Layouts
-
Telangana: జీపీ లేఔట్లన్నీ నిషేధిత జాబితాలోకి..
ఇబ్రహీంపట్నంలోని ఆదిబట్లలో 289/పీ సర్వే నంబరులోని ఓ జీపీ లేఔట్లో శ్రీనివాస్ రెడ్డి కొన్నేళ్ల క్రితమే 250 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. కూతురు పెళ్లి సమయానికి కట్నం కింద ఉపయోగపడుతుందని భావించారు. వచ్చే నెలలో ముహూర్తాలు ఉండటంతో పెళ్లి పెట్టుకున్నారు. అల్లుడికి కానుకగా ఇద్దామనుకున్న ఓపెన్ ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేసే వీలు లేకుండాపోయింది. దీనికి కారణం ప్రభుత్వం ఆ లేఔట్‌ను నిషేధిత జాబితాలో చేర్చడమే. దీంతో శ్రీనివాస్‌రెడ్డి లబోదిబోమంటున్నాడు.సాక్షి, హైదరాబాద్: వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే గ్రామ పంచాయతీ (జీపీ) లేఔట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. కానీ, తాజాగా రేవంత్ సర్కారు జీపీ లేఔట్లను నిషేధిత జాబితాలో చేర్చింది. ఈమేరకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని అనధికార లేఔట్ల సర్వే నంబర్లను నిషేధిత జాబితా 22–ఏ (1)(ఈ) కిందకు బదలాయించింది. దీంతో భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని కొనుగోలు చేసిన ప్లాట్లను విక్రయించుకోలేక సామాన్య, మధ్యతరగతి ప్రజలు కష్టాలు పడుతున్నారు. సాధారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు పైసా పైసా కూడబెట్టుకొని ప్లాట్ కొనుగోలు చేస్తుంటారు. కూతురు పెళ్లి కోసమో, కొడుకు ఉన్నత చదువుల కోసమో అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందనుకుంటారు. నగదు అవసరమైన³్పుడు ప్లాట్ అమ్మితే సొమ్ము వస్తుందనే భరోసాతో ఉంటారు. కానీ, తాజాగా ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచింది. ఎంపిక చేసిన సర్వే నంబర్లలోని జీపీ లేఔట్లు, అందులోని ఓపెన్ ప్లాట్లను నిషేధిత జాబితాలోకి చేర్చింది. దీంతో ఆయా స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరగకుండా అడ్డుకట్ట వేశారు. ఫలితంగా స్థల యజమానులు ప్లాట్లను విక్రయించుకోలేరు. రిజిస్ట్రేషన్లు జరగకపోతే కొనుగోలుదారులెవరూ ముందుకు రారు. దీంతో భవిష్యత్తు అవసరాల కోసమని కొనుగోలు చేసిన ప్లాట్ ఎందుకూ పనికిరాకుండా మిగిలిపోయినట్టయింది.ఏ చట్టం ప్రకారం చేర్చారు?జీపీ లేఔట్లు ఉన్న సర్వే నంబర్లన్నింటినీ ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెడుతూ నిర్ణయం తీసుకుంది. పట్టా స్థలాలను నిషేధిత జాబితా 22–ఏ (1)(ఈ)లో పెట్టే అధికారం ప్రభుత్వానికి లేదు. లేఔట్లకు అనుమతి ఇచ్చే అధికారం గ్రామ పంచాయతీలకు లేదు. హెచ్ఎండీఏ, డీటీసీపీ విభాగాలు మాత్రమే లేఔట్లకు అనుమతి ఇచ్చే అధికారం ఉంది. మరి, హుడా ఏర్పడకుముందే ఈ లేఔట్లు వెలిస్తే.. డీటీసీపీ ఏం చేస్తున్నట్టు? కొత్తగా అవి జీపీ లేఔట్లని పేర్కొంటే నిషేధిత జాబితాలోకి ఏ చట్టం ప్రకారం చేర్చారు? అని డెవలపర్ల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ భూములు లేదా కోర్టు కేసుల్లో ఉన్న స్థలాలను 22–ఏ జాబితా కింద చేర్చుతారు.ఇందులో ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూములు ఇలా ఐదు వర్గాలుగా ఉంటాయి. ఈ స్థలాలను ఎవరూ ఆక్రమించకుండా, రిజిస్ట్రేషన్లు జరగకుండా ఆయా సర్వే నంబర్లను 22–ఏ కింద చేర్చుతారు. తాజాగా ప్రభుత్వం జీపీ లేఔట్లను సైతం 22–ఏ జాబితాలోకి చేర్చడం గమనార్హం. దీంతో లేఔట్, పట్టాదారు స్థలాలు కూడా ప్రభుత్వ భూముల పరిధిలోకి వస్తాయని ఓ న్యాయవాది అభిప్రాయపడ్డారు. దీంతో చాలామంది భూ యజమానులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. డాక్యుమెంట్లను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత న్యాయస్థానం ఆయా స్థలాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి, రిజిస్ట్రేషన్లు చేయాలంటూ సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసే అవకాశముంటుందన్నారు. అయితే ఇలా ఎంతమంది సామాన్యులు కోర్టును ఆశ్రయిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కాగా, జీపీ లేఔట్లను నిషేధిత జాబితాలో పెడితే వాటిని ఎల్ఆర్ఎస్ ఎలా చేస్తారని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. -
అసంపూర్తిగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ల క్రమబదీ్ధకరణ) దరఖాస్తుల్లో అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయనివారు 75శాతం మంది దాకా ఉన్నారు. అధికారులు దరఖాస్తులు పరిశీలించే క్రమంలో ఈ విషయం వెలుగుచూసింది. 2020 ఆగస్టు 26కు ముందు ఉన్న అక్రమ లేఅవుట్లు, ప్లాట్లు క్రమబద్ధీకరించుకునేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అవకాశం ఇచ్చి ంది. రూ.1,000 ఫీజుగా చెల్లించి దరఖాస్తు చేసుకోగా, రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి.అయితే వివిధ కారణాల వల్ల ఎల్ఆర్ఎస్ ప్రక్రియ అప్పట్లో అర్ధాంతరంగా నిలిచిపోయింది. కాగా గత డిసెంబర్లో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం 2020 నాటి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన చేయడంతో జనవరి నుంచి దరఖాస్తుల పరిశీలన మొదలైంది. అరకొరగానే అప్లోడ్ దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్కు అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్పట్లో అప్లోడ్ చేయలేదు. మొత్తంగా 75 శాతం అసంపూర్తి దరఖాస్తులే అందజేశారు. ప్లాట్ల రిజి్రస్టేషన్ డాక్యుమెంట్లు, లే అవుట్ కాపీలు, ఇతర పత్రాలు అప్లోడ్ చేయకుండా వచ్చి న దరఖాస్తులను పక్కనబెడుతూ అధికారులు దరఖాస్తుల పరిశీలన ప్రారంభించారు. ఇప్పటి వరకు 4,28,832 దరఖాస్తులను పరిశీలించగా, వాటిలో కేవలం 60,213 దరఖాస్తులు మాత్రమే ఆమోదించినట్టు పురపాలక ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తెలిపారు. తద్వారా రూ.96.60 కోట్లు ఫీజు రూపంలో వసూలైనట్టు చెప్పారు. పరిశీలించిన దరఖాస్తుల్లో 75 శాతం పూర్తిస్థాయి డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల వాటిని ఆమోదించడం లేదని దరఖాస్తుదారులకు చెప్పారు. షార్ట్‌ఫాల్స్ వివరాలను కూడా దరఖాస్తుదారులకు తెలియజేశారు.మరోసారి అవకాశం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడానికి పురపాలకశాఖ మరో చాన్స్ ఇచ్చి ంది. దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయడానికి, మున్సిపాలిటీ/కార్పొరేషన్/నగరాభివృద్ధి సంస్థల నుంచి అధికారిక షార్ట్ ఫాల్స్ లెటర్ కోసం వేచిచూడకుండా పూర్తిస్థాయి డాక్యుమెంట్లను ఎల్ఆర్ఎస్ పోర్టల్‌లో అప్లోడ్ చేసే వెసులుబాటు కల్పించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని సేల్‌డీడ్, ఈసీ, మార్కెట్ వ్యాల్యూ సర్టీ ఫికెట్, లేఅవుట్ కాపీ వంటి డాక్యుమెంట్లను అప్లోడ్ చేయవచ్చు. దరఖాస్తుదారులు తమ మొబైల్ నంబర్, చిరునామా లేదా ఇతర దరఖాస్తు వివరాలను మొబైల్ నంబర్ ఓటీపీని వినియోగించుకొని ఈ పోర్టల్ ద్వారా సవరించుకోవచ్చునని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ తెలిపారు.ఇందుకోసం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరాభివృద్ధి సంస్థలతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్‌్కలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఏవైనా సందేహాలుంటే తీర్చుకోవడానికి లేదా వివరాల కోసం ఈ హెల్ప్‌డెస్క్‌లను సందర్శించవచ్చునని తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 25 లక్షల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు ఆరోపించారు. ప్రజల నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్ కింద ప్లాట్లు, లే అవుట్లను క్రమబద్దికరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి కేటీఆర్ మాట్లాడారు. గతంలో ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలు, ఇచ్చిన హామీల వీడియో క్లిప్పింగులను ప్రదర్శించారు.ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే ... ‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్, భట్టి విక్రమార్క సహా చాలా మంది కాంగ్రెస్ నేతలు ఎల్ఆర్ఎస్ను తప్పుపట్టారు. తాము అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ పథకాన్ని రద్దు చేస్తామన్నారు. ప్రజల దగ్గర ఎలాంటి చార్జీలు వసూ లు చేయకుండానే రెగ్యులరైజ్ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగుతున్నారంటూ భట్టి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రిజిస్ట్రేషన్ అయిన స్థలాలకు మళ్లీ ఎందుకు డబ్బులు కట్టాలని కూడా అడిగారు. నాడు భట్టి విక్రమార్క చేసిన డిమాండ్‌నే నేను పునరుద్ఘాటిస్తున్నా. రాష్ట్ర ప్రజల జేబుల నుంచి రూ.20 వేల కోట్లు దోచుకోవడానికి కాంగ్రెస్ సర్కారు ఎల్ఆర్ఎస్ స్కీం అమలు చేస్తుంటే భట్టి ఎందుకు మాట్లాడడం లేదు? ఆగమేఘాల మీద మార్చి 31వ తేదీ లోపల ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టాలని దరఖాస్తుదారులకు నేరుగా ఫోన్ కాల్స్ చేస్తున్నారు, ఇది రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగడం కాదా? ప్రజలెవరూ ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టవద్దు. ఆ మాటలేవీ గుర్తులేవా? తమ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తే.. ‘నో ఎల్ఆర్ఎస్ – నో బీఆర్ఎస్’అన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈరోజు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ప్రజలు నో కాంగ్రెస్ అంటున్నారనే విషయం తెలియడం లేదా? అప్పుడు ఉచితంగా క్రమబద్దికరిస్తామ న్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. రాష్ట్ర ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ పేరుతో సర్కారు డబ్బులు లాక్కోవడంపై స్పందించాలి. ఎల్ఆర్ఎస్ అంటే డబ్బులు దోచుకోవడానికేనని ప్రస్తుత మంత్రి సీతక్క అప్పట్లో మాట్లాడారు. మరి ఈరోజు ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్నప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? ఎల్ఆర్ఎస్పైన మంత్రి కోమటిరెడ్డి అప్పట్లో కోర్టులో కేసువేశారు. ఆ కేసును వెనక్కి తీసుకున్నారా? లేక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి కేసు వేస్తారా?..’’అని కేటీఆర్ ప్రశ్నించారు. మార్చి 31 కల్లా డబ్బులు కట్టి తీరాలని ప్రజల మెడమీద కత్తి పెట్టారని, ప్రభుత్వ ఖజానా నింపడానికే ఈ కార్యక్రమం తీసుకున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 6, 7 తేదీలలో జరిగే ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టాలని అడుగుతున్న అధికారులను నిలదీయాలన్నారు. ఎమ్మెల్సీ మనదే.. రెండు ఎంపీ సీట్లూ మనవే ‘స్థానిక’ఎమ్మెల్సీతోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు లోక్‌సభ సీట్లను గెలుచుకునేందుకు పకడ్బందీ కార్యాచరణ రూపొందిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో కేటీఆర్ సమావేశమై.. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై, మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చర్చించారు. ఎమ్మెల్సీ, లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఒకట్రెండు రోజుల్లోనే ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాలపైన పార్టీ అధినేత కేసీఆర్ విస్తృతస్థాయి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఎమ్మెల్సీతోపాటు రెండు లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కే విజయం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రూ.20 వేల కోట్లు దోచుకునే పన్నాగం ఎల్ఆర్ఎస్లో భాగంగా దరఖాస్తు చేసుకున్న 25 లక్షల 44 వేలమంది లబ్ధిదారుల్లో ఒక్కొక్కరిపై కనీసం రూ.లక్ష చొప్పున భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 31వ తేదీలోగా రాష్ట్ర ప్రజల నుంచి ఎల్ఆర్ఎస్ ద్వారా రూ.20 వేల కోట్లు దోచుకునేలా పన్నాగం పన్నారు. ఎల్ఆర్ఎస్ను ఎలాంటి చార్జీలు తీసుకోకుండా అమలు చేయాలి. ఈ డిమాండ్‌తో ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలను చేపడతాం. 7న ప్రతి జిల్లా కలెక్టర్, ఆర్డీవోలకు వినతి పత్రాలు అందజేస్తాం. హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపడతాం. – కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ -
2020నాటి ఎల్ఆర్ఎస్కు లైన్ క్లియర్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న లేఅవుట్ల క్రమబద్ధికరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020 సంవత్సరంలో ప్లాట్ ఓనర్లు, లేఅవుట్లు చేసిన రియల్టర్ల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి క్రమబద్ధికరించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని రెవెన్యూ విభాగాల నుంచి ఆదాయ సమీకరణపై సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31లోగా మొత్తం రుసుము చెల్లించిన పక్షంలో సదరు ప్లాట్ల క్రమబద్ధికరణకు అవకాశం కల్పించనున్నారు. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ, కోర్టు ఆదేశాలున్న భూములు మినహా ఇతర లేఅవుట్లను క్రమబద్ధీకరించనున్నారు. సుమారు 20 లక్షల మంది దరఖాస్తుదారులకు దీనితో ప్రయోజనం చేకూరుతుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఆదాయ సమీకరణ దిశగా.. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో అనుమతుల్లేని లేఅవుట్లలో ఉన్న ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో కేసీఆర్ సర్కారు ఎల్ఆర్ఎస్ పథకాన్ని తెచ్చింది. ఆ ఏడాది అక్టోబర్ 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. ప్లాట్లకు సంబంధించి రూ.1000 చొప్పున, లేఅవుట్లకు రూ.10,000 చొప్పున దరఖాస్తు ఫీజు తీసుకుంది. ఈ పథకం కింద 100 గజాల్లోపు ప్లాటు రెగ్యులరైజేషన్ కోసం గజానికి రూ.200 చొప్పున చార్జీ చెల్లించాలి. 100 నుంచి 300 గజాల వరకు ఉన్న స్థలాలకు గజానికి రూ.400.. 300 గజాలకుపైన ఉంటే గజానికి రూ.600 చొప్పున చార్జీ చెల్లించాలని పేర్కొంది. అయితే.. లేఅవుట్ల క్రమబద్ధికరణ అంశంపై న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. పెండింగ్ దరఖాస్తుల సంగతి ఏమిటన్నది అయోమయంగా మారింది. తాజాగా ఆదాయ సమీకరణపై సీఎం సమీక్ష సందర్భంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నారు. తద్వారా సర్కారుకు ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. దీనిపై అధికారికంగా విధి విధానాలు విడుదల కావాల్సి ఉంది. అయితే ఎల్ఆర్ఎస్ చార్జీల చెల్లింపు కోసం తక్కువ గడువు పెట్టడం ఏమిటన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సర్కారుకు రూ. 50 వేల కోట్ల ఆదాయం వచ్చే చాన్స్ 2020 నాటి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షనీయం. వేలాది మంది రియల్టర్లు, లక్షల మంది కొనుగోలుదారులకు గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని ప్లాట్లకు అనుమతి లభిస్తుంది. అయితే మార్చి 31లోగా ఎల్ఆర్ఎస్ క్రమబద్ధికరణ చార్జీల మొత్తాన్ని చెల్లించాలనే నిబంధనను సడలించాలి. కేవలం నెల రోజుల్లో లక్షల రూపాయలు చెల్లించి ఎల్ఆర్ఎస్ చేయించుకునే స్తోమత ప్లాట్ల యజమానులు, రియల్టర్లకు ఉండదు. ఈ విషయంలో పునరాలోచించాలి. ప్రస్తుతం సుమారు 25 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవ్వన్నీ క్లియర్ అయితే ప్రభుత్వానికి రూ. 50 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. – నారగోని ప్రవీణ్‌కుమార్, ప్రెసిడెంట్,తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ -
వెంచర్ల వంచన
సీఆర్డీఏ పరిధిలోని గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో 2020లో 5.50 ఎకరాల్లో కొందరు లే అవుట్ వేశారు. ఈ ప్రాంతం నగర శివారులో ఉండడం, కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడంతో సమీపంలోనే ఓ భారీ కంపెనీ వస్తున్నట్టు ప్రచారం చేసుకున్నారు. దాంతో పలువురు ప్లాట్లు కొన్నారు. వాటిల్లో నిర్మాణాలు చేపట్టాలని సీఆర్డీఏకి దరఖాస్తు చేసుకుంటే అసలు ఆ లేఅవుట్‌కు అనుమతి లేదని తేలింది. దాంతో ప్లాట్లు కొన్న వారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఇదే కాదు.. సీఆర్డీఏ పరిధిలోని గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఇలాంటి లేఅవుట్లు చాలా వెలిశాయి. వాటి తొలగింపునకు సీఆర్డీఏ అధికారులు చర్యలు ప్రారంభించారు. వీటిలో ఎవరూ ప్లాట్లు కొని మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని పేరు చెప్పి ప్రజలను ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేశారు. ఇందులో అక్రమ లేఅవుట్లు కూడా ప్రధాన పాత్ర పోషించాయి. అమరావతి రాజధాని నెపంతో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ)ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని దాదాపు మొత్తం ప్రాంతాన్ని దీని పరిధిలోకి తెచ్చారు. ఈ ప్రాంతంలో అనేకానేక ప్రాజెక్టులు వస్తాయని ప్రచారం చేశారు. దీంతో ఈ రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఇబ్బడిముబ్బడిగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడో లేఅవుట్ వేశారు. వీటిలో దాదాపు అన్నీ అక్రమంగా, అనుమతి లేకుండా వేసినవే. వీటికోసం ప్రచారం ఘనంగా చేశారు. కళ్లు చెదిరే నిర్మాణాలు, అంతర్జాతీయ పరిశ్రమలు వస్తున్నాయని ఊదరగొట్టారు. భారీగా అభివృద్ధి జరిగిపోతున్నట్లు గ్రాఫిక్స్ చూపించారు. దీంతో అనేక మంది ఇక్కడ ప్లాట్లు కొన్నారు. ధర ఎంత అన్నది చూడకుండా కొనేశారు. వీటిలో ఇళ్లు కట్టుకొనేందుకు అనుమతుల కోసం దరఖాస్తు చేయగా.. ఆ లేఅవుట్లకు అసలు అనుమతులే లేవని సీఆర్డీఏ అధికారులు వాటిని తిరస్కరించారు. దీంతో మోసం బయటపడింది. ప్లాట్లు కొనుక్కున్న వారు కన్నీటిపర్యంతమవుతున్నారు. సీఆర్డీఏ పరిధిలో భారీ ప్రాజెక్టులు వస్తున్నాయని, అద్భుత నగరం ఆవిష్కృతమవుతుందని గత ప్రభుత్వ హయాంలో ప్రచారం చేసి ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వందలాది వెంచర్లు వేశారు. విజయవాడ, గుంటూరు నగరాల మధ్య, అమరావతి – గుంటూరు మధ్య జాతీయ రహదారికి ఇరువైపులా, విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ఇబ్రహీంపట్నం, నున్న, గన్నవరం, కంకిపాడు ప్రాంతాల్లో, చిలకలూరిపేట సమీపంలో.. ఇలా సీఆర్డీఏ పరిధిలోని 19 నియోజకవర్గాల్లో లేఅవుట్లు వేశారు. వీటిలో దాదాపు అన్నీ అనుమతుల్లేకుండా అక్రమంగా వేసినవే. ఈ వెంచర్ల యజమానులు రెరా, సీఆర్డీఏ అనుమతులు తీసుకోకుండానే అవన్నీ ఉన్నట్టుగా మభ్యపెట్టారు. వేరే చోట అనుమతి ఉన్న లే అవుట్ల ఎల్పీ నంబర్లను ఇక్కడి వాటికి జోడించి కొనుగోలుదారులకు తప్పుడు సమాచారం అందించారు. ఆకట్టుకొనే డిజైన్లు, వారు చేసిన ప్రచారం, బ్రోచర్లను చూసి ముచ్చటపడిన వినియోగదారులు ఎక్కువ ధర అయినా కొనేశారు. విదేశాల్లో ఉన్న వారు కూడా చాలా మంది వీటిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత వీటి మోసం బయటపడటంతో సీఆర్డీఏకు పలు ఫిర్యాదులు అందాయి. ఇలా వచ్చిన వాటిలో 2020 వరకు 1,469 లేఅవుట్లను అక్రమమైనవిగా గుర్తించి చర్యలు తీసుకున్నారు. ఇటీవల మరో 98 అక్రమ లేఅవుట్లను గుర్తించారు. వాటిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. సీఆర్డీఏ పరిధిలో అక్రమ లేఅవుట్లతో పాటు అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణాలు మరో 3,072 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిపైనా చర్యలు తీసుకుంటున్నారు. అక్రమ లేఅవుట్లు, అక్రమ నిర్మాణాల యజమానులకు నోటీసులు కూడా జారీ చేశారు. అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని, అలా చేస్తే వచ్చే నష్టాలను వివరిస్తూ ఆ ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి వాటిని కొనుగోలు చేస్తే భవిష్యత్‌లో ప్రభుత్వ అనుమతులు మంజూరు కావని సీఆర్డీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు. గుర్తింపులేని లేఅవుట్లతో ఇబ్బందులు సీఆర్డీఏ పరిధిలో ప్రభుత్వ అనుమతి లేని లే అవుట్లు, నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి వాటిలో ప్లాట్లు కొంటే భవన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రావు. కొనుగోలుదారులు ప్లాటు కొనే ముందు రెరా, సీఆర్డీఏ అనుమతి, ఎల్పీ నంబర్ వంటివి సరిచూసుకోవాలి. సీఆర్డీఏ కూడా అన్ని ప్రభుత్వ అనుమతులు, సదుపాయాలతో లేఅవుట్లను నవులూరు, నూజివీడులో అభివృద్ధి చేసింది. ఏ వివరాలు కావాలన్నా వినియోగదారులు సీఆర్డీఏ వెబ్సైట్లో చూడవచ్చు. – సీఆర్డీఏ కమిషనర్ వివేక్‌యాదవ్ సీఆర్డీఏ లేఅవుట్లు సేఫ్ కొనుగోలుదారుల అవసరం మేరకు అన్ని అనుమతులు, సౌకర్యాలను కల్పించి సీఆర్డీఏనే సొంతంగా లేఅవుట్లు వేస్తోంది. నవులూరు, నూజివీడులో ప్లాట్లను అభివృద్ధి చేసి, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీ సైతం కల్పిస్తోంది. ఇలా నవులూరులో 386 ప్లాట్లు అభివృద్ధి చేయగా ఇప్పటికే 164 అమ్ముడయ్యాయి. మిగిలిన ప్లాట్లలో 10 శాతం ప్రభుత్వ అవసరాలకు మినహాయించి 180 ప్లాట్ల వరకు ఈ–లాటరీకి ఏర్పాట్లు చేసింది. నూజివీడులోనూ సీఆర్డీఏ 40.78 ఎకరాల్లో 393 ప్లాట్లను అభివృద్ధి చేసింది. -
అధ్వానంగా పారిశుధ్య నిర్వహణ... కమిషనర్‌ను ప్రశ్నిస్తున్న కౌన్సిలర్లు
సదాశివపేట(సంగారెడ్డి): మున్సిపల్ పరిధి రోజురోజుకు విస్తరించడంతోపాటు జనాభా పెరుగుతోందని, అయితే శానిటేషన్ నిర్వహణ అధ్వానంగా తయారైందని, లై అవుట్లలో రోడ్లు, లైట్లు తదితర పనులు పూర్తి కాకుండానే తుది అనుమతి ఎలా ఇస్తారని కౌన్సిలర్లు కమిషనర్ కృష్ణారెడ్డిని ప్రశ్నించారు. గురువారం మున్సిపల్ సమావేశ మందిరంలో జరిగిన తెలంగాణ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం అనంతరం అనధికారికంగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు శానిటేషన్, లేఅవుట్లు, ఇతర అభివృద్ధి పనులు విషయంలో అధికారుల వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. పట్టణంలో పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. మురుగు కాల్వల్లో పూడిక పెరుకుపోతుందని, పారిశుద్ధ్య నిర్వహణ ప్రైవేట్‌కు అప్పగించవద్దని 3వ వార్డు కౌన్సిలర్ చౌదరి ప్రకాశ్ చెప్పినట్లు సమాచారం. ప్రైవేట్ చెత్తసేకరణను రద్దుచేసి మున్సిపల్ శానిటేషన్ సిబ్బందితో చేయించాలన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది చాలడంలేదని, సిబ్బంది సంఖ్యను పెంచాలన్నారు. పట్టణ పరిధిలో ఎన్ని లే అవుట్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారని, లే అవుట్లలో రోడ్లు, మురుగునీటి కాల్వలు, వాటర్ ట్యాంకు నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా పైపులైన్ నిర్మించకుండా ఫైనల్ రిలీజ్ ఎందుకు చేస్తున్నారని కౌన్సిలర్ ఇంద్రమోహన్‌గౌడ్ కమిషనర్ కృష్ణారెడ్డిని ప్రశ్నించనట్లు తెలిసింది. లే అవుట్లలో అభివృద్ధి పనులు జరగకున్నా, ఇతర సౌకర్యాలు లేకున్నా ప్లాట్లు కొనుగోలు చేసినవారికి ఎలా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారని, నిబంధనల మెరకే లే అవుట్ ఫైనల్ చేస్తున్నామని కమిషనర్ సమాధానమిచ్చినట్లు సమాచారం. సీసీ రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణ పనులు నాణ్యతా జరగడంలేదని కౌన్సిలర్లు నాగరాజ్‌గౌడ్, చౌదరి ప్రకాశ్ నిలదీశారని, నాణ్యతగా పనులు చేపట్టేందుకు ఇంజనీర్‌ను ఆదేశిస్తామని కమిషనర్ సమాధానమిచ్చినట్లు తెలిసింది. మూడు నెలలకోసారి కాకుండా ప్రతీనెల సమావేశాలు నిర్వహిస్తే ప్రజాసమస్యలు సులువుగా పరిష్కారమవుతాయని మెజార్టీ కౌన్సిలర్లు కోరినట్లు సమాచారం. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లోడి జయమ్మ, వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్లు విద్యాసాగర్‌రెడ్డి, గుండు రవి, శ్రీనివాస్, ఇలియాస్ షరీఫ్, నాగరాజ్‌గౌడ్, గుండు రవి, ఖుద్దూస్, పిచర్యాగడి రేణుక, కోఆప్షన్ మెంబర్ కలీమ్ పటేల్ పాల్గొన్నారు. -
పనులు చకచకా.. ఆర్–5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు పనులు చకచకా సాగుతున్నాయి. లేఅవుట్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్లాట్ల సరిహద్దులు గుర్తించి రాళ్లు పాతే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వారం రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి అర్బన్, రూరల్ ప్రాంతాలతోపాటు తుళ్లూరు, పెదకాకాని మండలాల్లో లబ్ధిదారులకు 23,192 మందికి రకరకాల కారణాలతో పట్టాలు పంపిణీ చేయలేదు. ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 25 వేల మందికి పట్టాలు ఇచ్చేందుకు లబ్ధిదారులను గుర్తించారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాష్ట్ర్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో–45 ద్వారా భూమిని కేటాయించడం జరిగింది. గుంటూరు జిల్లాకు 550.65 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాకు 583.94 ఎకరాలు మొత్తం కలిపి 1,134.,59 ఎకరాల భూమిని కేటాయించారు. ఇప్పటికే పట్టాలు సిద్ధం లబ్ధిదారులకు సంబంధించి మళ్లీ ఇంటింటికీ వెళ్లి వెరిఫికేషన్ చేయించారు. ఎవరైనా లబ్ధిదారులు మరణిస్తే.. వారి వారసుల పేరిట పట్టాలిచ్చారు.తాత్కాలిక అవసరాల నిమిత్తం కొందరు, శాశ్వతంగా మరికొందరు వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. వీరందరినీ గుర్తించి అర్హులందరికీ ఇళ్ల పట్టాలు సిద్ధం చేయించారు. ఇప్పటికే పట్టాలను సైతం ప్రింట్ చేయించారు. అందులో లబ్ధిదారుల వివరాలన్నీ పొందుపరిచారు. ఇందులో ముఖ్యమంత్రి సందేశం, లబ్ధిదారుని వివరాలు, ఆధార్ నంబర్, గ్రామం, వివరాలు, రెండు పేజీలలో డి.పట్టా, లేఅవుట్, ప్లాట్ హద్దులు ఉండేలా ఏర్పాటు చేశారు. ఈ పట్టాలపై సంబంధిత తహసీల్దార్‌తో సంతకాలు చేయించి అందుబాటులో పెట్టారు. వీరందరికీ ఇళ్లు కూడా కట్టించి ఇచ్చేందుకు వాటిని స్కాన్ చేసి ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. 6 గ్రామాల్లో 20 లేఅవుట్లు ఐనవోలు, మందడం, నవులూరు, నిడమర్రు, కృష్ణాయపాలెం, కురగల్లు గ్రామాల్లో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల లబ్ధిదారుల కోసం 20 లేఅవుట్లు వేశారు. íసీఆర్డీఏకి భూమిని కేటాయించిన తర్వాత భూముల హద్దులు నిర్ధారించి.. ఆ భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత లేఅవుట్లు సిద్ధం చేశారు. టౌన్‌ప్లానింగ్ నిబంధనలకు అనుగుణంగా లేఅవుట్లలో ఉండాల్సిన ఓపెన్ స్పేస్, రోడ్లు, డ్రెయిన్లు, పార్కింగ్, ఇతర అవసరాలకు కావాల్సిన భూమిని వదిలి ప్లాట్లు వేశారు. సీఆర్డీఏ టౌన్‌ప్లానింగ్ నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకున్నారు. అనుమతులు వచ్చిన తర్వాత అభివృద్ధి బాధ్యతను íసీఆర్డీఏకి ప్రభుత్వం అప్పగించింది. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లను ఎంపిక చేసి ప్రతి లేఅవుట్‌కు ఒక కాంట్రాక్టర్ ఉండేలా పనులు అప్పగించారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లెవలింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రతి లేఅవుట్ పూర్తిస్థాయిలో రావడం కోసం లెవలింగ్, జంగిల్ క్లియరెన్స్, రోడ్ల ఏర్పాటు, సరిహద్దుల మార్కింగ్ చేశారు. సరిహద్దు రాళ్లు పాతి వాటికి తెల్లరంగు వేసి ప్లాట్ నంబర్లు వేసే పనులు చకచకా సాగుతున్నాయి. దీంతోపాటు రోడ్డు పక్కన డ్రెయిన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి లేఅవుట్‌కు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను నియమించారు. మార్కింగ్ ఇవ్వడం కోసం 120 మంది సర్వేయర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను నియమించారు. వీరంతా మార్కింగ్ చేస్తున్నారు. పేదల ఇళ్ల కోసం మరో 268 ఎకరాలు సాక్షి, అమరావతి: ఏపీ సీఆర్డీఏ పరిధిలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకానికి ప్రభుత్వం మరో 268 ఎకరాలను కేటాయించింది. ఇందులో బోరుపాలెం, పిచికలపాలెం, అనంతవరం గ్రామాల పరిధిలో 168 ఎకరాలను ఎన్టీఆర్ జిల్లాకు చెందిన లబ్ధిదారుల కోసం కేటాయించగా.. గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారుల కోసం మరో 100 ఎకరాలను నెక్కల్లులో కేటాయించింది. ఇప్పటికే పేదలందరికీ ఇళ్ల పథకానికి ప్రభుత్వం 1,134.58 ఎకరాలను కేటాయించి ప్లాట్లుగా వేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో సుమారు 50 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వనుంది. గతంలో ఇక్కడ 48,218 మంది లబ్ధిదారులకు చోటు కల్పించారు. అయితే, కేటాయించిన భూమిలో 40,502 ప్లాట్లు సిద్ధమవుతున్నాయి. మిగిలిన లబ్ధిదారులకు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు అనువుగా అదనంగా భూమి ఇవ్వాలని రెండు జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వాన్ని కోరారు. దాంతో మంగళవారం మరో 168 ఎకరాలను కేటాయించింది. ఈ ప్రాంతంలో పేదలందరికీ ఇళ్లు పథకంలో ఎన్టీఆర్ జిల్లాకు 26,739 మంది, గుంటూరు జిల్లాకు చెందిన 23,235 మంది లబ్ధిదారులకు మొత్తం 49,974 ప్లాట్లు ఇవ్వనున్నారు. సీఎం చేతుల మీదుగా పట్టాల పంపిణీ ఈ నెల 15వ తేదీ తర్వాత ఎప్పుడైనా సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ జరుగుతుంది. సుమారు రెండు జిల్లాల్లో కలిపి 50 వేల మందికి పట్టాల పంపిణీ చేస్తాం. ఈ పట్టాలు పంపిణీ జరిగితే జిల్లాలో పట్టాల పంపిణీ ప్రక్రియ పూర్తి అవుతుంది.– ఎం.వేణుగోపాలరెడ్డి, కలెక్టర్ -
విశాఖ జిల్లాలో చురుగ్గా జగనన్న లేఅవుట్ పనులు
-
గుంకలాం ప్రోగ్రెస్ రిపోర్ట్.. చక చకా నిర్మాణాలు..
-
ఎల్ఆర్ఎస్ లేకున్నా రిజిస్ట్రేషన్?
