lorry cleaner
-
క్లీనర్ లేని లారీ.. నడిపేవారేరీ!
సాక్షి, అమరావతి బ్యూరో: లారీలకు రథసారథుల కొరత ఏర్పడింది. దాదాపు 15 ఏళ్లుగా డ్రైవర్ల కొరత ఎక్కువవుతోంది. ఇచ్చే జీతం కంటే.. వారికొచ్చే కమీషన్లు, ట్రిప్పుల మామూళ్లు వంటి వాటితో డ్రైవర్ల ఆదాయం మెరుగ్గా ఉండేది. మొదట్లో లారీలపై క్లీనర్లుగా చేరి ఆపై డ్రైవర్లు అయ్యేవారు. భార్యాపిల్లలకు, కుటుంబాలకు వారాల తరబడి దూరంగా ఉండాల్సి వచ్చినా.. ఆదాయం బాగుండటంతో డ్రైవర్ వృత్తి వైపు మొగ్గు చూపేవారు. ఇప్పుడు ఆ వృత్తి చేపట్టేవారు తగ్గిపోయారు. పాత తరం డ్రైవర్లు వృద్ధాప్యానికి చేరుకోవడం, రోడ్డు ప్రమాదాల్లో మరణాలు అధికంగా సంభవించడం, వారి సంతానం ఈ వృత్తిపై ఆసక్తి చూపకపోవడం, వీరి పిల్లలు చదువుకు ప్రాధాన్యమిచ్చి ఉద్యోగాలు, ఇతర వృత్తులు, వ్యాపారాల వైపు మళ్లడం, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడం వంటివి డ్రైవర్ల కొరతకు కారణమవుతున్నాయి. ఇది లారీ యజమానులకు ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రంలో సరుకు రవాణా చేసే లారీలు 3 లక్షల వరకు ఉన్నాయి. వీటిలో 35 శాతం లారీలకు డ్రైవర్ల కొరత ఉందని యజమానులు చెబుతున్నారు. (చదవండి: గుట్టురట్టు: కవర్‌ను లాగితే నకిలీ తేలింది..) ఇతర రాష్ట్రాల నుంచి.. లారీ యజమానులు స్వరాష్ట్రంలో డ్రైవర్లు దొరక్క తప్పనిసరి పరిస్థితుల్లో అధిక జీతాలిచ్చి మరీ డ్రైవర్లను ఇతర రాష్ట్రాల నుంచి రప్పిస్తున్నారు. కొన్నాళ్లుగా బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి డ్రైవర్లు వస్తున్నారు. వీరికి నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు (ట్రాలీ డ్రైవర్లకు) చెల్లిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సమయానికి వీరు కూడా అందుబాటులో లేక యజమానులు అవస్థలు పడుతున్నారు. స్థానిక డ్రైవర్లు, వయసు మీరిన కొందరు దూర ప్రాంతాల కంటే లోకల్ లారీల్లో తిరగడానికే ఆసక్తి చూపుతున్నారు. విజయవాడలో డ్రైవర్ల శిక్షణ కేంద్రం లారీ డ్రైవర్ల కొరత ఏర్పడుతుందని ముందుగానే ఊహించిన కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ విజయవాడకు 32 కిలోమీటర్ల దూరంలోని అంపాపురంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 2005లో మోడల్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను స్థాపించింది. 20 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేసేందుకు రూ.5.50 కోట్లు వెచ్చించింది. రోజుకు 8 గంటల చొప్పున 32 రోజుల పాటు పూర్తిస్థాయి డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తారు. బయట డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఈ శిక్షణకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు వసూలు చేస్తే ఇక్కడ కేవలం రూ.6 వేల నామమాత్రపు ఫీజు మాత్రమే తీసుకుంటారు. ఈ ఇన్స్టిట్యూట్ కృష్ణా జిల్లాతో పాటు పొరుగు జిల్లాల్లో డ్రైవర్ల కొరతను కొంతవరకు తీరుస్తోంది. క్లీనర్ల వ్యవస్థకు చెల్లు.. ఒకవైపు డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉండగా మరోవైపు క్లీనర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒకప్పుడు ప్రతి లారీకి డ్రైవర్‌తో పాటు క్లీనర్ తప్పనిసరి. కానీ క్లీనర్‌గా చేరడానికి మునుపటిలా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఒక్క డ్రైవర్‌తోనే ‘బండి’ లాగిస్తున్నారు. (చదవండి: సీఎంపై దురుసుగా మాట్లాడితే ఊరుకునేది లేదు) -
నడిరోడ్డుపై ఘోరం
► కడ్డీలకు గొంతు గుచ్చుకుని లారీ క్లీనర్ బలవన్మరణం ► బళ్లారి రాయల్ సర్కిల్లో దుర్ఘటన బళ్లారి: పదునైన కడ్డీలకు చేయి తగిలితేనే అమ్మో అంటాం. అలాంటిది వాటి మీద గొంతును బలంగా గుచ్చి తనువు చాలించాడో యువకుడు. ఎంత కష్టమొచ్చిందో ఏమో కానీ ఒక యువకుడు పట్టపగలు అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై కాంపౌండ్ వాల్ గ్రిల్‌కు అమర్చిన పదునైన కడ్డీలకు గొంతు గుచ్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బళ్లారిలో జరిగింది. రాయల్ సర్కిల్ సమీపంలో గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఎస్బీఐ బ్యాంకు కాంపౌండ్ వాల్‌కు అమర్చిన బలమైన కడ్డీలకు గుచ్చుకుని సమీర్ షేక్ (28) అనే లారీ క్లీనర్ ప్రాణాలు తీసుకున్నాడు. మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన సమీర్ షేక్ స్టార్‌లైన్ అనే ట్రాన్స్‌పోర్టు లారీలో అనంతపురం మీదుగా బళ్లారికి వచ్చాడు. నాలుగు రోజులుగా అటు, ఇటూ తిరుగుతూ ఉండేవాడు. గురువారం వందలాది మంది సంచరిస్తుండగా ఈ అఘాయిత్యం చేసుకున్నాడు. అతడు ఆత్మహత్య చేసుకుంటున్నప్పటికీ ఎవరూ అడ్డుకోక పోవడం బాధాకరమని పోలీసులు అన్నారు. లారీ డ్రైవర్ తమ క్లీనర్ తప్పిపోయాడని ఫిర్యాదు చేయడంతో తాము శవాన్ని చూపించగా, వారు గుర్తు పట్టారని పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు మానసికంగా ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల కూడా కారణం కావచ్చని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై బ్రూస్‌పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అతనికి పెళ్లయి, పదేళ్ల కొడుకు ఉన్నట్లు తెలిపారు. -
బొగ్గుయార్డులో లారీ క్లీనర్ సజీవ సమాధి
గణపురం :మండలంలోని చెల్పూరు శివారులోని కేటీపీపీలోని బొగ్గుయార్డ్లో శనివారం జరిగిన ప్రమాదంలో లారీ క్లీనర్ దర్శనాల సమ్మోదర్(23) సజీ వ సమాధి అయ్యాడు. భూపాలపల్లిలోని రాంనగర్లో నివాసముం టున్న సింగరేణి కార్మికుడు దర్శనాల వెంకటయ్య, విమల దంపతులకు ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. వారి లో ఒక కుమారుడైన సమ్మోదర్ బొగ్గు లారీపై క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో భూపాలపల్లి నుంచి లోడుతో కేటీపీపీకి వచ్చిన రెండు లారీలు యార్డ్‌లో బొగ్గును డంపు చేస్తున్న సమయంలో సమ్మోదర్పై బొగ్గుపడింది. ఈ విషయాన్ని రెండు లారీల డ్రైవర్లు గమనించలేదు. డంపు చేసిన తర్వాత క్లీనర్ కోసం వెతకగా కనిపించలేదు. అతడి కోసం అరగంట సేపు వెతికారు. తర్వా త అనుమానం వచ్చి అక్కడ డంపు చేసిన బొగ్గును ప్రొక్లయిన్తో తోడగా ముక్కలుముక్కలుగా సమ్మోదర్ మృ తదేహం బయటపడింది. తల కనిపిం చలేదు. ప్రమాదానికి కారణమైన లారీలు వేర్వేరు ట్రా¯న్పోర్టులకు సం బంధించినవి. బొగ్గు డంపు చేసే సమయంలో యార్డ్‌కు సంబంధించిన అధికారులు లేకపోవడంతో సంఘటన సమాచారం కచ్చితంగా తెలి యడం లేదు. పోలీసులు కూడా సరైన సమాచారం ఇవ్వలేకపోతున్నారు. ఎస్సై ప్రవీన్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్య మంజుల, నాలుగు నెలల కూతురు పాప ఉన్నారు. మృతుడి కూతురు పరిస్థితి విషమం సంఘటన స్థలంలో సమ్మోదర్ మృతదేహంపై పడి భార్యతోపాటు తల్లిదండ్రులు, బంధువులు గుండెలు పగి లేలా విలపించారు. సుమారు నాలు గు నెలలు కూడా నిండని అతడి కూతురికి ఫిట్స్ వచ్చాయి. దీంతో గాబరా పడ్డా బంధువులు చేతిలో ఇనుప వస్తువు పెట్టి కాళ్లు చేతులు మర్దన చేశారు. భర్త మరణం, కూతురి పరిస్థితిని చూసి మంజుల బోరున విలపించింది. పాపను స్థానిక అస్పత్రికి తరలించారు. -
చెట్టును ఢీకొన్న లారీ: క్లీనర్ మృతి
