బొబ్బిలి జూట్‌మిల్ ఎదుట ఉద్రిక్తత
విజయనగరం: లాకౌట్ ఎత్తేయాలని కోరుతూ లక్ష్మీ శ్రీనివాస జూట్‌మిల్ కార్మికులు ఆందోళనకు దిగారు. అక్రమంగా లాకౌట్ విధించడాన్ని నిరసిస్తూ.. విజయనగరం జిల్లా బొబ్బిలి లోని లక్ష్మీ శ్రీనివాస మిల్లు ఎదుట ఆదివారం తెల్లవారుజాము నుంచి కార్మికులు ఆందోళనలు చేపడుతున్నారు. ఇలా చెప్పాపెట్టకుండా లాకౌట్ విధించడంతో 1200 మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆందోళన చేపడుతున్న కార్మికుల వద్దకు వచ్చిన యాజమాన్య ప్రతినిధి పర్సనల్ ఆఫీసర్ శర్మ పై కార్మికులు దాడికి దిగారు. దీంతో పోలీసులు కలగజేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం పోలీసులను తోసుకొని వచ్చిన కార్మికులు జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడుతున్నారు.