సాక్షి, హైదరాబాద్: అనుమతులు లేని లేఅవుట్లలోని ప్లాట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అలాంటి లేఅవుట్లలోని ప్లాట్లకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయడం లేదు. దీనితో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల శివార్లలోని గ్రామ పంచాయతీల్లో వేలాది ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆ గ్రామాల్లో చాలా వరకు మున్సిపాలిటీలుగా మారడమో, విలీనం కావడమో జరిగింది. ఈ నేపథ్యంలో నిబంధనను సడలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. సదరు లేఅవుట్లు ఎల్ఆర్ఎస్ చెల్లించేందుకు అర్హమైనవి అయితే.. ఆ లేఅవుట్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లను అనుమతించనున్నట్టు తెలిసింది. ప్రస్తుతానికి ఆ ప్లాట్లకు ఫస్ట్ రిజిస్ట్రేషన్లు చేయాలని.. అయితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఎల్ఆర్ఎస్ చెల్లించాల్సి ఉందన్న అంశాన్ని చేర్చాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ఒకటి రెండు రోజుల్లో జారీచేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదనపు ఆదాయ వనరుల సమీకరణలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. -
ప్లాట్ల కొనుగోలుదారులూ అదంతా మాయ.. కొంటే నిండా మునిగినట్టే!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: లేఅవుట్లో ఉన్న భూములకు కన్వర్షన్ జరిగిందా? ప్లాన్ అప్రూవల్ వచ్చిందా? వాస్తవంగా ప్లాట్లు వేశారా? రోడ్లు, సామాజిక అవసరాలకు భూమిని మినహాయించారా? ప్రభుత్వ భూములు, సాగునీటి కాలువలున్నాయా..? సొంతింటి కల సాకారం చేసుకోవాలనే ఆతృతతో ప్లాట్లు కొనుగోలు చేస్తున్న ప్రజలు ఇప్పుడవేవీ తెలుసుకోవడం లేదు. స్థలం దొరికిందని ఆదరాబాదరాగా చెల్లింపులు చేసేస్తున్నారు. లొసుగును బయటపెట్టాల్సిన అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కూడా చెక్ పెట్టడం లేదు. దీంతో చివరికి కొనుగోలుదారులు మోసపోవాల్సి వస్తోంది. రణస్థలం మండలం వరిశాంలో ఉన్న రామ్‌నగర్ లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేస్తున్న వారి పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. అంతా మాయ.. వరిశాంలోని రామ్‌నగర్ లే అవుట్లో సర్వే నంబర్.23–7ఎ, 23–11, 23–12, 23–13, 23–14, 23–15లో గల ఏడెకరాల భూమిలో లేఅవుట్ వేసినట్టుగా నిర్వాహకులు కాగితాల్లో చూపిస్తున్నారు. ఎన్ని ప్లాట్లు వేశారో ఎవరికీ తెలియడం లేదు. అక్కడ ల్యాండ్ పొజిషన్ లేదు. దానికి కారణం వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా కన్వర్షన్ చేయించలేదు. లేఅవుట్ వేసేందుకు అనుమతి తీసుకోలేదు. అంతా కాగితాల్లోనే మాయాజాలం ప్రదర్శించి రణస్థలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ముందస్తు ఒప్పందమో మరేమిటో తెలియదు గానీ అధికారులు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. తమకు డాక్యుమెంట్ వచ్చిందని రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. పక్కాగా ఉన్న ప్లాట్లపై జరిగే క్రయ, విక్రయాలకు అనేక ప్రశ్నలు, అభ్యంతరాలు తెలిపే రిజిస్ట్రేషన్ అధికారులు.. వరిశాంలోని రామ్‌నగర్ లేఅవుట్‌కు సంబంధించి వస్తున్న అక్రమ డాక్యుమెంట్లపై కనీసం అడగడం లేదు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్ వచ్చీ రాగానే రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. దీనివెనక ఉన్న లాలూచీ ఏంటో వారికే తెలియాలి. ల్యాండ్ కన్వర్షన్, ప్లాన్ అప్రూవల్ లేని రామ్‌నగర్ లేఅవుట్లోని నంబర్.74 ప్లాట్ క్రయ, విక్రయాలకు సంబంధించి జరిగిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కొనుగోలుదారులు మునిగినట్టే.. వ్యవసాయ భూమిని లేఅవుట్‌గా వేయాలంటే ముందుగా ల్యాండ్ కన్వర్షన్ చేయాలి. దాని కోసం రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వానికి భూమి విలువలో 5శాతం చెల్లించి ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవాలి. దీని తర్వాత లేఅవుట్ వేసేందుకు వుడా లేదంటే సుడా నుంచి ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలి. ఇందుకు భూమి విలువలో 12శాతం చెల్లింపులు చేయాలి. తదననుగుణంగా వచ్చిన అనుమతుల మేరకు రోడ్లు, సామాజిక అవసరాల కోసం స్థలం మినహాయించి మిగతా స్థలాన్ని ప్లాట్లుగా విభజన చేయాలి. కానీ వరిశాంలోని రామ్‌నగర్ లేఅవుట్ భూమికి కన్వర్షన్ గాని, ప్లాన్ అప్రూవల్ గాని తీసుకోలేదు. ప్రభుత్వానికి ఒక్క పైసా చెల్లించకుండానే కాగితాల్లో లేఅవుట్ సృష్టించారు. అందమైన బ్రోచర్లతో ప్లాట్లను అమ్మేస్తున్నారు. వారికి నమ్మకం కలిగేలా కొనుగోలుదారు పేరున సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయించేస్తున్నారు. అంతే తప్ప వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడం లేదు. లేఅవుట్లో విద్యుత్ సౌక ర్యం గాని, కాలువలు గాని ఉండడం లేదు. రోడ్లు, సామాజిక అవసరాల కోసం ఖాళీగా స్థలాన్ని మినహాయించిన పరిస్థితి లేదు. అసలు కొనుగోలుదారుల ప్లాట్ ఎక్కడో భౌతికంగా తెలియదు. దీనివల్ల కొనుగోలు చేసిన స్థలంలో భవిష్యత్‌లో ఇళ్లు కట్టుకోవాలంటే అనుమతి రాదు. ప్లాన్ ఇచ్చేందుకు అవకాశం ఉండదు. ఇవన్నీ రెగ్యులర్ చేస్తే తప్ప ఇంటి నిర్మాణానికి అనుమతి రాదు. కన్వర్షన్, ప్లాన్ అప్రూవల్‌కు మళ్లీ డబ్బులు చెల్లించాలి. రోడ్లు, సామాజిక అవసరాల కోసం కొనుగోలు చేసిన స్థలాల నుంచే కేటాయించాల్సి వస్తోంది. ఫలితంగా కొనుగోలు చేసే స్థలం విస్తీర్ణం కూడా తగ్గిపోనుంది. ఈ పరిస్థితి రాకుండా ముందుగా లేఅవుట్కున్న అనుమతులు పరిశీలించాలి. ప్లాన్ అప్రూవల్తో ఉన్న ప్లాట్లను గుర్తించి కొనుగోలు చేయాలి. ఇలా జరగకపోవడం వల్ల కొనుగోలుదారులు నిండా మునిగిపోతున్నారు. మరో వైపు ఇలాంటి వ్యవహారాలతో ప్రభుత్వ పరంగా ఆదాయానికి గండిపడుతోంది. రెండు తేదీల్లో తొమ్మిది ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు.. వరిశాంలోని అనధికారికంగా వేసిన రామ్‌నగర్ లేఅవుట్లో రెండు తేదీల్లో ఏకంగా తొమ్మిది ప్లాట్లకు రణస్థలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. సర్వే నంబర్ 23–7ఎలో 60, 64, 65, 66, 74, 75, సర్వే నంబర్ 23–14లో 8, 23–14,23–15లో 6 నెంబర్ల గల ప్లాట్లకు గత నెల 25న రిజిస్ట్రేషన్లు చేశారు. సర్వే నంబర్ 23–14, 23–15లో గల 23వ ప్లాట్‌ను ఆగస్టు 3న రిజిస్ట్రేషన్ చేశారు. ఇదంతా పక్కా పథకం ప్రకారం జరిగినట్లు తెలుస్తోంది. -
నీటిపై రాతలు అవాస్తవం
ఫిరంగిపురం(పల్నాడు జిల్లా): ఫిరంగిపురం ఆరోగ్యనగర్‌లోని జగనన్న లేఅవుట్‌ల్లో సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా బోర్లు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా రూ.41లక్షలు వెచ్చించి పైపులైన్ ఏర్పాటు చేసి నీటి సరఫరా చేస్తున్నారు. కానీ కొన్ని పత్రికలు కట్టు కథలు ప్రచారం చేస్తున్నాయి. నీటి సరఫరాపై ఓ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వెంకటేశ్వరరావు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం లేఅవుట్లను సందర్శించారు. 3,4 నెంబర్‌గల లేఅవుట్లలో జరుగుతున్న పైపులైన్ పనులను పరిశీలించారు. బోర్లు రెండు నెలల కిందట వినియోగంలోకి వచ్చాయన్నారు. నాలుగో లేఅవుట్లో 625 గృహాల నిర్మాణం జరుగుతుందని, నీటి అవసరాల కోసం రేపూడి గ్రామంలోని సమగ్ర మంచినీటి పథకం ద్వారా తాళ్లూరు రోడ్డు నుంచి వసంతనగర్ మీదుగా ఆరోగ్యనగర్‌కు పైపులైను ఏర్పాటు చేశామన్నారు. పైపులైను వేసే సమయంలో స్థానికంగా ఉన్న వారితో కొన్ని ఇబ్బందులు ఏర్పడటంతో ఆసమస్యలను పరిష్కరించుకొని రెండురోజుల కిందట నీటి సరఫరా చేశామన్నారు. వాటిలో లోపాలు గుర్తించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చొరవతో పూర్తిస్థాయిలో నేడు నీటిని విడుదల చేసి 70 వరకు ట్యాప్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లబ్ధిదారులు నీటిని కొనుగోలు చేస్తున్నారని చెప్పడం అవాస్తవమన్నారు. లోతట్టులో గృహాలు లేవు ప్రధాన రహదారి లోతట్టులో లేదు. అంతర్గత రోడ్ల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలి. ప్రధాన రహదారితో పోల్చకూడదు. అంతర్గత రోడ్ల కన్నా ఇచ్చిన ప్లాట్లు లోతులో ఉంటే మాత్రమే మెరక చేయాలి, లేనిఎడల అవసరం లేదు. నీటికోసం రూ.41 లక్షలు మంజూరు చేశారని వాటితో పైపులైన్ వేశారు. లబ్ధిదారులు ఆ నీటినే వాడుకుంటున్నారు. – పింకి, ఏఈ, హౌసింగ్ శాఖ బోర్లు, కొళాయిలు ఏర్పాటుచేశారు.. ఆరోగ్యనగర్‌లోని జగనన్న కాలనీలో నీటి కోసం అధికారులు బోర్లు, కొళాయిలు ఏర్పాటుచేశారు. కొళాయిలు నుంచి నీరు కూడా వస్తుండటంతో ఆ నీటిని డ్రమ్ములతో పట్టుకుంటున్నాం. ఇల్లు కట్టుకోడానికి నీటికోసం ఇబ్బందులు లేవు. కొన్ని రోజులుగా వానలు పడుతుండటంతో పనివారు రాకపోవడంతో పనులు చేయలేక పోతున్నాం. – ఆర్.ఇన్నయ్య లబ్ధిదారుడు నీటి ఇబ్బందులు లేవు జగనన్న కాలనీలో నీటికి ఇబ్బందులు లేవు. రెండురోజుల కిందట అధికారులు నీటి సరఫరా చేశారు. రెండు నెలల కిందటే బోర్లు వేశారు. మా లేఅవుట్ ప్రాంతంలో 17 ట్యాప్‌లు ఏర్పాటుచేశారు. బజారుకో పంపు రెండు కొళాయిలు ఇచ్చారు. వాటిని వినియోగించుకుంటున్నాం. – పి.లూర్దుమరియన్న. గృహ లబ్దిదారుడు. -
మధ్యతరగతి వర్గాలకు భరోసా జగనన్న స్మార్ట్ టౌన్షిప్
సాక్షి,గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): మధ్యతరగతి ఆదాయ వర్గాల ప్రజల అభ్యున్నతికి జగనన్న స్మార్ట్ టౌన్షిప్ చక్కటి భరోసాను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. సీఆర్డీఏ ఆధ్వర్యంలో తాడేపల్లి–మంగళగిరి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నవులూరు ఎంఐజీ లేఔట్లో ప్లాట్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకున్నవారికి శనివారం విజయవాడలో ఈ–లాటరీ నిర్వహించారు. వివేక్ యాదవ్ మాట్లాడుతూ.. ఎంఐజీ ప్లాట్లకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. ఇందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి మున్ముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. లేఔట్లో 60, 80 అడుగుల అనుసంధాన రహదార్లతోపాటు 40 అడుగులతో అంతర్గత సీసీ రహదార్లను కూడా నిర్మిస్తున్నామన్నారు. కాగా, నవులూరు ఎంఐజీ లేఔట్లో మొత్తం 147 మంది ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. 104 మందిని అర్హులుగా ఎంపిక చేశామని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ ఆన్లైన్ ర్యాండమ్ లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు పత్రాలను అందజేశారు. చదవండి: ఎనీ డౌట్? కలామ్ పేరును చంద్రబాబు సూచించారనేది కేవలం భ్రమ -
ఇక ‘అసైన్డ్’ వంతు!
రాష్ట్రంలో నెలకొన్న భూముల సమస్యలు, వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచీ పెండింగ్‌లో ఉన్న భూ సంబంధిత సమస్యలను పేద, మధ్యతరగతి వర్గాలకు అనుకూలంగా పరిష్కరించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు మరోమారు అవకాశం కల్పిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా అసైన్డ్ భూములు, నోటరీ స్థలాలు, లే అవుట్ల రెగ్యులరైజేషన్ సంబంధిత అంశాలపై దృష్టి సారించింది. దీంతో ఈ అంశాలకు కూడా త్వరలోనే పరిష్కారం లభించే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అసైన్డ్ భూములతో పాటు నోటరీ స్థలాలు, లే అవుట్ల రెగ్యులరైజేషన్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా కీలకమైన అసైన్డ్ భూముల సమస్య పరిష్కారానికి కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల ఎకరాల భూమిని 14 లక్షల మందికి అసైన్ చేశారు. అయితే ఈ భూములపై అసైనీలకు ఎలాంటి యాజమాన్య హక్కులు కల్పించలేదు. భూబదలాయింపు నిషేధ చట్టం (పీవోటీ) కారణంగా ఈ భూములపై అసైనీలకు హక్కులు కల్పించే అవకాశం లేకుండా పోయింది. దీంతో కేవలం వారసత్వ బదిలీకి మాత్రమే ఈ భూములు పరిమితం అయ్యాయి. ఇప్పుడు ధరణి పోర్టల్‌లో చాలా అసైన్డ్ భూములు నిషేధిత భూముల జాబితాలో ఉండడంతో ఈ లావాదేవీలు కూడా జరగడం లేదు. అయితే ఓ కటాఫ్ తేదీని నిర్ధారించి ఈ కటాఫ్ తేదీ కంటే ముందు పేదలకు అసైన్ చేసిన భూములపై పీవోటీ చట్టాన్ని సవరించడం ద్వారా అసైనీలకు సర్వహక్కులు కల్పించాలనే ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. అయితే అసైన్డ్ భూములు అన్యాక్రాంతమయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో జిల్లాల వారీగా ఎన్ని ఎకరాల అసైన్డ్ భూములున్నాయి? అందులో ఎన్ని అసైనీల చేతిలో ఉన్నాయి? ఎన్ని థర్డ్ పార్టీల చేతుల్లో ఉన్నాయి? ఎన్ని ఎకరాల్లో వెంచర్లు వేసి అక్రమంగా అమ్మకాలు జరిగాయి? థర్డ్ పార్టీల సామాజిక, ఆర్థిక స్థితిగతులేంటి ? అనే వివరాలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. ఈ వివరాల ఆధారంగా అసైన్డ్ భూముల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కూడా కొంత కసరత్తు జరిపింది. అయితే ఈ హక్కుల కల్పనకు గాను పీవోటీ చట్టాన్ని సవరించాల్సి ఉండడంతో త్వరలో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో సవరణ బిల్లు సభ ముందుకు తెస్తారా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదని రెవెన్యూ వర్గాలు చెపుతున్నాయి. ఒకవేళ ఈసారి వాయిదా పడితే వర్షాకాల సమావేశాల్లో మాత్రం ఖచ్చితంగా సభ ముందుకు బిల్లు వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వెంచర్లకు మార్గదర్శకాలు సిద్ధం మరోవైపు అనువుగా ఉన్న చోట్ల అసైన్డ్ భూముల్లో ప్రభుత్వమే వెంచర్లు వేసేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటు చేసిన పట్టణాభివృద్ధి సంస్థల్లో అసైన్డ్ భూముల్లో వెంచర్లు వేసేందుకు మార్గదర్శకాలు కూడా సిద్ధమయ్యాయి. ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా పట్టాదారు రైతులు ఎకరం భూమి ఇస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మౌలిక సదుపాయాల కోసం మినహాయించగా మిగిలే 2,800 గజాల్లో సగం భూమిపై రైతుకు యాజమాన్య హక్కు ఇవ్వాలని, లావుణి భూములయితే 600 గజాలపై హక్కు ఇవ్వాలని, అదే అసైన్డ్ భూమి అయితే సదరు అసైనీకి 25 శాతం (700 గజాలు) హక్కులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే పద్ధతిని హైదరాబాద్ శివార్లలోని కొన్ని గ్రామాల్లో ఉన్న అసైన్డ్ భూముల విషయంలో అవలంబించాలన్న ప్రతిపాదన కూడా పెండింగ్‌లో ఉంది. అయితే ఈ భూముల విషయంలో హక్కు ఇవ్వడం కన్నా పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకుని ఆ తర్వాత వాటిని అమ్మాలనే ప్రతిపాదనల వైపే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే అసైన్డ్ భూములకు పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ కూడా కొలిక్కి! పనిలో పనిగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్)ను కూడా ఓ కొలిక్కి తేవాలనే దిశలో ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ స్కీం కింద పెద్ద ఎత్తున దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటే పెద్ద ఎత్తున ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, హెచ్ఎండీఏ పరిధిలోని అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తే చాలా వరకు భూ సమస్యలు తీరిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్పై కూడా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తుందని అంటున్నారు. నోటరీ స్థలాలకు ఒకసారి రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనే చెప్పిన నేపథ్యంలో దీనిపై కూడా త్వరలోనే ప్రకటన వస్తుందనే అభిప్రాయాన్ని రెవెన్యూ వర్గాలు వ్యక్తం చేశాయి. -
మిడిల్ క్లాస్‌కు గుడ్ న్యూస్, సంక్రాంతికి జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లు
