lawyers protests
-
కొనసాగుతున్న న్యాయశాఖ ఉద్యోగుల నిరసనలు
ఆదిలాబాద్: హైకోర్టు విభజన చేపట్టాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే సోమవారం ఆదిలాబాద్ పట్టణంలో న్యాయవాదులు, ఉద్యోగులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కోర్టు నుంచి ప్రారంభమైన ర్యాలీ కలెక్టర్‌చౌక్, తెలంగాణచౌక్, వినాయక్‌చౌక్, అంబేద్కర్‌చౌక్, బస్టాండ్ మీదుగా కొనసాగింది. న్యాయమైన డిమాండ్లు సాధించేంత వరకు ఆందోళనలు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు. ఆంధ్రన్యాయాధికారుల కేటాయింపు రద్దు చేయాలని, తెలంగాణ న్యాయవాదులకు, న్యాయమూర్తులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు. భవిష్యత్తులో ఉద్యమం ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి, చంద్రమోహన్, భాస్కర్, కిరణ్, ఉమ, గంగుతాయి, న్యాయవాదులు సంగెం సుధీర్‌కుమార్, చంద్రమోహన్, మధుకర్, నాగేశ్వర్, రమణయ్య, రమేశ్‌రెడ్డి, సంతోష్ ఉన్నారు. -
కొనసాగుతున్న న్యాయవాదుల ఆందోళన
నల్లగొండ: ఆంధ్రా న్యాయమూర్తులు, న్యాయవాదులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన సమ్మతిని వెంటనే ఉపసంహరించుకుని ఏపీకి వెళ్లాలని డిమాండ్ చేస్తూ జిల్లా న్యాయవాదులు చేస్తున్న మంగళవారం స్థానిక కోర్టు వద్ద కొనసాగింది. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కల్లూరి యాదయ్యగౌడ్ మాట్లాడారు. దశల వారీగా న్యాయవాదులు సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నప్పటికీ కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. న్యాయరాష్ట్ర జ్యుడిషియల్ సర్వీసులో పనిచేస్తామని ఇచ్చిన ఆప్షన్లను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, పాదం శ్రీనివాస్, బి.నర్సింహారావు, నగేశ్, లెనిన్‌బాబు, నర్సిరెడ్డి, యాదగిరి, రాములు, లక్ష్మయ్య, రవియాదవ్, కిశోర్‌కుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, రమణారావు, భీమార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రంగారెడ్డి జిల్లాలో న్యాయవాదుల ఆందోళన
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు బుధవారం ఆందోళనకు దిగారు. 'మాకు న్యాయం జరగాలంటే మా హైకోర్టు మాగ్గావాలే, ఉమ్మడి హైకోర్టు విభజనను అడ్డుకుంటున్న చంద్రబాబు నాయుడు ఖబద్డార్, ఉమ్మడి హైకోర్టుపై బాబు పెత్తనం నశించాలి' అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. తక్షణమే తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.