బావిలో పడి కౌలు రైతు మృతి
నర్సింహులపేట: పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ కౌలు రైతు బావిలో పడి మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. నర్సింహులపేటకు చెందిన పెదమాముల నర్సయ్య(55) భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.
రాత్రి కరెంట్ కావడంతో శుక్రవారం రాత్రి 10 గంటలకు బావి మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు కాలు జారి బావిలోపడి మృతిచెందాడు.