నల్గొండ : నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలం కీతంవారిగూడెం గ్రామ శివారులో బుధవారం ఉదయం వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందగా.. డ్రైవర్ మాత్రం లారీని వదిలి అక్కడి నుంచి పరారైయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలికి చేరుకుని క్లీనర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.