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లోని మధ్య తరగతి ఆదాయ వర్గాల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్షిప్(ఎంఐజీ) లేఅవుట్ల పనులు ప్రారంభమయ్యాయి. మార్కెట్ ధర కంటే తక్కువకు ప్లాట్లను అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ అధికారులు లే అవుట్లను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలోని ధర్మవరం, ప్రకాశం జిల్లాలోని కందుకూరు, వైఎస్సార్ కడప జిల్లాలోని రాయచోటి, నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణాల్లో లే అవుట్లను వేసి, డిమాండ్‌కు అనుగుణంగా 150, 200, 240 చదరపు గజాల్లో అన్ని వసతులతో ప్లాట్లను సిద్ధం చేశారు. వీటితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కర్నూలు, గుంటూరు, ఏలూరు అర్బన్ అథారిటీ పరిధిలో మరికొన్ని లే అవుట్లను సిద్ధం చేస్తున్నారు. ఇవి వివిధ దశల్లో ఉన్నట్టు ఎంఐజీ ప్రాజెక్టు ఎండీ పి.బసంత్ కుమార్ సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. తొలివిడతలో వీటన్నింటినీ సిద్ధం చేసి..సంక్రాంతి నాటికి ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. అంతకు ముందే ప్లాట్ల బుకింగ్‌కు అనుగుణంగా ఆన్లైన్ పోర్టల్‌ను కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అర్బన్ అథారిటీ పరిధిలో.. ► జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రాజెక్టులకు సంబంధించి సాధ్యమైనంత వరకు ప్రభుత్వ భూముల్లోనే లే అవుట్లు వేస్తున్నారు. అందుకోసం ఆయా జిల్లాల్లోని అర్బన్ అథారిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను తీసుకుంటున్నారు. ►ఒక లే అవుట్ వేసేందుకు ఒకేచోట 50 లేదా అంతకంటే ఎక్కువ ఎకరాల భూమి ఉన్నచోట ప్లాట్లు వేసేందుకు అనువుగా ఉంటుందన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ధర్మవరం, కందుకూరు, రాయచోటి, కావలిలో వేగంగా ప్లాట్లు సిద్ధమయ్యాయి. ►ప్రభుత్వ భూములు అందుబాటులో లేనిచోట ప్రభుత్వ పరిశ్రమలకు చెందిన భూములను తీసుకుని, అందుకయ్యే వ్యయాన్ని ఆయా పరిశ్రమలకు చెల్లించనున్నారు. అవసరమైన చోట ప్రైవేటు భూములను సైతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం జీఓ నంబర్ 76 నిబంధనలకు లోబడి తీసుకుంటారు. వాటికి ఒప్పందం కుదిరిన వెంటనే నగదు చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. వచ్చే నెలాఖరుకు మరికొన్ని ప్రాంతాల్లో.. ►మధ్యాదాయ వర్గాలకు ఉద్దేశించిన ప్లాట్లకు ప్రజల్లో బాగా డిమాండ్ ఉండడంతో ప్రాజెక్టులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని అధికారులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సమీపంలో 150 ఎకరాలు, విజయనగరం జిల్లా డెంకాడ, బొండపల్లి వద్ద 40 ఎకరాలు, విశాఖ జిల్లా పాలవలస వద్ద 93 ఎకరాలు, జీఎస్ అగ్రహారం, రామవరంలో 269 ఎకరాల్లో జనవరి చివరి నాటికి ప్లాట్లు సిద్ధం కానున్నాయి. ►కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, ఏలూరు సమీపంలో అధికారులు భూములను పరిశీలించి అంచనాలు రూపొందించారు. కాగా, ఇప్పటికే సేకరించిన భూముల్లో జనవరి చివరి నాటికి రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ అనుమతితో ప్లాట్లు సిద్ధం చేయనున్నారు. ► సేకరించిన భూముల్లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 50% భూమిని అన్ని రకాల మౌలిక వసతులకు కేటాయించి, మిగిలిన స్థలంలో మాత్రమే ప్లాట్లు వేస్తున్నారు. ఈ ప్లాట్లు వేయడానికి అయిన ఖర్చు మేరకే ప్రజలకు అందించనున్నారు. -
హెచ్ఎండీఏ ‘భూమ్’దాం! రైతుల భాగస్వామ్యంతో భారీ లేఅవుట్లు
సాక్షి, సిటీబ్యూరో: స్థిరాస్తి రంగంలో మరింత దూకుడు ప్రదర్శించాలని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నిర్ణయించింది. కోకా పేట భూ వేలంతో ఊపు మీద ఉన్న హెచ్ఎండీఏ..ఉప్పల్ భగాయత్ తరహాలో మరిన్ని ప్రయోగాలు చేయాలని భావిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ భూముల అభివృద్ధి, లేఅవుట్ల ఏర్పాటు, ప్లాట్ల విక్రయాలకు పరిమితమైన ఆ సంస్థ..ఇకపై రైతుల భాగస్వామ్యంతో లేఅవుట్లను అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తోంది. ఉప్పల్ భగాయత్ ప్రయోగంతో ఊపు.. ► ఉప్పల్ భగాయత్‌లో ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసిన లేఅవుట్ కాసుల వర్షం కురిపించడంతో ఈ విధానాన్ని మరింత విస్తరించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ► ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు, కొత్తూరు మండలం ఇన్మూల్ నర్వా గ్రామాలను ఎంపిక చేసిన యంత్రాంగం.. ఇక్కడ రైతుల నుంచి సేకరించిన భూములను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ► వారం, పది రోజుల్లో ఈ ప్రాజెక్టులకు కార్యరూపం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. నగరం నలువైపులా.. ఉప్పల్ భగాయత్ తరహాలో నగరానికి నలువైపులా మినీటౌన్షిప్లను ఏర్పాటు చేసేందుకు గతేడాదే ఈ ప్రక్రియను చేపట్టారు. చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం, కీసర మండలంలోని బోగారం, కందుకూరు మండలంలోని లేమూరు, కొత్తూరు మండలంలోని ఇన్మూల్ నర్వా గ్రామాలను ఎంపిక చేశారు. హెచ్ఎండీఏ అధికారులు ఈ గ్రామాల్లో పలుమార్లు పర్యటించి భూములను పరిశీలించారు. భూముల అప్పగింతకు ముందుకు వచ్చిన రైతులతో ఒప్పందాలు చేసుకున్నారు. కానీ అప్పట్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం వల్ల ప్రాజెక్టు ముందుకు సాగలేదు. దండు మల్కాపురంలో సుమారు 300 ఎకరాలు, బోగారంలో 110 ఎకరాలు రైతుల నుంచి సేకరించి అభివృద్ధి చేసేందుకు రైతులతో డెవలప్మెంట్ అగ్రిమెంట్ కూడా పూర్తి చేసుకున్నారు. కానీ కొంతమంది రైతుల భూముల్లో వేరే వ్యక్తులు పొజీషన్లో ఉండడంతో దండుమల్కాపురం, బోగారంలలో భూసేకరణ ఆగిపోయింది. లేమూరు, ఇన్మూల్లలో ఎలాంటి వివాదాలు లేకపోవడంతో రైతులతో అభివృద్ధి ఒప్పందం కూడా పూర్తయింది. లే అవుట్ ముసాయిదా కూడా పూర్తయిందని హెచ్ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. రైతులకు 60 శాతం వాటా... ► ల్యాండ్‌పూలింగ్ పథకం కింద అభివృద్ధిచేసే భూ ముల్లో 60 శాతం వాటా రైతులకు చెందనుంది. ► గతంలో 50 శాతం ఉండగా, దీనిని ప్రస్తుతం 60 శాతానికి పెంచారు. తమ వాటా స్థలాలను రైతులు అమ్ముకోవచ్చు. లేదా లీజుకు ఇచ్చుకోవచ్చు. ► ఈ భూముల అభివృద్ధికి అయ్యే నాలా చార్జీలను, రిజిస్ట్రేషన్ ఫీజులు, భూ వినియోగ మార్పిడి ఫీజులను హెచ్ఎండీఏనే భరించనుంది. ► ఈ పథకం కింద భూములిచ్చే రైతులకు పూర్తి స్థాయి భద్రత లభిస్తుంది. జోన్ల నిబంధనలు పాటిస్తూ తమ వాటాలను నివాసిత, వాణిజ్య ప్లాట్లుగా విక్రయించుకోవచ్చు. ఐటీ కార్యాలయాలకు విక్రయించవచ్చు. లేదా లీజుకు ఇవ్వొచ్చు. ► హెచ్ఎండీఏ లే అవుట్ డ్రాఫ్ట్ అప్రూవల్ అయిన నాటి నుంచి మూడు నెలల్లోపు భూ యజమానులకు ప్లాట్లు కేటాయిస్తారు. చదవండి : Naresh Tumda: రోజుకూలీగా మారిన క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్ -
లే అవుట్ల వద్దకే ఇసుక, సిమెంట్, స్టీలు
కర్నూలు(సెంట్రల్): వైఎస్సార్–జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు లే అవుట్ల వద్దకే ఇసుక, సిమెంట్, స్టీలు తెప్పించి లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. ప్రతి 20 ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకు ఓ మండల స్థాయి అధికారిని నియమించామన్నారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, శాసనమండలి విప్ గంగుల ప్రభాకరరెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలసి ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆగస్టు మొదటి వారం నుంచి నియోజకవర్గాలవారీగా పర్యటించి.. వైఎస్సార్–జగనన్న కాలనీల్లో జరుగుతున్న పనులను పరిశీలిస్తామని తెలిపారు. రూ.32 వేల కోట్లతో డ్రెయినేజీలు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీలు, నీళ్లు, కరెంటు, రోడ్లతో పాటు ఉపాధి కల్పన యూనిట్లు స్థాపించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. మంచినీరు, విద్యుత్ సదుపాయాలను కల్పించేందుకు ఇప్పటికే రూ.1,200 కోట్లు విడుదల చేశామన్నారు. లక్షలాది మంది అక్కచెల్లెమ్మల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నిర్మాణాæత్మకమైన సలహాలు ఎవరు ఇచ్చినా తీసుకుంటామని మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. -
8 ప్లాట్ల విక్రయం.. రూ.2500 కోట్లు వస్తుందని అంచనా
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మరో భారీ భూ వేలానికి సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో సువిశాల రోడ్లతో అభివృద్ధి చేసిన నియోపొలిస్ లేఅవుట్లోని ప్లాట్లతో పాటు గోల్డెన్ మైల్ లే అవుట్‌లోని ప్లాటును ఆన్లైన్ వేలం ద్వారా విక్రయిస్తోంది. ఎకరానికి కనీస ధర రూ.25 కోట్లుగా హెచ్ఎండీఏ నిర్ణయించినా.. అందుకు రెట్టింపు ధర రావడం ఖాయమని ఆ సంస్థ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ లెక్కన రూ.2,500 కోట్ల వరకు వస్తాయని అంచనా వేస్తోంది. 8 ప్లాట్ల విక్రయం రూ.2500 కోట్లు వస్తుందని హెచ్ఎండీఏ అంచనా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు... ప్లాట్ నంబర్లు: నియోపోలిస్ లేఅవుట్ ప్లాట్లు 1,2,3,12 మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు... ప్లాట్ నంబర్లు: నియోపోలిస్ లేఅవుట్ ప్లాట్లు 4, 13, ప్లాట్ ఏ, గోల్డెన్ మైల్ లేఅవుట్ ప్లాట్ నంబర్ 2/పీ/వెస్ట్ పార్ట్ -
ఎల్ఆర్ఎస్ పిడుగు!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్).. రాష్ట్రంలో లక్షలాది మందిని ఇరకాటంలో పడేసింది. లే–అవుట్లు లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన పాపానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకునే పరిస్థితి దాపురించింది. గ్రామాలు, పట్టణాల్లో లే–అవుట్లు లేని ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. నూతన విధానంతో ప్లాట్లు క్రమబద్ధీకరణ ఫీజు అధికంగా ఉండటంతో ఆ మేరకు వెచ్చించడం పేదలకు భారంగా మారింది. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేరుతో మళ్లీ రూ. వేలల్లో చెల్లించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14,569 లే–అవుట్లు ఉండగా.. వాటిలో 3,568కు మాత్రమే నిబంధనల ప్రకారం అనుమతులు ఉన్నాయి. 11,001 లే–అవుట్లకు ఎలాంటి అనుమతులు లేవు. అనధికార లే–అవుట్లు అని తెలియక చాలామంది భవిష్యత్తు, ఇతర అవసరాల దృష్ట్యా ప్లాట్లు కొనుగోలు చేశారు. వీటిలో రెండు, మూడుసార్లు చేతులు మారి రిజిస్ట్రేషన్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే అనధికార లే–అవుట్లలో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా ఉండి ఉంటే తాము జాగ్రత్త పడి ఉండేవారమని బాధితులు చెబుతున్నారు. ఇదిలాఉండగా అక్రమ లే–æఅవుట్లలో ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయడాన్నీ వారు తప్పుబడుతున్నారు. అక్రమ లే–అవుట్లను గుర్తించి వాటిలో ప్లాట్ల క్రయవిక్రయాలు నిషేధించడం, బోర్డులు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తే ఎదురయ్యే ఇబ్బందులపై అవగాహన కల్పించాల్సిన అధికారులు గతంలో ఇవేమీ పట్టించుకోకపోవడంతోనే తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘రియల్’వ్యాపారులకు వరం అక్రమ ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ చాలామంది సామాన్యులపై భారం మోపుతుండగా, కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం వరంగా మారింది. రియల్టర్లు ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లు చేసి అమాయకులకు అంటగట్టారు. తాజాగా ఎల్ఆర్ఎస్ అమలుతో ఆ ప్లాట్లు కొనుగోలు చేసిన పేదలపై చార్జీల భారం పడింది. ఇదిలాఉండగా జిల్లా టౌన్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) అనుమతి లేకుండానే నాలా కన్వర్షన్ చేయకుండా, సరైన రోడ్లు, కనీస వసతులు లేకుండా ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లకు ఎల్ఆర్ఎస్ వరంగా మారింది. ఎల్ఆర్ఎస్ చార్జీ చెల్లించడం ద్వారా అక్రమ లే–అవుట్లు సక్రమంగా మార్చుకునే వీలు కలుగుతుంది. ప్రస్తుతం ప్లాట్లు విక్రయిస్తున్న రియల్టర్లు ఈ ప్లాట్లు విక్రయించేటప్పుడు ఎల్ఆర్ఎస్ సైతం కలుపుకొని ధరలు పెంచి చెబుతున్నారు. ఫలితంగా భవిష్యత్‌లో ప్లాట్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లాల వారీగా ఇలా.. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 3,416 లే–అవుట్లు ఉండగా వాటిలో 1,609కి మాత్రమే ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 1,014 లే–అవుట్లు ఉండగా 296, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,480 లే–అవుట్లకు గాను 489, నిజామాబాద్ జిల్లాలో 952 లే–అవుట్లకు 176, మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో 825కు 223, నాగర్‌కర్నూల్ జిల్లాలో 676 లే–అవుట్లు ఉంటే 72కు మాత్రమే అనుమతులు ఉన్నాయి. కాగా పెద్దపల్లి జిల్లాలో 58, జగిత్యాలలో 170 లే–అవుట్లు ఉంటే వాటిలో ఒక్క దానికి అనుమతి లేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బుజగౌని రాఘవేందర్‌గౌడ్. మూడేళ్ల క్రితం మహబూబ్‌నగర్ రూరల్ మండలం బొక్కలోనిపల్లిలో సర్వే నం.375/ఆ లో 150 గజాల ప్లాటు కొనుగోలు చేశాడు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాడు. ఆ ప్లాట్లు అక్రమమని, ఎల్ఆర్ఎస్ చెల్లించాలని మున్సిపల్ అధికారులు చెప్పడంతో ఆందోళనలో పడ్డాడు. అయితే.. అప్పుడే అక్రమమని చెప్పి రిజిస్ట్రేషన్ ఆపితే కొనేవాళ్లమే కాదని, ఇప్పుడు ఈ తిప్పలు తప్పేవంటున్నాడు. ఇతనొక్కడే కాదు రాష్ట్రంలో అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారందరిదీ ఇదే ఆవేదన. రాష్ట్రంలో మొత్తం లే–అవుట్లు: 14,569 లే–అవుట్ల పరిధిలో ప్లాట్లు: 16,22,681 ప్లాట్ల విస్తీర్ణం (ఎకరాల్లో): 1,22,338.24 అనుమతులు లేని లే–అవుట్లు: 11,001 వాటి పరిధిలో ప్లాట్లు: 12,14,574 విస్తీర్ణం: 83,452.12 అనుమతులున్న లే–అవుట్లు: 3,568 వాటి పరిధిలో ప్లాట్లు: 4,08,107 విస్తీర్ణం: 38,886.12 -
అప్రోచ్ ‘వంద’ ఉంటేనే లేఅవుట్
సాక్షి, సిటీబ్యూరో: నగర శివారుల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) లేఅవుట్ అనుమతుల మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. ముఖ్యంగా భవిష్యత్‌లో ఎదురయ్యే ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో భాగంగా హెచ్ఎండీఏ లేఅవుట్లకు అనుమతులు మంజూరు కావాలంటే వంద ఫీట్ల అప్రోచ్ రోడ్డు ఉండాలని తాజాగా విడుదల చేసిన జీవోలో స్పష్టం చేసింది. గతంలో 2008, 2013లో విడుదల చేసిన జీవో ప్రకారం లేఅవుట్ అనుమతికి 30 ఫీట్ల రోడ్డు ఉంటే సరిపోతుందనే నియమాలను మార్చింది. ఈ కొత్త నిబంధన ఇప్పటికే అనుమతులు కోసం హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకొని ప్రాసెస్‌లో ఉన్నవాటన్నింటికి వర్తిస్తుందని పేర్కొంది. ఒకవేళ ప్రస్తుత రోడ్డు 100 ఫీట్ల కన్నా తక్కువగా ఉంటే వారి లేఅవుట్ వరకు మిగిలిన రోడ్డును చూపిస్తేనే అనుమతులు ఇస్తామని హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలా రోడ్డు చూపించినా వాటి అభివృద్ధి కోసం అదనపు చార్జీలు చెల్లించాలని స్పష్టం చేశారు. దీంతో హెచ్ఎండీఏకు వచ్చే ఆదాయం మరింత రెట్టింపవుతుందని హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతికూల ప్రభావం: రియల్ ఎస్టేట్ వ్యాపారులు హెచ్ఎండీఏ తాజాగా తీసుకున్న వంద ఫీట్ల నిర్ణయం రియల్ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే కరోనా దెబ్బతో విలవిలలాడుతున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం రోడ్డు ఇంపాక్ట్ ఫీజు కింద అదనపు చార్జీలు వడ్డించడం ఎంతవరకు సమంజసం. గత రెండేళ్ల నుంచి చిన్నచిన్న లోపాలతో అనేక ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటన్నింటికి కొత్త నిబంధనలు వర్తింపచేయడం కరెక్ట్ కాదు. చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇది ఊహించని దెబ్బ. ట్రాఫిక్ నియంత్రణ పేరుతో ఏకంగా రియల్ వ్యాపారాన్ని కుదేలు చేయవద్దు. వంద ఫీట్ల అప్రోచ్ రోడ్డు లేనివారు ఇప్పుడు ఏం చేయాలి’అని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త నిబంధనలు ఇలా.. ♦ ప్రస్తుత రోడ్డు వెడల్పు(ఫీట్లు): అదనంగా చెల్లించాల్సిన నగదు ♦ 80 నుంచి 100లోపు ఉంటే: 50 శాతం డెవలప్మెంట్ చార్జీలు ♦ 60 నుంచి 80 లోపు ఉంటే : 66 శాతం డెవలప్మెంట్ చార్జీలు ♦ 30 నుంచి 60లోపు ఉంటే : 100 శాతం డెవలప్మెంట్ చార్జీలు ► 100 ఫ్లాట్ల కన్నా ఎక్కువగా ఉండి నాన్ హైరైజ్ బిల్డింగ్‌ల అనుమతి కోసం 50 శాతం డెవలప్మెంట్ చార్జీలు చెల్లించాలి. ► ఇప్పటికే డ్రాఫ్ట్ లేఅవుట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వాటికి, కొత్త దరఖాస్తులకు, అలాగే లేఅవుట్ విత్ హౌసింగ్ (ఓపెన్, గేటెడ్)కు కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ► అమోదం పొందిన మాస్టర్ ప్లాన్‌లో 100 ఫీట్లు, అంతకన్నా ఎక్కువగా ఉండి ప్రస్తుత రోడ్డు వెడల్పు ఎంత తక్కువగా ఉన్నా (30 ఫీట్ల వరకు) రోడ్డు ఇంపాక్ట్ ఫీ కింద 50 శాతం డెవలప్మెంట్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ► అయితే ఈ రోడ్డు ఇంపాక్ట్ ఫీజులను ‘స్పెషల్ ఎస్క్రో అకౌంట్’కింద ఉంచి లేఅవుట్లకు రోడ్ల అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ ఉపయోగించనుంది. -
నిర్మాణాల కోసం.. ఇక టీఎస్–బీపాస్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు ఏకగవాక్ష (సింగిల్ విండో) పద్ధతిలో అనుమతులు జారీ చేసేందుకు ఐదేళ్ల కిందట చేపట్టిన కొత్త పారిశ్రామిక విధానం ‘టీఎస్–ఐపాస్’సత్ఫలితాలను సాధించిపెట్టింది. ఈ తరహాలోనే భవనాలు, లేఅవుట్ల నిర్మాణానికి సింగిల్ విండో విధానంలో అనుమతులిచ్చేందుకు రాష్ట్ర పురపాలక శాఖ త్వరలో ‘టీఎస్–బీపాస్’పేరుతో కొత్త పాలసీని తీసుకురాబోతోంది. పురపాలనలో సంస్కరణల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన కొత్త మునిసిపల్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ‘టీఎస్–బీపాస్’విధానానికి రూపకల్పన చేసింది. ఖాళీ స్థలాల్లో లే–అవుట్లు, భవనాల నిర్మాణానికి అనుమతుల కోసం బిల్డర్లు, డెవలపర్లతో పాటు సాధారణ పౌరులు సైతం వివిధ ప్రభుత్వ శాఖల నుంచి పలు రకాల అనుమతులు పొందాల్సిన వస్తోంది. వాటి జారీలో అవినీతి, జాప్యం కారణంగా దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి పరిష్కారంగా ‘టీఎస్–బీపాస్’అనే కొత్త విధానానికి టౌన్,కంట్రీప్లానింగ్ విభాగం అభివృద్ధిపరిచింది. భవనాలు, లేఅవుట్ల నిర్మాణానికి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి తీసుకోవాల్సిన అనుమతులన్నింటినీ ఒకే చోట (సింగిల్ విండో) నుంచి జారీ చేయనున్నారు. భూయజమాని/డెవలపర్ కేవలం స్వీయధ్రువీకరణ పత్రం ఇస్తే టీఎస్–ఐపాస్ తరహాలో 21 రోజుల నిర్దేశిత గడువులోగా సత్వర అనుమతులు జారీ చేయనున్నారు. సాధారణ పౌరులతో పాటు బిల్డర్లు, డెవలపర్లు ఈ కొత్త విధానంతో ప్రయోజనం పొందనున్నారు. త్వరలో ఈ వెబ్‌సైట్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతోంది. ►భవనాలు, లేఅవుట్ల అభివృద్ధి కోసం వచ్చే దరఖాస్తుల పరిశీలన కోసం జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా స్థాయి టీఎస్–బీపాస్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అనుమతులు పొందిన తర్వాత నిర్దేశిత ప్లాన్ప్రకారమే నిర్మాణాలు జరిపారా? లేక ఉల్లంఘనలున్నాయా? అనుమతులు లేకుండా జరిపారా? అన్న అంశాలను ఈ కమిటీ తనిఖీ చేసి చర్యలు తీసుకోనుంది. ►75 చదరపు గజాలలోపు స్థలంలో ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తుదారులు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ►500 చదరపు మీటర్లలోపు ప్లాట్లలో 10 మీటర్లలోపు ఎత్తు వరకు నిర్మించే భవనాలకు స్వీయ ధ్రువీకరణ ఆధారంగా తక్షణ అనుమతులు జారీ చేయనున్నారు. ►నివాసేతర భవనాలు, 10 మీటర్లకు మించిన ఎత్తైన భవనాల నిర్మాణానికి 21 రోజుల నిర్దేశిత గడువులోగా సింగిల్ విండో విధానంలో అన్ని రకాల అనుమతుల జారీ. ►200 చదరపు మీటర్ల వరకు ప్లాట్లలో 7 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే భవనాల నిర్మాణానికి అనుమతుల కోసం తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. ►అనుమతుల అనంతరం జిల్లా స్థాయి కమిటీ దరఖాస్తులను తనిఖీ చేయనుంది. ►దరఖాస్తుదారులు తప్పుడు సమాచారమిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ►అనుమతులను ఉల్లంఘించి నిర్మిస్తే.. ఎలాంటి నోటీసులు లేకుండా తొలగిస్తారు. ►స్వీయధ్రువీకరణ ఆధారంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ. -
బిల్డర్లూ.. పారాహుషార్
సాక్షి, హైదరాబాద్ : భూమి వినియోగంలో హేతుబద్ధత, భవన నిర్మాణాలకు సంబంధించి కొత్త మున్సిపల్ చట్టంలో కఠిన నిబంధనలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా లే అవుట్ల విషయంలో బిల్డర్లు, అధికారులను బాధ్యులను చేసేలా ముసాయిదా మున్సిపల్ చట్టాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. లే అవుట్లు చేశాక ప్లాట్లు, ఫ్లాట్ల రూపంలో అమ్ముకొని సొమ్ము చేసుకొనే బిల్డర్లు ఆయా లే అవుట్లను గాలికి వదిలేస్తే వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేలా నిబంధనలు తయారవుతున్నాయి. లే అవుట్ ఆమోదం పొందిన రెండేళ్లలో కనీస సౌకర్యాలను కల్పించి సంబంధిత ఆధారాలను ఆన్లైన్లో పొందుపరచకుంటే ఆ బిల్డర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతోపాటు భవిష్యత్తులో ఎలాంటి లే అవుట్లు వేయకుండా అనర్హులుగా ప్రకటించేలా కఠిన నిబంధనలతో చట్టాన్ని తయారు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. భవన నిర్మాణాల విషయంలోనూ నిర్మాణదారులు, అధికారులను జవాబుదారీలను చేయడంతోపాటు నిర్మాణదారులకు కొంత వెసులుబాటు కల్పిస్తూ నిబంధనలు రూపొందుతున్నాయి. భవన నిర్మాణానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు సమర్పించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత వారం రోజుల్లోగా అనుమతి ఇచ్చేదీ లేనిది తేల్చేయాలనే నిబంధనను పొందుపరచనున్నారు. ఒకవేళ దరఖాస్తును తిరస్కరించాలనుకుంటే ఎందుకు తిరస్కరిస్తున్నామో కారణాలను వివరిస్తూ అధికారులు లిఖితపూర్వకంగా దరఖాస్తుదారునికి తెలియజేయాలని లేదంటే అనుమతి ఇచ్చినట్లే భావించాల్సి ఉంటుందని చట్టంలో పేర్కొననున్నారు. అదేవిధంగా గతంలో ఉన్న నిబంధనలకు కొంత మార్పు చేసి 200 చదరపు మీటర్లలోపు స్థలంలో భవనం నిర్మించాలనుకుంటే గతంలోలాగా అనుమతులు అవసరం లేదని, సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుందని, దరఖాస్తుదారుల స్వయం పూచీకత్తుతో భవనాలు నిర్మించుకునే వెసులుబాటు ఉంటుందని కొత్త చట్టంలో పేర్కొంటున్నారు. భూమి వినియోగంలో హేతుబద్ధత, భవన నిర్మాణాల విషయంలో ముసాయిదా చట్టంలో పేర్కొంటున్న ముఖ్యాంశాలివే... 1. లే అవుట్లకు సంబంధించి... చట్టంలో పేర్కొన్న విధంగా లే అవుట్ల అనుమతి కోసం సదరు లే అవుట్లో కల్పించనున్న మౌలిక సదుపాయాలను వివరిస్తూ ఆన్లైన్లో లేదా లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లేఅవుట్‌ను అనుమతిస్తే అందుకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరుస్తూ లే అవుట్ వివరాలను ఆన్లైన్లో అధికారులు ఉంచాలి. లే అవుట్ అనుమతులను నిర్దేశిత సమయంలో ఇవ్వలేకపోయిన పక్షంలో బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. అనుమతి పొందిన లే అవుట్లలో రెండేళ్లలో డెవలపర్ లేదా బిల్డర్ కనీస సౌకర్యాలు కల్పించి ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది. లేదంటే సదరు డెవలపర్ లేదా బిల్డర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు. భవిష్యత్తులో రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి లే అవుట్లు చేపట్టకుండా అనర్హులుగా ప్రకటిస్తారు. లే అవుట్లో పార్కులు, గ్రీన్‌బెల్ట్, ఆట స్థలాల కోసం కేటాయించిన ఖాళీ స్థలాలను ఉచితంగా మున్సిపాలిటీలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి అధికారులు స్పష్టమైన రికార్డు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం కేటాయించిన ఖాళీ స్థలాల్లో మళ్లీ క్రయవిక్రయ లావాదేవీలు నిర్వహిస్తే జరిమానా విధించడంతోపాటు మూడేళ్ల వరకు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. 2. వన నిర్మాణాలకు సంబంధించి... కమిషనర్ లేదా వైస్ చైర్పర్సన్ అనుమతి లేకుండా భవన నిర్మాణాల కోసం ఎలాంటి భూమిని వినియోగించకూడదు. అప్పటికే ఉన్న భవనాలను ఆధునీకరించకూడదు. 200 చదరపు మీటర్లలోపు స్థలంలో భవన నిర్మాణానికిగాను ఆన్లైన్లో సదరు యజమాని సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. దీంతోపాటు అన్ని డాక్యుమెంట్లు ఆన్లైన్లో సమర్పించిన వెంటనే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అనుమతి నిరాకరిస్తే ఎందుకు నిరాకరించాల్సి వచ్చిందో వారం రోజుల్లోగా సదరు యజమానికి లిఖితపూర్వకంగా తెలియజేయాలి. అలా చేయకుండా సదరు దరఖాస్తుపై వారం రోజుల్లోగా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకపోతే అనుమతి ఇచ్చినట్లే పరిగణించాల్సి ఉంటుంది. అందుకు బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటారు. 200 చదరపు మీటర్లలోపు స్థలాల్లో భవన నిర్మాణానికి ఇచ్చే సెల్ఫ్ డిక్లరేషన్‌కు సదరు యజమాని బాధ్యత వహించాల్సి ఉంటుంది. తప్పుడు డిక్లరేషన్ ఇస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అవసరం ఉండదు. భవన నిర్మాణానికి అనుమతి వచ్చిన 18 నెలల్లోగా నిర్మాణ పనులు ప్రారంభించి మూడేళ్లలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. భవన నిర్మాణం పూర్తయ్యాక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తారు. ఒకవేళ నిర్ణీత సమయంలో నిర్మాణం పూర్తి చేయకపోతే ఆ భవనానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా నిర్మించే భవనాల్లోని ఖాళీ స్థలాల్లో ప్రభుత్వం నిర్ణయించిన సంఖ్యలో చెట్లు నాటాలి. అన్ని భవనాల్లో పార్కింగ్ స్థలాలను ఉంచాలి. అక్కడ ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ సదుపాయం కల్పించాలి. భవన నిర్మాణ సమయంలో ఎవరైనా మరణిస్తే నిర్మాణాన్ని నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. -
నైసర్గిక స్వరూపాన్ని తెలిపే ఐసీఈశాట్2
వాషింగ్టన్: ధ్రువాల్లో మంచు దుప్పటి ఎంత మేరకు ఉంది? సముద్ర నీటిమట్టమెంత? కార్చిచ్చు ఎక్కడి దాకా వ్యాపించింది? వరద ప్రవాహాల ఎత్తెంత? అడవుల విస్తీర్ణ శాతం ఎంత మేరకు తగ్గింది? పట్టణ విస్తీర్ణం, రిజర్వాయర్లలో నీటిమట్టం ఎంత? ఇలాంటి నైసర్గిక ప్రశ్నలకు సమాధానాలివ్వడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సిద్ధమవుతోంది. భూమి నైసర్గికస్వరూపాన్ని కచ్చిత కొలతలతో చెప్పేందుకు ఐస్, క్లౌడ్ అండ్ ల్యాండ్ ఎలివేషన్ శాటిలైట్ (ఐసీఈశాట్–2)ను తయారుచేసింది. దీన్ని సెప్టెంబర్ 12న కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. శాటిలైట్‌లో నూతన సాంకేతికతతో టోపోగ్రాఫిక్ లేజర్ అల్టిమీటర్ సిస్టమ్ (ఏటీఎల్ఏఎస్)ను అమర్చారు. ఏటీఎల్ఏఎస్ అనుక్షణం మండుతూ వేల కోట్ల పోటాన్లను భూగోళంపై పడేలా చేస్తుంది. అవి పరావర్తనం చెంది ఆయా చోట్లలోని పర్వతం, మంచు, ఇలా ప్రతీదాని స్వరూప, స్వభావాలను తెలుపుతుంది. ఉదాహరణకు, పర్వతాన్ని తాకి పరావర్తనం చెందిన పోటాన్ల సాయంతో పర్వతం కచ్చితమైన ఎత్తు తెలుస్తుంది. -
శివారుల్లో కొత్త కాలనీలు, లేఅవుట్లు
సాక్షి, హైదరాబాద్: నగర శివారుల్లో అభివృద్ధితో కూడిన కాలనీలు, లేఅవుట్లు చేసేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సమాయత్తమైంది. దీనిలో భాగంగా భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) కోసం హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయా ప్రాంతాల్లో 50 ఎకరాలకు తగ్గకుండా భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న రైతులు నెల రోజుల్లోగా తార్నాకలోని హెచ్ఎండీఏ కార్యాలయం లోని భూసమీకరణ విభాగంలో సంప్రదించి.. తమ భూమి వివరాలతో కూడిన దరఖాస్తును అందించా లని పేర్కొన్నారు. ‘భూ యాజమాన్యపు హక్కు పట్టా ఉండాలి. కోర్టు కేసుల్లో ఉన్న భూములు తీసుకోరు. పట్టణాభివృద్ధి విభాగం తేదీ 1996 మార్చి 8 ప్రకారం ప్రతిపాదిత భూమి మాస్టర్ ప్లాన్ ప్రకారం బఫర్‌జోన్, చెరువు, ఫుల్ ట్యాంక్ లెవల్, ఓపెన్ స్పేస్, జీవో ఎం ఎస్ నం.111లో ఉండకూడదు. మెట్రోపాలిటన్ అభివృద్ధి ప్రణాళిక–2031 నియమనిబంధనల ప్రకారం శివారు ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం’అని స్పష్టం చేశారు. సగం ప్లాట్లు రైతులకు..: భూ సమీకరణకు అంగీకరించిన రైతులతో అభివృద్ధి ఒప్పందం–జీపీఏ కుదుర్చుకుంటారు. ఇది ఆమోదం పొందిన 6 నెలల్లోగా రోడ్లు, పాఠశాలలు, పార్కులు, పచ్చదనం, రవాణా సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేసిన ప్లాట్లలో సగం సంబంధిత యజమానికి అప్పగిస్తారు. మిగతా సగం ప్లాట్లను హెచ్ఎండీఏ తన వద్దే ఉంచుకుంటుంది. రోడ్డుకు ఆనుకుని ఉన్న భూముల యజమానులకు అక్కడే స్థలాన్ని ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తారు. మిగతా భూములను లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. ప్లాట్లు కేటాయించిన 6 నెలల్లోగా అక్కడ మౌలిక సదుపాయాల నిర్వహణ బాధ్యతను యజమానుల సంఘానికి అప్పగించేలా పథకంలో నిబంధనలు పొందుపరిచారు. మూడేళ్లలోగా మౌలిక సదుపాయాలను కల్పించకపోతే ప్రతి నెలా భూమి మూల విలు వ(బేసిక్ వాల్యూ)పై 0.5% పరిహారాన్ని చెల్లిస్తారు. -
బీపీఎస్‌కు స్పందన కరువు
మార్కాపురం టౌన్: జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అనుమతిలేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణ గడువు ముగిసిపోయింది. జిల్లాలో ఇంకా చాలా మంది క్రమబద్ధీకరించుకునేందుకు ముందుకు రాలేదు. జిల్లాలో 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉన్నాయి. మున్సిపాలిటీల్లో జీప్లస్ వన్ భవనాన్ని నిర్మించుకునేందుకు అనుమతి ఇస్తారు. జీ ప్లస్ 2 భవనాన్ని నిర్మించుకోవాలంటే రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా మున్సిపాలిటీకి సదరు భవనాన్ని మార్టిగేజ్ చేయాలి. 300 స్క్వేర్ మీటర్ల నుంచి వెయ్యి స్క్వేర్ మీటర్ల వరకు నిర్మించే భవనానికి గుంటూరు రీజనల్ డెప్యూటీ డైరెక్టర్ నుంచి అనుమతి పొందాలి. వెయ్యి స్క్వేర్ మీటర్లు దాటితే (4 అంతస్తుల పైన) హైదరాబాదులోని మున్సిపల్ డైరెక్టర్ కార్యాలయం నుంచి అనుమతులు పొందాలి. దినదినాభివృద్ధి చెందుతున్న మార్కాపురంతోపాటు జిల్లాలో మున్సిపాలిటీలలో కొన్నేళ్లుగా అపార్ట్మెంట్ నిర్మాణాలు ఊపందుకున్నాయి. దీంతో పాటు మల్టీప్లెక్స్ కాంప్లెక్స్‌లు కూడా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనధికార కట్టడాలకు మున్సిపల్ అధికారులు అపరాధ రుసుం విధిస్తున్నారు. కాగా, పురపాలక సంఘం పరిధిలో 1 జనవరి 1985 నుంచి 2014 డిసెంబర్ 31 వరకు మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మించుకున్న కట్టడాలను క్రమబద్ధీకరించుకోవచ్చని, రాష్ట్ర ప్రభుత్వం పురపాలక శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన సమయం ఏప్రిల్ 30తో ముగిసింది. తదుపరి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం బట్టి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ పథకం ద్వారా 1985 నుంచి 2014లోపు నిర్మించిన కట్టడాలను క్రమబద్ధీకరించుకోవాలని నిబంధన విధించింది. దీంతో జిల్లాలోనే మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలను గుర్తించి అధికారులు సుమారు 7 వేల భవనాల యజమానులకు నోటీసులు జారీ చేశారు. అయితే జిల్లాలో 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో బిల్డింగ్ పీనలైరైజేషన్ పథకంలో భాగంగా 3,346 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 2,215 మంది క్రమబద్ధీకరించుకోగా, 1130 దరఖాస్తులు పరిష్కరించుకోవాల్సి ఉంది. మామూలుగా భవన నిర్మాణదారులు ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తులను మున్సిపల్ అధికారులు డౌన్లోడ్ చేసుకుని డాక్యుమెంట్‌ను పరిశీలించి సదరు బిల్డింగ్ వద్దకు వెళ్లాలి. అక్రమ కట్టడాలను గుర్తించి అపరాధ రుసుం విధించిన అనంతరం ఆ బిల్లును కట్టి బిల్డింగ్‌ను క్రమబద్ధీకరించుకోవాలి. కష్టపడి పదివేలు డిపాజిట్ చెల్లించి ఆన్లైన్ చేయించుకుని వచ్చిన వాటిని డౌన్లోడ్ చేసుకుని పరిశీలించడానికి అనువైన పరికరాలు మున్సిపాలిటీలో లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
రియల్ కాదు.. దగా!
విస్తరిస్తున్న అనధికార లే అవుట్లు మోసపోతున్న కొనుగోలుదారులు భవనాల నిర్మాణానికి అధికారుల అభ్యంతరాలు దష్టిసారించిన వుడా అధికారులు 62 అక్రమ లేఅవుట గుర్తింపు చర్యలు తీసుకోవాలంటూ పంచాయతీ అధికారులకు లేఖ విజయనగరం కంటోన్మెంట్: జీవనసంధ్యలో ఆదుకుంటుందని ఒకరు... పిల్లల భవిష్యత్తుకోసం మరొకరు... ఏదైనా అవసరానికి ఆసరాగా నిలుస్తుందని ఇంకొకరు... ఇలా ప్రతి ఒక్కరూ చిన్నదో... పెద్దదో స్థిరాస్తికోసం వెంపర్లాడుతున్నారు. ఒకేసారి ఇళ్లు కొనుగోలు చేయలేక... ఎప్పటికైనా విలువ పెరుగుతుందన్న ఆశతో స్థలాలపై మోజు చూపిస్తున్నారు. ఇదే అదనుగా రియల్ఎస్టేట్వ్యాపారులు అక్రమ లేవుట్లతో దగా చేస్తున్నారు. నిరుద్యోగులను ఏజెంట్లుగా చేర్చుకుని వారికి కమీషన్ల ఆశచూపి కొనుగోలుదారులపైకి వదులుతున్నారు. మధ్యతరగతి ఉద్యోగులు... చిరువ్యాపారులను వారు ఏదోలా నచ్చజెప్పి బుట్టలోవేసి ఈ రొంపిలోకి లాగుతున్నారు. తీరా కొనుగోలు చేశాక అది అక్రమ లే అవుట్ అని తెలిసి లబోదిబోమంటున్నారు. జిల్లాలో ఇప్పటికే వుడా పరిధిలో 62 అక్రమ లే అవుట్లు గుర్తించి చర్యలకు ఉపక్రమించింది. జిల్లాలో కన్వర్షన్ అనుమతులు లేని... పంచాయతీ తీర్మానాలు పొందని అక్రమ లే అవుట్లు విస్తతంగా వెలుస్తున్నాయి. ఇవేమీ తెలియని అమాయకులు వాటిని కొనుగోలు చేసి తీరా ఇళ్ల నిర్మాణం ప్రారంభించినపుడు అధికారులు అడ్డుకోవడంతో మోసపోయామని తెలుసుకుంటున్నారు. కేవలం పెన్‌తో కొన్ని స్కెచ్‌లు గీసేసి ప్లాట్లను అమ్మేస్తున్నారు. ఇవన్నీ తెలిసిన జిల్లా యంత్రాంగం మాత్రం చేష్టలుడిగి చూస్తోంది. జిల్లా కేంద్రం చుట్టు పక్కల ఉన్న మండలాల్లో ఈ అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగిపోతోంది. వుడా పరిధిలోకి మండలాలనుంచి వచ్చిన ఫిర్యాదులతో రంగంలోకి దిగిన అధికారులు సర్వే చేపట్టి 62 లేఔట్లను గుర్తించారు. అందులోని డ్రెయిన్లు, సర్వే రాళ్లను తొలగించారు. మిగతా చోట్ల కూడా సర్వే జరిపి ఆర్డీఓలు, డీఎల్పీఓలు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీల ద్వారా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఉడా వైస్ చైర్మన్ టి.బాబూరావునాయుడు జిల్లా పంచాయతీ అధికారికి లేఖ రాశారు. దీనిపై చర్యలు తీసుకునేందుకు ప్రస్తుతం పంచాయితీ అధికారులు ఉపక్రమిస్తున్నారు. జిల్లాలో 280.01 ఎకరాల్లో ఉన్న 62 అనధికార లే ఔట్లను గుర్తించామని ఇందులోని ప్లాట్లు అనధికారమైనవనీ లేఖలో పేర్కొన్నారు. విజయనగరం, డెంకాడ, గంట్యాడ మండలాల్లో మాత్రమే ఇన్ని లే అవుట్లు గుర్తించడం విశేషం. అనధికార లే ఔట్లే ఎక్కువ ! జిల్లాలో 1955.06 ఎకరాల్లో అక్రమ లే ఔట్లు ఉన్నట్టు పంచాయతీ అధికారులు గతేడాది డిసెంబర్‌నాటికి గుర్తించారు. అధికారిక లే ఔట్లు మాత్రం 2463 ఎకరాల్లో ఉన్నాయి. మొత్తం 921 పంచాయతీల్లో 276 అక్రమ, 263 సక్రమ లే అవుట్లు ఉన్నట్టు గుర్తించారు. గుర్తించనవి మరో 500కు పైగానే ఉంటాయన్నది ఓ అంచనా! పంచాయతీల్లోని కార్యదర్శులు రియల్టర్లకు అనుగుణంగా వ్యవహరించడంతో పాటు వారి పనులే ఎక్కువగా చేస్తుండటంతో రియల్టర్లకు అడ్డు లేకుండా పోతోంది. గ్రామాల్లోని ప్రజల సమస్యల కన్నా రియల్టర్ల బేరాలతోనే కార్యదర్శులు కాలయాపన చేస్తారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ] నామమాత్రపు ఫీజులతోనే సరి! ల్యాండ్ కన్వర్షన్ యాక్టు 2006 ప్రకారం రెవెన్యూ శాఖకు చెల్లించాల్సిన ఫీజులను రియల్టర్లు ఎగనామం పెడుతున్నారు. పంచాయతీలకు చెందిన సెక్యూరిటీ డిపాజిట్లు, లే ఔట్ ఫీజులను మాత్రం చెల్లించేయడంతో ఆయా సర్పంచ్‌లు, కార్యదర్శులు వీరికి సహకరిస్తున్నారు. మరో పక్క జిల్లా వ్యాప్తంగా ఉన్న లే ఔట్లలో బోర్డులు పెట్టి పెద్ద ప్రచారం చేస్తూ వ్యాపారం చేస్తున్న వ్యాపారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. రిజర్వు స్థలాలను రిజిస్టర్ చేయని వైనం! జిల్లాలో రెండు వేలకు పైగా ఎకరాల్లో రియల్ ఎస్టేట్లున్నాయి. కానీ ఈ ఎస్టేట్లు పంచాయతీకి పది శాతం స్థలాన్ని వివిధ ప్రయోజనాల కోసం రిజిస్టర్ చేయాల్సి ఉంది. ఈ విధంగా జిల్లాలోని పంచాయతీల్లో ఉన్న లే ఔట్లలో సుమారు 200 ఎకరాలకు పైగా రిజిస్టర్ కావాల్సి ఉంది. కానీ ఇప్పటికి కేవలం ఓ 70 ఎకరాలు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. మిగతా వారు మాత్రం రిజిస్టర్ చేయకుండా ఆ స్థలాలనూ అమ్ముకున్న దాఖలాలున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. రోడ్లు కూడా రిజిస్టర్ చేయాలి – ఎస్ సత్యనారాయణ రాజు, డీపీఓ, విజయనగరం జిల్లాలోని పంచాయితీల్లో 2వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నడుస్తున్నాయి. వీరు అనుమతులు పొందడం లేదు. అన్ని అనుమతులు పొందడంతో పాటు పది శాతం స్థలాన్ని ప్రభుత్వానికి రిజిస్టర్‌చేయాలి. వీటితో పాటు రోడ్లు కూడా రిజిస్టర్ చేయాల్సి ఉంది. త్వరలో సమావేశాలు నిర్వహించి అక్రమ లే ఔట్లు అన్నీ క్రమబద్ధీకరించాలని ఆదేశాలు జారీ చేస్తాం. త్వరలోనే దీనిపై చర్యలు తీసుకుంటాం. -
క్రమబద్ధీకరణ జీవో వచ్చేస్తోంది!
► అక్రమ లే అవుట్లు, భవనాల క్రమబద్ధీకరణకు సీఎం ఆమోదం ► ఒకట్రెండు రోజుల్లో ఎల్ఆర్ఎస్ ఉత్తర్వులు ► చట్ట సవరణ తర్వాతే బీపీఎస్.. నెల రోజులు పట్టే అవకాశం ► క్రమబద్ధీకరణకు కటాఫ్ 2015, ఆగస్టు 31 ► స్లమ్స్‌లో క్రమబద్ధీకరణకు చదరపు గజానికి రూ.15 ► గడువు ముగిసిన తర్వాత అక్రమాలపై కఠిన చర్యలు ► కూల్చివేతలతో పాటు యజమానులపై క్రిమినల్ కేసులు ► అనుమతులు లేని కట్టడాలు, లే అవుట్ల రిజిస్ట్రేషన్లకు నో సాక్షి, హైదరాబాద్: అక్రమ కట్టడాలు, లే అవుట్లు ఉన్న వారికి శుభవార్త. వాటి క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చివరిసారిగా రాష్ట్రంలో భవనాల క్రమబద్ధీకరణ పథకం(బీపీఎస్)తో పాటు లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకాన్ని (ఎల్ఆర్ఎస్) ప్రవేశపెట్టాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పంపిన ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ ఆమోదించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందు సంబంధిత ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సంతకాలు చేశారు. న్యాయ శాఖ ఆమోదం తెలిపిన వెంటనే ఎల్ఆర్ఎస్ అమలుకు ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఒకట్రెండు రోజుల్లో ఈ తంతు పూర్తయ్యే అవకాశముంది. బీపీఎస్ అమలుకు ముందు న్యాయపరమైన చిక్కులను తొలగించిన తర్వాతే ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఒకేసారి (వన్ టైమ్ స్కీం) అంటూనే గత ప్రభుత్వాలు పదేపదే అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ పథకాలను ప్రవేశపెట్టడంపై అభ్యంతరం తెలిపిన హైకోర్టు.. 1998లో నాటి ప్రభుత్వం జారీ చేసిన బీపీఎస్ ఉత్తర్వుల (జీవో 419)ను కొట్టేసింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ ద్వారా 2007-08లో మళ్లీ బీపీఎస్‌ను అమలు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా మళ్లీ ఆర్డినెన్స్ ద్వారా ఏపీ మునిసిపాలిటీ చట్టం, జీహెచ్ఎంసీ చట్టం, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టంతో పాటు భవన నిర్మాణ నియమావళి మార్గదర్శకాల (జీవో 168)ను సవరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ ముగిసి బీపీఎస్ ఉత్తర్వులు జారీ అయ్యేందుకు కొంత సమయం పట్టే అవకాశముంది. చివరిసారిగా అమలు చేసిన క్రమబద్ధీకరణ పథకాల గడువు 2013 జూన్ 12తో ముగిసిపోగా, వేల సంఖ్యలో దరఖాస్తులు అపరిష్కృతంగా ఉండిపోయాయి. ఈ దరఖాస్తులను సైతం పరిష్కరించాలని సర్కారు నిర్ణయించింది. పేద, మధ్యతరగతికి వెసులుబాటు అక్రమాల క్రమబద్ధీకరణ కోసం 2015 ఆగస్టు 31ని కటాఫ్ తేదీగా ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ తర్వాత చేపట్టిన కట్టడాలు, లే అవుట్లను క్రమబద్ధీకరించకూడదని నిర్ణయించింది. అవినీతికి తావు లేకుండా ‘టీఎస్-ఐపాస్’ తరహాలో క్రమబద్ధీకరణ దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించి నిర్ణీత గడువులోగా పరిష్కరించనున్నారు. అక్రమ ప్లాట్లు, కట్టడాల మార్కెట్ ధరల ఆధారంగా రుసుం వసూలు చేయనున్నారు. వైశాల్యం ఆధారంగా వాటి మార్కెట్ విలువలో 20 నుంచి 100 శాతం వరకు ఫీజు వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, పేద, మధ్య తరగతి వర్గాలకు ఫీజుల విషయంలో వెసులుబాటు కల్పించనున్నారు. 500 చ.మీ.లోపు ప్లాట్లకు నామమాత్రంగా రుసుములు ఉండనున్నాయి. 5 వేల చ.గజాలు దాటిన అక్రమ లే అవుట్లపై మాత్రం భారీగా వడ్డీంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. మురికివాడల్లో నిర్మించిన ఇళ్లు/కట్టడాలకు చ.గజానికి కేవలం రూ.15 చొప్పున క్రమబద్ధీకరణ ఫీజు వసూలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 100 చ.గజాలలోపు ఉండే కట్టడాలకు సైతం ఇదే ఫీజులను వర్తింపజేసే అవకాశముంది. బీపీఎస్ ద్వారా ఒక్క జీహెచ్ఎంసీలోనే సుమారు రూ. వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనావేస్తోంది. ఇకపై ‘అక్రమం’ క్రైమే! ఇదే చివరిసారి అంటూ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్, బీపీఎస్ పథకాలను ప్రవేశపెట్టబోతోంది. ఈ పథకాల గడువు ముగిసిన తర్వాత అక్రమ కట్టడాలు, లే అవుట్లపై ఉక్కుపాదం మోపనుంది. ఎక్కడికక్కడ కూల్చివేతలతో పాటు తొలిసారిగా యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టనుంది. కేసులు పెట్టేందుకు అనువుగా కొత్త భవన నిర్మాణ నియమావళికి రూపకల్పన చేస్తోంది. ఇది అమలులోకి వస్తే అక్రమ లే అవుట్లు, భవనాలకు రిజిస్ట్రేషన్లు జరపరు. -
అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లకు నో!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అనుమతి లేకుండా వెలసిన లేఅవుట్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సంస్థ పాలకవర్గం నిర్ణయించింది. అక్రమ లేఅవుట్లను నిరోధించడానికి రిజిస్ట్రేషన్ల నిలిపివేతే మార్గమని సమావేశం అభిప్రాయపడింది. భారత రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్-22ఏ కింద అక్రమ లేఅవుట్లను అడ్డుకొనేందుకు వాటిలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదించాలని పాలకవర్గం మూకుమ్మడిగా నిర్ణయించింది. హెచ్ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా ఆధ్వర్యంలో శనివారం తార్నాకలోని కేంద్ర కార్యాలయంలో హెచ్ఎండీఏ 20వ పాలకవర్గ సమావేశం జరిగింది. అనుమతి (అప్రూవల్) ఉన్న లేఅవుట్లలోని ప్లాట్లకే రిజిస్ట్రేషన్ చేయాలనీ... లేదంటే నిలిపివేయాలన్న నిబంధనను పాటించాలని రిజిస్ట్రేషన్ శాఖను ఆదేశించేలా ప్రభుత్వాన్ని కోరాలని పాలకవర్గం అభిప్రాయపడింది. ప్రధానంగా 1,000 చ.మీ. విస్తీర్ణం, 10 మీటర్ల ఎత్తుకు లోబడిన భవనాలకు అదీకూడా... హెచ్ఎండీఏ అనుమతి ఇచ్చిన లేఅవుట్లోని ప్లాట్లకే అనుమతిచ్చే అధికారం గ్రామపంచాయతీలకు ఉంది. అయితే... ఆ నిబంధన లేవీ పాటించకుండా ఇష్టారీతిన అనుమతులిస్తుండటం వల్ల శివారు ప్రాంతాల్లో లెక్కకు మించి అక్రమ నిర్మాణాలు వెలిశాయని, ప్రభుత్వానికి రావలసిన ఆదాయం కూడా రాకుండా పోతోందని సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లకు పాత తేదీలతో అనుమతులిస్తూ ప్రోత్సహిస్తున్నాయని, అందుకే గ్రామ, నగర పంచాయతీలకున్న అధికారాల (డెలిగేషన్ పవర్స్)ను పూర్తిగా రద్దుచేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో మొత్తం 14 అంశాలపై పాలకవర్గం చర్చించి ఆమోదం తెలిపింది. ఉప్పల్ భగత్ రైతులకు వెయ్యి చ.గ. ప్లాట్ ఉప్పల్ భగత్‌లో రైతుల నుంచి సేకరించిన భూమికి పరిహారంగా (జీవో నం.36 ప్రకారం) ఎకరానికి 1,000 చ.గ. ప్లాట్‌ను అభివృద్ధి చేసిన లేఅవుట్లో ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అయితే... ఇక్కడి గడ్డిభూముల్లో మధ్యలో అక్కడక్కడ బిట్స్‌గా మిగిలి ఉన్న 13.30 ఎకరాల భూమిని మొత్తం 61 మంది రైతుల నుంచి హెచ్ఎండీఏ సేకరించి మెగా లేఅవుట్‌ను అభివృద్ధి చేసింది. ఆయా రైతులకు కూడా ప్లాట్లు ఇచ్చేందుకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. బేగంపేటలోని పైగా ప్యాలెస్‌ను హెచ్ఎండీఏకు ఇవ్వాలని, లేనిపక్షంలో కొత్త భవనం నిర్మాణానికి ప్రభుత్వం అనుమతివ్వాలని కోరుతూ సమావేశంలో పెట్టిన అంశానికి కమిటీ ఆమోదం తెలిపింది. అలాగే సమావేశంలో ఐటీ బకాయిలపై లోతుగా చర్చ సాగింది. ట్యాక్స్ కన్సల్టెంట్‌గా ఆర్.సుబ్రహ్మణ్యం అండ్ కంపెనీకి చెందిన ఆర్.సుబ్బారావును, ఐటీ సెల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా ఎస్.లక్ష్మిని ఏడాది పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తూ కమిటీ నిర్ణయం తీసుకొంది. హెచ్ఎండీఏలో రివైజ్డ్ పే స్కేల్స్‌ను, రివైజ్డ్ పెన్షన్స్ అమలు చేసేందుకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. పెన్షన్ ఫండ్ కింద ఎల్ఐసీకి చెల్లించాల్సిన రూ.16 కోట్లకు గాను ఒక వాయిదాలో రూ.4 కోట్లు చెల్లించారు, ఇక మిగిలిన రూ.12 కోట్లు వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు కమిటీ సుముఖత వ్యక్తం చేసింది. సిటీ ఐటీఎస్, హెచ్ఆర్ఎం ప్రాజెక్టులకు ఓకే హెచ్‌జీసీఎల్ ఆధ్వర్యంలో రూ.162కోట్ల వ్యయంతో తలపెట్టిన సిటీ ఐటీఎస్ ప్రాజెక్టుకు, రూ.14.5 లక్షల వ్యయంతో తలపెట్టిన హెచ్ఆర్ఎం ప్రాజెక్టుకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2013-14 యాన్యువల్ అకౌంట్స్‌ను, 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వానికి ప్రతిపాదించిన రూ.304.37 కోట్ల బడ్జెట్‌కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. హుస్సేన్‌సాగర్ పరీవాహక ప్రాంత అభివృద్ధి పథకం కింద ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి, ఇందుకోసం వెచ్చించిన రూ.258 కోట్లు, చేపట్టాల్సిన పనులపై సమావేశంలో చర్చించారు. కిస్మత్పూర్ వద్ద ఈసీ నదిపై రూ.6.58 కోట్ల వ్యయంతో తలపెట్టిన వంతెన నిర్మాణానికి కమిటీ ఆమోద ముద్రవేసింది. హెచ్ఎండీఏ పెండింగ్ కేసుల (2,462 కేసులు) వివరాలను ఎప్పటికప్పుడు అందించేందుకు ప్రత్యేకంగా లీగల్ అడ్వయిజర్‌ను నియమించాలని కమిటీ నిర్ణయించింది. -
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
హెచ్ఎండీఏకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: అనుమతుల్లేని లేఅవుట్లు, అందులో జరుగుతున్న నిర్మాణాలను తక్షణమే నిలుపుదల చేయించాలని హైకోర్టు సోమవారం హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)ను ఆదేశించింది. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారికి తక్షణమే నోటీసులు జారీ చేసి నిర్మాణాల నిలుపుదలకు అన్ని చర్యలను తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆయా లేఅవుట్లలో ఒక్క నిర్మాణం కూడా జరగడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే నిర్మాణాలు జరిగి ఉంటే వాటి విషయంలోనూ చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రంగారెడ్డి జిల్లాలోని నాదర్గుల్ గ్రామంలో అనుమతుల్లేని లేఅవుట్లలో నిర్మాణాలు చేపడుతున్న తేజశ్రీ రియల్ ఎస్టేట్స్, భవానీ రియల్ ఎస్టేట్స్, శ్రీనిధి రియల్ ఎస్టేట్స్, లక్ష్మీ నర్సింహ బిల్డర్స్, రాఘవేంద్ర రియల్ ఎస్టేట్స్, సప్తగిరి రియల్ ఎస్టేట్స్‌లతోపాటు హెచ్ఎండీఏకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాదర్గుల్ గ్రామ పరిధిలో తేజశ్రీ రియల్ ఎస్టేట్స్ తదితరులు హెచ్ఎండీఏ అనుమతుల్లేకుండానే లేఅవుట్లు వేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవట్లేదని ఆరోపిస్తూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్)పై సోమవారం విచారణ సందర్భంగా ధర్మాసనం పిటిషనర్ల వాదనలు విన్నది. తేజశ్రీ రియల్ ఎస్టేట్స్ తదితరులు పెద్ద మొత్తంలో అక్రమ లేఅవుట్లు వేసి నిర్మాణాలు చేస్తున్నారని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చినా ప్రయోజనం లేదని, అందుకే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశామని పిటిషనర్ల తరఫు న్యాయవాది పి. తిరుమలరావు పేర్కొన్నారు. తరువాత హెచ్ఎండీఏ తరఫు న్యాయవాది వై.రామారావు వాదనలు వినిపిస్తూ అక్రమ లేఅవుట్ల విషయం తమకు దృష్టికి వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తాము నాదర్గుల్ గ్రామానికే పరిమితం కాకుండా హెచ్ఎండీఏ పరిధి మొత్తానికీ కలిపి ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసింది. -
ఎకరానికి లక్ష !
సీఆర్డీఏలో మామూళ్లు మామూలే ఉడా అవినీతిమయమంటూ మొదట్లో హడావుడి ఆ తర్వాత అందరూ కలిసి దోపిడీ లేఅవుట్లు, అపార్టుమెంట్లకు యథేచ్ఛగా వసూళ్లు విజయవాడ బ్యూరో : వీజీటీఎం ఉడా స్థానంలో ఆవిర్భవించిన సీఆర్డీఏ మొదట్లో ఉప్పులా కనిపించినా ప్రస్తుతం చప్పగా మారిపోయింది. మామూళ్లు, పైరవీలు ఉడా మాదిరిగానే చాలా మామూలుగా జరిగిపోతున్నాయి. ఉడాలో పనిచేసిన అధికారులు, సిబ్బంది అవినీతిపరులని, ఎవరికీ పని రాదని, అందరినీ మార్చేస్తామని తొలుత సీఆర్డీఏ పగ్గాలు చేపట్టిన ఉన్నతాధికారులు ఘీంకరించారు. దీంతో పాత ఉడా ఉద్యోగులు తమ ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయోనని బెంగపెట్టుకుని కంటి మీద కునుకు లేకుండా గడిపారు. ఆ సమయంలో పాత ఉద్యోగులను సీఆర్డీఏ కార్యాలయంలో దోషులుగా చూసే పరిస్థితి ఉండేది. దీన్ని తట్టుకోలేక కొందరు హెచ్వోడీలు వేరే శాఖల్లోకి వెళ్లిపోయారు. సీన్ కట్ చేస్తే... ప్రస్తుతం అవినీతిలో సీఆర్డీఏ ఉడాను మించిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాత, కొత్త యంత్రాంగం కలిసి అందినకాడికి దోచుకుంటోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు నిబంధనలే, మామూళ్లు మామూలే అన్నట్లుంది అక్కడ పరిస్థితి. అన్నీ నిబంధనలకు అనుగుణంగానే ఉండాలి అయినా ఆమ్యామ్యాలు సమర్పించుకోవాలి. రియల్ వెంచర్లు, అపార్టుమెంట్లకు అనుమతులిచ్చే డెవలప్మెంట్ కంట్రోల్ విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఉన్నతాధికారులంతా రాజధాని వ్యవహారాల హడావుడిలో మునిగితేలుతుంటే ఈ విభాగంలో పనిచేసేవారు చాపకింద నీరులా తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. అన్ని స్థాయిల్లోనూ మామూళ్లు తప్పనిసరి... కిందిస్థాయి నుంచి విభాగాధిపతి వరకూ అన్ని స్థాయిల్లోనూ మామూళ్లు సమర్పించుకుంటే గానీ ఫైలు కదలడం లేదు. లేఅవుట్లకు అనుమతి ఇచ్చేందుకు ఏరియాను బట్టి మామూళ్ల రేట్లను ఫిక్స్ చేశారు. విజయవాడ పరిసరాల్లో ఎక్కడైనా ఎకరం భూమిని లేఅవుట్ చేయించుకోవాలంటే కనీసం లక్ష ఖర్చు పెడితేగానీ పని జరగడంలేదు. సాధారణంగా ఎకరం భూమి లేఅవుట్ కోసం సీఆర్డీఏకు కట్టాల్సిన ఫీజులే రూ.3.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ ఉంటున్నాయి. మామూళ్లతో కలిపి ఈ ఖర్చు రూ.5 లక్షలకు చేరుతోంది. సర్వేయర్ మొదలు పైస్థాయి అధికారులకు ఇచ్చే మొతం లక్షకు మించిపోతోంది. ఇటీవల ఇబ్రహీంపట్నం సమీపంలో నాలుగు ఎకరాల భూమికి లేఅవుట్ మంజూరు చేసేందుకు ఒక రియల్ కంపెనీ నుంచి రూ.4.25 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. అన్నీ సక్రమంగా ఉంటేనే ఈ రేటు. ఏదైనా తేడా ఉంటే ఇక ఆ కంపెనీ ప్రతినిధులను రోజుల తరబడి తమ చుట్టూ తిప్పుకుని సాధారణంగా ఇచ్చే మామూలు కంటే రెట్టింపు వసూలు చేస్తున్నారు. ఫైలు ప్లానింగ్ అధికారి దగ్గర ఉందని, డెరైక్టర్ పెండింగ్‌లో పెట్టారని, కొన్నిసార్లు కమిషనరే ఆపేశారని చెబుతూ డబ్బు గుంజేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కంకిపాడు సమీపంలోని రియల్ కంపెనీ మూడున్నర ఎకరాల లేఅవుట్‌కు రూ.8 లక్షలు సమర్పించుకోవాల్సి వచ్చినట్లు సమాచారం. గాలిలో కలుస్తున్న నిబంధనలు... ఇక అపార్టుమెంట్ల నిర్మాణానికి భారీగా డబ్బు వసూలు చేస్తున్నారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి శివార్లలో నిబంధనలు అతిక్రమించి మరీ ఇష్టానుసారం భవనాలు కట్టేస్తున్నారు. కానూరు నుంచి కంకిపాడు వరకూ, గొల్లపూడి నుంచి ఇబ్రహీంపట్నం వరకూ, ఎనికేపాడు నుంచి గన్నవరం వరకూ అనేక భవనాలు సీఆర్డీఏ నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. వీటిని చూసీచూడకుండా ఉండడం కోసం సీఆర్డీఏ అధికారులకు భారీ ఎత్తున డబ్బులు ముట్టజెబుతున్నారు. ఉన్నతాధికారులకూ ఇందులో భాగం ఉంటోంది. కానీ వాటి గురించి ఎవరైనా వారి వద్ద ప్రస్తావిస్తే అలా జరుగుతోందా, నిజమా.. మాకు తెలియదే! అంటూ నటిస్తున్నారు. దీనివల్ల సీఆర్డీఏ నిబంధనలు గాలిలో కలిసిపోతుండగా, అధికారుల జేబులు మాత్రం నిండుతున్నాయి. పైకి సీఆర్డీఏ ఇంటర్నేషనల్ ఏజెన్సీలా ఉందనే కలరింగ్ ఇస్తున్నా లోపల మాత్రం అంతా మామూళ్ల మయంగా మారిపోయింది. -
ఎకరాకే లేఅవుట్
భూ విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఇకపై లేఅవుట్లకు అనుమతినిచ్చే విషయమై హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) దృష్టి సారించింది. ఇందుకు అనుమతివ్వాలని కోరుతూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో నియమ నిబంధనలు పాటిస్తూనే.. భూ విస్తీర్ణంతో సంబంధం లేకుండా అనుమతులు ఇవ్వడం వల్ల చిన్న రియల్టర్లు కూడా లే అవుట్స్ చేసుకొనే వెసులుబాటు కల్పించవచ్చని భావిస్తోంది. దీనివల్ల హెచ్ఎండీఏకు అనుమతుల రూపంలో వచ్చే ఆదాయం పెరగడమేగాక సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు సొంత ఇంటి కల నెరవేర్చవచ్చునని ప్రతిపాదనల్లో పేర్కొంది. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి ప్రాథమికంగా సానుకూలత వ్యక్తం చేయడంతో ప్రభుత్వ స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. - భూ విస్తీర్ణంతో సంబంధం లేకుండా అనుమతులు - ప్రభుత్వ పరిశీలనలో హెచ్ఎండీఏ ప్రతిపాదన - సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారుల కసరత్తు సాక్షి, హైదరాబాద్ హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం... ఒక ఓపెన్ లేఅవుట్‌ను అభివృద్ధి చేయాలంటే విధిగా 10 ఎకరాలు (4 హెక్టార్ల), ఆపైన భూ విస్తీర్ణం ఉండాలి. ఇందులో పార్కు, రోడ్లు, క్రీడా స్థలం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు (ఎమినిటీస్) 40శాతం భూమిని తప్పనిసరిగా కేటాయించాల్సి ఉంటుంది. దీంతో ప్లాటెడ్ ఏరియా సుమారు 55-60శాతం మాత్రమే ఉంటుంది. లేఅవుట్ నియమ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే హెచ్ఎండీఏ స్వీకరిస్తుంది. ఇందుకుగాను డెవలప్మెంట్ ఛార్జెస్ కింద చ.మీ. రూ.10ల చొప్పున ఎకరాకు సుమారు రూ.4లక్షలు ఫీజు వసూలు చేస్తున్నారు. నిర్ణీత ఫీజును చెల్లించేందుకు రియల్టర్లు ముందుకు వచ్చినా... లేఅవుట్ భూ విస్తీర్ణం 10ఎకరాలకు తక్కువ ఉన్న దరఖాస్తులను తిరస్కరిస్తుండడంతో హెచ్ఎండీఏకు అనుమతుల రూపంలో వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇప్పుడు భూ విస్తీర్ణంతో సంబంధం లేకుండా కొత్త లేఅవుట్లకు అనుమతి ఇవ్వడం ద్వారా ఆర్థిక జవసత్వాలను కూడగట్టుకోవాలని సంస్థ ఆరాటపడుతోంది. అయితే... ఈ ప్రతిపాదనపై ప్రభుత్వ పెద్దలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. సాంకేతికంగా ఇందులో ఎదురయ్యే ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై ఉన్నతస్థాయి అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ప్రయోజనాలివీ.. - చిన్నస్థాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా వెంచర్లు వేసే అవకాశం ఉండడంతో పోటీ పెరగడం వల్ల ధరలు తగ్గి సామాన్య, మధ్యతరగతి వర్గాల బడ్జెట్లో పాట్లు అందుబాటులోకి వస్తాయి. - గ్రామపంచాయతీల్లో అక్రమ లేఅవుట్లకు అడ్డుకట్ట పడుతుంది. రియల్టర్లు హెచ్ఎండీఏ అనుమతి తీసుకోవడంతో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. - హెచ్ఎండీఏ పరిధిలో లేని ప్రాంతాల్లో ప్రస్తుతం డెరైక్టరేట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) ద్వారా 2 ఎకరాల విస్తీర్ణం ఉన్నా లేఅవుట్ అభివృద్ధికి అనుమతిస్తున్నారు. ఈ విధానాన్ని హెచ్ఎండీఏలో అమలు చేయడం వల్ల అక్రమ లేఅవుట్లు తగ్గుతాయి. ఇబ్బందులివీ.. - చిన్నచిన్న లేఅవుట్లలో పార్కులు, ఆట స్థలం, ఇతర మౌలిక సౌకర్యాల కోసం 40శాతం మేర స్థలం కేటాయించడం సాధ్యం కాదు. - చిన్న లేఅవుట్స్‌కు రోడ్ల అనుసంధానం కష్టమవుతుంది. - జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ పరంగా వచ్చే సౌకర్యాలు చిన్న లేఅవుట్‌కు మంజూరు కావు. - చిన్న ప్లాట్లలో పార్కుల ఏర్పాటుకు ఖాళీ స్థలం వదలడం సాధ్యం కాదు. కనుక ఇరుకైన నిర్మాణాలతో గజిబిజిగా మారుతుంది. -
దర్జాగా.. అక్రమాలు
జిల్లా వ్యాప్తంగా ఎడాపెడా కొత్త నిర్మాణాలు!? ఎల్ఆర్ఎస్, బీపీఎస్‌పై అక్రమార్కుల ఆశలు తెరచాటుగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లు కర్నూలు : జిల్లా వ్యాప్తంగా ఎడాపెడా కొత్త నిర్మాణాలు, లేఅవుట్లు తెరపైకి వస్తున్నాయి. అక్రమ లేఅవుట్ల, నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం మరోసారి లేఅవుట్ క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్), బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్(బీపీఎస్)ను తీసుకొచ్చేందుకు సన్నద్ధం కావడంతో గుంపులో గోవింద అంటూ తెరచాటు అక్రమ నిర్మాణాలకు అక్రమార్కులు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అధికారికంగా ఈ పథకాలను ప్రకటించేలోగా ఈ అక్రమ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఆయా వర్గాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల ముందస్తు అనుమతుల్లేకుండా కొత్త నిర్మాణాలు వెలుస్తున్నాయి. కర్నూలు జిల్లా పరిధిలో కొత్తగా నిర్మాణాలు చేపట్టాలన్నా, లేఅవుట్లు వేయాలన్నా స్థానిక సంస్థల అనుమతి తప్పనిసరి. లేదంటే వీటిని అక్రమ నిర్మాణాలుగా పరిగణిస్తారు. వీటిని ఎవరైనా కొనుగోలు చేసినా రిజిస్ట్రేషన్లు జరగవు. బ్యాంకుల నుంచి రుణాలు మంజూరయ్యేది తక్కువ. గతంలో కొందరు వ్యాపారులు చేసిన మోసాలకు కొనుగోలుదారులు ఇబ్బందులకు గురవ్వడాన్ని గుర్తించిన ప్రభుత్వం 2007లో మొదటిసారి బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌ని ప్రవేశపెట్టింది. బీపీఎస్ కింద అప్పట్లో దాదాపు 8 వేలకుపైగా దరఖాస్తులొచ్చాయి. 4,600కుపైగా పరిష్కరించారు. 2013 మార్చి వరకు క్రమబద్ధీకరణ గడువును ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. ఎల్ఆర్ఎస్ కింద వచ్చిన వెయ్యి దరఖాస్తుల్లో అప్పట్లో 50 శాతానికిపైగా పరిష్కారమయ్యాయి. పట్టణ ప్రణాళిక సూచించిన మేరకు తదుపరి సమాచారాన్ని అందించకపోవడంతో దాదాపు 500 దరఖాస్తులు వివిధ దశల్లో అపరిష్కృతంగా మిగిలాయి. మరోసారి బీపీఎస్, ఎల్ఆర్ఎస్ వచ్చే అవకాశం లేదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పదేపదే ప్రకటించడంతో నగరం, గ్రామీణ జిల్లాలోని ముఖ్య ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లు వేసేందుకు వ్యాపారులు సాహసించలేదు. కొనుగోలుదారుల్లోనూ చైతన్యం రావడంతో లేఅవుట్లకు డీటీసీపీ, అపార్ట్మెంట్లకు కర్నూలు కార్పొరేషన్/మున్సిపాలిటీ అనుమతి ఉందా? లేదా? అనేది నిర్ధారించుకున్నాకే రంగంలోకి దిగుతున్నారు. దీంతో రియల్టీ వ్యాపారులు కూడా అచితూచి వ్యవహరిస్తున్నారు. క్రమబద్ధీకరణ లక్ష్యంగా నిర్మాణాలు.. స్థానిక సంస్థలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు ప్రభుత్వం మరోసారి బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌ని ప్రవేశపెట్టాలని నిర్ణయించడంతో ఇదే మంచి తరుణంగా భావించి కొత్తగా అనేక నిర్మాణాలకు, లేఅవుట్లకు వ్యాపార వర్గాలు తెరతీస్తున్నాయి. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో గత నెల రోజుల వ్యవధిలో 50 నుంచి 100 వరకు అక్రమ నిర్మాణాలు జరిగినట్లు అధికారికవర్గాలు గుర్తించాయి. వీటిలో 70 శాతానికిపైగా ఉన్న పాత భవంతులపై అదనపు అంతస్తులు వేసినవే. ప్రణాళిక విభాగ క్షేత్రస్థాయి ఉద్యోగుల సాయంతో మూడో కంటికి తెలియకుండా నిర్మాణాలను పూర్తి చేశారు. వీటిని బీపీఎస్ కింద క్రమబద్ధీకరించుకోవాలన్నది ప్రధాన ఉద్దేశం. ఇప్పటికీ నగర పరిధిలోనూ, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో ప్రణాళిక విభాగ అధికారులతో అదనపు అంతస్తుల నిర్మాణం కోసం వ్యాపారులు సంప్రదింపులు జరుపుతున్నారు. గత నెల రోజుల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా కొత్తగా 50 వరకు లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. కర్నూలు నగర పరిధిలోని శివార్లలోనూ, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ పట్టణ శివార్లలో వీటిని వేసినట్లు నిఘా, అమలు విభాగం తాజాగా గుర్తించినట్లు సమాచారం. వీటిని ప్లాట్ల కింద సాధ్యమైనంత వేగంగా విక్రయించి సొమ్ము చేసుకోవాలన్నది వ్యాపారుల ఉద్దేశం. నిబంధనల ప్రకారం స్థానిక సంస్థల నుంచి అనుమతి తీసుకోవాలంటే వివిధ రుసుముల కింద భారీగా చెల్లించాలి. ప్రభుత్వ భూమి వంటివి ఇందులో కలిసి ఉంటే అధికారులు కొర్రీలు వేస్తారు. ప్రభుత్వం మరోసారి తీసుకొచ్చే ఎల్ఆర్ఎస్తో ఇలాంటి అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలన్నది వ్యాపారుల లక్ష్యం. నియంత్రించాల్సింది అధికారులే... అక్రమ భవనాల, లేఅవుట్ల నియంత్రణ అధికారుల చేతిలోనే ఉంది. త్వరలో బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పథకాలు మళ్లీ ప్రవేశపెడతారనే ఉద్దేశంతో నిర్మాణాలు సాగిస్తున్న, తెరచాటు అక్రమ నిర్మాణాలను అధికారులే నిరోధించాలి. క్షేత్రస్థాయిలో జరిగే వ్యవహారాలపై దృష్టి సారిస్తే వీటిని అడ్డుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. లేనప్పుడు బీపీఎస్, ఎల్ఆర్ఎస్ లాంటి పథకాలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా నిర్మాణాలు చేపట్టి క్రమబద్ధీకరించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా కర్నూలు కార్పొరేషన్, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు వీటిపై దృష్టిసారిస్తే మేలు. -
పంచాయతీ లేఅవుట్లను అనుమతించం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: లేఅవుట్ల అనుమతి అధికారం గ్రామ పంచాయతీలకు లేదు. డీటీసీపీ (డెరైక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) లేదా హెచ్ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటెన్ డెవలప్మెంట్ అథారిటీ) అనుమతి తీసుకున్న తర్వాతే ప్లాట్లు విక్రయించుకునే అధికారం ఉం టుంది. కానీ జిల్లాలో, ముఖ్యంగా నగర శివారు పంచాయతీల పరిధిలో ఏకంగా గ్రామపంచాయతీ కార్యదర్శులు, పాలకమండలి ఆమోదంతో వేల సంఖ్యలో అక్రమ లేఅవుట్లు వెలిశాయి. వీటిలో ప్లాట్ల విక్రయాలు పూర్తైభవన నిర్మాణాలు సైతం పూర్తయ్యాయి. ప్రస్తుతం వీటిపై చర్యలు తీసుకోవడం అంత సులువైన విషయం కాదు. 500 లేఅవుట్లు తొలగింపు... ఇటీవల పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో నగర శివారు గ్రామాల్లో ర్యాండమ్‌గా సర్వే నిర్వహించి దాదాపు ఐదువందలకుపైగా అక్రమ లేఅవుట్లు గుర్తించాం. అలా గుర్తించిన చాలా లేఅవుట్లలో నిర్మాణాలు లేవు. దీంతో వాటిని ట్రాక్టర్లతో చదును చేయించాం. ప్లాట్లుగా గుర్తించే హద్దురాళ్లను తొలగించాం. ఎల్ఆర్ఎస్ ఉంటే అనుమతిస్తున్నాం. లేకుంటే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నాం. గతనెలలో ఇబ్రహీంపట్నం మండలం ఆది బట్ల, బొంగ్లూర్ గ్రామ పంచాయతీల పరిధిలో లేఅవుట్లను తొలగిస్తే వెంటనే సదరు యజమానులు ఎల్ఆర్ఎస్ చేయి ంచుకుని అనుమతి తీసుకున్నారు. ఇలా అన్ని ప్రాంతాలపైనా దృష్టి పెట్టాం. రిజిస్ట్రేషన్లు.. బ్యాంకు రుణం కట్.. అక్రమంగా వెలిసిన లేఅవుట్ల అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇటీవల జిల్లాలో పర్యటించిన విజిలెన్స్ బృందం ప్రభుత్వానికి ప్రత్యేక నివేదిక ఇచ్చింది. హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతిలేని లేఅవుట్లకు సంబంధించి వెంటనే రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ఆ నివేదిక లో పేర్కొంది. దీంతో జిల్లా కలెక్టర్ అనుమతితో పంచాయతీశాఖ ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖ రాస్తున్నాం. దాంతో అ క్రమ లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు నిలి చిపోతాయి. అదేవిధంగా నిర్మాణాలపై రుణా లు ఇవ్వొద్దంటూ బ్యాంకర్లకు సైతం లేఖ రాస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తిచేయడానికి కొంత సమయం పడుతుంది. పన్ను వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్ గ్రామపంచాయతీలకు రాబడి పెంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు త్వరలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నాం. ఆస్తి పన్ను వసుళ్ల ప్రక్రియ మందకొడిగా సాగింది. చాలాచోట్ల నిర్మాణాల అసిస్మెంట్ సరిగా జరగలేదు. దీంతో అసిస్మెంట్ ప్రక్రియను పూర్తిచేస్తున్నాం. గతంలో ఆస్తి పన్ను రూ.89కోట్లు లక్ష్యం కాగా.. మదింపు అనంతరం దాదాపు రూ.150కోట్లకు చేరనుంది. ప్రస్తుతం పింఛన్లు, ఆహార భద్రత పరిశీలపై ఈఓపీఆర్డీలు బిజీగా ఉన్నారు. డిసెంబర్ రెండో వారంలోపు ఈ ప్రక్రి య పూర్తవుతుంది. డిసెంబర్ చివరి వారం నాటికి ఆస్తి పన్నుపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నాం. అదేవిధంగా ట్రేడ్‌లెసైన్స్ వసూళ్లపైనా చర్యలు చేపట్టాం. ఆరోపణలు రుజువైతే చర్యలు.. జిల్లాలో 688 పంచాయతీలకుగాను 676 గ్రామపంచాయతీల్లో పాలకవర్గాలు ఏర్పాటై ఏడాది అవుతోంది. అయితే గత నెలరోజుల నుంచి సర్పంచులపై ప్రజావాణికి ఫిర్యాదులు వస్తున్నాయి. నిధుల వినియోగంలో అక్రమాలు తదితర అంశాలపై ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటివరకు 15మంది సర్పంచులు, ముగ్గురు పంచాయతీ కార్యదర్శులపై ఫిర్యాదులు రావడంతో విచారణకు ఆదేశించాం. విచారణ పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం. -
ఉడా కన్ను
సాక్షి, విజయవాడ : వీజీటీఎం ఉడా పరిధిలో అనధికార లేఅవుట్లు పుట్టగొడుగులుగా విస్తరిస్తున్నాయి. అన్నిప్రాంతాల్లో స్థలాల ధరలకు రెక్కలు రావటంతో పొలాలు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుతున్నాయి. తాజాగా రాష్ట్రవిభజన జరిగిన క్రమంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీగా లేఅవుట్లు వేస్తున్నారు. వాటిలో ఎక్కువ లేఅవుట్లకు ఉడా నుంచి అనుమతులు లేవు. దీంతో ఉడా అనధికార లేఅవుట్లపై దృష్టి నిలిపింది. ముఖ్యంగా గడిచిన ఆరేళ్లలో వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లపై దృష్టిసారించి సమగ్ర వివరాలను తెప్పించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఐదు వేల ఎకరాల్లో... ఉడా పరిధిలో రెండు జిల్లాల్లో సుమారు నాలుగు నుంచి ఐదు వేల ఎకరాల్లో అనధికార లేఅవుట్లు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఉడా పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాలో విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థలతో పాటు తొమ్మిది మున్సిపాలిటీలు ఉన్నాయి. 2012 ముందు వరకు ఉడా పరిధి కేవలం విజయవాడ, గుంటూరు తెనాలి ప్రాంతాలకే పరిమితమై 1945 చదరపు కిలోమీటర్లు మాత్రమే పరిధి ఉండేది. 2012లో అదనంగా రెండు జిల్లాల్లో 8 మున్సిపాలిటీలు ఉడా పరిధిలోకి రావటంతో విస్తీర్ణం 7095 చదరపు కిలోమీటర్లకు పెగింది. దీంతోపాటు ఉడా పరిధిలోకి సుమారు 1600 గ్రామాలు వచ్చాయి. దీంతో ఉడా పరిధి భారీగా పెరిగింది. దానికనుగుణంగా ఉడాలో సిబ్బంది మాత్రం లేకపోవటంతో అనధికార లేఅవుట్లపై చర్యలు పూర్తిస్థాయిలో తీసుకోలేకపోయారు. కేవలం ఫిర్యాదులు వచ్చిన లేఅవుట్లు, ఉడా సిబ్బంది గుర్తించిన వాటిపైనే చర్యలు తీసుకున్నారు. దీంతో అనధికార లేఅవుట్లు వేల ఎకరాల్లోకి చేరాయి. ఈ క్రమంలో ఉడా పరిధి పెరిగిన తర్వాత పంచాయతీల అనుమతులు ఉన్న లేఅవుట్లు మినహా మిగిలిన వాటిపై దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యంగా మంగళగిరి, విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లు ఎక్కువగా ఉన్నాయి. వీటితోపాటు పెరిగిన పరిధి నేపథ్యంలో నూజివీడు, గుడివాడ, సత్తెనపల్లి, పొన్నూరు ప్రాంతాల్లో కూడా అనధికార లేఅవుట్లు ఉన్నట్లు గుర్తించారు. సిద్ధమవుతున్న మాస్టర్ ప్లాన్ మరోవైపు ఉడా మాస్టర్‌ప్లాన్ సిద్ధమవుతోంది. మాస్టర్‌ప్లాన్ అమలులోకి వస్తే అనధికార లేవుట్లకు ప్రారంభ దశలో అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. దీంతో మాస్టర్‌ప్లాన్ వచ్చాక చర్యలు తీసుకుందామని ఉడా భావించినా రాజధాని నేపథ్యంలో ముందే చర్యలకు ఉపక్రమిస్తే సంస్థకు ఆదాయం పెరుగుతుందని భావించారు. దీంతో ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి ఈ దిశగా కసరత్తు సాగిస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది సాయంతో... ఉడాను దశాబ్దాలపాటు సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది. కేవలం 120 రెగ్యులర్ పోస్టులకు గాను ప్రస్తుతం 58 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో ఉడా సిబ్బంది నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటించి అనధికార లేఅవుట్లను గుర్తించిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో రెవెన్యూ సిబ్బంది సాయంతో ప్రస్తుతం అనధికార లేఅవుట్లపై కొంతమేరకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే పూర్తిస్థాయిలో మాత్రం చర్యలు లేకపోవటంతో ఎటువంటి ఫలితం ఉండటం లేదు. గ్రామాల్లో గ్రామకార్యదర్శుల ద్వారా అక్రమాలను గుర్తించి సంబంధిత భూయజమానికి నోటీసుల జారీ, సదరు రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తున్నారు. రెండు నెలల క్రితం రెండు జిల్లాల కలెక్టర్ల సమావేశాన్ని ఉడా నిర్వహించింది. అనధికార లేఅవుట్లను నిరోధించటానికి ఉడాకు రెవెన్యూ యంత్రాంగం సహకరించాలని కోరింది. గ్రామాల్లో నూతనంగా వేసే వెంచర్లను ఆయా గ్రామస్థాయి రెవెన్యూ అధికారులు పరిశీలించి ఉడా అనుమతులు లేనివి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, తద్వారా వారి నుంచి ఉడా సమాచారం తీసుకొని చర్యలు తీసుకోవటానికి వీలుంటుందని దీనికి సహకరించాలని కోరింది. దీనికి రెండు జిల్లాల కలెక్టర్లు అంగీకారం తెలిపారు. దీంతో ఉడా అనధికార లేఅవుట్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. -
239 లే అవుట్లపై చర్యకు నివేదిక
భద్రాచలం, న్యూస్‌లైన్: జిల్లాలో అనుమతుల్లేని లే అవుట్లను కొనుగోలు చేయవద్దని జిల్లా టౌన్‌ప్లానింగ్ అధికారి టీ లక్ష్మణ్‌గౌడ్ అన్నారు. గురువారం భద్రాచలం వచ్చిన ఆయన విలేకరులతో మా ట్లాడారు. పంచాయతీరాజ్ చట్టాల ప్రకారం పదివేలలోపు జనాభా ఉన్న అన్ని గ్రామాల్లో 20సంవత్సరాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లుగా చెప్పారు. ఇప్పటికే ఖమ్మం పట్టణానికి ఆనుకుని ఉన్న పిండిప్రోలు, జీళ్లచెరువు, మంచుకొండ, దెందుకూరు, తనికెళ్ల, శివాయిగూడెం, మద్దులపల్లి గ్రామాలకు మాస్టర్ ప్లాన్ తయారు చేసినట్లుగా చెప్పారు. డీటీసీపీఓ అనుమతిలేని లే అవుట్లపై కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా స్థలంపై యజమాని హక్కు పత్రాలు, ఉన్న స్థలంలో 25 నుంచి 30 శాతం మేర రోడ్లకు కేటాయింపు, మరో పది శాతం గ్రీన్‌బెల్టు ఏర్పాటు నిమిత్తం పంచాయ తీ వారికి అప్పగించినట్లు తగిన ధ్రువీకరణ పత్రం ఉంటేనే ఇంటి స్థలం కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లాలో 239 లే అవుట్లకు యజమానులు తగిన నిబంధనలు పాటించలేదని వారిపై తగు చర్య నిమిత్తం జిల్లా కలెక్టర్‌కు నివేదించామన్నారు. తగిన ధ్రువీకరణ లేని స్థలాల్లో ఇంటి నిర్మాణాలకు పంచాయతీ కార్యదర్శులు అనుమతులు ఇవ్వడానికి వీల్లేదన్నా రు. నిబంధనలు అతిక్రమించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్‌కు లేఖ నివేదిస్తామన్నారు. ప్రతీ పంచాయతీలో 9 రకాల రికార్డులను నిర్వహించాలన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జోరుగా సాగుతున్న తరుణంలో కొనుగోలుదారులను అప్రమత్తం చేసేందుకు అన్ని మండలాల్లో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఎంపీడీఓ స్థాయిలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసి పంచాయతీ కార్యదర్శులను భాగస్వామ్యులను చేస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టానికి లోబడే లే అవుట్ ఏర్పాటు జరగాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వేసే లే అవుట్లను కొనుగోలు చేసిన వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆ స్థలాలపై హక్కు సంక్రమించే పరిస్థితి ఉండదన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వారు కొనుగోలు దారులకు ఇబ్బందుల్లేకుండా అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు తీసుకున్న తర్వాతే లే అవుట్లు వేయాలన్నారు. -
లే అవుట్లకు తూట్లు
తిమ్మాపూర్, న్యూస్‌లైన్ : తిమ్మాపూర్ మండలంలో అక్రమ లే అవుట్ల దందా జోరుగా సాగుతోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో సామాన్యులు భూమిని కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. నగర శివారు ప్రాంతాల్లో గుంట భూమికి రూ.20 లక్షలకు పైగా ధర పలుకుతోంది. ప్రధాన సెంటర్లో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. సామాన్యులకు అందుబాటులో లేనివిధంగా భూముల ధరలు ఉండడంతో తిమ్మాపూర్ మండలంలో రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న గ్రామాలపై దృష్టి పెట్టారు. ఇక్కడ నగర వాసులతోపాటు దూరప్రాంతాల వారుసైతం ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న అల్గునూర్, తిమ్మాపూర్, రామకృష్ణకాలనీ, ఇందిరానగర్, నుస్తులాపూర్, కొత్తపల్లి, రేణికుంటతోపాటు లోపలికి ఉన్న మన్నెంపల్లి, నల్లగొండ గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఐదారేళ్ల క్రితం ఎకరానికి రూ.20 లక్షలు పలికిన ధరలు ఇప్పుడు రూ.కోటికి పైగా పెరిగిపోయాయి. అల్గునూర్, తిమ్మాపూర్, రామకృష్ణకాలనీ గ్రామాల్లో ఎకరానికి రూ.2కోట్ల వరకు ధర పలుకుతోంది. మొదట గుంటకు రూ.2లక్షలు పలికిన ధర ఇప్పుడు రూ.6లక్షల వరకు పెరిగిపోయింది. రామకృష్ణకాలనీలోని ఇంజినీరింగ్ కళాశాల ఎదుట రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న స్థలం గుంటకు రూ.13లక్షల వరకు ఉందంటే ఇక్కడ భూముల ధరలు ఎంత ఖరీదో ఊహించవచ్చు. నిబంధనలకు తూట్లు... వ్యవసాయ భూములను ప్లాట్లు చేసేందుకు ప్రభుత్వపరంగా నిబంధనలున్నాయి. వ్యవసా య భూమిని కమర్షియల్‌కు వాడుకోవడానికి రెవెన్యూ శాఖకు నాలాపన్ను చెల్లించాలి. ఎకరం భూమిలో ప్లాట్లు చేస్తే అందులో నాలుగు గుం టలు స్థానిక గ్రామపంచాయతీ పేర రిజిస్ట్రేషన్ చేయాలి. అందులో 33ఫీట్ల రోడ్లతో అన్ని మౌలి క వసతులు కల్పించాలి. ఎకరానికి రూ.12వేల వరకు లే అవుట్ ఫీజు, సెక్యురిటీ డిపాజిట్ చే యాలి. లే అవుట్ భూమి వరకు 33 ఫీట్ల అ ప్రోచ్ రోడ్లు ఉండాలి. వీటన్నింటికి రియల్టర్లు తూట్లు పొడుస్తున్నారు. రామకృష్ణకాలనీలో అక్కడక్కడ 33 ఫీట్ల అప్రోచ్ రోడ్ మినహా ఎక్కడా ప్రభుత్వ నిబంధనలు పాటించిన దాఖ లాలు కానరావు. తిమ్మాపూర్‌లోని ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో అక్రమ లే అవుట్ ప్లాట్లలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇవి గ్రామపంచాయతీ అనుమతి లేకుండా నిర్మిస్తున్నా రా... అనుమతి ఉంటే ఎలా ఇచ్చారనేది ప్రశ్న. అల్గునూర్‌లో అక్రమ లే అవుట్ల స్థలాల్లో గ్రామ పంచాయతీ సిబ్బంది హెచ్చరిక బోర్డులు పాత గా వాటిని రియల్టర్లు వెంటనే తొలగించేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి... అక్రమ లే అవుట్ల దందాతో తమ జేబులు నిం పుకుంటున్న రియల్టర్లు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. మండలంలో మొత్తం 257.09 ఎకరాల్లో అక్రమ లే అవుట్ల దందా కొనసాగుతోంది. అత్యధికంగా రామకృష్ణకాలనీలో 93.07 ఎకరాల్లో ప్లాట్ల క్రయ విక్రయాలు సాగుతున్నాయి. ఇందిరానగర్‌లో 64 ఎకరాల్లో, తిమ్మాపూర్‌లో 44.15 ఎకరాల్లో, కొత్తపల్లిలో 3 ఎకరాల్లో, మన్నెంపల్లిలో 17.11 ఎకరాల్లో, నుస్తులాపూర్‌లో 4.07 ఎకరాల్లో, నల్లగొండలో 1.24 ఎకరాల్లో, రేణికుంటలో 28.25 ఎకరాల్లో, అల్గునూర్‌లో 18 ఎకరాల్లో అక్రమంగా లే అవుట్లు చేశారు. ఇక్కడ ప్రైవేటు గా గుంటకు పలుకుతున్న ధరను ఎకరానికి చూపిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రియల్టర్లు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఆ ధరలనే చూపిస్తూ నాలాపన్ను చెల్లించి వ్యవసాయ భూములను కమర్షియల్‌గా అమ్మేసుకుంటున్నారు. గ్రామపంచాయతీకి ఎకరానికి నాలుగు గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉన్నా ఏ ఒక్కరూ ఒక్క గుంటను సైతం చేయలేదని రికార్డులు చెబుతున్నాయి. మండలంలో మొత్తం 257 ఎకరాల్లో 25 ఎకరాలు ఆయా గ్రామ పంచాయతీల పేర రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. దీంతో గుంటకు సరాసరిగా రూ.4లక్షలు ధర ఉన్నా ప్రభుత్వానికి రూ.40 కోట్లు నష్టం స్పష్టంగా కనిపిస్తోంది. లే అవుట్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ 257 ఎకరాలకు రూ.30.84 లక్షలు ప్రభుత్వానికి జమ కాలేదు. మిగతా మౌలిక వసతులు కల్పన అసలు కానరావడం లేదు. అటు రిజిస్ట్రేషన్లలో, ఇటు నాలాపన్నులో, 10 శాతం భూమి, ఫీజు, డిపాజిట్‌తో కలిపి మొత్తంగా రూ.50 కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. సర్కారుకు ఇంత నష్టం జరుగుతున్నా పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, జిల్లా పంచాయతీ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావితీస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ లే అవుట్లపై కొరడా ఝులిపించాల్సిన అవసరముంది.