కొనసాగుతున్న న్యాయవాదుల ఆందోళన | lawyers protests continuous in nalgonda district | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న న్యాయవాదుల ఆందోళన

Published Wed, Jun 15 2016 11:33 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

lawyers protests continuous in nalgonda district

నల్లగొండ: ఆంధ్రా న్యాయమూర్తులు, న్యాయవాదులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన సమ్మతిని వెంటనే ఉపసంహరించుకుని ఏపీకి వెళ్లాలని డిమాండ్ చేస్తూ జిల్లా న్యాయవాదులు చేస్తున్న మంగళవారం స్థానిక కోర్టు వద్ద కొనసాగింది.

ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కల్లూరి యాదయ్యగౌడ్ మాట్లాడారు. దశల వారీగా న్యాయవాదులు సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నప్పటికీ కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. న్యాయరాష్ట్ర జ్యుడిషియల్ సర్వీసులో పనిచేస్తామని ఇచ్చిన ఆప్షన్లను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, పాదం శ్రీనివాస్, బి.నర్సింహారావు, నగేశ్, లెనిన్‌బాబు, నర్సిరెడ్డి, యాదగిరి, రాములు, లక్ష్మయ్య, రవియాదవ్, కిశోర్‌కుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, రమణారావు, భీమార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement