Lockout
-
రాజమండ్రి పేపర్ మిల్ లాకౌట్
-
చక్కెర..ఓ చేదు నిజం
సాక్షి,గన్నవరం : జిల్లా వాసులకు హనుమాన్‌జంక్షన్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది మొదట ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్థానం కాగా రెండవది అంతే పేరున్న షుగర్ ఫ్యాక్టరీ. నిజంగా ఈ ప్రాంత ప్రజలకు చక్కెర కార్మాగారంతో అంత అవినాభవ సంబంధం ఉంది. జంక్షన్ పరిసరాల ప్రాంతాల్లో వేలాది మంది చెరకు రైతులు, కూలీలు, వందలాది మంది కార్మికులు ఈ ఫ్యాక్టరీని నమ్ముకుని ఉన్నారు. డెల్టా షుగర్ ఫ్యాక్టరీకి 2017 అక్టోబర్‌లో లాకౌట్ ప్రకటించడం జంక్షన్ వాసులను తీవ్రంగా కలిచివేసింది. ఫ్యాక్టరీపై ఆధారపడిన దాదాపు 10 వేల మంది చెరకు రైతులు, 400 మందికిపైగా కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. హనుమాన్జంక్షన్కు ఓ తలమానికంగా ఉన్న షుగర్ ఫ్యాక్టరీ కనుమగురు కానుందనే చేదు నిజాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు పాలనలో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముగిసిన షుగర్ ఫ్యాక్టరీ ప్రస్థానం.. హనుమాన్ జంక్షన్, నూజివీడు, గన్నవరం ప్రాంతాల్లో చెరకు సాగు విస్తీర్ణం అధికంగా ఉండటంతో గతంలో ప్రైవేట్ వ్యక్తులకు చెందిన చిన్న, చిన్న ఖండసారి చక్కెర మిల్లులు ఆరేడు ఉండేవి. క్రమేణా చెరకు సాగు విస్తీర్ణం పెరగటంతో వీటి సామర్థ్యం సరిపోకపోవటంతో 1977లో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తొలి బీజం పడింది. అప్పటి నూజివీడు ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్ అప్పారావు సారధ్యంలో ప్రభుత్వ, రైతుల భాగస్వామ్యంతో కో–ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు విశేష కృషి చేశారు. చంద్రబాబు పాలనలోనే ప్రైవేట్‌పరం.. షుగర్స్ ఫ్యాక్టరీలో 1982–83 సీజన్లో ప్రారంభమైన చెరకు క్రషింగ్ 17 ఏళ్లు పాటు సహకార రంగంలో కొనసాగింది. 2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్యాక్టరీ నష్టాలను సాకుగా చూపి వేలం ద్వారా హనుమాన్ కోఆపరేటివ్ షుగర్స్‌ను లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత గోకరాజు గంగరాజుకు రూ.11.40 కోట్లకు విక్రయించేశారు. అప్పట్లో సుమారు రూ. 300 కోట్లు విలువ చేసే సహకార రంగంలోని ఫ్యాక్టరీని, 90 ఎకరాల విలువైన భూమిని కారుచౌకగా తెలుగుదేశం ప్రభుత్వం విక్రయించటం రైతుల ఆగ్రహానికి కారణమైంది. కనీసం సహకార చెక్కర కార్మాగారంలో రైతుల 49 శాతం షేర్ వాటాను కూడా ఆనాటి సీఎం చంద్రబాబు చెల్లించకుండా మొండిచేయి చూపించారు. లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సారధ్యంలో ‘డెల్టా షుగర్స్’గా రూపాంతరం చెంది 2001–02 సీజన్లో రోజుకు 2500 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభమైంది. 2015–16 నాటికి ఫ్యాక్టరీ క్రషింగ్ సామర్థ్యం 3500 టన్నులు కాగా, లక్షన్నర టన్నుల చెరకును క్రషింగ్ చేసి చక్కెర ఉత్పిత్తి చేశారు. ఫ్యాక్టరీ మూసివేత వ్యూహాత్మకమేనా? మూడేళ్లుగా డెల్టా షుగర్స్ యాజమాన్య వైఖరి పరిశీలిస్తే వ్యూహాత్మకంగానే మూసివేతకు ప్రణాళికతో ఉన్నారనిపిస్తోంది. చెరకు సాగు విస్తీర్ణంపై సరిగ్గా దృష్టి పెట్టకపోవటం, రైతులకు సకాలంలో చెరకు తోలిన డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేయటం వంటి ఆంశాలు యాజమాన్యం తీరుపై పలు అనుమానాలను రేకేత్తించాయి. జాతీయ రహదారికి ఆనుకుని 100 ఎకరాల స్థలంలో ఫ్యాక్టరీ ఉండటంతో ఇతరత్రా వ్యాపార అవసరాలకు స్థలం వినియోగించుకునే దురుద్దేశంతోనే లాకౌట్ దిశగా అడుగులు వేశారని ప్రచారం. విలువైన స్థలంపై యాజమాన్యం దృష్టి పెట్టడంతోనే క్రమంగా ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. -
పారిశ్రామిక సంక్షోభం!
– జిల్లాలో 500 పరిశ్రమలకు తాళాలు – ఇందులో పది పెద్దతరహా పరిశ్రమలు – 300 ఆయిల్, 150 రైస్ మిల్లులు బంద్ – ఉపాధి దూరమైన వేలాది మంది కార్మికులు – కొత్త పరిశ్రమలు అంటూ హడావుడి చేస్తున్న ప్రభుత్వం – టెక్స్టైల్ పార్కు ఊసే ఎత్తని ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాను పరిశ్రమల హబ్‌గా మారుస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హడావుడి చేస్తున్నారు. కొత్త పరిశ్రమలంటూ వేలాది ఎకరాల భూములను రైతుల నుంచి లాక్కుంటున్నారు. అయితే ప్రభుత్వ ప్రోత్సాహం లేక..యాజమాన్యాల వైఖరితో జిల్లాలో దాదాపు 500 పరిశ్రమలు మూతపడ్డాయి. ఏళ్లుగా వీటికి తాళాలు ఉన్నా తెరిపించే నాథుడు కరువయ్యాడు. ఎన్నికల సమయంలో వీటిని తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పిస్తామని టీడీపీ నేతలు ఇచ్చిన హామీలు నీటిమూటలయ్యాయి. జిల్లాలోని కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, వెల్దుర్తి, బేతంచెర్ల, డోన్, బనగానపల్లె, కొలిమిగుండ్ల తదితర ప్రాంతాల్లో ఒక మోస్తారు నుంచి పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో 150 నుంచి 5 వేల మందికి ఉపాధిని కల్పించే పరిశ్రమలు ఉన్నాయి. అయితే ఆయా యాజమాన్యాల వైఖరి, ప్రభుత్వ ప్రోత్సాహం కరువడంతో చాలా చోట్లా పరిశ్రమలు మూతపడ్డాయి. వీటిలో వెయ్యి నుంచి 2 వేలకు పైగా కార్మికులకు ఉపాధిని కల్పించే పరిశ్రమలు పదికిపైగా ఉన్నాయి. మూతపడిన (2006లో) రాయలసీమ పేపర్ మిల్ పరిశ్రమలో ఐదు వేల మంది కార్మికులు పనిచేసేవారు. ఇది కేవలం యాజమాన్యం వైఖరి కారణంగా మూతపడినట్లు కార్మికులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక కర్నూలుకు సమీపంలోని కార్బైడ్ ఫ్యాక్టరీ రాజకీయా కారణాలతో బంద్ అయింది. ఈ పరిశ్రమ నిర్వహణకు పూర్తిగా కరెంట్ వినియోగమే అధికం. అయితే రాయితీపై కరెంట్ సరఫరాను నిలిపివేయడంతో పరిశ్రమకు తాళాలు వేయడంతో వెయ్యి మంది కార్మికులు రోడ్డున పడ్డారు. వీటితోపాటు ఆదోనిలో కొఠారి స్పిన్నింగ్ మిల్లులో మూతపడడంతో 1200 మంది, రాయలసీమ స్పిన్నింగ్ మిల్, బంద్‌కావడంతో 1500 మంది, ఏటీ ఆయిల్ ఫ్యాక్టరీ నడవకపోవడంతో 700 మంది కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఇక ఎమ్మిగనూరులో ఎమ్మిగనూరు స్పిన్నింగ్ మిల్స్, నంద్యాలలో కోపరేటివ్ స్పిన్నింగ్ మిల్, కో పరేటివ్ చక్కెర కర్మాగారం మూతపడడంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఉపాధి కోల్పోయిన కార్మికులు పదేళ్ల క్రితం జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఆదోని తదితర ప్రాంతాల్లో వెయ్యికిపైగా నూనె, రైస్ మిల్లులు ఉండేవి. అంతేకాక బనగానపల్లె, బేతంచెర్ల, డోన్, కొలిమిగుండ్ల తదితర ప్రాంతాల్లో