KUKATPALLY MLA Madhavaram Krishna Rao
-
టీఆర్ఎస్ వైపు మాధవరం చూపు!
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు త్వరలో టీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన అనంతరం బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి జాబితాలో చేరిస్తే టీఆర్ఎస్లో చేరడానికి సిద్ధమని ఆయన సోమవారం మీడియాకు తెలిపారు. అంతకుముందు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ను ఎన్టీఆర్ భవన్లో కలసిన మాధవరం పార్టీ తెలంగాణ నేతల తీరుపై ఫిర్యాదు చేశారు. బీసీ కులాల జాబితా నుంచి తొలగించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 26 కులాల విషయంలో యథాతథస్థితి కొనసాగించాలని తాను అసెంబ్లీలో ప్రస్తావించినా టీడీపీ ఎమ్మెల్యేల నుంచి మద్దతు రాలేదని, ఎవరికి వారే ఎప్పుడు టీఆర్ఎస్లో చేరుదామా అనే ఆలోచనలో ఉన్నారని, అందరూ ఆ పార్టీతో టచ్‌లో ఉన్నారని లోకేశ్‌కు తెలిపారు. తెలంగాణలో పార్టీ బతకాలని టీ నాయకులెవరికీ లేదని, ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారని చెప్పారు. ‘నాకు పార్టీ మారే ఆలోచన లేదు...మన పార్టీ వారే అలా ప్రచారం చేస్తున్నారు. ఆ ఆలోచనే ఉంటే మిమ్మల్ని ఎందుకు కలుస్తాను’ అని లోకేశ్‌కు వివరించినట్టు సమాచారం. -
వెలుగులు నింపుతా
‘పిచ్చుక గూళ్ల లాంటి ఇళ్లల్లో పాతికేళ్లుగా ఎలా నివాసం ఉంటున్నారు.. ఏరోజుకారోజు అన్నట్టుగా రోజు కూలీతో బతుకులీడుస్తున్న మీ భవిష్యత్ ఏమిటి.. ప్రభుత్వం నుంచి సాయం అందకపోతే ఎలా ?..’ అంటూ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విస్తుపోయారు. కూకట్పల్లి ఇందిరానగర్, శ్రీశ్రీనగర్ వాసుల సమస్యలు విన్న ఆయన చలించిపోయారు. ‘మీ కష్టాలు..కన్నీళ్లు తుడిచేస్తా..సమస్యలు లేని బస్తీగా చేస్తా.. మీ బతుకుల్లో వెలుగు నింపుతా... సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి దత్తాత్రేయలను తీసుకువస్తా..పక్కా ఇళ్లు నిర్మిస్తా’నని వారికి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే కృష్ణారావు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మంగళవారం వ్యవహరించారు. ఇందిరానగర్, శ్రీశ్రీనగర్లలో పర్యటించారు. సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరిస్తా.. విద్యుత్, ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ ఆస్పత్రి, డ్రైనేజీలు నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రేషన్‌కార్డులు, అర్హులకు పింఛన్లు ఇప్పించే బాధ్యతను తీసుకుంటానన్నారు. పేదల సమస్యలు పరిష్కరించినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. - కూకట్పల్లి మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే