ఆదిలాబాద్: హైకోర్టు విభజన చేపట్టాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే సోమవారం ఆదిలాబాద్ పట్టణంలో న్యాయవాదులు, ఉద్యోగులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.
కోర్టు నుంచి ప్రారంభమైన ర్యాలీ కలెక్టర్‌చౌక్, తెలంగాణచౌక్, వినాయక్‌చౌక్, అంబేద్కర్‌చౌక్, బస్టాండ్ మీదుగా కొనసాగింది. న్యాయమైన డిమాండ్లు సాధించేంత వరకు ఆందోళనలు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు. ఆంధ్రన్యాయాధికారుల కేటాయింపు రద్దు చేయాలని, తెలంగాణ న్యాయవాదులకు, న్యాయమూర్తులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు. భవిష్యత్తులో ఉద్యమం ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి, చంద్రమోహన్, భాస్కర్, కిరణ్, ఉమ, గంగుతాయి, న్యాయవాదులు సంగెం సుధీర్‌కుమార్, చంద్రమోహన్, మధుకర్, నాగేశ్వర్, రమణయ్య, రమేశ్‌రెడ్డి, సంతోష్ ఉన్నారు.
కొనసాగుతున్న న్యాయశాఖ ఉద్యోగుల నిరసనలు
Published Tue, Jul 5 2016 9:06 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM
Advertisement