గోదావరిలో పెరిగిన భక్తుల రద్దీ
గోదావరి ఉధృతితో జల్లుల స్నానాలు
పదివేలకు పైగా భక్తుల పుష్కరస్నానం
మంథని: గోదావరి అంత్యపుష్కరాల్లో భాగంగా ఏడోరోజు మంథనిలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం గోదావరి తీరం భక్తులతో కిటకిటలాడింది. సాదారణంగా భక్తులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే స్నానాలు ఆచరిస్తారు. కానీ శనివారం సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో స్నానఘట్టాల వద్ద పుష్కరస్నానం చేసి అటు తర్వాత జల్లుల స్నానం చేశారు. పిండ ప్రదానాలకు ఈ రోజు ప్రాధాన్యత గల దినం కావడంతో పెద్దసంఖ్యలో పిండప్రదానాలు చేశారు. పదివేలకు పైగా భక్తులు పుష్కరస్నానం చేశారు.
కాళేశ్వరం: కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరిలో ఏడోరోజు 15వేల మంది వరకు అంత్యపుష్కర స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 1వఘాట్లో రెండువేల మంది, 2వ ఘాట్లో 12,000 వేల మంది, 3వ ఘాట్లో వెయ్యిమంది పుష్కర పుష్యస్నానాలు ఆచరించారు. వీఐపీలు ఎవరు రాలేదు.