసి గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి కిందపడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పశ్చిమ బంగాకు చెందిన సమరేష్ దోలాయ్ (18) ఎర్రగడ్డలో ఉంటూ ఓ ప్రైవేటు సంస్థలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సంక్రాంతి నాడు స్నేహితులు కలిసి గాలి పటం ఎగురవేస్తుండగా తాను కూడా వారితో కలిసి భవనం పైకి ఎక్కాడు. గాలి పటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తూ కాలుజారి కింద ఉన్న రేకుల షెడ్డుపై పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతనిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చయేస్తున్నారు. -
ఈ ఫోటో చూస్తే మరో పక్షిరాజు వస్తాడేమో..!
న్యూఢిల్లీ : సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి రంగురంగుల ముగ్గులు, పిండి వంటలు, గంగిరెద్దులు, హరిదాసు, గాలిపటాలు. ఎక్కెడెక్కడో ఉన్న వారంతా పల్లేలకు చేరుకుని సంతోషంగా గడుపుతారు. కానీ మన సంతోషం పక్షుల పాలిట యమపాశమవుతోంది. గాలిపటాల పేరుతో పక్షులకు ఉరితాళ్లు బిగిస్తున్నాం. గాలిపటం మంజా తగిలి మృతి చెందిన ఓ రామచిలుక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బిదితా బాగ్ అనే ట్విటర్ యూజర్ ఒకరు.. మంజా తగిలి చనిపోయిన రామ చిలుక ఫోటోను ట్వీట్ చేశారు. ‘కాయ్‌పో చీ’ అనే క్యాప్షన్‌తో ఫోటోను పోస్ట్ చేయడమే కాక.. ‘వందలాది పక్షులు ఈ కైట్ ఫెస్టివల్ మూలంగా ప్రాణాలు కోల్పోతున్నాయి. దయచేసి చైనీస్ మంజా వాడకాన్ని నిలిపివేయండి’ అంటూ ట్వీట్ చేశారు. చైనీస్ మంజా దారానికి చిక్కి ప్రాణాలు కోల్పోయిన రామచిలుక ఎంత విలవిలలాడి ఉంటుందోనని పక్షి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు ‘ఫోటోకు తగ్గ క్యాప్షనే పెట్టారు నిజంగానే రామ చిలుక కాయ్‌పో చీ’ అంటూ కామెంట్ చేస్తున్నారు. We hang our head in shame. This hard hitting image has been shared by Bhavik Thaker, titled "kaypo che?". Thanks for aptly showcasing the plight of these beautiful creatures. Unfortunately, hundreds of birds loose their life during kite festival. stop using chinese/manja threads. pic.twitter.com/TcJlTVJXAw — Bidita Bag (@biditabag) January 15, 2019 ‘కాయ్‌పో చీ’ అనేది గుజరాతి పదం. గాలిపటాల ఎగరేసేటప్పుడు ఈ పదాన్ని ఎక్కువగా వాడతారు. అవతలి వారి గాలిపటాన్ని కట్ చేస్తే కాయ్‌పో చీ అంటారు. నిషేధిత చైనా మంజా వల్ల పక్షులే కాక మనుషులు కూడా మృత్యువాత పడ్డారు. మంజా వల్ల గొంతు తెగి ఓ ఎనిమిదేళ్ల బాలుడు మరణించిన సంగతి తెలిసిందే. -
మూలాలకు తిరిగి వెళ్దాం
సాక్షి, హైదరాబాద్: మన సంస్కృతి, సంప్రదాయాలను పునఃపరిశీలించుకొని తిరిగి మన మూలాలకు వెళ్లాల్సిన సరైన తరుణమిదేనని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. తద్వారా మన మూలాలను మరింత పటిష్టం చేసుకునేందుకు వీలుంటుందన్నారు. పర్యాటక, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహిస్తున్న 4వ తెలంగాణ అంతర్జాతీయ పతంగుల పండుగ, అంతర్జాతీయ మిఠాయిల పండుగ –2019 సంబరాలను ఆదివారం ఉప రాష్ట్రపతి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మన పండుగలు, పర్వదినాల ద్వారా ప్రజల్లో సమైక్యతా భావన పెరుగుతుంది. పండుగల్లోని ముఖ్యోద్దేశాలు అర్థం చేసుకోవాలి. తెలుగువారి వ్యవసాయ పండుగ సంక్రాంతి. మకర సంక్రమణం లో వచ్చే ఈ పండుగను వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో ఘనంగా జరుపుకుంటారు. కొత్త ధాన్యం ఇంటికి వచ్చి, పాడిపంటలతో రైతులు తులతూగే పండుగే సంక్రాంతి’అని వెంకయ్య పేర్కొన్నారు. ఇదీ గాలిపటాల్లోని భావం! గాలిపటాలను ఎగరేయడం వెనక భావాన్ని లోతుగా అర్థం చేసుకోవాలని వెంకయ్య నాయుడు తెలిపారు. నేలపై నిలబడి మన ఊహలను గాలిపటాలుగా ఆకాశంలో ఎగురవేస్తున్నామని.. ఆకాశంలోని లక్ష్యాలను అందుకునేందుకు కృషి చేయాల్సి ఉందన్నారు. పతంగులు, ముగ్గులు, గొబ్బెమ్మలతో పోటీలు వంటివి ప్రజల్లో పోటీతత్వం పెంపొందిస్తాయన్నారు. వివిధ దేశాలు, రాష్ట్రాలకు చెందిన తీపి పదార్థాలు ఒకే వేదికపై ప్రదర్శించడం భారతీయ తత్వంలో ఉన్న వసుధైక కుటుంబానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. మన ఆహారపు అలవాట్లను ఆరోగ్యకరంగా మార్చుకుందామని వెంకయ్య పిలుపునిచ్చారు. విదేశీ ఆహార, విహార పద్ధతులకు స్వస్తి చెప్పాలన్నారు. ఇందుకోసం ఈ సంక్రాంతి సం దర్భంగా ప్రతిజ్ఞ తీసుకుందామని పిలుపునిచ్చారు. తద్వారా ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’నినాదాన్ని నిజం చేద్దామన్నారు. ఒకే చోట వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన 1,200 రకాల మిఠాయిలను ప్రదర్శించడం అరుదైన విషయమని ప్రశంసించారు. పరేడ్ గ్రౌండ్ జనసంద్రం అంతర్జాతీయ పతంగుల, మిఠాయిల పండగలో పాల్గొనేందుకు నగర ప్రజలు ఆసక్తి కనబరిచారు. మధ్యాహ్నం 12 గంటల నుంచే ఓ ప్రవాహంలా పొటెత్తారు. ఇందులో భాగంగా నిర్వహించిన çఫుడ్‌కోర్టులు, హ్యాండీక్రాఫ్ట్ మేళాలు జనంతో నిండిపోయాయి. మూడు రోజులపాటు నిర్వహించే ఈ వేడుకలో 20 దేశాల నుంచి 42 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్, 60 దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు పాల్గొంటున్నారు. అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్లో భాగంగా 22 దేశాలు, దేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన 1,200 రకాల స్వీట్లను పదుల సంఖ్యలో స్టాల్స్‌లో అందుబాటులో ఉంచారు. ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు కైట్ ఫెస్టివల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ రోజులు గుర్తొచ్చాయ్! ‘తెలుగు వారందరికీ తెలంగాణ ప్రభుత్వం తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చిం దంటే స్నేహితులతో కలిసి డాబాలపై పతంగులను ఎగురవేస్తూ సందడి చేసేవారం. ఈ పండగ సందడిని చూస్తుంటే ఆ రోజులు గుర్తొచ్చాయ్’అని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తన చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరయ్యారు. శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ ప్రసంగిస్తూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయా లను దేశ, విదేశాల్లో ఇనుమడింపజేసేందుకు పర్యాటక శాఖ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సంక్రాంతి వచ్చిందంటే కూతుళ్లు–అల్లుళ్లు, కొడుకులు – కోడళ్లు ఒకే చోట చేరడం.. వివిధ వంటకాలు.. ఇవన్నీ మరిచిపోలేని అనుభూతిని కల్పిస్తాయన్నారు. పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. ‘2020 నాటికి తెలంగాణ పతంగుల పండగను దేశంలోనే అతిపెద్ద పండగ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తున్నానన్నారు. ఇది 4వ అంతర్జాతీయ పతంగుల పండగ, రెండో ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ అని తెలిపారు. ప్రజ లందరూ ఆసక్తిగా వచ్చి తిలకించి, ఈ వేడుకను ఆస్వాదించాలన్నారు. ఈ కార్యక్రమంలో మేజర్ శ్రీనివాసరావు, వరల్డ్ కల్చర్ టూరిజం అసోషియేషన్ అధ్యక్షుడు యూంగ్, ఢిల్లీలో తెలంగాణ ప్రభు త్వ ప్రతినిధి డాక్టర్ వేణుగోపాలాచారి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, టూరిజం ఇన్చార్జి కమిషనర్ దినకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. స్వీట్ఫెస్టివల్లో మిఠాయి తింటున్న స్వామిగౌడ్. చిత్రంలో బుర్రా, మామిడి హరికృష్ణ తదితరులు -
కన్నుల పండువగా కైట్ ఫెస్టివల్
-
ఎగిరే కైట్.. సూపర్ హిట్..
-
సికింద్రాబాద్‌లో కైట్,స్వీట్ ఫెస్టివల్