భూసేకరణ ప్రక్రియ వేగవంతం
దగదర్తి: దగదర్తి మండలం దామవరం వద్ద విమానాశ్రయ నిర్మాణం చేపట్టిన భూసేకర ప్రక్రియను వేగవంతం చేసినట్లు తహసీల్దార్ మస్తానయ్య అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ భూసేకరణ వివరాలు వెల్లడించారు. విమానాశ్రయ నిర్మాణం కోసం 1399.62 ఎకరాలు సేకరించేందుకు సర్వే పూర్తయిందన్నారు.
మొత్తం 1399.62 ఎకరాల్లో పట్టాభూమి 357.24 ఎకరాలు, డీకేటీ ల్యాండ్ 285.40 ఎకరాలు, ప్రభుత్వ భూమి 384.30 ఎకరాలు, సీజేఎఫ్ఎస్ ల్యాండ్ 297.34 ఎకరాలు, ఇతర పోరంబోకు భూమి 61.76 ఎకరాలు వంతున గుర్తించడం జరిగిందన్నారు. మొదటి విడతగా 614 ఎకరాలు సేకరించనున్నట్లు తెలిపారు. ఈనెల 10 లోపు మొదటి విడతగా సేకరించాలనుకున్న 614 ఎకరాలను సేకరించేందుకు చర్యలు వేగవంతం చేశామని వివరించారు.