పలమనేరు రూరల్ : వేగంగా వచ్చిన కారు ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. టైరు పంక్చర్ అవ్వడంతో ఓ లారీ రోడ్డుపైనే నిలిచిపోయింది. క్లీనర్ మరమ్మతు పనుల్లో ఉండగా వేగంగా వచ్చిన ఓ కారు అతన్ని బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో లారీ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.