రెవె‘న్యూ’... భూమంత్రం
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: వివిధ అవసరాల నిమిత్తం కేటాయించిన భూములు నిరుపయోగంగా ఉంటే వాటిని వెనక్కు తీసుకోడానికి రెవెన్యూ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఏళ్ల క్రితం భూములను దఖలు పర్చినా ఆ అవసరాలకు అనుగుణంగా వినియోగించని భూముల ను స్వాధీనం చేసుకోడానికి సన్నాహాలు చేస్తోంది.
ఇందుకోసం జిల్లాలో ల్యాండ్ ఆడిట్‌ను ము మ్మరంగా చేపడుతోంది. వివిధ ప్రభుత్వ శాఖ ల ఆధీనంలో వినియోగానికి దూరంగా ఉన్న భూములను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలో పారిశ్రామిక, గృహ, పర్యాటక అవసరాల నిమిత్తం రెవెన్యూ భూములను 15 ఏళ్ల క్రితం ఏపీఐఐసీ, వుడా, హౌసింగ్, జీవీఎంసీ, టూరిజం శాఖలకు దాదాపుగా 12 వేల ఎకరాల వరకు అప్పగించారు. కొన్ని ప్రైవేటు సంస్థలకు కూడా వివిధ ప్రాజెక్టు ల ఏర్పాటు కోసం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కేటాయించారు.
కానీ ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన భూములే కాకుండా ప్రభుత్వ సంస్థలకు అప్పగించిన భూములు కూడా చాలా వరకు నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. జిల్లా లో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ఆయా ప్రభుత్వ శాఖలకు ఇచ్చినవి చాలా వర కు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఆక్రమణదారుల నుం చి ఆ భూములను వెనక్కు తీసుకొనేందుకు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితు లు ఏర్పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇటువంటి నిరుపయోగ భూములు కబ్జాకు గురికాకుండా పరిరక్షించడంతో పాటు వాటిని ఇతర అవసరాలకు వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం జాతీయ స్థాయి ప్రా జెక్టులకు భూములు అవసరముంది. సైన్స్ సిటీ, ఇతర ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కోసం భూ ములను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిరుపయోగ భూములను వాటికి కేటాయించే అవకాశాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు సుమారుగా 2500 ఎకరాల వ రకు వివిధ శాఖల ఆధీనంలో నిరుపయోగంగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. అలాగే ఒక అవసరం కోసం భూములు తీసుకొని వాటిని ఇతర అవసరాలకు వినియోగిస్తున్న వాటి పై కూడా దృష్టి సారించారు. మరో రెండు వారాల్లో ల్యాం డ్ ఆడిట్ పూర్తవుతుంది. అనంతరం ప్రభుత్వ శాఖలతో పాటు ప్రైవేటు సంస్థల ఆధీనంలో ఏమేరకు భూమి వినియోగానికి దూరంగా ఉందో తేల్చి ఆయా సంస్థలకు అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. అనంతరం ఆ భూములను స్వాధీనం చేసుకోనున్నారు.