క్రస్సర్ మిషన్లు, బండల ఫ్యాక్టరీలు ఉండేవి. డోన్‌లో సున్నపు ఫ్యాక్టరీలు అధికంగా ఉండేవి. ప్రస్తుతం అక్కడ ఒక్క సున్నపు ఫ్యాక్టరీ కూడా కనిపించడంలేదు. ప్రస్తుతం వీటిలో సగానికిపైగా మూతపడ్డాయి. దీంతో వేలాది మంది కార్మికులు ఉపాధిని కోల్పోయారు. కొత్త పరిశ్రమలంటూ హడావుడి.. ప్రస్తుతం జిల్లాలో కొత్త పరిశ్రల స్థాపన అంటూ ప్రభుత్వం హడావుడి చేస్తోంది. రైతుల నుంచి 35 వేల ఎకరాల భూమిని బలవంతంగా తీసుకొని ఓర్వకల్లు సమీపంలో పరిశ్రమల హబ్ స్థాపనకు చర్యలు తీసుకొంటోంది. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండున్నరేళ్లు గడిచిపోయింది. ఇంతవరకు ఒక్క పరిశ్రమ కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావడంలేదు. ఇప్పట్లో వచ్చే పరిస్థితులు కూడా కనిపించడంలేదు. ఈనేపథ్యంలో మూత పడిన పరిశ్రమలను తెరిపించాలనే వాదన బలపడుతోంది. టెక్స్టైల్ పార్కు ఊసే లేదు.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2014 ఆగస్టు 15వ తేదీన కర్నూలులో జరిగిన స్వాతంత్ర దిన వేడుకల్లో పాల్గొని జిల్లాకు పలు హామీలు ఇచ్చారు. అందులో టెక్స్టైల్ పరిశ్రమ ఒక్కటి. ఈ హామీకి రెండేళ్లు వచ్చినా ఆచరణలో మాత్రం ఊసే కనిపించడంలేదు. దీంతో కార్మిక లోకం తీవ్ర మనోవేదనకు గురవుతోంది. -
లాకౌట్‌పై స్పష్టత ఇవ్వకపోతే ముట్టడే
విజయనగరం టౌన్ : అరుణా జ్యూట్‌మిల్లును అక్రమంగా లాకౌట్ చేసి ఐదు నెలలు కావస్తోందని, మిల్లు తెరుస్తారా.. లేక పూర్తిగా మూసేస్తారా అన్న దానిపై స్పష్టత ఇవ్వాలని ఏఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు బి.శంకరరావు డిమాండ్ చేశారు. కార్మికుల ఓట్లతో గెలిచిన మంత్రులు పూసపాటి అశోక్‌గజపతిరాజు, మృణాళినిలు 15 రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే వారు చేసే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం విజయనగరం వి.టి.అగ్రహారం అరుణా మిల్లు వద్ద జాతీయ రహదారిపై నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వై జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించకపోవడం దారుణమన్నారు. వ్యవసాయాధారిత జూట్ పరిశ్రమలు మూతపడి వేలాది మంది కార్మికులు వీధిన పడినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. జపాన్, సింగపూర్ల జపం చేస్తూ విదేశీ పెట్టుబడులు వస్తున్నాయంటూ మభ్యపెడుతూ దేశీయ పరిశ్రమల గొంతు నులుముతున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో యూని యన్ ప్రధాన కార్యదర్శి పి.శ్రీను, ఆర్.అప్పారావు, ఆర్.ఆదినారాయణ, డి.రామారావు, జి.విజయరామరాజు, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. -
జూట్ మిల్లు లాకౌట్ : కార్మికుల ఆందోళన
శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్‌లో మరో జూట్ మిల్లు లాకౌట్ ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా రాజాంలోని శ్రీలక్ష్మీశ్రీనివాస జూట్మిల్లుని మూసివేస్తున్నట్లు ఆ మిల్లు యాజమాన్యం బుధవారం ప్రకటించింది. దీంతో మిల్లులో పని చేస్తున్నకార్మికులంతా ఉదయమే జూట్‌మిల్లు వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. లాకౌట్‌పై ముందస్తు సమాచారం ఇవ్వకుండా యాజమాన్యం మిల్లును అర్థాంతరంగా మూసివేసిందని కార్మికులు ఆరోపించారు. యాజమాన్యం వైఖరిని కార్మికులు తప్పుపట్టారు. యాజమాన్యం చర్యలతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లు యాజమాన్యానికి వ్యతిరేకంగా కార్మికులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్మికులను శాంతింప చేసేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆ క్రమంలో పోలీసులు... కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే గుంటూరు నగరంలోని భజరంగ్ జూట్ మిల్లు యాజమాన్యం లాకౌట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
శ్రీభజరంగ్ జూట్ముల్ లాకౌట్ ఎత్తివేయాలి
-
బొబ్బిలి జూట్‌మిల్ ఎదుట ఉద్రిక్తత
విజయనగరం: లాకౌట్ ఎత్తేయాలని కోరుతూ లక్ష్మీ శ్రీనివాస జూట్‌మిల్ కార్మికులు ఆందోళనకు దిగారు. అక్రమంగా లాకౌట్ విధించడాన్ని నిరసిస్తూ.. విజయనగరం జిల్లా బొబ్బిలి లోని లక్ష్మీ శ్రీనివాస మిల్లు ఎదుట ఆదివారం తెల్లవారుజాము నుంచి కార్మికులు ఆందోళనలు చేపడుతున్నారు. ఇలా చెప్పాపెట్టకుండా లాకౌట్ విధించడంతో 1200 మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేపడుతున్న కార్మికుల వద్దకు వచ్చిన యాజమాన్య ప్రతినిధి పర్సనల్ ఆఫీసర్ శర్మ పై కార్మికులు దాడికి దిగారు. దీంతో పోలీసులు కలగజేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం పోలీసులను తోసుకొని వచ్చిన కార్మికులు జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడుతున్నారు. -
జూట్‌మిల్లు ఎదుట కార్మికుల ఆందోళన
గుంటూరు : గుంటూరు జిల్లాలోని భజరంగ్ జూట్‌మిల్లు లాకౌట్‌ను ఎత్తివేయాలంటూ కార్మికులు మంగళవారం ఆందోళన బాటపట్టారు. లాకౌట్‌ను ఎత్తివేయకపోతే సామూహిక ఆత్మహత్యలే దిక్కంటూ జూట్ మిల్ ముందు నిరసన చేపట్టారు. దీనిపై సమాచారం అందుకున్న సబ్ రిజిస్ట్రార్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి అదుపులో తేవడానికి ప్రయత్నించసాగారు. కాగా కార్మికులు ఆయనతో వాగ్వివాదానికి దిగారు. కార్మికులు మూకుమ్మడిగా సబ్ రిజిస్ట్రార్‌పై దాడి చేయడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడ ఉన్న నాయకులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
గుంటూరులో జూట్ మిల్లు లాకౌట్