నల్గొండ : నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలం కీతంవారిగూడెం గ్రామ శివారులో బుధవారం ఉదయం వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందగా.. డ్రైవర్ మాత్రం లారీని వదిలి అక్కడి నుంచి పరారైయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని క్లీనర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
కారు ఢీకొని లారీ క్లీనర్ దుర్మరణం
పలమనేరు రూరల్ : వేగంగా వచ్చిన కారు ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. టైరు పంక్చర్ అవ్వడంతో ఓ లారీ రోడ్డుపైనే నిలిచిపోయింది. క్లీనర్ మరమ్మతు పనుల్లో ఉండగా వేగంగా వచ్చిన ఓ కారు అతన్ని బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో లారీ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. -
నయ వంచకుడు
వల్లూరు, న్యూస్‌లైన్ : తాను ఎస్ఐ పోస్టుకు ఎంపికయ్యానంటూ ఓ కుటుంబాన్ని నమ్మించి మోసం చేసిన ఓ నయవంచకుని కథ ఇది. ఆ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయిని అందరి సమక్షంలో పెళ్లి చేసుకుని, కొంతకాలం కాపురం చేస్తూ, గర్భవతిగా వుండగా శిక్షణకంటూ ఉడాయించిన ఘటన ఇది. దాదాపు 8 నెలలుగా ఆచూకీ లేకపోవడంతో తాను మోసపోయానని భార్య తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. వివరాలిలా వున్నాయి. వల్లూరు మండలంలోని పైడికాలువకు చెందిన వెంకట సుబ్బయ్య లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. లారీకి వస్తూ పోతూ ఉండగా మరో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న షేక్ మస్తాన్‌తో పరిచయం పెరిగింది. ఈ క్రమంలో తాను అనాథనని, ఎస్ఐ పోస్టుకు ఎంపికయ్యానని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని తెలిపాడు. ఆ యువకుని మాటలను నమ్మిన వెంకటసుబ్బయ్య పైడికాలువలోనే వుంటున్న తన చెల్లెలు కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి ప్రయత్నాలు చేశాడు. నలుగురు ఆడ పిల్లల తల్లిగా, భర్తను పోగొట్టుకుని పేదరికంలో వున్న ఆమె తన అన్న మాట మీద నమ్మకంతో మూడో కూతురైన విజయలక్ష్మిని ఇచ్చి బంధువుల సమక్షంలో 2012 ఆగస్టు 15న గండి క్షేత్రంలో వివాహం చేసింది. కొంతకాలం ఆమెతో కొంతకాలం కాపురం సాగించాడు. ఆమె 5 నెలల గర్భవతిగా వుండగా తనకు ఎస్ఐ ట్రైనింగ్ ఆర్డర్ వచ్చిందని, అందుకు గానూ గుజరాత్‌కు వె ళ్లాల్సి వుందని నమ్మించాడు. అయితే అక్కడ కొంత డబ్బు కట్టాలని చెప్పి భార్య మెడలో వున్న 6 తులాల బంగారు ఆభరణాలతో బాటు, అతని వద్ద వున్న రూ.30 వేలను, లారీ ఓనర్ దగ్గర వెంకటసుబ్బయ్య హా మీగా వుండి ఇప్పించిన రూ.20 వేలను, బంధువుల దగ్గర మరో రూ.20 వేలను తీసుకుని వెళ్లాడు. శిక్షణ పూర్తి చేసుకొని వస్తాడని భర్త కోసం ఎదురు చూసిన విజయలక్ష్మి ఐదు నెలల క్రితం ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇంత కాలంగా భర్త ఫోన్ కూడా చేయకపోవడమే కాక, అతని ఫోన్ నెంబర్ స్విచ్ఆఫ్ చేసి వుంటుండడంతో తాను మోసపోయాయని తెలుసుకున్న విజయలక్ష్మి శుక్రవారం వల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వారి పెళ్లి ఫొటోలతోపాటు, పోలీస్ డ్రస్‌లతో తీయించుకున్న ఫొటోలను పోలీసులకు అందజేసింది. తనకు న్యాయం చేయాలని తన 5నెలల పసి బిడ్డతో వేడుకుంటోంది. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరసింహరావు తెలిపారు. అతని వివరాలు తెలిసిన వారు 9440796916 నంబరుకు తెలియజేయాలని ఆయన కోరారు. -
బతుకులు మసి
గువ్వలచెరువు ఘాట్ మరోసారి రక్తంతో తడిసి ముద్ద అయింది. అర్ధరాత్రి బయలుదేరిన లారీ ఘాట్‌లోకి రాగానే ఓ మలుపు మృత్యువై పిలిచింది. లారీని అదుపు తప్పించి దారి తప్పేలా చేసింది. లోయలోకి దూసుకెళ్లిన లారీ నుజ్జునుజ్జు కాగా, అందులోని డ్రైవర్, క్లీనర్ బతుకులు నలిగిపోయాయి. వారి కుటుంబాల్లో చీకట్లు నింపాయి. చింతకొమ్మదిన్నె, న్యూస్‌లైన్ : కడప-రాయచోటి ప్రధాన రహదారి గువ్వలచెరువు ఘాట్‌లోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద గల మలుపులోకి బుధవారం అర్ధరాత్రి వచ్చిన లారీ అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. సంఘటనలో డ్రైవర్ షామీర్(45), క్లీనర్ నాగయ్య(38) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘోరో సంఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతులిద్దరూ రాయచోటి, శిబ్యాల ప్రాంతాలకు చెందిన వారిగా తెలుస్తోంది. బెల్లం లోడుతో వచ్చి.. ముక్కచెక్కలై... చిత్తూరు జిల్లా పీలేరు నుంచి బెల్లం లోడుతో సూర్యాపేటకు బయలుదేరిన లారీ మార్గమధ్యంలోని గువ్వలచెరువు ఘాట్‌లోని ఓ మలుపు వద్దకు రాగానే ఇరవై అడుగులో లోతు కలిగిన లోయలోకి దూసుకెళ్లింది. దీంతో లారీ మొత్తం ముక్కలైంది. డ్రైవర్, క్లీనర్ అందులోనే ప్రాణాలొదిలి ఇరుక్కుపోయారు. వారిని బయటకు లాగడం చాలా కష్టమైంది. క్రేన్ సహాయంతో... ప్రమాద సమాచారం తెలుసుకున్న కడప డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, రూరల్ సీఐ నాగేశ్వరరెడ్డి, చింతకొమ్మదిన్నె ఎస్ఐ నరసింహారెడ్డి గురువారం ఉదయమే హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికితీసేందుకు ఎంతగా ప్రయత్నించినా ఇనుప కంచెల మధ్య ఇరుక్కుపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో క్రేన్‌ను తెప్పించి లారీ ట్రాలీని తప్పించారు. ఆ తరువాత మృతదేహాలను వెలికితీశారు. వాటిని పోస్టుమార్టం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. బంధువుల రోదనలతో నిండి.. డ్రైవర్ షామీర్‌కు భార్య ఇద్దరు కుమారులు ఉండగా, క్లీనర్ నాగయ్యకు భార్య ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఆయా కుటుంబాలతో పాటు బంధువులు గువ్వలచెరువు ఘాట్‌కు చేరుకున్నారు. అడవిలో.. దిక్కులేని చావు చచ్చిన తమ వారిని చూసి గుండెలు పగిలేలా రోదించారు. వారి రోదనలతో అటవీ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. -
ఆగని కామాంధుల ఆకృత్యాలు
కోదాడ అర్బన్, న్యూస్‌లైన్ నిర్భయలాంటి చట్టాలెన్ని వచ్చిన కామాంధుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది.. కొందరి మృగాళ్ల చేతిలో చిన్నారులు నలిగిపోతూనే ఉన్నారు. ఓ లారీ క్లీనర్ మాయమాటలు చెప్పి ఓ చిన్నారిని లొంగతీసుకుని నాలుగు రోజుల పాటు అత్యాచారం జరిపిన ఘటన కోదాడలో ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మైనర్ తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఈ నెల 6న ఇంటి నుంచి బయలుదేరి ఖమ్మం వెళ్లింది. తిరిగి వచ్చే క్రమంలో ఈ నెల 12న కోదాడ బస్టాండ్‌కు చేరుకుంది. బస్టాండ్‌లో ఆమెకు మాతానగర్‌కు చెందిన జానీ అనే లారీక్లీనర్ పరిచమయ్యాడు. అతడు ఆమెకు మాయమాటలు చెప్పి ఓ బహిరంగ ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారం జరిపాడు. అనంతరం ఆమెను తన మిత్రుడు రాకేష్ గదిలో ఉంచి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బంధువుల ఇంటి నుంచి బయలుదేరిన తన కుమార్తె తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి ఆది వారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో ఆ బాలిక ఫోన్ ద్వారా తన సోదరికి ఆచూకీ తెలిపింది. ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు కోదాడలో గాలిస్తుం డగా జానీ,అతని మిత్రుడు పరారయ్యారు. పోలీసులు ఆ బాలికను కోదాడలో సోమవారం కనుగొన్నారు. ఈ సంఘటనపై బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు జానీ, అతడికి ఆశ్రయమిచ్చిన రాకేష్‌లపై నిర్భయచట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.